మూడున్నర దశాబ్దాలుగా తెలుగు పాఠకులకు మంచి పుస్తకాలు అందిస్తున్న సంస్థ: చిరునామా: Hyderabad Book Trust, Plot No. 85, Balaji Nagar, Gudi Malkapur, Hyderabad-500 006. Ph.No. 040-23521849 ..... Mail: hyderabadbooktrust@gmail.com
Wednesday, September 13, 2017
Tuesday, September 12, 2017
బొజ్జా తారకం జ్ఞాపకాల సంచిక "నీలి ఆకాశంలోఎర్ర నక్షత్రం"; కవితల సంపుటి "నేనడుగుతున్నాను" ఆవిష్కరణ సభ 16 సెప్టెంబర్ 2017 శనివారం 5-30 కి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో
బొజ్జా తారకం జ్ఞాపకాల సంచిక "నీలి ఆకాశంలోఎర్ర నక్షత్రం"; కవితల సంపుటి "నేనడుగుతున్నాను"
ఆవిష్కరణ సభ 16 సెప్టెంబర్ 2017 శనివారం 5-30 కి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో
బొజ్జా తారకం గారి ప్రధమ వర్ధంతి సందర్భంగా 16 సెప్టెంబర్ 2017 శనివారం 5-30 కి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సంస్మరణ సభ, అయన జ్ఞాపకాల సంచిక "నీలి ఆకాశంలోఎర్ర నక్షత్రం"; కవితల సంపుటి "నేనడుగుతున్నాను" ఆవిష్కరణ జరుగుతుంది
అధ్యక్షత: కాకి మాధవ రావు IAS
ముఖ్య అతిధి : జస్టిస్ సురశ్ కైత్
వక్తలు : ప్రొ. హరగోపాల్, గెడ్డం ఝాన్సి, బత్తుల పున్నయ్య, దాసరి శ్రీనివాసులు , ప. అంజయ్య,
నాళేశ్వరం శంకరం
మిత్రులకు ఆహ్వానం
- హైదరాబాద్ బుక్ ట్రస్ట్ , బొజ్జా తారకం ట్రస్ట్
Friday, September 1, 2017
ఆనాటి ''నలుపు'' ప్రజా పక్ష పత్రిక సంచికలను ఇప్పుడు ఆన్లైన్లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు!
''నలుపు'' ప్రజా పక్ష పత్రిక
సిరిల్ రెడ్డి ప్రచురణ కర్తగా, బొజ్జా తారకం సంపాదకుడిగా, కె.బాలగోపాల్, డి. నరసింహారెడ్డి, కంచె ఐలయ్య, సజయ, పి.ఎల్. విశ్వేశ్వరరావు, ఆర్.అఖిలేశ్వరి ప్రభృతులు సంపాదక వర్గ సభ్యులుగా వెలువడిన ''నలుపు'' పత్రిక ఆనాడు కుల, వర్గ, అస్తిత్వ ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచిన విషయం విదితమే.
1989 ఏప్రిల్ లో ప్రారంభమై 1993 వరకు ఐదేళ్లపాటు నిరాటంకంగా నడచిన ఈ పత్రిక తెలుగునాట రాజకీయ సామాజిక రంగాల్లో తనదైన ముద్ర వేసింది. కారంచేడు అనంతరం ఉవ్వెత్తున ఎగిసిపడిన దళితోద్యమాలకు, రిజర్వేషన్లపై మండల్ కమిషన్ నివేదిక అనంతరం చెలరేగిన ఆందోళనలకు, వామపక్ష సాయుధ రైతాంగ పోరాటాలకు అద్దంపట్టింది.
రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషణలకు నలుపు గొప్ప వేదికగా నిలిచింది.
నలుపులో ప్రచురించిన బొజ్జాతారకం వ్యాసాలు, సంపాదకీయాలను ఇటీవలనే హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పుస్తక రూపంలో వెలువరించింది.
నలుపును అధ్యయనం చేయడం అంటే ఆనాటి పోరాటాల తీరుతెన్నులను, రాజకీయ ఆర్థిక సామాజిక రంగాలలో చోటుచేసుకుంటున్నమార్పులను అధ్యయనం చేయడమే.
విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులు, ఇతర ఔత్సాహికులందరి సౌలభ్యం కోసం ఐదేళ్ల నలుపు పత్రిక
సంచికలన్నింటినీ ఇప్పుడు ఆన్లైన్లో పొందుపరిచామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.
దిగువ లింక్ ల ద్వారా నలుపు పత్రికలను పిడిఎఫ్ రూపంలో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు:
Online Catalog
Center for Research Libraries ,
Global Resources Network
1) http://catalog.crl.edu/record=b2896132~S1
2) https://dds.crl.edu/crldelivery/30204
ఎంతో శ్రమ తీసుకుని నలుపు పత్రికలన్నింటినీ స్కానింగ్ చేసిచ్చిన ''మనసు ఫౌండేషన్'' వారికి (http://www.manasufoundation.com/) ఈసందర్భంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
అలాగే ఈ బృహత్తర కార్యానికి ఇంకా ఎందరో హెచ్‌బిటి, నలుపు పత్రిక అభిమానులు ఎన్నో విధాలుగా తమ సహాయ సహకారాలు అందించారు వారందరికీ కూడా కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటున్నాం.
మీ సలహాలు, సూచనలు ఏమైనా వుంటే ఈ కింది ఐడీకి మెయిల్ చేయండి:
hyderabadbooktrust@gmail.com
-హైదరాబాద్ బుక్ ట్రస్ట్
https://dds.crl.edu/crldelivery/30204
...........................................................
కొందరు పాఠకుల సూచన మేరకు :
కోరుకున్న నలుపు పత్రికను, లేదా అందులోని అవసరమైన పేజీలను డౌన్లోడ్ చేసుకునేందుకు సులువైన పద్ధతి :
1. ఈ దిగువ శాశ్విత లింక్ పై క్లిక్ చేయండి లేదా ఈ url ని ఉపయోగించి 'సెంటర్ ఫర్ రీసెర్చ్ లైబ్రరీస్' లోని 'నలుపు ప్రజల పక్ష పత్రిక' పేజ్ లోకి ఎంటర్ అవండి:
https://dds.crl.edu/crldelivery/30204
2. నిర్ణీత బాక్స్ లో కావలసిన పత్రిక పబ్లికేషన్ సంవత్సరాన్ని ఎంపిక చేసుకోండి (1989-1993)
3. అదేవిధంగా అక్కడి కాలెండర్ లో కావలసిన నెల, కావలసిన పత్రిక తేది (బోల్డ్ ఫాంట్ లో వున్న అంకె ) పై క్లిక్ చేయండి
4.పత్రిక పీ డీ ఎఫ్ కనిపించగానే డౌన్లోడ్ బటన్ (కిందకు చూపిస్తున్నబాణం గుర్తు ఎగువ కుడివైపున ఉంటుంది ) పై క్లిక్ చేయండి.
5. సంచిక ప్రత్యక్షమయ్యాక .మొత్తం పత్రికను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే "Download Full Issue " పై క్లిక్ చేయండి. కొన్ని పేజీలు మాత్రమె కావాలంటే 'ఫ్రమ్-టూ' కాలం లో పేజీ నెంబర్లను టైప్ చేసి ఆ తర్వాత"Download" పై క్లిక్ చేయండి.
.......
