Thursday, February 27, 2020

పి సత్యవతి గారికి "ఒక హిజ్ర ఆత్మకథ" అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం

పి సత్యవతి గారికి "ఒక హిజ్ర ఆత్మకథ" అనువాదానికి  కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం

హైదరాబాదు బుక్ ట్రస్ట్ ప్రచురించిన ఒక  హిజ్రా ఆత్మకధ పుస్తకానికి అనువాద విభాగంలో 2019 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన రచయిత్రి పి.సత్యవతి గారికి అభినందనలు. ఈ పుస్తకం చదివితే హిజ్రాల పట్ల అంత వరకూ మనం ఏర్పరచుకున్న దురభిప్రాయాలుఏహ్యతచిన్నచూపు అన్నీ పటాపంచలయ్యి వారి పరిస్థితి పట్ల సానుభూతిదుఖం కలుగుతాయి.  వారిని ఇంటా బయటా  అడుగడుగునా అవమానిస్తూ చీదరించుకున్నందుకు మన పట్ల మనకు అపరాధ భావం కలుగుతుంది. కొత్త కోణంలోనుంచి వారిని కూడా మనుషులుగా చూస్తూ వారి సమస్యలను అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తాం.  శారీరకంగా తాము ఎదుర్కొనే సమస్యలు తమలో కలిగే భావాల గురించి ఎవరికీ చెప్పుకోలేకహిజ్రా అని తెలిసిన తర్వాత కుటుంబాలసమాజ వెలివేతకు గురై ఎవరి ఆదరణకూ నోచుకోక,  ఎటువంటి ఆసరా లేక  జీవించడానికి హిజ్రాలు ఎంచుకున్న మార్గాలు అనుభవిస్తున్న అతి దారుణమైన పరిస్థితులూ  మన హృదయాన్ని మెలిబెడతాయి.  వారి పరిస్థితిని ఆసరా చేసుకుని వారిపై  దౌర్జన్యాలు చేస్తున్న వారిపట్ల ఆగ్రహం కలుగుతుంది.  హిజ్రాలు  అనుభవిస్తున్న దుఖం ఏమిటోవాళ్ల అంతరంగం ఎంత కల్లోలభరితంగా ఉంటుందోవాళ్ళ పట్ల ఈ సమాజంప్రభుత్వాలు ఎంత నిర్ధయగా ఉన్నాయో పి. సత్యవతి గారు అత్యద్భుతంగా అనువదించి  మన కళ్ల ముందుంచారు. రేవతి కధ కల్పించిన ప్రేరణ అవగాహనతో ఎంతో మంది స్త్రీ వాదులుహిజ్రాలు తమ సమస్యలపై జరుపుతున్న పోరాటాలకు ఈనాడు అండగా నిలబడుతున్నారు.       
- హైదరాబాద్ బుక్ ట్రస్ట్ 
,,,,,,,,,,,,,,,,,,,,,,

పి.సత్యవతికి కేంద్ర సాహిత్య పురస్కారం
న్యూఢిల్లీ, విజయవాడ/కల్చరల్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ కథా రచయిత్రి పి.సత్యవతిని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. ఆమె అనువదించిన ‘ఓ హిజ్రా ఆత్మకథ’ రచనకు ఈ పురస్కారం లభించినట్టు అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు తెలిపారు. 23 భాషల్లో అనువాద పురస్కారాలను సోమవారం ప్రముఖ కన్నడకవి చంద్రశేఖర కంబార నేతృత్వంలోని కార్యవర్గ సమితి ఆమోదించింది.

ఈ పురస్కారం క్రింద సత్యవతికి రూ.50వేలు నగదు, ప్రశంసాపత్రం అందజేస్తారు. ఎ.రేవతి తమిళంలో రాసిన ఆత్మకథ ‘ద ట్రూత్‌ ఎబౌట్‌ మీ: ఏ హిజ్రా స్టోరీ’ పేరిట ఆంగ్లంలోకి అనువాదం అయింది. ఈ రచనను హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ కోసం సత్యవతి ‘ఓ హిజ్రా ఆత్మకథ’’ పేరుతో తెలుగులోకి తెచ్చారు.

