హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన పుస్తకాలు ఇకనుంచి 'కినిగె డాట్ కామ్'లో 'ఇ బుక్స్'గా లభిస్తాయి.
మా తొలి తెలుగు ఇ బుక్: "నేనే బలాన్ని"
ప్రపంచ వ్యాప్తంగా వున్న మా అభిమానులకు హెచ్‌బీటీ పుస్తకాలను కినిగె డాట్ కామ్' వారి సహకారంతో ఇ బుక్స్' రూపంలో అందించాలని సంకల్పించాము. హెచ్‌బిటీ ఇటీవలే ప్రచురించిన గోగు శ్యామల రచించిన ''నేనే బలాన్ని-టిఎన్ సదాలక్ష్మి బతుకు కథ'' మా తొలి తెలుగు ఈ పుస్తకంగా ఇప్పటికే కినిగె డాట్ కామ్ లో అందుబాటులోకి వచ్చింది.
ఈ పుస్తకం కోసం దిగువ లింక్‌పై క్లిక్ చేయండి:
''నేనే బలాన్ని ఇ బుక్''
మా రెండో ఈ బుక్ : "ఊరు వాడ బతుకు"
అదేవిధంగా దేవులపల్లి కృష్ణమూర్తి రచించిన మరో విశిష్టమైన బతుకు పుస్తకం ''ఊరు వాడ బతుకు'' కూడా మా రెండో ''ఇ బుక్'' గా లభిస్తోంది. మా పుస్తకాలన్నింటినీ క్రమంగా ''ఇ బుక్స్'' రూపంలో అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది.
ఊరు వాడ బతుకు "ఇ పుస్తకం" కోసం దిగువ లింక్‌పై క్లిక్ చేయండి.
''ఊరువాడ బతుకు ఇ బుక్''
మంచి పుస్తకాలను ఆదరించండి. మా ప్రయత్నాన్ని విజయవంతం చేయండి.
కినిగే వారి వెబ్ చిరునామా: http://kinige.com
.
మూడున్నర దశాబ్దాలుగా తెలుగు పాఠకులకు మంచి పుస్తకాలు అందిస్తున్న సంస్థ: చిరునామా: Hyderabad Book Trust, Plot No. 85, Balaji Nagar, Gudi Malkapur, Hyderabad-500 006. Ph.No. 040-23521849 ..... Mail: hyderabadbooktrust@gmail.com
Saturday, August 20, 2011
Tuesday, August 16, 2011
తొలి దళిత మహిళా శాసన సభ్యురాలు, మంత్రి శ్రీమతి టి.ఎన్.సదాలక్ష్మి బతుకు కథ: ''నేనే బలాన్ని''
సికింద్రాబాద్ బొల్లారంలోని మెహతర్ బస్తీలో అట్టడుగు మాదిగ ఉపకులమైన మరుగుదొడ్లు సాపు చేసే మెహతర్ వృత్తి కులంలో పుట్టి ఏటికి ఎదురీదుతూ అక్కడి నుంచే రాష్ట్ర శాసన సభలో ప్రవేశించి, మంత్రి స్థాయికి ఎదిగిన ధీరోదాత్త వ్యక్తిత్వం శ్రీమతి టి.ఎన్.సదాలక్ష్మిది. భారతదేశంలో 1952లో ప్రప్రథమంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో రిజర్వుడు అభ్యర్థిగా నిలబడి కమ్యూనిస్టు ప్రభంజనాన్ని ఎదుర్కొని రాష్ట్ర శాసన సభకు ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్, సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి, దేవాదాయ శాఖా మంత్రి వంటి అనేక బాధ్యతలను నిర్వహించారు. దేవాదాయ శాఖను నిర్వహించిన తొలి మాదిగ మహిళామంత్రిగా పేరు గడించడమే కాకుండా ఆయా శాఖలపై తనదైన బలమైన ముద్ర వేశారు.
1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి మూలస్తంభంగా వున్నారు. తెలంగాణా ప్రజా సమితి (టిపిఎస్) అధ్యక్షురాలిగా ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. మాదిగ హక్కుల కోసం, ఎబిసిడి వర్గీకరణ కోసం పోరాడుతూ దండోరా ఉద్యమానికి బీజం వేశారు. మాదిగ వర్గీకరణ అన్నది వీరి ఆలోచనే. దండోరా ఉద్యమానికి రాజకీయ రంగు రావద్దొన్న ఉద్దేశంతో తను వెనకుండి మంద కష్ణ మాదిగ, కృపాకర్ మాదిగలను ముందుంచి ఉద్యమాన్ని నిర్మించారు.