Tuesday, July 4, 2017
బొజ్జా తారకం నలుపు సంపాదకీయాలు
బొజ్జా తారకం నలుపు సంపాదకీయాలు
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ 1980లో ఆరంభమైంది. దళిత అంశాలపట్ల మేం ప్రత్యేక శ్రద్ధ కనపరచటమన్నది కూడా దాదాపుగా అదే సమయంలో మొదలైందని చెప్పొచ్చు. డా|| బి.విజయభారతి గారు రచించిన బాబాసాహెబ్ అంబేడ్కర్ జీవిత చరిత్ర (1982) మేం ప్రచురించిన తొలి పుస్తకాల్లోనే ఉంది. ఆ తర్వాత 1984లో మరాఠీ దళిత కథా సంకలనాన్ని తెలుగులోకి తెచ్చాం. 'శూద్రులెవరు?' అన్న అంబేడ్కర్ రచననూ అదే సంవత్సరం ప్రచురించాం. 1985లో జరిగిన కారంచేడు ఘటన సామాజికంగా, రాజకీయంగా పెద్ద కుదుపునే తీసుకువచ్చింది. హెచ్‌బీటీ విషయంలో కూడా దాన్నో ముఖ్యమైన మైలురాయిలా చెప్పుకోవచ్చు. ఆ దారుణకాండ అనంతరం పెల్లుబికిన ఉద్యమం ఎంతటి ప్రభావవంతంగా నడిచిందో వర్ణించటానికి మాటలు చాలవు. దళితులు సాగించిన
ఉద్యమాల్లో సుదీర్ఘకాలం పాటు నిలకడగా జరిగిన అద్భుత ఉద్యమం ఇది. ఈ ఉద్యమ సమయంలో చర్చలకు ఒక వేదిక అవసరమన్న బలమైన నమ్మకంతో హెచ్‌బీటీ సిరిల్ రెడ్డి, బొజ్జా తారకం, మరి కొంతమంది కలిసి 'నలుపు' పత్రికను ప్రారంభించారు. అప్పటి వామపక్ష పార్టీలూ, ఉద్యమాలన్నీ కూడా కులం విషయంలో తాము అనుసరించాల్సిన వైఖరిపై ఇంకా స్పష్టత తెచ్చుకోలేదు. మరోవైపు షెడ్యూల్డు కులాల సంఘాలన్నీ కూడా 'సంక్షేమ' దృక్పథంతోనే పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రారంభమైన 'నలుపు' పత్రిక... దళితుల గొంతుగా, అట్టడుగు వర్గాల సమస్యలు, ఆలోచనలు, ఆవేదనలన్నింటికీ అక్షర రూపంగా నిలిచేందుకు ప్రయత్నించింది. నలుపు మొదటి సంపాదకవర్గ సమావేశం 1988 మార్చి 12న ఉదయం 11 గంటలకు హెచ్‌బీటీ ఆఫీసులోనే జరిగింది. దాదాపు ఏడాది కసరత్తు అనంతరం 1989 ఏప్రిల్‌లో తొలి సంచిక వెలువడింది.
నలుపు- 'ప్రజా పక్ష పత్రిక' అనే పేరుతో వెలువడేది. పేరుకు తగ్గట్లుగానే నలుపు నిబద్ధమైన వామపక్ష ఉద్యమ మేధావుల నుంచి దళిత బహుజన ఆలోచనాపరుల వరకూ అందరినీ భాగస్వాములను చేస్తూ విశాలమైన చర్చా వేదికగా అవతరించింది. దీన్ని తీసుకురావటం వెనక ఎంతగానో శ్రమించింది బొజ్జా తారకం. ఆయన కవి, రచయిత, న్యాయవాది, ఉద్యమకారుడు. హైకోర్టులో న్యాయవాదిగా పని చేసేవారు. ఇలా ఎన్నో వ్యాపకాలతో తన మీద ఎంతో పని భారం ఉన్నప్పటికీ 'నలుపు' కోసం ఆయన కచ్చితంగా సమయం కేటాయించి, ప్రత్యేక శ్రద్ధతో పని చేశారు. నలుపును ప్రజాపక్ష పత్రికగా తీసుకురావటం గురించి ఆయన మాటల్లో.. ''ప్రజలంటే అందరూ ఉండొచ్చు. కానీ ఎక్కువ శాతం బాధలకు, దోపిడీకి, హింసకు గురవుతున్న వాళ్ళు, హక్కులు కోల్పోతున్న వాళ్ళందరూ ప్రజలనే ఉద్దేశాన్ని స్పష్టంగా ప్రకటించింది నలుపు! ప్రత్యేకంగా దళితుల కోసం పత్రిక పెట్టటంగానీ, వ్యాసాలు రాయటంగానీ దీనిలో భాగమే...''
