



ఆంధ్రజ్యోతి ఆదివారం 4 అక్టోబర్ 2009 : కొత్త పుస్తకాలు :
కళ్లకు కనికట్టుచేసి మనిషిని కుర్చీలో కట్టిపడేసే విభిన్న ప్రసార మాధ్యమాల మధ్య మంచి సాహిత్యం పుట్టడమే గగనమైన ఈ రోజుల్లో ... కొన్ని పుస్తకాలు పునర్మద్రణలు పొందడం హర్షణీయం అభినందనీయం కూడా.
ఈ మధ్య కాలంలో అ లా మళ్లీ అచ్చయి వచ్చిన వాటిల్లో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి , డా. కేశవరెడ్డి, చిలుకూరి దేవపుత్రల పుస్తకాలున్నాయి.
ఆంగ్ల పదాలు అసలే లేని శ్రీపాద అచ్చమైన తేట తెనుగు కథల రుచిని నాలుగు తరాలుగా పాఠకులు అనుభవిస్తూనే ఉన్నారు. కొంతకాలం క్రితం పుల్లంపేట జరీచీర నిలువు చెంబు పేర్లతో వచ్చిన కథా సంపుటాల్లో 49 కథల్ని అందించిన ప్రగతి పబ్లిషర్స్ ఈ సారి కలుపు మొక్కలు, మార్గదర్శి, అందమైన చంద్ర ముఖచిత్రాలతో అరచేతుల్లో ఎంచక్కా అమరే సైజుతో పుస్తకం ప్రయాణాల్లో చదువుకోడానికి సౌకర్యంగా ఉంది. మల్లాది రామకృష్ణ శాస్త్రి రాసిన ఒకే ముందుమాటను మూడు సంపుటాల్లోనూ వాడటం మాత్రం బాగాలేదు.
దళితుల సమస్యల్ని కథా వస్తువులుగా తీసుకుని రాయలసీమ గ్రామీణ జీవిత సంఘర్షణను అక్షరబద్ధం చేస్తున్న రచయిత డా. కేశవరెడ్డి,. గతంలో వచ్చిన అతడు అడవిని జయించాడు, చివరి గుడిసె, మూగవాని పిల్లన గ్రోవి నవలల్ని ఇప్పుడు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు పునర్ముద్రించారు.
ఒకప్పుడు 14 భారతీయ భాషల్లోకి అనువదించబడిన ''అతడు అడవిని జయించాడు'' నవల రేడియో నాటకంగా కూడా పేరుగాంచి, జాతీయ అవార్డు పొందిన సంగతి ఈ తరం వారికి తెలియదు.
1998లో అటావారి బహుమతి పొంది అప్పుడే పుస్తకంగా వెలుగు చూసిన చిలుకూరి దేవపుత్ర ''పంచమం'' నవలని ఇప్పుడు హైదరాబద్ బుక్ ట్రస్ట్ మళ్లీ తీసుకొచ్చింది. అంటరానితనం, అణగారిన తనం భూమికలుగా దళిత జీవన చిత్రాన్ని సృజనాత్మకంగా విరచించిన రచన ఇది. సమాజంలోని కుల, వర్గ వాస్తవికతల విశ్వరూపాన్ని చూపుతూ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన తొలి నవలగా పంచమానికి పేరుంది.
- గొరుసు
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథలు :
1. మార్గదర్శి (పేజీలు:288, వెల రూ.120),
2. వడ్లగింజలు (పేజీలు:272, వెల రూ.120),
3. కలుపు మొక్కలు (పేజీలు:309, వెల రూ.120)
ప్రతులకు:
విశాలాంధ్ర అన్ని బ్రాంచీలు.
డా. కేశవరెడ్డి నవలలు :
1. అతడు అడవిని జయించాడు (పేజీలు: 96, వెల: రూ.40)
2. చివరి గుడిసె (పేజీలు: 158, వెల: రూ.80)
3. మూగవాని పిల్లనగ్రోవి (పేజీలు: 132, వెల: రూ.60)
చిలుకూరి దేవపుత్ర నవల :
పంచమం (పేజీలు: 275, వెల: రూ.100)
ప్రతులకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్, గుడి మల్కాపూర్,
హైదరాబాద్ - 500067
ఫోన్ నెం. 040 2352 1849
................................(ఆదివారం ఆంధ్ర జ్యోతి సౌజన్యం తో )
.............................
i need these books
ReplyDeleteఅతడు అడవిని జయించాడు (పేజీలు: 96, వెల: రూ.40)
చివరి గుడిసె (పేజీలు: 158, వెల: రూ.80)
మూగవాని పిల్లనగ్రోవి (పేజీలు: 132, వెల: రూ.60)
how to get
let me know
9912159531
john000in@gmail.com
This comment has been removed by the author.
ReplyDelete@ జాన్ హైడ్ కనుమూరి
ReplyDeleteపై పుస్తకాల ధర రూ. 180 మా చిరునామాకు మని ఆర్డర్ చేయండి. లేదా హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పేరిట తీసిన డిమాండ్ డ్రాఫ్ట్ రూపం లో పంపించండి. మేము వెంటనే మీకు ఆ పుస్తకాలను వి పి పి పోస్టు ద్వారా పంపిస్తాము. పుస్తకాల ధరను ఆన్ లైన్ ద్వారా కూడా మాకు పంపవచ్చు. అయితే భద్రతా కారణాల రీత్యా బ్యాంకు అకౌంట్ వివరాలు ఇక్కడ పొందుపరచడం లేదు. మీరు ఆన్ లైన్ ద్వారా డబ్బు చెల్లించాలనుకుంటే మాకు మెయిల్ / ఫోన్ చేయండి. అకౌంట్ వివరాలు తెలియజేస్తాం.
ధన్యవాదాలు.
మా చిరునామా :
హదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెంబర్ 85 , బాలాజీ నగర్ , గుడి మల్కాపూర్ ,
హైదరాబాద్ - 500067
ఫోన్ నెంబర్ : 040 2352 1849
E Mail ID : hyderabadbooktrust@gmail.com
.....