నేర పూరిత రాజకీయ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా సాగిన శ్రీమతి సదాలక్ష్మి కృషి మీడియాలో పెద్దగా ఫోకస్ కాలేదు. ఇంటా బయటా హిందూ బ్రాహ్మణీయ వర్ణ, పితృస్వామ్య నియంత్రణలను ధిక్కరించి... నిజమైన సాధికారతతో దళిత స్త్రీశక్తిని చాటిచెప్పిన వీరి పాత్ర చరిత్రలో మరుగుపరచబడింది. అందుకే అడుగడుగునా ''నాకు చరిత్ర వున్నదని'' తనే బలంగా ఎలుగెత్తి ప్రకటించారు.
టి.ఎస్. సదాలక్ష్మి జీవితం ఈ నాటి మహిళలందరికీ ఆదర్శప్రాయం. ఉద్యమాల్లో, ఉద్యోగాల్లో రాజకీయాల్లో స్త్రీ పురుషులకు... ముఖ్యంగా సాధికారతలో వెనుకబడ్డ ఎంతోమంది మహిళలకు సదాలక్ష్మి జీవితం బతుకు తొవ్వను చూపిస్తుంది.
ఈ పుస్తక రచయిత్రి గోగు శ్యామల గొంతు ప్రత్యేకమైనది. పది సంవత్సరాల క్రితం కథలు రాయటం మొదలుపెట్టిన శ్యామల తన రచనల్లో దళిత సమాజంలో బాల్యం, దళిత స్త్రీలు భూమికోసం పడే తపన, దళిత కుటుంబాలలో, సమూహాలలోని ప్రజాస్వామిక తత్వం, దళిత సబ్బండ కుల సంబంధాలు, మాదిగ అస్తిత్వం, మాదిగ ఉపకులాల అస్తిత్వాలను కొత్త దృక్పథంలో చూపిస్తూ వచ్చారు. ఆమె రచనల్లో దళితులు పీడిత అస్తిత్వంతో కాక, తమ జీవితం, ఇప్పటి ప్రపంచం, దానిలో రావలసిన మార్పుల గురించి తదేకంగా ఆలోచించే తాత్విక దృక్పథం కలవారిగా కనిపిస్తారు. అనేక
సాహితీ పురస్కారాలు అందుకున్న శ్యామల మొదటి పుస్తకం ''నల్లపొద్దు.'' ఆ తరువాత ''నల్లరేగడి సాల్లు'', ''ఎల్లమ్మలు'' పుస్తకాలు ఆమె సంపాదకత్వంలో వెలువడ్డాయి. ''ఎడ్యుసెంట్'' అనే దళితుల విద్యపై పనిచేసే సంస్థను స్థాపించి, 'అందరికీ విద్య' అనే మాసపత్రికను నడుపుతున్నారు. అనేక సంస్థలలో, సాహితీ వేదికలలో క్రియాశీలంగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం ''అన్వేషి'' సంస్థలో సీనియర్ ఫెలోగా పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే సదాలక్ష్మి బతుకు కథను రాశారు.
నేనే బలాన్ని - టి.ఎన్. సదాలక్ష్మి బతుకు కథ
రచన: గోగు శ్యామల
పేజీలు: 338, వెల: రూ.180/-
ప్రతులకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్ - 500067
ఫోన్ నెం. 040 23521849
ఇ మెయిల్: hyderabadbooktrust@gmail.com
...
Friday, July 15, 2011
సహవాసి గారు అనువదించిన "ఏడు తరాలు" ( అలెక్స్ హేలీ "ద రూట్స్" ) పుస్తకం పై "నెమలి కన్ను" బ్లాగు సమీక్ష
ఏడు తరాలు
పుస్తకాలు కేవలం
విజ్ఞానాన్నీ, వినోదాన్నీ
పంచి ఊరుకోవు. అవి మనల్ని ప్రభావితం చేస్తాయి కూడా. అలా నన్ను ప్రభావితం చేసిన
ఒకానొక పుస్తకం 'ఏడు తరాలు.' ఎలెక్స్ హెలీ ఆంగ్ల నవల 'రూట్స్' కి సహవాసి చేసిన సరళమైన తెలుగు అనువాదం.
విజేతలే చరిత్రలు రాశారు, రాస్తారు.
ఇది సామాన్యంగా జరిగే విషయం. ఎందుకంటే పరాజయాలు చెప్పుకోగలిగే విషయాలుగా అటు
పరాజితులకీ, ఇటు సమాజానికే
కూడా అనిపించవు కాబట్టి. కానీ, ఈ ఆనవాయితీని బద్దలు కొట్టిన వాడు హెలీ.
