Thursday, November 12, 2020

శాంతసుందరికి జోహార్లు

 శాంతసుందరికి జోహార్లు గత కొంత కాలంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న శాంతసుందరి గారు 11 నవంబర్ 2020 రాత్రి చనిపోయారు. వారు అనేక పుస్తకాలను ఇంగ్లీష్, హిందీ భాషలనుంచి తెలుగు లోకి, తెలుగు నుంచి హిందీ లోకీ అనువదించారు. 

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన "ఇంట్లో ప్రేమ చంద్" పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం అందుకున్నారు. ఇది తొలుత 'భూమిక' మాస పత్రికలో సీరియల్ గా వెలువడింది. వీరు అనువదించిన మరో పుస్తకం "కలల రైలు" (కాల్సన్ వైట్ హెడ్ రచన)ను కూడా హెచ్ బి టి ప్రచురించింది.

వరూధిని-కొడవటిగంటి కుటుంబరావు గార్ల కుమార్తె అయిన శాంతసుందరి 1947 లో మద్రాస్ లో జన్మించారు.వారి కుటుంబ సభ్యులకు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తోంది. 

Monday, October 12, 2020

మారని దుస్థితిని మార్చే పాఠం - దుప్పల రవికుమార్

 మారని దుస్థితిని మార్చే పాఠం - దుప్పల రవికుమార్

దళిత్ పాంథర్స్ చరిత్ర పుస్తకం పై ఇవాళ్టి (12-10-2020) ప్రజా పక్షం దినపత్రికలో 

దుప్పల రవికుమార్ సమీక్ష :

http://epaper.prajapaksham.in/epaper/edition/3813/prajapaksham-city-edition/page/4
Sunday, September 6, 2020

Tuesday, September 1, 2020

నా మహాభారత రచన గురించి - కల్లూరి భాస్కరం

 

నా మహాభారత రచన ( మంత్ర కవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే - హెచ్ బి టి  ప్రచురణ) గురించి ఫేస్ బుక్ లైవ్ లో నేను చేసిన ప్రసంగం సారాంశం:

- కల్లూరి భాస్కరం 
 భారతంపైన నేను వెలువరించిన పుస్తకంపైవిశాఖపట్నంలోని సాహిత్య సురభి నిర్వాహకుల ఆహ్వానంపైన  ఆగస్టు29, శనివారంనాడు ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడాను

  అధ్యయనం గురించి పుస్తకంలో కానీమరెక్కడ కానీ పొందుపరచని విషయాలను మొదటిసారి అందులోస్పృశించానుఆసక్తి ఉన్నప్పటికీ గంటంబావు సేపు సాగిన  ప్రసంగం వినే అవకాశం దొరకనివారి కోసంప్రసంగక్రమంలోఎక్కడైనా స్పష్టత లోపిస్తే రాతలో స్పష్టత తేవడం కోసం ప్రసంగ అంశాలను క్లుప్తంగా ఇక్కడ పొందుపరుస్తున్నాను.

1. మహాభారత స్వభావం గురించీతన కవిత్వస్వభావం గురించీ నన్నయ చెప్పిన రెండు పద్యాలు సాంప్రదాయికంగావస్తున్న పాఠ్య సంప్రదాయాన్ని స్థూలంగా సూచిస్తాయి

 వి: 1. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రమనియు...2, సారమతిం కవీంద్రులు...! 

మొదటి పద్యం ప్రకారం మహాభారతాన్ని ధర్మతత్వంవేదాంతంనీతికావ్యంలాక్షణికంఇతిహాసంపురాణంఅనేకోణాలనుంచి చూడవచ్చు

ఇతిహాసం అనడం ద్వారా మహాభారతాన్ని చరిత్రగా కూడా చూసే వెసులుబాటు కలిగింది కానీఇప్పుడు చరిత్ర అనేమాటకుఇతిహాసం అనే  మాట ముమ్మూర్తులా సరిపోయేది కాదు.

