ఒక విజ్ఞప్తి
పాఠకుల కోరికపై మేరీ టైలర్ రచించిన ''భారతదేశంలో నా జైలు జీవితం'' అనే పుస్తకాన్ని పునర్ముద్రించాలనుకుంటున్నాం.
మన దేశంలో 1970లలో తనకు ఎదురైన చేదు అనుభవాలను వివరిస్తూ ఆమె రాసిన ఈ పుస్తకం అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
పెంగ్విన్ వారు ''మై ఇయర్స్ ఇన్ ఏన్ ఇండియన్ ప్రిజన్'' అన్న పేరుతో ఇంగ్లీషులో వెలువరించగా హైదరాబాద్ బుక్ ట్రస్ట్ 1983లో ''భారతదేశంలో నా జైలు జీవితం'' పేరిట తెలుగులో ప్రచురించింది.
అయితే ప్రస్తుతం మాదగ్గర వున్న ఒకే ఒక ప్రతి కవర్‌పేజీ సరైన స్థితిలో లేదు. ముద్రణా యొగ్యమైన మేరీ టైలర్ ఫొటో కూడా అందుబాటులో లేదు. కాబట్టి ఎవరిదగ్గరైనా ఈ దిగువ ఇంగ్లీషు లేదా తెలుగు పుస్తక ప్రతి ముఖచిత్రం మెరుగైన స్థితిలో వున్నట్టయితే దయచేసి మాకు పంపించవలసిందిగా కోరుతున్నాం. వారం పది రోజుల్లో మీ పుస్తకాన్ని మీకు భద్రంగా తిరిగి అందజేస్తాం. ( పెంగ్విన్ కాకుండా ఇతర పబ్లిషర్స్ ప్రచురించిన పుస్తకం మాత్రం అవసరం లేదు.)
పుస్తకం పంపించడానికి వీలుకాకపోతే కవర్ పేజీని ముద్రణకు అనువుగా హై రెజల్యూషన్‌తో స్కాన్ చేసి ఈ కింది చిరునామాకు వెంటనే పంపించండి.
ధన్యవాదాలు
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ,
07 నవంబర్ 2017
మా చిరునామా:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం 85 , బాలాజీ నగర్, గుడిమల్కాపూర్
హైదరాబాద్ - 500006
ఫోన్ నెం. 040-23521849
ఇమెయిల్ ఐడి: hyderabadbooktrust@gmail.com
No comments:
Post a Comment