'ఏడు తరాలు' బానిసల కథ. కేవలం తమ అమాయకత్వం కారణంగా,
చీకటి ఖండం ఆఫ్రికా నుంచి అమెరికాకి
బానిసలుగా తీసుకురాబడ్డ దురదృష్టవంతుల కథ. పచ్చటి ఆఫ్రికా
పల్లెల్లో, తమవైన సంస్కృతీ సంప్రదాయాల మధ్యన, ఆటపాటలతో జీవితం గడుపుతున్న ఆఫ్రికా వాసులని,
వలవేసి పట్టుకుని, బంధించి, రోజుల తరబడి గాలైనా సోకని ఓడలలో తమ దేశానికి రవాణా చేసి, నడిబజార్లో వాళ్ళని వేలం వేసిన అమెరికన్ల కథ.
క్రీస్తుశకం 1750
లో పడమటి ఆఫ్రికా లో గాంబియా
సమీపంలోని జపూరు అనే పల్లెటూళ్ళో ఉమరో-బింటా దంపతులకి నేరేడు పండులా
నిగనిగలాడే 'కుంటా' అనే కొడుకు పుట్టడం కథా ప్రారంభం. ఆఫ్రికా పల్లెల
సౌందర్యాన్నీ, సమస్యలనీ,
ప్రకృతి వైపరీత్యాలనీ పరిచయం
చేస్తూనే, అక్కడి జీవన
విధానాన్నీ కళ్ళ ముందుంచుతారు రచయిత. ముఖ్యంగా పిల్లల పెంపకం, పనిపాటలతో పాటు రాయడం, చదవడం నేర్పించడం, మగ పిల్లలని ప్రత్యేకమైన 'పురుష' శిక్షణ కోసం పంపించడం ఇవన్నీ పాఠకులని ఆశ్చర్య
పరుస్తాయి.
కుంటా తమ పల్లె
దగ్గరలో ఉన్న అడవిలో పురుష శిక్షణ పూర్తి చేసుకుని యువకుడి గ్రామానికి
తిరిగి వచ్చాక, అతనికి వేరే
ఇల్లు కట్టించి అక్కడికి పంపేస్తారు తల్లిదండ్రులు. అడవుల్లో తిరిగేటప్పుడు 'తెల్లోడి' బారిన పడకుండా ఎలా తప్పించుకోవాలో కొడుక్కి వివరంగా చెబుతాడు
ఉమరో. తడిసిన కోడి మాంసం వాసన వచ్చిందంటే దగ్గరలో తెల్లోడు ఉన్నట్టేననీ, వాడి అడుగులు బరువుగా పడతాయనీ, ఆకుల్ని తుంపుతూ పోతాడనీ.. ఇలా ఎన్నో
ఆనుపానులు విశదంగా చెబుతాడు.
మంచెమీద కూర్చుని
రాత్రంతా పొలం కావలి కాస్తూ, యవ్వన
సహజమైన కోర్కెలతో భావి సంసారజీవితాన్ని గురించి మేల్కొనే కలలు కంటూ నిద్రకు
దూరమైన కుంటా, మర్నాడు ఉదయాన్నే
తమ్ముడికి మృదంగం చేసి ఇవ్వడం కోసం నాణ్యమైన దుంగ కోసం అడవికి వెళ్లి
ఏమరుపాటున తెల్లోడికి చిక్కుతాడు. అక్కడినుంచి అతని కష్టాలు ప్రారంభం.
దెబ్బలతో స్పృహ తప్పించి తీసుకెళ్ళిన తెల్లోళ్ళు, కుంటాని ఒక ఓడలో గొలుసుతో బంధిస్తారు. ఆ ఓడ నిండా
వందలాది ఆఫ్రికావాసులే.
దుర్భరమైన ప్రయాణం తర్వాత
తీరం చేరుతుంది ఓడ. వేలంలో కుంటాని కొనుక్కున్న యజమాని అతనికి 'టోబీ' అని పేరు పెట్టి తనతో తీసుకెళ్ళి పోతాడు. చేతులుమారిన కుంటా వర్జీనియాలో 'నిగ్గరు' (బానిస) గా స్థిరపడతాడు. పారిపోడానికి ఎన్నో ప్రయత్నాలు
చేస్తాడు. అవన్నీ విఫలమవుతాయి. తన ప్రయత్నానికి శిక్షగా కాలు కోల్పోతాడు.
నలభయ్యేళ్ళ వయసులో తోటి నిగ్గరు బెల్ ని పెళ్లి చేసుకుని 'కిజ్జీ' కి తండ్రవుతాడు. కూతురికి జ్ఞానం రాగానే, దగ్గర కూర్చోబెట్టుకుని జపూరు గురించీ,
తన బాల్యాన్ని గురించీ, తను బానిసగా వచ్చిన వైనాన్ని గురించీ వివరంగా
చెప్పడంతో పాటు తన భాషనీ నేర్పుతాడు.
