Sunday, October 31, 2010

మనసున్న మహా గాయని

మనసున్న మహా గాయని

బెంగుళూరు నాగరత్నమ్మ ఓ శతాబ్దం క్రితమే, పురుషాధిక్య సమాజాన్ని ఎదిరించి నిలిచారు.
సంగీత ప్రతిభతో మహామహుల ఆదరం పొందారు.
ఆస్తులు సంపాదించారు.
తంజావూరు పాలకుల ఆస్థాన కవయిత్రి ముద్దుపళని రాసిన రాధికా సాంత్వనము అనే శృంగార కావ్యాన్ని ధైర్యంగా ముద్రించారు.

తిరువయ్యారులో త్యాగరాజు సమాధి శిధిలావస్థలో వుందని తెలిసి ఆ”మె మనసు ద్రవించింది.
వెంటనే బయల్దేరి వెళ్లారు.
ఇక తిరువయ్యారే ఆమె ప్రపంచమైపోయింది.
త్యాగయ్య సమాధే ఆమెకు సర్వస్వమైపోయింది.
తనకున్న ఆస్తులన్నీ కరిగించి ఆలయాన్ని కట్టాంచారు.
త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో మహిళలకు ప్రవేశం కల్పించిన ఘనత కూడా నాగరత్నమ్మదే.
కావేరీ తీరంలోని ఆమె సమాధి సంగీతాభిమానుల పుణ్యక్షేత్రం.
 
ఆ సంగీత సామ్రాజ్ఞి జీవితాన్నీ, వ్యక్తిత్వాన్నీ ఈ పుస్తకంలో కళ్లకు కట్టారు వి.శ్రీరాం.
సంగీత ప్రపంచానికి కూడా పెద్దగా తెలియని ఆమె జీవిత విశేషాల్ని సేకరించడానికి రచయిత చాలా కష్టపడ్డారని అడుగడుగునా కనిపించే రెఫరెన్సులు చూస్తేనే అర్థమైపోతుంది.
అనువాదం సరళంగా వుంది.

- వాణి.
ఈనాడు ఆదివారం 31-10-2010




















బెంగుళూరు
నాగరత్నమ్మ 
జీవిత చరిత్ర
శ్రీ రాం.వి
అనువాదం: టి. పద్మిని
ముఖచిత్రం: బత్తుల
పేజీలు 143
వెల: రూ.60/-

ప్రతులకు, వివరాలకు
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067
ఫోన్‌: 040 2352 1849 

Friday, October 22, 2010

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వద్ద లభించే ఇతర సంస్థలు ప్రచురించిన కే బాలగోపాల్ పుస్తకాలు


1. మా బాల గోపాల్
మానవ హక్కుల వేదిక ప్రచురణ
165 పేజీలు  వెల: రూ. 100 /- 

]


2. హక్కుల ఉద్యమం - తాత్విక దృక్పధం
మానవ హక్కుల వేదిక ప్రచురణ
248 పేజీలు  వెల: రూ. 100 /-


 


3.రాజ్యం - సంక్షేమం
కే బాలగోపాల్ ఉపన్యాసాలు
పర్స్పెక్టివ్ ప్రచురణ 
170 పేజీలు  వెల : రూ. 100 /-  


4. వీటితోపాటు మనవ హక్కుల వేదిక వారి బాలగోపాల్ ఉపన్యాసాల డీవీడీ (తెలుగు) కూడా వుంది. వెల రూ. 50 /- 

కావలసిన వారు
సంప్రదించ వలసిన చిరునామా :

హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్, గుడి మల్కాపూర్,
హైదరాబాద్ - 500 067
ఫోన్ నెం. 040 2352 1849
ఇ మెయిల్ :
   hyderabadbooktrust@gmail.com

Friday, October 15, 2010

చంద్రగిరి శిఖరం (చందేర్‌ పహార్‌) - బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ - తెలుగు అనువాదం: కాత్యాయని-