'నలుపు'కు బొజ్జా తారకం సంపాదకులు కాగా హెచ్‌బీటీ సిరిల్‌రెడ్డి ప్రచురణకర్త. సంపాదకవర్గంలో కె. బాలగోపాల్, డి. నరసింహారెడ్డి, కంచ ఐలయ్య, పి.ఎల్. విశ్వేశ్వర రావు, ఆర్. అఖిలేశ్వరి ఉన్నారు. నలుపును ప్రజలు తమ పత్రికగా సొంతం చేసుకున్నారు. వ్యాసాలు, క్షేత్ర నివేదికల వంటివి రాయటమే కాదు, పత్రికను స్వయంగా అమ్మిన
వాళ్ళున్నారు. రకరకాల రూపాల్లో 'నలుపు' పనిలో పాలు పంచుకున్నవాళ్ళు ఎంతోమంది.
1989-95 మధ్య పత్రిక ఐదేళ్ళ పాటు 'నలుపు' విజయవంతంగా నడిచింది. పోలీసులు దీన్ని కూడా విప్లవ పత్రికలా భావిస్తూ ఎక్కడికక్కడ స్వాధీనం చేసుకుంటున్నా కూడా పత్రిక రైల్వేస్టేషన్లలో, బస్టాండ్లలో... రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా దొరుకుతూనే ఉండేది. ప్రజలు దీన్ని అంతగా అక్కునజేర్చుకున్నారు.
'నలుపు' ప్రతి ఒక్కరి జీవితాలను స్పృశించింది. హెచ్‌బీటీలో మాలో కూడా సరి కొత్త స్పృహ నింపింది. వామపక్ష ఆలోచనా ధోరణిలో ఎక్కడెక్కడ అంతరాలున్నాయన్నది వారికి బలంగా ఎత్తి చూపింది. దళితులకు వారి నిత్యజీవన పోరాటాల్లో అండగా నిలబడింది. దళిత రచయితలు, కార్యకర్తలకు కీలకమైన వేదికగా నిలిచి, వారి రచనలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. వామపక్షాలకూ, దళిత వర్గాలకూ మధ్య అంతరాలను పూడ్చే దిశగా అవగాహనా పూరితమైన చర్చలకు దోహదపడింది. అప్పట్లో 'నలుపు'లో పనిచేసిన ఉపసంపాదకుల్లో గుడిపాటి, జగన్‌రెడ్డి, చంద్రమౌళి, ఎస్. జయ, వై. నాగేశ్వర రావు, ఎస్.మల్లారెడ్డి ఇలా ఎంతోమంది తర్వాతి కాలంలో మంచి రచయితలుగా, జర్నలిస్టులుగా నిలబడ్డారు.
1995లో ఆగిపోయే నాటికి 'నలుపు' దాదాపు దాని లక్ష్యాలను పాక్షికంగానైనా అందుకుందనే చెప్పొచ్చు. భిన్న వర్గాల వారిని, భిన్న నేపథ్యాల నుంచి వచ్చే ప్రజలను దళిత అనుకూల ఉద్యమాల్లో భాగస్వాములను చెయ్యటం, దళితేతరుల్లో కూడా దళిత అంశాలపట్ల స్పృహ పెంచటం, దళిత రచయితలకూ, కార్యకర్తలకూ అవసరమైన ఒక వేదికను అందించటం - వీటన్నింటిలోనూ 'నలుపు' కీలక మలుపుగా నిలిచిందన్నది నిస్సందేహం!

ప్రతులకు, వివరాలకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ,
ప్లాట్ నెం.85. బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్- 500006
ఫొన్ నెం:23521849
పేజీలు; 183, వేల ,120/-
బొజ్జా తారకం 'నలుపు వ్యాసాలు '
బొజ్జా తారకం 'నలుపు వ్యాసాలు
తెలుగు రాజకీయాలకు సంబంధించినంతవరకు 1989-1995 మధ్యకాలం - అంటే కారంచేడు మారణకాండ అనంతరం జన చైతన్యం ఉవ్వెత్తున ఎగసిపడిన కాలం. సామాజిక, రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక రంగాలన్నీ ఒక కుదుపునకు గురైన కాలం. అన్ని ముఖ్యమైన సమస్యలపై ఆ రోజుల్లో విస్తృతమైన చర్చలు జరిగేవి. అదే కాలంలో నలుపు పత్రికలో బొజ్జా తారకం ఎంతో సాహసోపేతంగా, లోతైన పరిశీలనతో, ప్రత్యక్ష పోరాటానుభవంతో రాసిన సంపాదకీయాలు, వ్యాసాలు ఆనాటి తరానికి ప్రశ్నించడం, సంఘటితమవడం, ఎదురుతిరగడంలో మార్గనిర్దేశనం చేశాయి. మతోన్మాదం, కులోన్మాదం మళ్లీ పడగవిప్పి బుసకొడుతున్న ఈ రోజుల్లో వాటి ఆవశ్యకత మరింత వుంది.
