
...
మేధస్సుకు పదును పెడుతూనే, విలువలకూ కళాదృష్టికీ ఆలవాలంగా ఉన్న పుస్తకాలను కొన్ని దశాబ్దాలుగా తెలుగు పాఠకుల ముందుకు తెస్తున్న హైదరాబాద్ బుక్ ట్రస్ట్ (హెచ్.బి.టి.) 2011 సంవత్సరంలో కూడా పుస్తకాల ఎంపికలో తనదైన శైలిని చూపింది.
ఈ సంవత్సరం అ లెగ్జాండర్ డ్యూమా విఖ్యాత నవల 'కౌంట్ ఆఫ్ మాంట్ క్రిస్టో' ను 'అజేయుడు' పేరుతో, విక్టర్ హ్యూగో నవల 'హంచ్‌బ్యాక్ ఆఫ్ నాట్ర్‌డేమ్' ను 'ఘంటారావం' పేరుతోనూ తెలుగులోకి తీసుకొచ్చారు. సూరంపూడి సీతారాం అనితర సాధ్యమనిపించే రీతిలో చేసిన అనువాదాలివి.
ఝల్‌కారీ బాయి కథకు అనువాదాన్ని కూడా ఈ సంవత్సరమే విడుదల చేశారు.
హెచ్‌బీటీ ప్రచురణల్లో ప్రత్యేకంగా చెప్పుకోవలసినవి డాక్టర్ కేశవరెడ్డి నవలలు.
ఆయన రాసిన 'స్మశానం దున్నేరు', 'ఇన్‌క్రెడిబుల్ గాడెస్', 'సిటీ బ్యూటిఫుల్', 'రాముడుండాడు-రాజ్యముండాది' నవలలను మళ్లీ వెలువరించింది హెచ్‌బీటీ.
వచ్చే సవత్సరం-
'ఇస్మత్ చుగ్తాయ్ కథలు',
రడ్యార్డ్ కిప్లింగ్ 'జంగిల్ బుక్',
విభూతి భూషణ్ బంధోపాధ్యాయ 'అపరాజితో',
దేవులపల్లి కృష్ణమూర్తి 'యాత్ర' నవలను
వెలువరించే ఆలోచనలో ఈ సంస్థ ఉంది.
- సాక్షి - సాహిత్యం 19 డిసెంబర్ 2011 సౌజన్యంతో
No comments:
Post a Comment