చంద్రగిరి శిఖరం 
- బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ -

బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ పేరు వినగానే తెలుగు పాఠకులకు రెండు అపురూపమైన నవలలు గుర్తొస్తాయి.
ఒకటి: పథేర్‌ పాంచాలి.
రెండు: వనవాసి - 

వాటితో పోల్చినప్పుడు ఈ చంద్రగిరి శిఖరం (చందేర్‌ పహార్‌) కాస్త భిన్నమైనదిగా తోచవచ్చు. (ఇది పూర్తిస్థాయి సాహసగాథ కావటం వల్ల అలాఅనిపిస్తుంది) కానీ, కొంచెం లోతుగా పరిశీలించి చూస్తే బిభూతి భూషణుడి జీవన తాత్వికతా, ప్రకృతితో ఆయనకున్న ప్రగాఢమైన అనుబంధమూఈ మూడు నవలల్లోనూ సమానంగానే ప్రతిఫలించాయని అర్థమవుతుంది.

ప్రకృతి సౌందర్యాన్ని దర్శించటంలో ఈ రచయిత దొక విలక్షణమైన దృష్టి.  ప్రకృతిలోని అన్ని పార్శ్వాల్లోనూ, అన్ని శక్తుల్లోనూ వ్యక్తమయ్యే సౌందర్యాన్ని ఆస్వాదించి పాఠకుల అనుభూతికి అందించగలడాయన.

పూల వనాలూ, కీకారణ్యాలూ, వెన్నెల రాత్రులూ, కార్చిచ్చు జ్వాలలూ, జలపాతాలూ, అగ్నిపర్వతాలూ... ప్రకృతిలోని ప్రతి అంశాన్నీ మానవజీవితంలోని వెలుగునీడలంత సహజంగా స్వీకరించి, ప్రేమించగలడాయన. ఈ తాత్వికతే ఆయన రచనలకు గొప్ప గాఢతనూ, సౌందర్యాన్నీచేకూర్చింది.

'పథేర్‌ పాంచాలి' నవలలో బెంగాల్‌ పల్లెసీమల ప్రకృతి దృశ్యాలనూ, 'వనవాసి' నవలలో లవటులియా, మౌహన్‌పురా ప్రాంతాల అరణ్య శోభనూ వర్ణించిన బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ ఈ చందేర్‌ పహార్‌ (చంద్ర గిరి శిఖరం)లో ఆఫ్రికన్‌ అడవుల భయద సౌందర్యాన్ని దృశ్యమానం చేశాడు. 

శంకర్‌ అన్న బెంగాలీ యువకుడు ఆఫ్రికన్‌ అరణ్యాల్లోని చందేర్‌ పహార్‌ అనే పర్వతాన్ని అధిరోహించాలన్న ఆశతో సాగించిన సాహస యాత్రను
ఉత్కంఠ భరితంగా చిత్రించాడు.

అయితే ఇది కేవలం కాలక్షేపాన్ని అందించే సాహస గాథ వంటిది కాదు. ప్రకృతితో గాఢమైన అనుంబంధం ద్వారా మానవ స్వభావానికి చేకూరే సౌకుమార్యాన్నీ, స్వార్థ రాహిత్యాన్నీ, తాత్విక దృష్టినీ గురించి ఎంతో సున్నితంగా చెప్తుందీ నవల. బిభూతి భూషణుడి రచనలతో తెలుగు పాఠకుల అనుబంధాన్ని ఇది మరింత గాఢం చేస్తుంది.

చంద్రగిరి శిఖరం
బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ
బెంగాలీ మూలం : చందేర్‌ పహార్‌
తెలుగు అనువాదం: కాత్యాయని
104 పేజీలు
వెల: రూ.50/-

Thursday, October 14, 2010

బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర -


బెంగుళూరు నాగరత్నమ్మ ఒక దేవదాసి.
ఓ అసాధారణ స్త్రీమూర్తి.
ఇది ఆమె జీవిత చరిత్ర.