--------------------------------------------------------------------------------------------------------------------------
అగ్రకుల దౌష్ట్యానికీ, వర్గ దోపిడీకీ గురవుతున్న ప్రజల పక్షాన జీవితాంతం రాజీలేని పోరాటం సల్పిన బొజ్జా తారకం (1939-2016) వృత్తి రీత్యా సీనియర్ న్యాయవాది.
ఆయన నిరంతరం అధ్యయన శీలి, బహుముఖ ప్రజ్ఞాశాలి.
అపారమైన న్యాయశాస్త్ర వైదుష్యంతో అటు న్యాయ పోరాటాలనూ, ఇటు ఉద్యమ సారధ్యాన్నీ శక్తివంతంగా నిర్వర్తించారు.
భారత రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
కారంచేడు, చుండూరు, లక్షింపేట మారణకాండల ప్రతిఘటనలలో రాజీలేని పోరాటం సల్పారు. దళితులను సంఘటిత పరిచే కార్యక్రమాలకే పూర్తికాలం వెచ్చించిన ఆయన ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ స్థాపనలో కీలక పాత్ర పోషించారు.
మానవ హక్కుల పౌర హక్కుల పరిరక్షణకై విస్తృతంగా కృషి సల్పిన ఆయన తన ప్రసంగాలు రచనల ద్వారా తన భావజాలాన్ని ప్రచారం చేశారు.
ఆయన రచనల్లో పోలీసులు అరెస్టు చేస్తే (1981),
నది పుట్టిన గొంతుక (1983),
కులం వర్గం (1996),
నాలాగే గోదావరి (2000),
దళితుడు-రాజ్యం (2008),
నేల నాగలి మూడెద్దులు (2008),
ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు (2012),
ఎస్సీ, ఎస్టీ నిధులు విదిలింపు మళ్లింపు (2012),
పంచతంత్రం (2012),
చరిత్ర మార్చిన మనిషి (2016) వీరి రచనల్లో ముఖ్యమైనవి.

పేజీలు; 283, వేల ,200/-
Monday, June 26, 2017
Tuesday, March 21, 2017
Thursday, January 5, 2017
Saturday, October 8, 2016
కాశ్మీర్ పై బాలగోపాల్
కశ్మీర్ అనగానే ఈ రోజు మతోన్మాదం , హింస స్ఫురించే వాతావరణం నెలకొనింది గానీ సగటు కశ్మీరీలో ఇవేవీ కనిపించవు. 'మేము వేరు, మా బతుకు వేరు . మా పాటికి మమ్మిల్ని ఉండనివ్వండి అంటే మీకెందుకు అర్ధం కాదు? అని స్నేహంగానే విస్మయం వ్యక్తం చేస్తారు. వాళ్ళ భావాలతో నిమిత్తం లేని వేరే ఏవేవో విషయాలకు కశ్మీర్ ప్రతీక అయిపోవడం వల్ల ఈ ప్రశ్న ఎవరికీ వినిపించదు. నెహ్రూ భ్రాండు లౌకికవాదులకు కాశ్మీర్ ఆధునిక భారత లౌకికతకు ప్రతీక. అద్వానీ భ్రాండు దేశభక్తులకు కశ్మీర్ అఖండ భారత్ కు ప్రతీక. పాకిస్థానీ పాలకులకు అనంతమైన జిహాద్ కు ప్రతీక. కశ్మీర్ గురుంచి ఆలోచించడమంటే కశ్మీరీల కోసం ఆలోచించడమని మనమెప్పుడు అర్థం చేసుకుంటాం?
