Monday, January 11, 2016

జీనా హైతో మర్‌నా సీఖో - జార్జిరెడ్డి జీవన రేఖలు, (తెలుగులో) రచన: కాత్యాయని, హెచ్‌బిటి ప్రచురణ, ధర రూ.60/-


జీనా హైతో మర్‌నా సీఖో - కదమ్‌ కదమ్‌ పర్‌ లడ్‌నా సీఖో

జార్జి రెడ్డి పోరాటస్ఫూర్తికి ప్రతిరూపమైన నినాదమిది.
అతడు జీవించినది పాతికేళ్ళే.
కానీ, నిండైన వ్యక్తిత్వంతో జీవించటం ఎలాగో, జీవితాన్నొక ఆధిపత్య వ్యతిరేక పోరాటంగా మలచుకోవటం ఎలాగో, ఒక నమూనాను నెలకొల్పి వెళ్ళాడు జార్జి.

అతడి జీవితం నిజంగా అడుగడుగునా పోరాటంగానే సాగింది.
తన వ్యక్తిగత, సామాజిక జీవితాల్లో ఎదురయిన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ జార్జి సాగించిన ప్రయాణం అతడినొక విలక్షణమైన వ్యక్తిగా తీర్చిదిద్దింది.

ప్రపంచవ్యాప్తంగా యువతరాన్ని ఉరకలెత్తించిన అరవయ్యవ దశాబ్దపు విప్లవ చైతన్యానికి స్పందించిన జార్జి, ఆ స్ఫూర్తితో విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించేందుకు పూనుకున్నాడు.

ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జార్జి, అతడి సహచరులు సాగించిన పోరాటం తెలుగు నేలపై విప్లవ ప్రజాస్వామిక విద్యార్థి ఉద్యమాల చరిత్రలోనే ఒక విశిష్టమైన అధ్యాయాన్ని రచించింది.
భారతదేశంలోనూ, రాష్ట్రంలోనూ బలపడుతున్న విప్లవోద్యమ చైతన్యాన్ని విద్యార్థి ఉద్యమంలో ప్రవేశపెట్టేందుకు జార్జి విలువైన కృషి చేశాడు.
ఆనాటి విద్యా సంస్థలపై పెత్తనం సాగిస్తుండిన అభివృద్ధి నిరోధక శక్తులపై అతడి సహచర బృందం పోరాటానికి సిద్ధపడింది. విద్యారంగ సమస్యలను సామాజిక సమస్యలతో అనుసంధానం చేసిన ఈ విద్యార్థి సంఘం సామాజిక మార్పులో విద్యార్థులు నిర్వహించాల్సిన పాత్రను స్పష్టంగా నిర్వచించింది.

అన్ని రకాల ఆధిపత్య వ్యవస్థలకూ ఎదురు నిలిచి పోరాడే క్రమంలో జార్జి నెలకొల్పిన విలువలు అతణ్ణి యువతరానికి సన్నిహితం చేశాయి. ఫ్యూడల్‌ పెత్తందారీ శక్తులకు ఎదురు నిలవాల్సిన ఉద్యమం ఎంత ప్రజాస్వామికంగా, పారదర్శకంగా, నిర్భయంగా సాగాలో అతడు ఆచరించి చూపాడు. అందుకు తన ప్రాణాలనే పణం పెట్టాడు.

జార్జి హత్యతో యువతరంలో రేగిన ఆగ్రహం, అలజడి బలమైన విద్యార్థి ఉద్యమానికి ప్రేరణగా నిలిచాయి. సంస్థాగతంగా ఎన్ని పాయలుగా ప్రవహించినా, వ్యవస్థను సమూలంగా మార్చాలనే విప్లవ చైతన్యం ఈ ఉద్యమాలన్నిటికీ స్ఫూర్తిగా నిలిచింది.
జార్జి మరణానంతరం ఉస్మానియా యూనివర్సిటీ నుండి తయారైన ఎందరో విప్లవ విద్యార్థులు భారత విప్లవోద్యమానికే నాయకులుగా ఎదిగారు.

ఇన్ని ఉద్యమాలు వికసించిన అనంతరం, ఇవాళ మళ్ళీ సమాజంపై మతోన్మాద రాజకీయాల పట్టు బిగుస్తున్నది. హేతువాద, ప్రజాస్వామిక శక్తులపై పెరుగుతూ వచ్చిన అసహనం భౌతిక దాడులుగా, హత్యలుగా పరిణమిస్తున్నది. ఈ పరిస్థితికి కారణాలను లోతుగా అన్వేషించాల్సి ఉన్నది. ప్రజాజీవనంలో మతానికున్న పాత్రనూ, మతోన్మాద రాజకీయాల పట్ల నిర్లిప్తంగా ఉండిపోయే వైఖరినీ విశ్లేషిస్తూ ప్రత్యామ్నాయ దృక్పథాన్ని నిర్మించాల్సి ఉన్నది. మతోన్మాద శక్తులపై జార్జి చేసిన పోరాటాన్ని తెలిపే ఈ పుస్తకం అందుకు సహకరించగలదని మా ఆశ.

భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తున్న ఆధిపత్య శక్తులపై నిరసన స్వరాలను విన్పిస్తున్న ప్రజాస్వామిక వాదులతో గొంతు కలుపుతూ ఈ పుస్తకాన్ని మీ ముందుకు తెస్తున్నాం.
- హెచ్‌బిటి 

జీనా హైతో మర్‌నా సీఖో 
- జార్జిరెడ్డి జీవన రేఖలు
రచన: కాత్యాయని
112 పేజీలు , ధర : రూ.60/- 
కవర్ ఫోటో : క్రైసిస్ ఇన్ ది కాంపస్, డాక్యుమెంటరీ బై ఫాలి బిల్లిమోరియా, 1971, అక్షరాలు : సృజన్

ఈ పుస్తకం కావలసిన వారు తమ పోస్టల్ చిరునామా పేర్కొంటూ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పేరిట మనీ ఆర్డర్ లేదా  డీడీ పంపిస్తే పోస్టల్ ఖర్చులు మేమే భరించి పుస్తకాన్నిమీకు అందిస్తాం.
మా చిరునామా :
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్, గుడిమల్కాపూర్,
మెహదిపట్నం, హైదరాబాద్ 500006

ఈ కింది బాంక్ అకౌంట్ కు ఆన్ లైన్ లో కూడా డబ్బు పంపించవచ్చు :
Oriental Bank of Commerce
1. Account Number - 15642191000616
2. Account Type - Savings bank
3. Account Name - Hyderabad Book Trust
4. Bank and Branch Name - Oriental Bank of Commerce, Attapur, Hyderabad.
5. IFSC Code.  - ORBC 0101564

ఇంకా ఏమైనా వివరాలు కావలిస్తే ఈ కింది నెంబర్ కు ఉదయం 10 నుంచి  సాయంత్రం 5 మధ్య ఫోన్ చేయండి:
Phone No. 040-2352 1849

లేదా ఈ కింది చిరునామాకు ఇమెయిల్  చేయవచ్చు :
Email ID : hyderabadbooktrust@gmail.com

ఈ పుస్తకం ఇంగ్లీష్ లో కూడా లభిస్తోంది:
Jeena hai to marna seekho : 
The Life and Times of George Reddy, 
Gita Ramaswamy, 
154 pages, Rs. 100 

.

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