సంగీత సాహిత్య సామాజిక రంగాలలో ఆమె చూపిన ప్రతిభ, తెగువ విలక్షణమైనవి.
ఆమె సంగీత పండితుల నుంచి కూడా గౌరవాన్ని పొందిన విద్వాంసురాలు.
తన జీవితాన్ని త్యాగరాజ సంప్రదాయానికి అంకితం చేసిన విదుషీమణి.

ముద్దుపళని ''రాధికా సాంత్వనము''ను ప్రచురించి వీరేశలింగం పంతులువంటి ఉద్దండులను ఎదుర్కొంది.
ముళ్ల తుప్పల మధ్య అనాదరంగా పడివున్న త్యాగరాజ సమాధిని చూసి చలించిపోయి తిరువయ్యూరుకు కొత్త శోభను తీసుకొచ్చింది.
దేవదాసీ హక్కుల కోసం ధైర్యంగా పోరాడింది.

దేవదాసీగా పుట్టిన నాగరత్నమ్మ (1878-1952) చిన్నతనంలోనే సంగీత సాహిత్య నృత్య కళల్లో ఎంతో నైపుణ్యం సాధించింది.

వాగ్గేయ కారుడు త్యాగరాజు సమాధి చుట్టూ మండపం కట్టించడంలో ఆమె పాత్ర చిరకాలం నిలిచిపోతుంది.
రెండు వేరువేరు వర్గాల వారు త్యాగరాజ ఆరాధనోత్సవాలను నిర్వహించడమే గానీ మండపం గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.
అప్పుడు నాగరత్నమ్మ జోక్యం చేసుకుని, మండపం కోసం తన ఆస్తినంతా ధారపోసింది.
ఆమె కృషి వల్లనే త్యాగరాజు సమాధి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
దాని బాగోగులు చూసేందుకు తన జీవిత చరమాంకంలో తిరువయ్యూరులోనే వుండిపోయింది.
అయినా ఆమె త్యాగరాజ ఆలయంలో దాసిగానే మిగిలిపోయింది.
త్యాగరాజు సమాధికి ఎదురుగా చేతులు జోడించి కూర్చున్న భంగిమలో ఆమె విగ్రహం వుంది.
ఇంతకంటే ఆమె కూడా ఏమీ కోరుకుని వుండదు....

స్త్రీవాదిగా నాగరత్నమ్మ జీవితం దేవదాసీల పట్ల మనకుండే అపోహలను పటాపంచలు చేస్తుంది.
వారిని లైంగిక జీవులుగా, అనైతిక ప్రాణులుగా హీనంగా చూసే మన సమాజ ధోరణి ఎండగడుతూ... వారిని కూడా మనలో ఒకరిగా చూసే కొత్త చూపును మన కందిస్తుంది.

ఈ మహత్తర జీవిత చరిత్రకు అంతటి ప్రాశస్త్యం వుంది.


బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర
ఆంగ్లమూలం:The Devadasi and the Saint : The Life and Times of Bangalore Nagarathnamma. East West Books (Madras) Pvt. Ltd., Chennai 2009
By Shriram.V.
అనువాదం: టి. పద్మిని
ముఖచిత్రం: బత్తుల
పేజీలు 143
వెల: రూ.60/-

Tuesday, October 12, 2010

మతతత్వంపై బాలగోపాల్‌



మతతత్వంపై బాలగోపాల్‌  

''హైందవం గర్వంగా ప్రకటించుకునే విప్లవ సంప్రదాయమేమీ లేదు. అందువల్ల ''హిదూత్వం' పరమత ద్వేషం మీద మాత్రమే మనగలదు'' - బాలగోపాల్‌

    భారత దేశంలో మతతత్వం అనే అంశంపై ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల వేదిక నాయకుడు, రచయిత కె. బాలగోపాల్‌ (1952-2009) వివిధ సందర్భాలలో రాసిన 31 వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం.

