Thursday, July 19, 2012

గురజాడ కంటే ముందే తొలి తెలుగు కథ రాసిన భండారు అచ్చమాంబ సచ్చరితను తెలుసుకోవాలని ఉందా? పుస్తకం దొరకడం సమస్యగా ఉందా ? దిగులు పడకండి. బండారు అచ్చమాంబ సచ్చరిత ఈ బుక్ కూడా అప్పుడే వచ్చేసింది.!


తెలుగు సాహిత్యంలో చిరకాలంగా విమర్శకుల విస్మరణకు గురైన తొలి స్త్రీవాది భండారు అచ్చమాంబ.

తెలుగులో తొలి కథ రాసి, తొలిసారి స్త్రీల చరిత్రని స్త్రీవాద దృక్పథంతో దండ గుచ్చిన ఘనత కూడా అచ్చమాంబదే. స్త్రీల కోసం సంఘాలు నిర్మించడంలోనూ ఆమె ఆద్యురాలుగా నిలిచింది. వివిధ రంగాలలో ప్రసిద్ధులైన భారత స్త్రీల చరిత్రలను అనేక భాషల నుంచి సేకరించి, అవువదించి 1903లోనే అబలా సచ్చరిత్ర రత్మమాలను రాసింది. వైదిక పౌరాణిక, బౌద్ధ స్త్రీల చరిత్రలను గ్రంథస్తం చేయాలనే మెగా ప్రణాళికను సిద్ధం చేసుకున్న అచ్చమాంబను అది పూర్తికాకముందే మృత్యువు కబళించడం మహా విషాదం.
 
వందేళ్ళ క్రితమే స్త్రీల స్థితిగతుల గురించి ఎంతో అత్యాధునికంగా ఆలోచించి, స్త్రీల అభ్యున్నతి కోసం అహరహం కలవరించి, పలవరించిన అచ్చమాంబ ఆనాటి స్త్రీల పరిస్థితి పట్ల తన ఆవేదనను, అంతరంగ ఘోషను కథలుగా, వ్యాసలుగా, చరిత్రగా, ఉపన్యాసాలుగా మలుచుకున్న తీరు అమోఘం, ఆశ్చర్యకరం కూడా. దాన్ని సవివిరంగా చర్చించిందీ పుస్తకం.
 
కొండవీటి సత్యవతి, ఫెమినిస్ట్, జర్నలిస్ట్, రైటర్.

ముప్ఫై సంవత్సరాల స్త్రీల ఉద్యమంలో మమేకమయ్యారు. తెలుగులో వస్తున్న
ఏకైక స్త్రీవాద పత్రిక 'భూమిక' వ్యవస్థాపక సభ్యులే కాక ఇరవై సంవత్సరాలుగా సంపాదకురాలు. సమస్యల్లో ఉన్న స్త్రీల కోసం భూమిక హెల్ప్‌లైన్ నడపడంతో పాటు స్త్రీలకు సకల సహాయాలు అందించాల్సిన ప్రభుత్వ శాఖలు జండర్ స్పృహతో పనిచేసేలా కృషి చేస్తున్నారు.
 
ఇప్పటివరకూ ఆమె"కల", "మెలకువ సందర్భం" పేర్లతో రెందు కథా సంపుటాలు వెలువరించారు. అంకితం, భూమి హక్కులు, (ఆర్‌డిఐ) సంకలనాలు, గృహహింస చట్టం మీద సంక్షిప్త పుస్తకం, భూమిక సంపాదకీయాలు, ప్రయాణ అనుభవాలు మొదలైన పుస్తకాలు వెలువడ్డాయి.

భండారు అచ్చమాంబ సచ్చరిత "ఈ బుక్" కోసం ... కినిగే డాట్ కాం ... సందర్శించండి.

ఇది కాక మరెన్నో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పుస్తకాలు ఇప్పుడు కినిగే డాట్ కాం  వద్ద "ఈ బుక్స్ " రూపం లో లభిస్తున్నాయి.  
 

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