మహిళల హక్కులు డా.అంబేద్కర్ దృక్పథం
- బి. విజయభారతి
డా. బి.ఆర్.అంబేద్కర్ విభిన్న అంశాలపై ఎంతో విస్తృతంగా రచనలు చేశారు. 'ప్రజాస్వామ్యం', 'అంటరానితనం', 'కుల నిర్మూలన', 'మతమార్పిడి', 'బౌద్ధమతం', 'హిందూమతంలోని చిక్కుముడులు', 'ఆర్థిక సంస్కరణలు-దళితులు', 'భారతదేశ చరిత్ర' మొదలైన వాటిపై ఆయన రచనలు ఎంతో ప్రఖ్యాతి చెందాయి.
కానీ, స్త్రీల అణిచివేత, స్త్రీల విముక్తిపై ఆయన చేసిన రచనల గురించి మాత్రం ఇప్పటికీ చాలా మందికి తెలియదు.
ప్రముఖ విద్యావేత్త, స్త్రీల హక్కుల కోసం కృషి చేస్తున్న డా. విజయభారతి స్త్రీల సమస్యలపై అంబేద్కర్ రాసిన రచనలను ఈ పుస్తకంలో పరిచయం చేసి వాటిని విశ్లేషించారు.
పుత్ర సంతానమూ పాతివ్రత్యమూ ఈ రెండే స్త్రీలకు సమాజంలో గౌరవాన్నిస్తాయని నమ్మించిన పూర్వ వ్యవస్థపై తిరుగులేని పోరాటం చేసి స్త్రీలను హక్కుల దిశలో నడిపించిన డా. అంబేద్కర్ ప్రయత్నాలను ఈ పుస్తకంలో చూడవచ్చు.
డా. విజయభారతి తెలుగు అకాడమీ డైరెక్టర్‌గా పదవీవిరమణ చేశారు. వారు అనేక పుస్తకాలు రచించారు. వాటిలో అంబేద్కర్, ఫూలేల జీవిత చరిత్రలు ప్రముఖమైనవి. పురాణాలు - కుల వ్యవస్థపై ఐదు పుస్తకాలు రాశారు.
మహిళల హక్కులు డా.అంబేద్కర్ దృక్పథం
- బి. విజయభారతి
మొదటి ముద్రణ: సెప్టెంబర్ 2014
44 పేజీలు, ధర : రూ.20/-
పతులకు, వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్ - 500 006
ఫోన్ : 040 23521849
Email: hyderabadbooktrust@gmail.com
No comments:
Post a Comment