- బాలగోపాల్
బుర్హాన్ వాణి కాల్చివేత తర్వాత కశ్మీర్ లోయ మరోసారి భగ్గుమనడం చూశాం . యువకుల నుండి పెద్దఎత్తున రాళ్ల దాడులు, సైన్యం నుండి పెద్దఎత్తున పెల్లెట్ల ప్రయోగమూ, కాల్పులూ జరిగి ఈ మూడు నెలలలో ఇప్పటికే 88 మంది దాకా కశ్మీరీలు చనిపోయారు. 1989 నుండి కశ్మీర్ చరిత్రంతా ఒక సంఘర్షణ నుండి మరో సంఘర్షణకు ప్రయాణమే. ఒక రక్తపాతం నుండి మరో రక్తపాతానికి ప్రయాణమే. ఇది ఈ రోజూకి తాజాది. మరోటి జరగదన్న నమ్మకం లేదు.
- బాలగోపాల్
బుర్హాన్ వాణి కాల్చివేత తర్వాత కశ్మీర్ లోయ మరోసారి భగ్గుమనడం చూశాం . యువకుల నుండి పెద్దఎత్తున రాళ్ల దాడులు, సైన్యం నుండి పెద్దఎత్తున పెల్లెట్ల ప్రయోగమూ, కాల్పులూ జరిగి ఈ మూడు నెలలలో ఇప్పటికే 88 మంది దాకా కశ్మీరీలు చనిపోయారు. 1989 నుండి కశ్మీర్ చరిత్రంతా ఒక సంఘర్షణ నుండి మరో సంఘర్షణకు ప్రయాణమే. ఒక రక్తపాతం నుండి మరో రక్తపాతానికి ప్రయాణమే. ఇది ఈ రోజూకి తాజాది. మరోటి జరగదన్న నమ్మకం లేదు.
ప్రతులకు, వివరాలకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ,
ప్లాట్ నెం.85. బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్- 500006
ఫొన్ నెం:23521849
పేజీలు; 140, వేల ,120/-
Tuesday, September 27, 2016
చరిత్ర మార్చిన మనిషి : బొజ్జ అప్పలస్వామి , బొజ్జ తారకం
శతాబ్దాలుగా వెట్టి చాకిరితోనూ పాలేరుతనాలతోనూ దీనంగా దుర్భరంగా నిస్సహాయంగా జీవితాలు గడుపుతూ ఆత్మగౌరవం అనే మాటకు ఆమడ దూరం పెట్టబడిన వర్గాలను గురించీ -ఆ వర్గాలను పురోగమన మార్గంలో ప్రధాన స్రవంతి దిశగా నడిపించిన ఉద్యమ శక్తుల గురించీ - ఎంత చెప్పుకున్న అది ఎప్పటికీ అంతులేని కథనమే అవుతుంది . హిందూ సమాజపు సామాజిక నిర్మితి పైన ,మతమౌఢ్యపు దౌర్భల్యాలపైనా సమరం సాగించిన ఉద్యమ శక్తుల సమాహారం అది రుదాంద్ర మహోద్యమం . ఆ మహోద్యమంలో ఎన్నో వెలుగు రవ్వలు. ఈ చరిత్రను ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ స్ఫూర్తి పొందుతూ ముందుకు సాగవలసి వుంది.
ఆ సంఘర్షణాత్మ వికాస క్రమంలో బొజ్జ అప్పలస్వామి గారు , డా . అంబేడ్కర్ బాటలో పయనించారు. అంబేడ్కర్ స్థాపించిన ఆలిండియా షెడ్యూలు క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీలో క్రియాశీల సభ్యలు. ఆయన వ్యవహాశైలి,ఆలోచన రీతి, సాహాసము , నిర్భీతి ఆయనను ఉత్తమ ప్రజా నాయకునిగా నిలిపాయి. ఒక జాతికి మార్గదర్శకునిగా ఒక ఉద్యమకారునిగా ఆయన రాజకీయ సామాజిక గమనాన్ని వివరిస్తూ ... ఆ ఆశయాలతో ఉద్యమిస్తున్న యువతరానికి జవసత్యాలను అందించే ప్రయత్నమే ఈ పుస్తకం.

Subscribe to:
Posts (Atom)