సారమతిం’ అనే రెండో పద్యంలో...కవీంద్రులు తన ప్రసన్నకథా కలితార్థయుక్తిని లోతుగా చూసి మెచ్చుకుంటారనీఇతరులు తన అక్షర రమ్యతను ఆదరిస్తారని నన్నయ చెప్పుకుంటూనానా రుచిరార్థసూక్తినిధి నైన తాను జగత్తుకుహితం కలగడం కోసం తెలుగులో మహాభారత సంహితా రచనకు పూనుకున్నానని చెబుతాడు.  


2.  పాఠ్య సంప్రదాయం ప్రకారం  రచననైనా ‘మూసిన పుస్తకంగా చూడవలసి ఉంటుందిదాని మీద ఎలాంటిపరిశీలన జరిగినావిమర్శ జరిగినా దాని ఆద్యంతాల హద్దుల్లోనే...అంటేఇతివృత్తనిర్వహణరసంఅలంకారంశైలిశిల్పం వగైరా రచనాసామగ్రి హద్దుల్లోనే చూడవలసి ఉంటుంది

 ఆవిధంగా ఒక రచన వెలువడగానే దానికి తనదైన ఒక స్వతంత్ర అస్తిత్వం వచ్చేస్తుందిమొదట్లో రచనలన్నీ ఇతిహాసపురాణ సంబంధమైనవి కనుక ఇతరేతర విమర్శల జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడడం కోసమే ఇలాంటి పాఠ్యసంప్రదాయం రూపొంది ఉండవచ్చు.

 3. అయితే దీనికి అసలు మినహాయింపులు లేవని కాదుశ్రీకృష్ణ భారతం పేరుతో మహాభారతాన్ని పద్యరూపంలోరచించిన శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు తన వజ్రాయుధం పత్రికలో భీష్ముడిపైనాచివరికి వ్యాసుడిపైనారాముడిపైనాకూడా ఎలా ప్రతికూల విమర్శలు చేశారో మహాభారతచరిత్రము రాసిన పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రిగారు ఎత్తిచూపారు

 

ఆరోజుల్లోనే కోటమర్తి చినరఘుపతిరావుగారు సుయోధనపక్షం వహిస్తూ ‘సుయొధనవిజయము’ అనే రచన చేశారువఝల చినసీతారామస్వామిశాస్త్రిగారు ‘కర్ణచరిత్రము’ రాశారు

  తర్వాత ఇలాంటి ప్రతికూల రచనలు వచ్చినప్పటికీ పండితవర్గం వాటిని ఆమోదించలేదువారినుంచిఅలాంటివాటిపై అప్రకటితనిషేధం అమలు జరుగుతూ వచ్చిందిఇప్పటికీ అదే జరుగుతోంది పరిణామాన్ని నాపుస్తకంలో మరింత వివరంగా చర్చించానునేను పరిశీలించిన ఒక మహాభారత ప్రతిలో సందేహాలకువివరణకు చోటుఉన్న చోట కూడా అందుకు పూనుకోకుండా పండితులు కేవలం అలంకారం వంటి కావ్యసామగ్రి  ప్రస్తావనకు ఎలాపరిమితమయ్యారో నా పుస్తకంలో రాశాను.

4. నా ప్రతిపాదన ఏమిటంటే రచన అయినా శూన్యంలో పుట్టదుశూన్యంలో వ్రేలాడదుదానికి గతంతో ఒక లింకుఉంటుందిభవిష్యత్తుతో ఇంకొక లింకు ఉంటుందిఆవిధంగా అది కాలంలో నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. (1999లోనేను రాసిన ‘రచననీకాలాన్నీ వేరు చేయగలమా?’ అనే వ్యాసంలో దాదాపు ఇదే అంశాన్ని చర్చించాను. ‘కాలికస్పృహమరికొన్ని సాహిత్యవ్యాసాలు’ అనే నా వ్యాససంపుటి (2006)లో  వ్యాసం ఉంది

 అలాగే మహాభారతానికి కూడా ఒక గతమూఒక భవిష్యత్తూ ఉన్నాయిఅది గతాన్ని మోసుకొస్తూనే భవిష్యత్తులోకిప్రవహించిందిచారిత్రకంగా చెబితేమహాభారతానికి సమీపగతం ఋగ్వేదకాలం