ఆంధ్ర జ్యోతి 26-2-2020



Wednesday, February 26, 2020

తెలుగు భాష భ్యవిష్యత్తు - చిన్న పబ్లిషర్ల సాధక బాధకాలు ఇష్టాగోష్టి

తెలుగు భాష భ్యవిష్యత్తు - చిన్న పబ్లిషర్ల సాధక బాధకాలు
ఇష్టాగోష్టి
29 ఫిబ్రవరి 2020 మధ్యాహ్నం 3 గంటలకు లామకాన్ లో
రోడ్ నెం 1, బంజారా హిల్స్, జి.వి.కే.1 ఎదురుగా.
అందరూ ఆహ్వానితులే


Tuesday, February 11, 2020

అనువాదాలు మరో సమాజాన్ని, సంస్కృతిని మన కళ్ళ ముందు ఉంచుతాయి


అనువాదాలు మరో సమాజాన్ని, సంస్కృతిని మన కళ్ళ ముందు ఉంచుతాయి

హైదరాబాద్ బుక్ ట్రస్ట్  ప్రారంభించి నాలుగు దశాబ్దాలు పూర్తి ఛేసుకున్న సందర్భంగా వరంగల్ కాకతీయ విశ్వవిధ్యాలయం, జాఫర్ నిజాం హాల్ లో ఫిబ్రవరి 9, 2020 తేదిన "సమాజం- అనువాద సాహిత్యం" అనే అంశంపై సెమినార్ ను హెచ్.బి.టి. సంస్థ నిర్వహించింది. ఈ అంశంపై రచయిత్రి,  అనువాదకురాలు చూపు కాత్యాయని, ప్రచురణ రంగంలో 40 సంవత్సరాల  హెచ్.బి.టి. ప్రయాణం, అనుభవాలపై  ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యురాలు గీతా రామస్వామి ఉపన్యసించారు. 

 ఈ సదస్సులో అనేక మంది విధ్యాధికులు,  సాహిత్యాభిలాషులు, పౌరహక్కుల ప్రతినిధులు పాల్గొని తమ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలను అందించి  సదస్సును ఆసక్తికరంగా మార్చారు.  ముందుగా గీతా రామస్వామి మాట్లాడుతూ  ఇప్పటివరకూ హెచ్.బి.టి. 400 వరకూ పుస్తకాలను ప్రచురించిందని, ప్రపంచ వ్యాప్తంగా వచ్హిన మంచి సాహిత్యాన్ని తెలుగు పాటకులకు అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ సంస్థ, 250కి పైగా అనువాదాలను ప్రచురించిందని అన్నారు.  అయితే నానాటికీ పుస్తక పఠనం తగ్గుతుండడం, తెలుగు భాష పట్ల పెరుగుతున్న నిరాధరణ తెలుగు భాష క్రమంగా అంతరించిపోతుందేమోననే ఆందోళనను కలిగిస్తున్నాయని, అన్నారు. తెలుగు ఫాంట్ కి సంబంధించి యూనిఫాం కోడ్ ఉండాలని, ఆంగ్ల భాషను ప్రోత్సహించినా, తెలుగు భాషను విధిగా నేర్చుకోవలసిన భాషగా చేయడానికి ప్రభుత్వం పూనుకోవాలని అన్నారు.

కాత్యాయని మాట్లాడుతూ  సమాజంలోని ఆర్ధిక రాజకీయ సాంఘిక వాతావరణమే సాహిత్య మానసికతను సృష్టిస్తుందని, సమాజానికీ సాహిత్యానికి పరస్పర సంబంధం ఉంటుందని, అనువాదాలు మరో సమాజాన్ని సంస్కృతిని మన కళ్ళ ముందు ఉంచుతాయని అన్నారు. 

