మూడున్నర దశాబ్దాలుగా తెలుగు పాఠకులకు మంచి పుస్తకాలు అందిస్తున్న సంస్థ: చిరునామా: Hyderabad Book Trust, Plot No. 85, Balaji Nagar, Gudi Malkapur, Hyderabad-500 006. Ph.No. 040-23521849 ..... Mail: hyderabadbooktrust@gmail.com
Thursday, February 25, 2010
గెట్ పబ్లిష్డ్ ... మహమ్మద్ ఖదీర్ బాబు కథ ...
ఒక్క దోషికి శిక్ష పడకపోయినా పర్వాలేదు
కానీ నూరుమంది నిర్దోషులు తప్పించుకోవాలి.
....
వాళ్లు దర్గాలో వుండగానే ముంబై తాజ్ హోటల్‌లో పొగలు టీవీల్లో కనిపించాయి.
ఆ తరువాత మంటలు చెలరేగాయి.
ఆ తర్వాత పేలుళ్ల శబ్దాలు వాళ్ల గుండెలను దడదడలాడించాయి.
వాళ్లు కంగారు పడ్డారు.
ఆ భయంతో, ఆ ఆందోళనతో, ఇలాంటి సమయంలో తిరుగు ప్రయాణం మంచిది కాదని రెండు రోజులపాటు అక్కడే వుండిపోయారు.
మూడో రోజు సద్దు మణిగినట్టు అనిపించాక, మరేం భయం లేదని బయలు దేరి అదేరోజు ఇళ్లకు చేరుకున్నారు.
ఆ రోజు సాయంత్రం గడిచింది. ఆ రోజు రాత్రి గడిచింది. మరుసటి రోజు పగలు గడిచింది. సాయంత్రం గడిచింది. రాత్రి అత్తర్ నయాబ్ యింటి తలుపు తట్టిన చప్పుడు వినిపించింది. ...
... ... ...
ఊ... ఇదంతా పబ్లిష్ అవుతుందనే అనుకుంటున్నావా షకీలూ?
నేను మాట్లాడలేదు. ...
తెలుగు సంగతి పక్కన పెట్టు కనీసం ఇంగ్లీష్ మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో అయినా ఇలాంటివి పబ్లిష్ అవడం ఎప్పుడైనా చూశావా నువ్వు?
నేను మాట్లాడలేదు.
... ... ...
యాల్లా... మాకు దక్కవలసిన రొట్టెను మాకు దక్కించు.
యాల్లా... మా బతుకు తెరువులో బర్కత్ ఇవ్వు.
మేము నిస్సహాయులం.
నీవు తప్ప వేరే దిక్కులేని వాళ్లం. కనికరించు.
మా ఇళ్లలో రోగాలతో పీడితులైనవారు ఎందరో వున్నారు. వాళ్లకు స్వస్థత చేకూర్చు.
పనిలేని బేరోజ్‌గార్‌లు మరెందరో వున్నారు. వాళ్లకు పని ఇవ్వు.
పెళ్లిళ్లు జరగక బండ శిలల వలె తండ్రుల గుండెలపై కూర్చున్న ఆడపిల్లలు లెక్కకు మించి వున్నారు. వాళ్లపై దయ చూపు.
యాల్లా... మాకు మర్యాదతో కూడిన జీవితం ఇవ్వు.
నిర్భయంగా జీవించే బతుకు ఇవ్వు.
యాల్లా... మాకు ప్రార్థించడం రాదు.
అడగడం కూడా రాదు.
ఈ ముక్కల చెక్కల దుఆను నువ్వే కుబూల్ చేయాలి పర్‌వర్‌దిగార్.
ఆమీన్.
... ... ...
చదవండి. చదివించండి.
గెట్ పబ్లిష్‌డ్ (కథ)
రచన: మహమ్మద్ ఖదీర్ బాబు
ముఖచిత్రం, బొమ్మలు: మోహన్
కవర్ డిజైన్: లేపాక్షి
39 పేజీలు, వెల: రూ.20
ప్రతులకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్, గుడిమల్కాపూర్,
హైదరాబాద్-500067
ఫోన్: 040 2352 1849
...
Subscribe to:
Post Comments (Atom)
ఒక్క కథని విడి పుస్తకంగా ప్రచురించారా?
ReplyDeleteInteresting
We are glad to share with you the happy news that Mandara Prabhakar has just won the Best Translator award for the HBT book, Dalitodyama charitra from the Sahitya Academy.
ReplyDelete