    మతతత్వంపై, ప్రత్యేకించి హిందూత్వపై డా.కె.బాలగోపాల్‌ రాసిన 31 వ్యాసాల సంకలనమిది. మన జీవితాలపై హిందూత్వ ప్రభావం తాలూకు విభిన్న అంశాలను తడిమే ఈ వ్యాసాలు మూడు భాగాలలో పొందుపరచబడ్డాయి.  

    మొదటి భాగం 'హిందూ ధర్మ ప్రజాస్వామ్యం'లో దేశభక్తి, హిందూమతం, దాని వర్ణవ్యవస్థ, అదేవిధంగా ప్రజాస్వామ్యం నుంచి మతాన్ని (వర్ణ వ్యవస్థను) వేరు చేయాల్సిన అవసరం వంటి అంశాలపై రాసిన వ్యాసాలున్నాయి. 

    రెండో భాగం ''హిందూత్వ విద్య''లో డా.బాలగోపాల్‌ విద్యారంగ కాషాయీకరణ గురించి చర్చించారు.  వీటిలో  భారతదేశానికీ, దాని విజేతలకూ సంబంధించిన చారిత్రక వాస్తవాలు ఏమాత్రం వక్రీకరించకుండా విద్యార్థులకు ''లౌకికతత్వం'' విలువను బోధించాల్సిన ఆవశ్యకతను విశ్లేషించారు.

    మూడో విభాగం ''మైనారిటీలు-సంఘ్‌పరివార్‌''లో  ముస్లింలూ, క్రైస్తవులూ తదితర అ ల్పసంఖ్యాకులపై జరిగే దాడులకూ, అణచివేతకూ హిందూత్వ ఎలా దోహదం చేస్తోందో వివరించారు. బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్‌ మారణకాండ, క్రైస్తవులపై పెరుగుతున్న దాడుల గురించి ఈ భాగంలో చర్చించారు.

    దేశంలో చోటు చేసుకున్న ఆయా చారిత్రక సంఘటనలను ఒక క్రమపద్ధతిలో అర్థం చేసుకునేందుకు వీలుగా ఈ మూడు భాగాలలోని వ్యాసాలన్నీ తేదీల వరుసక్రమంలో పొందుపరచబడ్డాయి.

    ఈ పుస్తకానికి బిజు మాథ్యూ ముందుమాట రాశారు.

ఇందులోని వ్యాసాల వివరాలు:
హిందూ ధర్మ ప్రజాస్వామ్యం:
1. దేశభక్తి
2. శ్రామికుడిని శ్రమ దోపిడీకి లోనయ్యేలా చూడటం 'మతం' కర్తవ్యం.
3. హిందూ మత రాజ్యం
4. బ్రాహ్మణ ధర్మంలో ప్రజాస్వామ్యం
5. పర్సనల్‌ చట్టాలు: ఏకీకరణ కాదు, ప్రజాస్వామీకరణ జరగాలి.
6. ప్రాచీన భారత రాజకీయార్థిక నిర్మాణాలను ప్రతిబింమించే రచనలు-మహిళల జీవితం.

హిందూత్వ విద్య:
7. చదువును గురించి మాట్లాడటమూ కుట్ర అవుతుందా?
8. చరిత్ర పాఠాలపై కాషాయం నీడ
9. విద్య-భావజాలం
10. లౌకిక ప్రజాస్వామిక విలువలు
11. పాఠాంశాలలో హిందూత్వవాదుల జోక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
12. విద్య, విజ్ఞానం: హిందూత్వవాదుల దాడిని ఎదుర్కోవడానికి మనం సిద్ధమేనా?

