Many of you have grown up reading some HBT books and some of
you may possible remember your favourite
books - Edutaralu, Vaidyudu Leni Chota, Raktaasruvulu, Spartacus, etc, with some
affection.
At HBT, we have always used a cheaper variety of printing paper and packed the matter densely
into the page so that we save on paper, and can keep the cost low. While the
average reader has not complained (or maybe, not in our hearing), sometimes we
ourselves, wonder - was there no other way?
Take Edutaralu. The present 200 page edition costs Rs. 100.
If we use better quality paper (light-weight printing paper or 70 GSM
maplitho), and retype the book with wider margins, the pages will increase to
280. With new CTP films and plates and better paper, the book will cost us
roughly Rs. 65/- copy (printing bill
alone), to be priced at Rs. 150-180.
We have a proposal.
If you have a favourite HBT book, if you would like to see
it in a better production (quality of paper, wider margins, better binding,
maybe hard cover), and would like to contribute to this, we can bring down the
price.
If we get say, Rs. 30,000, we can retain the old price of
Rs. 100 for 1,000 copies. If we get more, we can retain the old price for a
bigger print order. That is, your contribution helps the new reader to read the
old classic in a better production.
If you like this idea, please reply on our blog, indicating
which book you would like to support. Maybe if more than one person responds,
it could be easier for this proposal to get off ground. We will be glad to
acknowledge your support in this fashion roughly:
‘HBT gratefully acknowledges the support of X, Y and Z,
which made the price of this edition low.’
- HYDERABAD
BOOK TRUST
Phone No. 040-2352 1849
Mail: gitaramaswamy@yahoo.com
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
మీకు నచ్చిన, మీరు మెచ్చిన అత్యుత్తమ హెచ్‌బిటి పుస్తకాలను మరింత అందంగా పునర్ముద్రించేందుకు చేయూతనివ్వండి !
మీలో చాలామంది హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పుస్తకాలు చదువుతూ పెరిగిపెద్దయివుంటారు. ఆనాడు ఎంతో అభిమానంతో చదివిన ''ఏడుతరాలు'', ''వైద్యుడులేనిచోట'', ''రక్తాశృవులు'', ''స్పార్టకస్'' వంటి పుస్తకాలు మీలో కొందరికైనా ఇంకా గుర్తుండే వుంటాయి.
సాధారణంగా పాఠకులకు సాధ్యమైనంత తక్కువ ధరకు పుస్తకాలను అందించాలన్న ఉద్దేశంతో మేం తక్కువ రకం కాగితం మీద, పేజీలో చిన్న అక్షరాలతో ఎక్కువ మాటర్‌ని ఇరికించి ముద్రిస్తుంటాం. సగటు పాఠకుడు ఇప్పటివరకు ఈ విషయంలో మాకేమీ ఫిర్యాదు చేయలేదు (లేదా మా దృష్టికి రాలేదు) కానీ ఒకోసారి మాకే అనిపిస్తుంటుంది దీనికి ప్రత్యామ్నాయం ఏమీ లేదా అని.
ఉదహరణకి ''ఏడుతరాలు'' తీసుకోండి. ప్రస్తుతం మార్కెట్‌లో వున్న 200 పేజీల ఆ పుస్తకం వెల 100 రూపాయలు. మేం గనక నాణ్యమైన కాగితాన్ని ( తక్కువ బరువుండే 70 జిఎస్‌ఎం మ్యాప్‌లిథో పేపర్‌ని) ఉపయోగించి, విశాలమైన మార్జిన్లతో మళ్లీ టైపుచేయించి ముద్రిస్తే పేజీల సంఖ్య 280 కి పెరుగుతుంది. కొత్త సిటిపి ఫిలిమ్‌లు, ప్లేట్లు, మంచి పేపర్ అంతా కలసి ముద్రణకే ఒక్కో కాపీకి 65 రూపాయలవుతుంది. మిగతా ఖర్చులు కలిపితే అమ్మకం ధర 150 నుంచి 180 రూపాయలుగా వుంటుంది.
ఇక్కడ మాకొకటి అనిపిస్తోంది...
మీరు గనక మీకు నచ్చిన ఒక హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పుస్తకాన్ని (నాణ్యమైన పేపర్, విశాలమైన మార్జిన్లు, మంచి బైడింగ్, వీలైతే హార్ట్ కవర్‌లో) అందంగా తీసుకురావడానికి మాకు కొంత విరాళం ఇవ్వగలిగితే మేము పైన పేర్కొన్న అమ్మకం ధరని గణనీయంగా తగ్గించగలుగుతాం.
ఉదాహరణకు రూ.30,000 ల విరాళం అందితే కొత్త నాణ్యమైన పుస్తకాన్ని 1000 కాపీలు ముద్రించి పాత ధరకే అంటే 100 రూపాయలకే పాఠకులకు అందించగలుగుతాం. మరింత ఎక్కువ మొత్తం ఆర్థిక సహాయం లభిస్తే ఇంకా ఎక్కువ కాపీలు ముద్రించి అదే ధరకు అందించడానికి వీలవుతుంది. అంటే మీ విరాళం ద్వారా నేటి పాఠకులకు అలనాటి క్లాసిక్ పుస్తకాలను మరింత అందంగా తీర్చిదిద్ది అందించడం సాధ్యమవుతుందన్నమాట.
ఈ ఆలోచన మీకు నచ్చినట్టయితే దయచేసి మీ సమాధానాన్ని మా ఈ బ్లాగులో పొందుపరచండి. ఏ పుస్తకానికి మీరు సహాయం చేయాలనుకుంటున్నారో కూడా తెలియజేయండి. ఒక పుస్తకానికి ఒకరి కంటే ఎక్కువ మంది చేయూత నిచ్చేందుకు ముందుకు వచ్చినట్టయితే మరింత సులువుగా వుంటుంది. వెంటనే ఈ బృహత్కార్యాన్ని ప్రారంభించేందుకూ వీలవుతుంది. మేం ఆ పుస్తకంలో మీరు అందించిన సహాయాన్ని ఈ కింది విధంగా ప్రస్తావిస్తాం:
''ఈ పుస్తకాన్ని తక్కువ ధరకే ఇంత అందంగా పునర్ముద్రించేందుకు ఆర్థిక సహాయం చేసిన ఫలానా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.''
ఇట్లు
మీ
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ఫోన్ నెం. 040 2352 1849
మెయిల్ : gitaramaswamy@yahoo.com

No comments:
Post a Comment