అనేజ్ గణాంకల కంటే కూడా అతి సామాన్యమైన పదాలతో భాషా సింగ్ భారతదేశ పాకీ పనివారి సామార్థ్యలను శక్తివంతంగా ఈ పుస్తకంలో వివరించారు. ఎంతో సున్నితత్వంతో వారి జీవితాల్లోన్ని అనేక బాధాకరమైన కోణాలను ఆవిష్కరించారు.అది వర్షకాలంలో పనిలో వారుపడే దుర్భర పరిస్థితి కావొచ్చు.లేదా వారిలో కొంత మంది తమ పనినే "వ్యాపారం"గా ఎలా మార్చకున్నారో కావొచ్చు. వీటిన్నిటికంటే కూడా క్రూరమైన కులవ్యవస్థలో వారి జీవితాలు ఎలా బందీ అయ్యాయో ఈ కథనాలు సూటిగా వివరిస్తాయి.మనమిప్పటివరకూ వినని,కనని, ఆలోచించని భారతదేశపు మరో పార్శ్వాని మనముంధుకు తీసుకువచ్చి మన కళ్ళు తెరిపిస్తంది.
- జాన్ డ్రెజ్ (ప్రముఖ అంతర్జాతీయ ఆర్థికవేత్త)
"మనం సగర్వ భారతీయులం అని చెప్పుకోవటం అంటేనే, అత్యంత అవమానకరమైన పరిస్థితుల్లో మన ప్రజలు అమానవీయమైన పాకీపని చేస్తూ తమ చేతులతో తోటిమనుషుల పెంటలను ఎత్తతున్నారనే వాస్తవాన్ని గుర్తించ నిరాకరించటమే. ఒక పక్కన చంద్రయానాలు చేస్తూ, మరోపక్కన ఐటి రంగంలో దూసుకెళ్తున్న తరుణంలో ఇది కొనసాగటం దిగ్ర్బాంతికరమైన విషయం. ఈ పుస్తకం అనేక గొంతులను ముందుకు తీసుకువచ్చింది. వీటిని మనం తప్పనిసరిగా విని సహానుభూతిని ప్రకటించాలి. తద్వారా ఈ అమానవీయమైన విధానాన్ని మన గత చరిత్రగా మార్చివేయాలి".
- మల్లికా సారాభాయ్
(ప్రముఖ నాట్యకళాకారిణి, సామాజిక కార్యకర్త .)
కేవలం పుట్టుక ద్వారా తోటి మనుషుల పియ్యిపెంటలను ఎత్తి పారబోసే పాకీ పనిచేసే వ్యక్తుల, సమూహాల వాస్తవ పరిస్థితి బయటపెట్టంది అన్ సీన్ పుస్తకం. ఈ పనిని చాలా మంది ఊహించటానికి కూడా ఇష్టపడరు
ఎమ్ . వి . రమణ
( ప్రిన్స్ టన్ యూనివర్సిటీలో ఫిజిసిస్ట్.)
" ద పవర్ ఆఫ్ ప్రామిస్: ఎగ్జామినింగ్ న్యూక్లియర్ ఎనర్జీ ఇన్ ఇండియా పుస్తక రచయిత
ధర. : రూ. 150
మొదటి ముద్రణ :జులై 2016
ఆంగ్లమూలం : Unseen: The Truth about India's Manual Scavengers, Bhasha Singh, 2014, Penguin India
ప్రతులకు, వివరాలకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ,
ప్లాట్ నెం.85. బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్- 500006
ఫొన్ నెం:23521849