ఇందులో మహాభారతంలోని కొన్ని కథల తాలూకు బీజాలు ఉన్నాయివాటిలో ప్రసిద్ధమైనది గరుత్మంతునిఅమృతాపహరణంఅలాగే ఋగ్వేదంలో నిషాదులనబడే ఆదివాసుల ప్రస్తావన కూడా చాలా చోట్ల వస్తుందిమహాభారతంలోఅమృతం తేవడానికి బయలుదేరిన గరుత్మంతుడు అందుకు అవసరమైన బలం కోసం తను ఏంతినాలని తల్లి వినతను అడిగినప్పుడు జనానికి ఇబ్బంది కలిగిస్తున్న నిషాదగణాలను తినేయమంటుందిఇలాంటిఆదివాసీఆదివాసేతర సంబంధాలనుఘర్షణలను నా పుస్తకంలో పలుచోట్ల చర్చించాను.

 

రామాయణమూలాలు కూడా ఋగ్వేదంలో కనిపిస్తాయిఇంద్రుడు ఋగ్వేద రాముడైతేరాముడు రామాయణఇంద్రుడుఇద్దరూ చేసిన ప్రధాన కార్యాలలో ఒకటి రాక్షస సంహారంయజ్ఞరక్షణ.


5. మహాభారతానికి భవిష్యత్తుతో కూడా ఒక లింకు ఉందని చెప్పాను లింకు  రూపంలో ఉందోమనం ఇప్పటికీమహాభారత సమాజంలోనే ఎలా ఉన్నామో నా పుస్తకంలో విస్తృతంగా చర్చించానుఇలా మహాభారతానికి గతంతోనూభవిష్యత్తుతోనూ ఉన్న లింకులను పోల్చుకునే ప్రయత్నంలో మూసిన పుస్తకంగా ఉన్న  రచనను తెరచిన పుస్తకంచేశానుఅంటేమహాభారతానికి సంప్రదాయవిమర్శ కల్పించిన హద్దులను దాటి వెళ్ళానుఅలా వెళ్ళిన కొద్దీమహాభారతం హద్దులు విస్తరిస్తూ పోయాయిదాంతో మహాభారతరంగస్థలి మరింత విశాలం అయింది.

 6. మహాభారతం ఒక భిన్నదశకు చెందిన రచనకనీసం  దశకు దగ్గరగా ఉన్న రచనదేశాల పేరుతోరాజ్యాల పేరుతోసంస్కృతుల పేరుతోమతాల పేరుతో నిర్దిష్టమైన సరిహద్దులు లేని దశ అదిమనుషుల మధ్యసంస్కృతుల మధ్యసాహిత్యాల మధ్యపురాణ కథల మధ్యనమ్మకాల మధ్య స్వేచ్ఛగా ఆదానప్రదానాలు జరిగాయిస్వపర భేదాలులేకుండా అందరూ అందరి దేవుళ్ళకూ మొక్కుకున్నారుపర్షియన్ చక్రవర్తి డరియస్ గ్రీస్ మీదికి యుద్ధానికి వెడుతూట్రాయ్ లో ఒకరోజు ఆగి ట్రోజన్ దేవతకు వెయ్యి వృషభాలను బలి ఇచ్చినట్టు హెరాడటస్ రాస్తాడు(వెయ్యి అనడంలో కొంతఅతిశయోక్తి ఉండవచ్చు). జూలియస్ సీజర్ తన బద్ధ శత్రువైన పాంపేను వెంటాడుతూ ట్రాయ్ మీదుగా వెళ్లినప్పుడుఅక్కడి ప్రేతాత్మాల గురించిన కథలు విని భయంతో వణికిపోయి స్థానిక దేవతలకు మొక్కుకుంటాడు

 

