''నలుపు'' ప్రజా పక్ష పత్రిక
సిరిల్ రెడ్డి ప్రచురణ కర్తగా, బొజ్జా తారకం సంపాదకుడిగా, కె.బాలగోపాల్, డి. నరసింహారెడ్డి, కంచె ఐలయ్య, సజయ, పి.ఎల్. విశ్వేశ్వరరావు, ఆర్.అఖిలేశ్వరి ప్రభృతులు సంపాదక వర్గ సభ్యులుగా వెలువడిన ''నలుపు'' పత్రిక ఆనాడు కుల, వర్గ, అస్తిత్వ ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచిన విషయం విదితమే.
1989 ఏప్రిల్ లో ప్రారంభమై 1993 వరకు ఐదేళ్లపాటు నిరాటంకంగా నడచిన ఈ పత్రిక తెలుగునాట రాజకీయ సామాజిక రంగాల్లో తనదైన ముద్ర వేసింది. కారంచేడు అనంతరం ఉవ్వెత్తున ఎగిసిపడిన దళితోద్యమాలకు, రిజర్వేషన్లపై మండల్ కమిషన్ నివేదిక అనంతరం చెలరేగిన ఆందోళనలకు, వామపక్ష సాయుధ రైతాంగ పోరాటాలకు అద్దంపట్టింది.
రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషణలకు నలుపు గొప్ప వేదికగా నిలిచింది.
నలుపులో ప్రచురించిన బొజ్జాతారకం వ్యాసాలు, సంపాదకీయాలను ఇటీవలనే హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పుస్తక రూపంలో వెలువరించింది.
నలుపును అధ్యయనం చేయడం అంటే ఆనాటి పోరాటాల తీరుతెన్నులను, రాజకీయ ఆర్థిక సామాజిక రంగాలలో చోటుచేసుకుంటున్నమార్పులను అధ్యయనం చేయడమే.
విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులు, ఇతర ఔత్సాహికులందరి సౌలభ్యం కోసం ఐదేళ్ల నలుపు పత్రిక
సంచికలన్నింటినీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరిచామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.
దిగువ లింక్ ల ద్వారా నలుపు పత్రికలను పిడిఎఫ్ రూపంలో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:
Online Catalog
Center for Research Libraries ,
Global Resources Network
1) http://catalog.crl.edu/record=b2896132~S1
2) https://dds.crl.edu/crldelivery/30204
ఎంతో శ్రమ తీసుకుని నలుపు పత్రికలన్నింటినీ స్కానింగ్ చేసిచ్చిన ''మనసు ఫౌండేషన్'' వారికి (http://www.manasufoundation.com/) ఈసందర్భంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
అలాగే ఈ బృహత్తర కార్యానికి ఇంకా ఎందరో హెచ్‌బిటి, నలుపు పత్రిక అభిమానులు ఎన్నో విధాలుగా తమ సహాయ సహకారాలు అందించారు వారందరికీ కూడా కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటున్నాం.
మీ సలహాలు, సూచనలు ఏమైనా వుంటే ఈ కింది ఐడీకి మెయిల్ చేయండి:
hyderabadbooktrust@gmail.com
-హైదరాబాద్ బుక్ ట్రస్ట్
https://dds.crl.edu/crldelivery/30204
...........................................................
కొందరు పాఠకుల సూచన మేరకు :
కోరుకున్న నలుపు పత్రికను, లేదా అందులోని అవసరమైన పేజీలను డౌన్లోడ్ చేసుకునేందుకు సులువైన పద్ధతి :
1. ఈ దిగువ శాశ్విత లింక్ పై క్లిక్ చేయండి లేదా ఈ url ని ఉపయోగించి 'సెంటర్ ఫర్ రీసెర్చ్ లైబ్రరీస్' లోని 'నలుపు ప్రజల పక్ష పత్రిక' పేజ్ లోకి ఎంటర్ అవండి:
https://dds.crl.edu/crldelivery/30204
2. నిర్ణీత బాక్స్ లో కావలసిన పత్రిక పబ్లికేషన్ సంవత్సరాన్ని ఎంపిక చేసుకోండి (1989-1993)
3. అదేవిధంగా అక్కడి కాలెండర్ లో కావలసిన నెల, కావలసిన పత్రిక తేది (బోల్డ్ ఫాంట్ లో వున్న అంకె ) పై క్లిక్ చేయండి
4.పత్రిక పీ డీ ఎఫ్ కనిపించగానే డౌన్లోడ్ బటన్ (కిందకు చూపిస్తున్నబాణం గుర్తు ఎగువ కుడివైపున ఉంటుంది ) పై క్లిక్ చేయండి.
5. సంచిక ప్రత్యక్షమయ్యాక .మొత్తం పత్రికను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే "Download Full Issue " పై క్లిక్ చేయండి. కొన్ని పేజీలు మాత్రమె కావాలంటే 'ఫ్రమ్-టూ' కాలం లో పేజీ నెంబర్లను టైప్ చేసి ఆ తర్వాత"Download" పై క్లిక్ చేయండి.
.......
No comments:
Post a Comment