...
ప్రజాసేవ కోసం రంగంలోకి దిగిన నాయకులంతా పదవులు దక్కగానే ప్రజలను మరిచిపోవడం మామూలే. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు, ఉన్నట్టుండి ఆస్తులు, అంతస్తులు పెరుగుతాయి. నెల తిరిగేసరికి బంజారాహిల్స్‌కు వెళ్లిపోవడం చూస్తూనే వున్నాం. పదవులు చేపట్టగానే తమ కులం నుండి, తమ సమాజం నుండి దూరమవుతారు. కాని సదాలక్ష్మి జీవితం ఇందుకు పూర్తిగా భిన్నమైంది.
ఆమె ఎమ్మెల్యే నుండి డిప్యూటీ స్పీకర్ స్థాయికి వచ్చినా, రాజకీయాల్లో వున్నా లేకపోయినా, ఎప్పుడూ ప్రజా సమస్యల వైపు, దళితుల అభివృద్ధి వైపే దృష్టి సారించేవారు. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న అరుదైన వ్యక్తిత్వం సదాలక్ష్మిది. నిబద్ధత కలిగి అనేక అస్తిత్వాలకు, వివిధ తరాలకు చెందిన ప్రజానీకాన్ని తన వెంట నడిపించుకున్న రాజకీయ నాయకురాలు ఆమె. అవినీతికి దూరంగా నిస్వార్థంగా, నిజాయితీగా, నిరాడంబరంగా జీవించిన సదాలక్ష్మి జీవితం నేటి యువతరానికి ఆదర్శప్రాయం.
విషయసేకరణ వేరు, దాన్ని విశ్లేషించుకుని, నింగడించుకుని సరిగ్గా ప్రజెంట్ చేయడం వేరని రచయిత్రి గుర్తించలేకపోయారని తెలుస్తుంది. పుస్తకం నిండా బోలెడంత రిపిటేషన్, అనవసర, అసందర్భ వ్యాఖ్యానాలు కోకొల్లలు. పదే పదే సదాలక్ష్మి కులాన్ని పనిగట్టుకుని తెలియజేయడం చిరాకనిపిస్తుంది. తెలంగాణ చరిత్ర, భాష, సమానత్వంల గురించిన అధ్యాయాలు అనవసరం. ఇది పుస్తకం నిడివిని పెంచడానికే తప్ప సదాలక్ష్మి జీవిత చరిత్రను, ఆమె గొప్పదనాన్ని తెలియజేయడానికి
ఏమాత్రం ఉపకరించవు. సరిగ్గా ఎడిట్ చేసి ఈ పుస్తకాన్ని సగానికి కుదించి, పాఠకునికి తక్కువ ధరకు మరింత ఆసక్తికరంగా వుండేట్టు అంజేసే అవకాశాన్ని ప్రచురణకర్తలు ఎందుకు పట్టించుకోలేదో అర్థం కాదు.
- కె.పి.అశోక్ కుమార్
(వార్త, ఆదివారం 20 నవంబర్ 2011 సౌజన్యంతో)
నేనే బలాన్ని - టి.ఎన్. సదాలక్ష్మి బతుకు కథ
రచన: గోగు శ్యామల
పేజీలు: 338, వెల: రూ.180/-
ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్, గుడి మల్కాపూర్,
హైదరాబాద్ - 500 067
ఫోన్ నెం. 040 2352 1849
ఇ మెయిల్: hyderabadbooktrust@gmail.com
No comments:
Post a Comment