ఇలాంటివి మూఢనమ్మకాలుగా ఇప్పుడు కనిపించవచ్చునిజమేకానీ తనపర అనే సరిహద్దులు ఎరుగని నమ్మకాలుఅవిపాస్ పోర్టులువీసాల అవసరం లేకుండా మనుషులు ఒక చోటినుంచి ఇంకొక చోటికి స్వేచ్ఛగా ప్రవహించేవారుభౌగోళికమైన గుర్తింపుల తేడాల కన్నాగణాలుతెగల వంటి గుర్తింపుల తేడాలు మాత్రమే ఉండేవి మేరకు స్వపరభేదం ఉన్నా స్థానిక వనరులపై ఆధిపత్యం కోసమే ఘర్షణలు జరిగేవిమనిషికి సంచారం అనేది రెండో ప్రకృతిగా ఉన్న దశఅదిజలసేచనపై ఆధారపడిన వ్యవసాయం పుంజుకున్న తర్వాతే మనిషి స్థిరజీవనానికి అలవాటు పడ్డాడుసంచారస్థిరజీవనుల మధ్య ఘర్షణలు జరిగినా క్రమంగా ఒకరిపై ఒకరు ఆధారపడవలసిరావడంతో వారి మధ్య సయోధ్యఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఏర్పడ్డాయిభూమితో బతుకు బందీ కాని చేతివృత్తుల వారూభూమిలేని ఇతరులూబ్రాహ్మణులూ నేటికీ ప్రధానంగా సంచారజీవులుగానే ఉన్నారు

 ఇలాంటి సరిహద్దులు ఎరుగని గతం మహాభారతంలోకి ఎలా ప్రవహించిందో యయాతి-దేవయాని-శర్మిష్ఠల త్రికోణ కథద్వారానల దమయంతుల కథ ద్వారాభారతీయభారతీయేతర పురాణఇతిహాస కథలలోని సామ్యాల ద్వారాఆచారాలుఆనవాయితీల మధ్య పోలికల ద్వారా నా పుస్తకంలో చర్చించానుఇవే కాకుండా ఒకనాటి గణవ్యవస్థమాతృస్వామ్యపితృస్వామ్య వ్యవస్థల గురించిసరిహద్దులు ఎరుగని దశలో అవి దాదాపు ప్రపంచవ్యాప్తం అవడంగురించి నా పుస్తకంలో విస్తారంగా చర్చించానుసంప్రదాయం విధించిన హద్దులను దాటి వెళ్ళడం వల్లనేఅంటేమూసిన పుస్తకాన్ని తెరచిన పుస్తకం చేయడం వల్లనే ఇది సాధ్యమైందిఅంతేకాకుండాఇందువల్ల మహాభారతాన్నికనీసం మరో అయిదారు కోణాల నుంచి పరిశీలించే వెసులుబాటు కలిగిందిమరికొన్ని కోణాలు రాబోయే నా పుస్తకంరెండవ సంపుటంలో భాగం అవుతాయి.

 7. ఇంకోవైపు మహాభారతానికి భవిష్యత్తుతో ఎలాంటి లింకు ఉందో అనేక కథల ద్వారాఉదంతాల ద్వారా నా పుస్తకంలోచర్చించాను. (క్లుప్తంగా చెప్పాలనుకున్నది కాస్తా ఇప్పటికే పెద్దదైంది కనుక  వివరాలలోకి వెళ్ళడం లేదు)

 8. చివరిగా....మహాభారతం(రామాయణం మొదలైనవి కూడావిశ్వ సారస్వతంలో భాగంప్రపంచవారసత్వ సంపదయూనివర్సల్ అప్పీల్ ఉన్న రచనదానిని ఏదో ఒక దేశానికోసంస్కృతికోజాతీయతకో మాత్రమే చెందినదిగా భావించడం పొరపాటు.

.......................................................................................

Link:

https://lm.facebook.com/l.php?u=https%3A%2F%2Fus02web.zoom.us%2Fj%2F9280909705%3Fpwd%3DNXZiN1NKUDZZVkU0OExzOGxuYjhadz09%26fbclid%3DIwAR3nYVlFfb-lqflnX9EkjKM-Ls2WN30k_XzOJl8nrk0JMqp_fnbXbJjKVHo&h=AT09DKyLHbTvelLfvtZX1Su05Y57dVSB8qRqS8khds3U1lYQJ2dWWNfATL6c71h0rsDR3q99PtEo1wlerzvPdoYLAnuuybhVICjBEQImlMGPx80P3oiz9rIeGPVHg50AL4tYoisM2x0KjiOmL-pjsg

 


హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