
ఇటీవల కత్తి మహేష్ కుమార్ గారు తన బ్లాగు పర్ణశాల లో మునెమ్మ నవలపై కాత్యాయని గారు సాక్షి దినపత్రికలో చేసిన విమర్శపై ఇలా స్పందించారు:
‘మునెమ్మ’ పై కాత్యాయని పైత్యం - కత్తి మహేష్ కుమార్
'మునెమ్మ' నవలపై కాత్యాయనిగారి సమీక్ష/విశ్లేషణ కూడా "రాసేవాళ్ళకు చదివేవాళ్ళెప్పుడూ లోకువే" అన్న నానుడిని స్థిరపరిచేదిగానే ఉంది.అందుకే, ఒక సాధారణ పాఠకుడిగా కాత్యాయనిగారు చేసిన ఈ అవమానాన్ని చూస్తూ సహించలేక ఈ స్పందనని అక్షరబద్ధం చేస్తున్నాను.
ఒక రచయిత యొక్క వర్గస్పృహ, సామాజిక ధృక్పధం, భావజాలం తను రచించే రచనలలో ఉండొచ్చునుగాక. కానీ, విమర్శకులు ఒక రచనని బేరిజు చేసేటప్పుడు రచయితనుకాక, ఆ రచనలోని సూచించిన ఆధారాలను మూలం చేసుకుని వాటిని ఎత్తిచూపే ప్రయత్నం చెయ్యాలి. అలాకాకుండా, ఉరుమురిమి మంగలం మీదపడ్డట్టు మొదటిపేరాలోనే డా" కేశవరెడ్డి "గొప్ప"తనాన్ని ఎద్దేవాచేసి. ఆయన "మార్క్సిస్టు నిష్ట" ను అపహాస్యం చేసి. పేద,దళితసమస్యలనే చురకత్తుల్ని జేబులోపెట్టుకు తిరుగుతాడనే అపవాదు మూటగట్టి. తదనంతరం అసలు విషయాన్ని ప్రారంభించడం కాత్యాయనిగారి bias ను సుస్పష్టంగా ఎత్తిచూఫూతోంది.ఒక పాఠకుడిగా ఇవన్నీ నాకు అప్రస్తుతాలు, అనవసరాలు.
పుస్తకం గురించి చెప్పకముందే కాత్యాయనిగారు విసిరిన మరొ రాయి, రచయిత "స్త్రీ సమస్యలపై సానుభూతితో తాజానవల 'మునెమ్మ' వెలువరించారు" అటూ రచయితకు లేని ఉద్దేశాన్ని ఆపాదించడం. 'జయప్రభ'గారు రాసిన ముందుమాటలో "అయ్యా! మీరచనల్లో స్త్రీపాత్రే ఉండవు. ఉన్నా వాటికి ప్రాధాన్యత ఉండదు. మీధృష్టిలో స్త్రీలకి ప్రాధాన్యత లేదా? లేక స్త్రీలని ముఖ్యపాత్రగా మలచి కథ రాయగల్గిన శల్తిమీకు లేదా? ఆడవాళ్ళంటే మీకేమన్నా భయమా??" అన్న ప్రశ్నలకి సమాధానంగా ఈ నవలను రాయటం జరిగిందన్న సూచన ఉంది. అంతేతప్ప, సమీక్షకురాలు ఆరోపించిన 'ఒంటరి స్త్రీల సమస్యలకు పరిష్కారాన్ని అందిచడానికి పూనుకున్నట్లు'గా కనీసం చూచాయగాకూడా చెప్పడం జరగలేదు.అలాంటప్పుడు, ఇంతటి ఆరితేరిన conclusion కి సమీక్షకురాలు ఎలా వచ్చిచేరారో అర్థంకాకుండా ఉంది.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఈ సందర్భంగా ...
మునెమ్మ నవలపై సాక్షి దినపత్రికలో
13, 20, 27 అక్టోబర్ 2008 తేదీలలో జరిగిన చర్చ
...విమర్శకులకు నవలా రచయిత డాక్టర్ కేశవరెడ్డి గారు 03 నవంబర్ 2008 న
ఇచ్చిన సమాధానం తాలూకు లింకులను ఇక్కడ పొందుపరుస్తున్నాము:
1) రాసే వాళ్లకు చదివే వాళ్ళు లోకువ .........కాత్యాయని (సాక్షి 13-10-2008)
http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=13035&Categoryid=1&subcatid=3
2) మునెమ్మ ఎవరిని జయించింది? ...... గోపిని కరుణాకర్ (సాక్షి 20-10-2008)
వికృత శిల్ప విన్యాసం ................. తెల్కపల్లి రవి (సాక్షి 20-10-2008)
http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=13527&Categoryid=1&subcatid=3
3) అవును ఈ విమర్శకు రాలికి మేము లోకువే !! - డాక్టర్ భారతి (సాక్షి 27-10-2008)
ఒక అసంబద్ధ రచన .......... ఆర్ కే (సాక్షి 27-10-2008)
http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=14010&Categoryid=1&subcatid=3
4) హిస్టీరియా రోగుల నుంచి సాహిత్యాన్ని కాపాడండి .... డాక్టర్ కేశవరెడ్డి గారి సమాధానం (సాక్షి 03-11-2008)
http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=14390&Categoryid=1&subcatid=3
వెతకండి : సాక్షి దినపత్రిక ..... పాత సంచికలు .... తేది ... అభిప్రాయం (శీర్షిక)....సాహిత్యం ( ఉప శీర్షిక)
మునెమ్మ ... నవల
రచన: డా. కేశవరెడ్డి
తొలి పలుకు: జయప్రభ
మలి పలుకు: అంబటి సురేంద్రరాజు
ముఖచిత్రం: కాళ్ళ
111 పేజీలు, వెల రూ.40
ప్రతులకు, వివరాలకు :
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం. 85 ,
బాలాజీ నగర్ , గుడి మల్కాపూర్ ,
హైదరాబాద్ - 500 067
ఆంద్ర ప్రదేశ్
ఫోన్ నెం. 040-2352 1849
.......................................