బషాయి టుడు
- మహాశ్వేతాదేవి నవల
... పీడిత, తాడిత జన విముక్తి కోసం నడుంకట్టిన సున్నితమైన వ్యక్తులు నా రచనల్లో కీలక పాత్రధారలుగా కనిపిస్తారు. ... జీవితం అంకగణితం కాదు. మనిషి రాజకీయ క్రీడ కోసం రూపొందలేదు. తన హక్కులన్నీ చెక్కుచెదరకుండా హాయిగా జీవించాలన్న మనిషి తపనను సఫలం చెయ్యాలన్నదే ప్రతి తరహా రాజకీయాలకూ ధ్యేంగా వుండాలని నేను నమ్ముతాను. పార్టీ ప్రయోజనాల పెంపుదలకు మాత్రమే పరిమితమైన రాజకీయాలు వర్తమాన సామాజిక వ్యవస్థను మార్చగలవంటే నేను నమ్మను.
స్వాతంత్య్రం సిద్ధించిన నలభై ఒక్క (...) ఏళ్ల తరువాత కూడా తిండికి, నీళ్లకు, భూమికి నోచుకోక అప్పుల్లో కట్టుబానిసత్వంలో నా దేశ ప్రజలు అల్లాడి పోవడం నా కళ్లతో చూస్తున్నాను. ఈ అమానుష నిర్బంధాలనుంచి నా ప్రజల్ని విముక్తుల్ని చెయ్యలేని వ్యవస్థకు వ్యతిరేకంగా జాజ్వల్యమాన సూర్యబింబంలా ప్రజ్వరిల్లుతున్న ఓ ఆగ్రహమే నా రచనలన్నింటికీ ప్రేరణ, స్ఫూర్తి.
వామపక్ష. మితవాద పక్షాలు ఏవైనా గానీ అన్నీ ప్రజాసామాన్యానికిచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో విఫలమైనవే. నా ఈ జీవితకాలంలో పరిస్థితి గుణాత్మకంగా మారుతుందనే ఆశారేఖ పొడగట్టడంలేదు. అందుకే నేను అనాధలు, అభాగ్యుల పక్షాన నిలబడి నా శాయశక్తులా కలంతో పోరాటం కొనసాగిస్తున్నాను. ఆవిధంగా నాకు నేను సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తే తలదించుకోవాల్సిన ఆగత్యం ఏనాడూ కలగబోదు. ఎందుకంటే అందరు రచయితలూ తమ తరానికి జవాబుదారులు; తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్లు.
...................................................................................................................- మహాశ్వేతాదేవి
.........................................................................బషాయి టుడు నవల 'నా మాట' నుంచి (1990)
... .... .... ....
... నిజమైన నక్సలైట్ ఉద్యమం నడిపిన ఆదివాసీ హీరోలు అనేకమందిలో ఒక బషాయ్ టుడును తన గిరిజన కథానాకుడుగా మహాశ్వేతాదేవి రూపొందించారు.
అతడు నక్సలైట్ ఉద్యమానికే కాదు రాజ్యాంగబద్ధమైన రాజకీయపక్షాలకు సైతం ఎడంగా నిలబడి వ్యవసాయ కార్మికుల బాగే ఏకైక లక్ష్యంగా మొండిగా పోరాటం సాగించడానికే బద్ధుడయ్యాడు. ఆమె ఒకసారి బషాయ్ టుడును సృష్టించాక, కాల్పనిక కథానాయకుడిగా అతణ్ణి ఎదగనిచ్చారు.
ప్రతి ఎన్‌కౌంటర్‌లో అతను మరణిస్తాడు.
మరో పోరాటం నడిపించడానికి మళ్లీ లేచివస్తాడు.
కథా కథనం పొడవునా ఈ కల్పనా చమత్కృతి దర్శనమిస్తూ కథకొక పొందికను, ఏకతను సంతరించిపెట్టింది.
..............................................................................................- సమిక్ బంధోపాధ్యాయ
..................................................................................బషాయ్ టుడు 'పరిచయం' నుంచి
మహాశ్వేతా దేవి
మహాశ్వేతా దేవి సుప్రసిద్ధ బెంగాలీ రచయిత మనీష్ ఘటక్ పుత్రిక.
14 జనవరి 1926లో జన్మించారు. 28 జూలై 2016లో మరణించారు.
శాంతినికేతన్, కలకత్తా విశ్వ విద్యాలయాల్లో చదివారు.
1947లో ప్రముఖ నాటక కర్త, నటుడూ అయిన బిజన్ భట్టాచార్యను వివాహం చేసుకున్నారు.
పదిహేడు సంవత్సరాలు ఇంగ్లీష్ లెక్చరర్ గా పని చేసి పూర్తిస్థాయి సామాజిక రచనా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు 1982 లో స్వచ్చంద పదవీవిరమణ చేసారు.
సాహిత్య అకాడమీ అవార్డు, జ్ఞానపీట్ అవార్డు, రామన్ మెగసెసే అవార్డు, పద్మశ్రీ, పద్మ విభూషణ్ వంటి అనేక పురస్కారాలను అందుకున్నారు.
బషాయ్ టుడు నవల
రచన : మహాశ్వేతాదేవి
తెలుగు అనువాదం: ప్రభంజన్
ఆంగ్లమూలం: Thema, 1990, translated by Gayatri Spivak and Samik Bandopadhyay
మొదటి ముద్రణ: నవంబర్ 1997
పునర్ముద్రణ: జనవరి 2018
138 పేజీలు వెల: రూ. 120/-
ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్ - 500 006
ఫోన్ : 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com
dear sir very good blog and very good content
ReplyDeleteLatest Telugu Cinema News
good information blog.
ReplyDeletehttps://goo.gl/Yqzsxr
plz watch and subscribe our channel.
good information post
ReplyDeletehttps://youtu.be/2uZRoa1eziA
plz watch our channel