మైనారిటీలు-సంఘ్‌ పరివార్‌:
13. నిరాధారమైన రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంపై జరుగుతున్న మత ఘర్షణలను ఆపండి! దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక విలువలను కాపాడండి
14. హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం
15. సంఘ్‌ పరివార్‌పై అవగాహన లోపం ఎవరికీ లేదు
16. 'కమల' వికాసంలో ఎవరి చేయి ఎంత?
17. క్రైస్తవం పైన దాడులను వ్యతిరేకిద్దాం
18. జాతి ఆకాంక్ష కాదు మానవతకు అవమానం
19. అయోధ్యలో ఏ కరసేవా జరగనక్కరలేదు..జరగనివ్వొద్దు
20. సంఘ్‌ పరివార్‌ను గట్టిగా ఎదుర్కోవడం అవసరం
21. హిందూత్వవాదుల ద్వేషం ఎవరి మీద?
22. ఇంకెక్కడా మరొక గుజరాత్‌ కాకుండా చూడటం ప్రజాతంత్ర ఉద్యమాల కర్తవ్యం
23. గుజరాత్‌లో అన్ని కేసులూ బెస్ట్‌ బేకరీ కేసులే కాబోతాయా?
24. దేశాన్ని 'వెలిగించ'డానికి తగలబెట్టడమూ ఒక మార్గమే
25. భాజపా 'విజన్‌' - మతోన్మాద ఫాసిజానికి ముసుగు
26. ఎవరికి సంకేతాలు పంపడానికి అఫ్జల్‌ను ఉరితీయాలి?
27. సంఘ్‌ పరివార్‌ హింసాకాండను వ్యతిరేకిద్దాం రండి
28. ఆదివాసీ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలను తిరస్కరిద్దాం.
ఇంగ్లీషు నుంచి అనువాదం:
29. మీరట్‌ 1987 రాజ్య ప్రేరేపిత ఉగ్రవాదంగా మారిన మతకల్లోలం
30. డిసెంబర్‌ 6, 1992 ఎందుకు జరిగింది?
31. గుజరాత్‌ ప్రదేశ్‌: హిందూ రాష్ట్ర ప్రతిరూపం

తొలి ముద్రణ: అక్టోబర్‌ 2010
పేజీలు: 317
ధర: రూ.150/-


ప్రతులకు, వివరాలకు
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067
ఫోన్‌: 040 2352 1849

Friday, October 1, 2010

బాలగోపాల్ సంస్మరణ సభ, ఆరు పుస్తకాల ఆవిష్కరణ - అక్టోబర్ 8 న, హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో


బాలగోపాల్ సంస్మరణ సభ
అక్టోబర్ 8 న, హైదరాబాద్  సుందరయ్య విజ్ఞాన  కేంద్రంలో
సమయం: సా: 5.00 నుంది 9.00 వరకు


విద్వంసకర ఆభివృద్ధి నమూనా- మానవ హక్కులుఅనే అంశం మీద
 శ్రీ ఈఏఏస్ శర్మ,మాజీ ఇందన శాఖ కార్యదర్శి, GOI 
 స్మారకోపన్యాసం చెస్తారు.
                               
 మానవ హక్కుల ఉద్యమం - బాలగోపాల్ కృషి అనే అంశం మీద
 బుర్రా రాములు, మానవహక్కుల వేదికప్రసంగిస్తారు. 
                      
సభను ఎస్ జీవన్ కుమార్ నిర్వహిస్తారు. 

వివిధ సంస్థలు ప్రచురించిన బాలగోపాల్ రచనలు, ఆయన సామాజిక జీవితం మీద వచ్చిన రచనలు ఆవిష్కరించబడతాయి.
అవి
 
1. హక్కుల ఉధ్యమం తాత్విక ధృక్పదం - బాలగోపాల్ రచన
2.
మా బాలగోపాల్ - మానవ హక్కుల వేదిక ప్రచురణ
3.
రాజ్యం- సంక్షేమం - బాలగోపాల్ ప్రసంగాలు-పెర్స్పెక్టివ్
4.
మతతత్వం పై బాలగోపాల్ - హైదరబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ
5.
సాహిత్యం పై బాలగోపాల్ - హైదరబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ       
6.
నిగాహ్ - ప్రజాతంత్ర లో ప్రచురిచితమయిన బాలగోపాల్ వ్యాసాల సంకలనం. 


అంధరికి  ఆహ్వానం

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