యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్' ...
సంక్షిప్తంగా 'సోవియట్ యూనియన్' ...
ఇంకా సంక్షిప్తంగా 'రష్యా' ...!
స్వర్గం ఎలా వుంటుందో తెలియకపోయినా
'భూతల స్వర్గం' ఇలా వుంటుందని చాటిచెప్పిన...
సకల దేశాలను, సమస్త మానవాళిని
నాలుగైదు దశాబ్దాలపాటు ఉత్తేజపరచిన, ఉర్రూతలూగించిన 'మరో ప్రపంచం' ...!!
'వసుధైక కుటుంబం' అన్న భావనను ఆచరణలోకి తెచ్చిన
తొలి సమసమాజ శ్రామికరాజ్యం ...!!
ప్రపంచ మానవుడంటే తనకి ఎంత ప్రేమో...
ప్రపంచ బాలబాలికలంటే తనకి ఎంత వాత్సల్యమో ...!
దేశదేశాల భాషల్లో మానవ విలువలను, విజ్ఞాన వికాసాలను పెంపొందించే పుస్తకాలను, ప్రత్యేకించి పిల్లలను అలరించే పంచరంగుల పుస్తకాలను ఎంత అందంగా ప్రచురించి
ఎంత సరసమైన ధరలకు అందించేదో ...!
ఆ రోజుల్లో సోవియట్ యూనియన్ ప్రచురించిన పుస్తకాలు లేని పుస్తక ప్రియుల ఇల్లు మన దేశంలో ఒక్కటి కూడా వుండేది కాదంటే అతిశయోక్తి కాదు.
తెలుగులో ప్రతియేటా స్థానిక ప్రచురణ కర్తలు ప్రచురించే కొత్త పుస్తకాలకంటే
సొవియట్ యూనియన్ నుంచి దిగుమతి అయ్యే కొత్త పుస్తకాలే ఎక్కువగా వుండేవి.
పుస్తక ప్రపంచంలో అదొక స్వర్ణ యుగం.
అనిల్ బత్తుల గారు ఆనాటి మధుర స్మృతులను తట్టిలేపుతూ
పుస్తకాభిమానుల కోసం
''సోవియట్ బుక్స్ ఇన్ తెలుగు''
అనే బ్లాగును ప్రారంభించారు.
ఎంతో శ్రమించి సేకరించిన సోవియట్ పుస్తకాలను స్కాన్ చేసి మరీ ఆ బ్లాగులో పొందుపరిచారు. ఒక్కసారి ఆ మరో ప్రపంచంలో విహరించండి.
నలుగురు కలిసి బ్లాగును వెబ్‌సైట్‌లా అభివృద్ధి పరిచి ఆ అపరూపమైన పుస్తకాలను పూర్తి స్థాయిలో ఈ తరానికి అందుబాటులోరకి తీసుకురాగలిగితే మరింత ఉపయుక్తంగా వుంటుంది.
http://sovietbooksintelugu.blogspot.in/