మూడున్నర దశాబ్దాలుగా తెలుగు పాఠకులకు మంచి పుస్తకాలు అందిస్తున్న సంస్థ: చిరునామా: Hyderabad Book Trust, Plot No. 85, Balaji Nagar, Gudi Malkapur, Hyderabad-500 006. Ph.No. 040-23521849 ..... Mail: hyderabadbooktrust@gmail.com
Thursday, February 18, 2010
వైద్యుడు లేని చోట ... Where There is No Doctor
వైద్యుడు లేని చోట
వైద్యుడు లేని చోట కేవలం ప్రథమ చికిత్సకు సంబంధించిన పుస్తకం కాదు.
అంతకంటే ఎంతో విస్తృతమైన గ్రంథం.
సామాన్యల ఆరోగ్యంపై ప్రభావం చూపే అనేక అంశాలను ఇది తడిమింది.
నీళ్ల విరేచనాలు మొదలుకుని క్షయ వ్యాధి వరకు అన్ని వ్యాధుల్ని విశ్లేషించింది.
సహాయపడే/హానిచేసే రకరకాల గృహ వైద్యాలు మొదలుకొని కొన్ని ఆధునిక మందుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకు అనేక అంశాల గురించి చర్చించింది.
పరిశుభ్రత, పౌష్టిక ఆహారం, వ్యాధి నిరోధక టీకాలు మొదలైన అంశాలకు ఈ పుస్తకంలో ప్రత్యేక ప్రాధాన్యత యివ్వడం జరిగింది.
ఇందులో బిడ్డల పుట్టుక, కుటుంబ నియంత్రణ గురించిన సమాచారం కూడా వుంది.
పాఠకులు తమ శ్రేయస్సు కోసం ఏం చేయాలో సూచించడమే కాకుండా ఏ సమస్యలను అనుభవజ్ఞులైన ఆరోగ్య కార్యకర్తచే పరిష్కరింపజేసుకోవాలో వారికి అవగాహనను కలిగిస్తుందీ పుస్తకం.
సవరించబడిన ఈ సరికొత్త ముద్రణలో ఎయిడ్స్, గర్భస్రావం, మాదకద్రవ్యాల వ్యసనం వంటి అనేక ఆరోగ్య సమస్యలపై అదనపు సమాచారాన్ని చేర్చడం జరిగింది. అదేవిధంగా వివిధ అంశాలపై మొదటి ప్రచురణలో యిచ్చిన సూచనలని ప్రస్తు పరిస్థితులకు అనుగుణంగా సవరించడం కూడా జరిగింది.
ఇందులోని అధ్యాయాలు:
1. ఇంటింటి వైద్యం, 2. తరచూ అయోమయంలో పడేసే జబ్బులు, 3. రోగిని ఎలా పరీక్షించాలి?, 4. రోగిని ఎలా సంరక్షించాలి?, 5. మందులు లేకుండా జబ్బును నయం చేయడం,
6. ఆధునిక మందుల వాడకంలో తప్పొప్పులు, 7. యాంటీ బయాటిక్స్ అంటే ఏమిటి వాటిని ఎలా ఉపయోగించాలి? 8. మందును ఎలా కొలచి ఇవ్వాలి?, 9. ఇంజక్షన్స్‌కి సూచనలు, జాగ్రత్తలు 10. ప్రథమ చికిత్స,
11. పోషకాహారం, 12. వ్యాధినిరోధకం, 13. కొన్ని సర్వ సాధారణ జబ్బులు, 14. ప్రత్యేక వైద్యం అవసరమైన ప్రమాదకరమైన వ్యాధులు, 15. చర్మ వ్యాధులు,
16. కళ్లు, 17. చెవులు, ముక్కు, 18. జీర్ణ వ్యవస్థ, పళ్లు, చిగుళ్లు, నోరు, 19. మూత్రకోశం, జననేంద్రియాలు, 20. తల్లులకు, మంత్రసానులకు కావలసిన వివరాలు,
21. కుటుంబ నియంత్రణ, 22. పిల్లల ఆరోగ్యం జబ్బులు, 23. వృద్ధుల ఆరోగ్యం జబ్బులు, 24. మందుల పెట్టె, 25. మందుల ఉపయోగం, మోతాదు, తీసుకోవలసిన జాగ్రత్తలు, 26. ప్రమాదకరమైన, నిషేధించబడిన మందుల జాబితా.
ఈ పుస్తకాన్ని మీ బీరువాలో దాచి పెట్టకండి. పదిమందికీ అందజేయండి.
వైద్యుడు లేని చోట
- డేవిడ్ వర్నర్
తెలుగు అనువాదం: డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి
సహాకుడు: బి. కృష్ణారావు
ఆంగ్ల మూలం: వేర్ దేర్ ఈజ్ నో డాక్టర్, హెస్పెరియన్ ఫౌండేషన్, కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.
ఇండియన్ ఎడిషన్‌ను డా. సత్యమాల సవరించారు. దానిని వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ వారు ప్రచురించారు.
తెలుగులో తొలి ముద్రణ: 1982
మలి ముద్రణలు: 1983, 1988, 1990, 1996, 2000
450 పేజీలు ... వెల: 220/-
ప్రతులకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్, గుడిమల్కాపూర్,
హైదరాబాద్-500067
ఫోన్: 040 2352 1849
.
Subscribe to:
Post Comments (Atom)
hi... nanna kannada ashtu volledilla... :-) nenage Indiblooger alli
ReplyDeletenodidhu... welcome to the family :-)
naanu ondu contest nalli paticipate maaduthene... please nanage
vote maadi neevu...
http://www.indiblogger.in/indipost.php?post=30610
thumba help aaguthadhe... dhanyavaadagalu :-)
I need your help...
ReplyDeleteIm taking part in the indiblogger contest and i need ur vote...
please do read my post and promote it. I bet you will like it... :-)
http://www.indiblogger.in/indipost.php?post=30610
Please vote for it...
i wnt this book
ReplyDelete