Wednesday, January 13, 2016

జార్జి, నాకు కేవలం అన్నయ్య మాత్రమే కాదు - సంరక్షకుడూ, మిత్రుడూ కూడా - సిరిల్ రెడ్డి

జార్జి పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోదాం
-  సిరిల్ రెడ్డి 

నలభైమూడేళ్ళ కిందట హత్యకు గురైన జార్జి, ఇప్పుడు జీవించి వుంటే అరవై తొమ్మిదేళ్ళ వయసులో ఉండేవాడు. జార్జి, నాకు కేవలం అన్నయ్య మాత్రమే కాదు - సంరక్షకుడూ (తల్లీ, తండ్రీ, సోదరుడూ - అన్నీ తానే అయిన వ్యక్తి), మిత్రుడూ కూడా. నాకు ఎనిమిదేళ్ళుండగా 1956లో తంగస్సేరి, క్విలోన్‌ లోని హాస్టల్లో చేర్చినప్పటి నుండి, 1965 లో నిజాం కాలేజిలో పియుసి పూర్తి చేసేంతవరకూ అతడు నాకు సహచరుడూ, రక్షకుడూ కూడా.
... ... ...
జార్జి మరణానంతరం జంపాల ప్రసాద్‌, మధుసూదన్‌రాజ్‌ యాదవ్‌, జనార్దన్‌ వంటి ఎందరో యువకులు ప్రజల కొరకు పోరాటంలో నేలకొరిగారు. బొజ్జా తారకం వంటి కొందరు దళిత మేధావులు కుల సమస్యపై పోరాటాలు చేశారు.
ఇన్ని పోరాటాల అనంతరం, ఈనాడు హిందూత్వ, బ్రాహ్మణీయ శక్తులు దేశ వ్యాప్తంగా మరింత బలపడటమూ, మరొక వైపున ప్రజల కొరకు పోరాడ వలసిన మార్క్సిస్టు - లెనినిస్టులూ, అంబేడ్కర్‌ వాదుల నడుమ అనైక్యత నెలకొనటమూ స్పష్టంగా కనబడుతున్నది.
... ... ...
మార్క్సిజాన్ని గురించి మాట్లాడేవారు అంబేడ్కర్‌ను తోసిపుచ్చటమూ, అంబేడ్కర్‌ను అనుసరించేవారు మార్క్సిజాన్ని వ్యతిరేక భావనతో చూడటమూ జరుగుతూ వచ్చింది.
భారతదేశంలోని ప్రత్యేకమైన సంక్లిష్ట సమాజంలో ప్రజా పోరాటాలను నిర్మించటమూ, అభివృద్ధి చెయ్యటమూ జరగాలంటే కేవలం మార్క్సిజాన్నో లేక అంబేడ్కరిజాన్నో అనుసరిస్తే సరిపోదు.
భారతదేశంలోని సంక్లిష్టమైన సామాజిక వ్యవస్థను అర్థం చేసుకునేందుకు మార్క్సిస్టులు అంబేడ్కర్‌ను అధ్యయనం చెయ్యటం ఎంత అవసరమో పేదలూ, అట్టడుగు వర్గాల వారూ అయిన సామాజిక శక్తులను సంఘటితం చెయ్యాలనుకునే అంబేడ్కర్‌ వాదులు మార్క్స్‌ను అధ్యయనం చెయ్యటమూ అంతే అవసరం.

- సిరిల్ రెడ్డి (ముందుమాట నుంచి)

జీనా హైతో మర్‌నా సీఖో 
- జార్జిరెడ్డి జీవన రేఖలు
రచన: కాత్యాయని
112 పేజీలు , ధర : రూ.60/- 
కవర్ ఫోటో : క్రైసిస్ ఇన్ ది కాంపస్, డాక్యుమెంటరీ బై ఫాలి బిల్లిమోరియా, 1971, అక్షరాలు : సృజన్

ఈ పుస్తకం కావలసిన వారు తమ పోస్టల్ చిరునామా పేర్కొంటూ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పేరిట మనీ ఆర్డర్ లేదా  డీడీ పంపిస్తే పోస్టల్ ఖర్చులు మేమే భరించి పుస్తకాన్నిమీకు అందిస్తాం.
మా చిరునామా :
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్, గుడిమల్కాపూర్,
మెహదిపట్నం, హైదరాబాద్ 500006

ఈ కింది బాంక్ అకౌంట్ కు ఆన్ లైన్ లో కూడా డబ్బు పంపించవచ్చు :
Oriental Bank of Commerce
1. Account Number - 15642191000616
2. Account Type - Savings bank
3. Account Name - Hyderabad Book Trust
4. Bank and Branch Name - Oriental Bank of Commerce, Attapur, Hyderabad.
5. IFSC Code.  - ORBC 0101564

ఇంకా ఏమైనా వివరాలు కావలిస్తే ఈ కింది నెంబర్ కు ఉదయం 10 నుంచి  సాయంత్రం 5 మధ్య ఫోన్ చేయండి:
Phone No. 040-2352 1849

లేదా ఈ కింది చిరునామాకు ఇమెయిల్  చేయవచ్చు :
Email ID : hyderabadbooktrust@gmail.com


ఈ పుస్తకం ఇంగ్లీష్ లో కూడా లభిస్తోంది:

Jeena hai to marna seekho : 


The Life and Times of George Reddy, 


Gita Ramaswamy, 

154 pages, Rs. 100

.


No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