Tuesday, July 21, 2009

చరిత్ర అంటే ఏమిటి? - ఇ.హెచ్‌. కార్‌ ...అనువాదం : వల్లంపాటి వెంకట సుబ్బయ్య ...



What is History? by E.H.Carr ...

అన్ని వాస్తవాలూ చారిత్రక వాస్తవాలేనా ?
చరిత్రకారుడు వాస్తవాలను ఎలా ఎన్నుకుంటాడు ?
పాలకవర్గ భావజాలం చరిత్రకారుణ్ణి ఎలా ప్రభావితం చేస్తుంది ?
చరిత్రకూ, తత్వశాస్త్రానికీ మధ్య వున్న సంబంధం ఎలాంటిది ?
ఏ తత్వశాస్రాన్నీ నమ్మని గొప్ప చరిత్రకారుడుంటాడా ?
చరిత్ర అంటే కొందరు ప్రముఖుల జీవిత చరిత్రేనా ?
చరిత్రలో కార్యకారణ సంబంధాన్ని నిర్ణయించటం ఎలా ?
చారిత్రక సంఘటనలను యాదృచ్ఛికత ఎలా నిర్ణయిస్తుంది ?
చరిత్ర తయారుచేసిన చరిత్రకారుడు చరిత్రను ఎలా రాస్తాడు ?
చరిత్ర శాస్త్రమేనా ?
ఆక్టస్‌, ఇసయా మెర్లిన్‌, కాలింగ్‌వుడ్‌, టాయన్‌బీ మొదలైన చరిత్రకారుల చారిత్రక దృక్పథాల్లోని లోపాలేమిటి?

చరిత్రను గురించిన ఇలాంటి ఇంకెన్నో ప్రశ్నలను ఈ గ్రంథం కూలంకషంగా చర్చిస్తుంది.
మన చారిత్రక చైతన్యాన్ని తట్టిలేపుతుంది.
ఇది ప్రతి చరిత్ర విద్యార్థికీ కరదీపికగా వుండతగ్గ పుస్తకం.
ఈ గ్రంథంలోని చరిత్రను గురించిన సిద్ధాంతాలను కొన్ని చిన్న చిన్న మార్పులతో సాహిత్యానికీ, సాహిత్య చరిత్రకూ అన్వయింపజేయవచ్చు.
అందుచేత ప్రతి రచయితా, విమర్శకుడూ తప్పకుండా చదవవలసిన పుస్తకం యిది.

చరిత్ర అంటే ఏమిటి?
- ఇ.హెచ్‌.కార్‌

ఆంగ్లమూలం : What is History? -E.H.Carr
తెలుగు అనువాదం: వల్లంపాటి వెంకటసుబ్బయ్య

ట్రస్ట్‌ సంపాదకుడు: చేకూరి రామారావు
తొలి ముద్రణ: 1983
మలి ముద్రణలు: 1984, 1994, 1997
115 పేజీలు, వెల: రూ.22

2 comments:

  1. నాకు ఈ బుక్ కావాలి. హైద్రాబాద్ లో ఎక్కడ దొరుకుతుందో చెప్పుండి.

    ReplyDelete
  2. జయ గారూ
    మా పుస్తకాలు ఈ దిగువ పుస్తకాల షాపుల్లో లభిస్తాయి:
    ప్రజా శక్తి - చిక్కడపల్లి
    దిశ - చిక్కడపల్లి
    విశాలాంధ్ర - కోఠి
    లేదంటే మీరు మా కార్యాలయం నుంచి కూడా పుస్తకాలను కొనుగోలు చేయవచ్చు. మా చిరునామా, ఫోన్ నెంబర్ బ్లాగు శీర్షిక కింద వున్నాయి గమనిచండి.

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