కె.యు.సి. రిజిస్ట్రార్ పురుషోత్తం ప్రసంగిస్తూ విశ్వవిధ్యాలయాలలో 90 శాతంగా వున్న బడుగు బలహీన వర్గాల విధ్యార్ధుల ఉపాధి బద్రతకు తెలుగు కాక ఆంగ్ల భాష కావడంతో విధ్యార్దులు అటువైపే మొగ్గు చూపుతున్నారని ఈ స్థితిలో మార్పు రావాలని అన్నారు. 

పౌరహక్కుల నాయకులు హరికృష్ణ, రచయిత మెట్టు రవీందర్, అనేక మంది ఇతర సభ్యులు కూడా తమ అభిప్రాయాలను వెలిబుచ్హారు.  సదస్సును హెచ్.బి.టి.బాధ్యురాలు సంధ్య నిర్వహించారు.

తెలుగు పాఠకులకు 400 కు పైగా పుస్తకాలను అందించిన హెచ్.బి.టి.

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ 40 వ వార్షికోత్సవం సందర్భంగా కాకతీయ యునివర్సిటీ లో జరిగిన
ఆత్మీయ సమావేశం. 10 ఫిబ్రవరి 2020 నాటి సాక్షి దిన పత్రికలో ప్రచురించిన వార్త :

Monday, February 10, 2020

కాకతీయ యునివర్సిటీ లో హెచ్ బి టీ పై జరిగిన సదస్సు

ఫిబ్రవరి 9 ఆదివారం సాయంత్రం వరంగల్ కాకతీయ యునివర్సిటీ లో
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ 40 వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సమావేశం దృశ్యాలు.
సంధ్య, డా. మణి, డా.పురుషోత్తం, కాకతీయ యునివర్సిటీ రిజిస్త్రార్ , కాత్యాయని గీతా రామస్వామి ప్రభ్రుతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.



Saturday, February 8, 2020

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ను ప్రారంభించి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా
హెచ్.బి.టి. సంధ్య గారి అధ్యక్షతన ఫిబ్రవరి 9 ఆదివారంనాడు పుస్తకాభిమానుల సదస్సు
వేదిక : జాఫర్ నిజాం సెమినార్ హాల్ కాకతీయ యూనివర్సిటి, వరంగల్
అందరూ ఆహ్వానితులే


Friday, February 7, 2020

శంకరాభరణం వర్సెస్ హైదరాబాద్ బుక్ ట్రస్ట్

40 ఏళ్లు నిండిన ‘శంకరాభరణం’ గురించి మూడ్రోజులుగా తెగ పోస్టులు.

40 ఏళ్లు నిండిన ‘హైదరాబాద్ బుక్ ట్రస్ట్’ గురించి మచ్చుకి ఒక్కటీ చూడలేదు. ప్చ్! *

.
సరే, 1980 కల్లా టెన్త్ పూర్తి చేసుకుని,
జూ.కాలేజీల్లో కొత్త రెక్కలు తొడుక్కునేవాళ్లకు wisdom window తెరిచింది HBT.
టీనేజ్ చివర్లో ఉన్నవాళ్లను చేయిపట్టి నడిపించింది.
తెలుగు సాహిత్యంలో కొత్త రుచి మప్పింది.

రష్యావాళ్ల సాయంతో వేసే అనువాదాలతోనూ,
ఎమెస్కో వగైరాల భ్రమాభరిత నవలలతోనూ
అటుఇటుగా చీలిన తెలుగు పాఠకులను HBT ఒకచోటకు తెచ్చింది.

నేను చదివిన ప్రతి 5 మంచి పుస్తకాల్లో 2 కచ్చితంగా HBTవే ఉంటాయి.

పబ్లికేషన్ సంస్థకు రెండో తరం ఉండదు.
దీన్నికూడా HBT బ్రేక్ చేసి, ముందుకు సాగాలి.
.

——
*’ఏం, నువ్వు రాయొచ్చు కదా!’ అనకండి.
Youthని encourage చేయడం నా పద్ధతి. 🤘

...... By Mani Bhushan
from FB on 3rd February

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