ఈ కథ పరంపరాగతంగా
ప్రతీ తరమూ తన తర్వాతి తరానికి చెప్పడం ద్వారా, ఎనిమిదో తరం వాడైన ఎలెక్స్ హెలీకి చేరడం, అతడు చాలా పరిశోధన చేసి 688 పేజీల ఆంగ్ల నవలగా తీసుకురావడం తర్వాతి కథ. ఈ ఆంగ్ల
నవల సారాన్ని క్లుప్తంగా, సరళంగా తెనిగీకరించారు 'సహవాసి' గా పేరొందిన జంపాల ఉమామహేశ్వర రావు. (నాకు కొద్దిపాటి
పరిచయం ఉంది అని చెప్పుకోడానికి గర్వ పడే వ్యక్తుల్లో ఒకరీయన). తనకి మరికొంచం
వివరంగా రాయాలని ఉన్నా, ప్రకాశకుల
కోరిక మేరకే బాగా క్లుప్తీకరించాల్సి వచ్చిందని ఆదివారం ఆంధ్రజ్యోతి 'ఫెయిల్యూర్ స్టోరీ' కి ఇచ్చిన ఇంటర్యూ (బహుశా ఆయన చివరి ఇంటర్యూ) లో చెప్పారు.
జపూరు నాగరికత,
తరాల పాటు కొనసాగిన అంచె డప్పుల
వ్యవస్థ మొదలుకొని, విముక్తి కోసం కుంటా పడే
తపన, తన సంస్కృతీ
సంప్రదాయాలని నిలబెట్టుకోవడం కోసం పడే తాపత్రయం వెంటాడతాయి. అంతేనా? నిగ్గర్ల కష్టాలు, యజమానుల కారణంగా వాళ్ళు పడే హింస,
ఒకరితో ఒకరు కనీసం మాట్లాడుకోలేని
అసహాయత, యజమానుల మెప్పు కోసం చేసే వృధా
ప్రయత్నాలు ఇవన్నీ కలుక్కుమనిపిస్తాయి. ఒక్క క్షణం ఏమరుపాటు కారణంగా తమ
జీవితాలనే మూల్యంగా చెల్లించిన వాళ్ళు వాళ్ళంతా. అంతే కాదు, ప్రపంచానికి నాగరికత నేర్పానని
నిస్సిగ్గుగా చెప్పుకునే దేశం చేసిన అనాగరిక పనికి ప్రత్యక్ష సాక్ష్యాలు కూడా.
తరచి చదవగలిగితే
ఎన్నో జీవిత సత్యాలని విప్పి చెబుతుందీ నవల. ఒక్కో పాత్రనుంచీ నేర్చుకోగలిగింది
ఎంతైనా ఉంది. సహవాసి రాసిన ఎన్నో చిన్న వాక్యాలు పదే పదే వెంటాడతాయి.
ఆలోచనల్లో పడేస్తాయి. ప్రతి ఒక్కరూ చదవాల్సిన, చదివించాల్సిన ఈ నవలని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది.
(ఈ సమీక్షను మా బ్లాగులో పొందుపరచుకునేందుకు అనుమతించిన మురళి గారికి ధన్యవాదాలు. వీక్షకుల స్పందనలకోసం నెమలి కన్ను బ్లాగును సందర్శించండి.: )
http://nemalikannu.blogspot.com/2011/07/blog-post_11.html
Wednesday, June 29, 2011
ఘంటారావం - The Hunchback of Notre Dame - రచన: విక్టర్ హ్యూగో- అనువాదం: సూరంపూడి సీతారాం -ముందుమాట: చలసాని ప్రసాద్
ప్రపంచ సాహిత్యంలో పేరెన్నికగన్న రచనల్లో ఒకటిగా నిలిచిపోయిన ''హంచ్‌బాక్ ఆఫ్ నోత్ర్‌దామ్''కు తెలుగు అనువాదం ఈ ఘంటారావం. సుప్రసిద్ధ ఫ్రెంచ్ రచయిత విక్టర్ హ్యూగో 1830లలో రాసిన నవల ఇది. దాదాపు రెండు శతాబ్దాలు కావొస్తున్నా ఇప్పటికీ ఈ నవలకు ప్రభ తగ్గలేదు.
దాదాపు ప్రపంచంలోని ప్రధాన భాషలన్నింటిలోకీ అనువాదమైంది.
దీని ఆధారంగా 1905లో మూకీలతో మొదలుకొని ఇప్పటి వరకూ ప్రతి తరంలోనూ సినిమాలు తీస్తూనే వున్నారు.
ఇక టీవీ సీరియళ్లు, నాటకాలు, రేడియో అనుసరణలు, సంగీత రూపకాలకు లెక్కలేదు.
1997లో పిల్లల కోసం వాల్ట్ డిస్నీ దీన్ని విజయవంతమైన యానిమేషన్ చిత్రంగా కూడా తెచ్చింది. నిజానికి పౌరాణిక గాథలకు తప్పించి ఒక కాల్పనిక రచనకు శతాబ్దాలుగా ఇంతటి ప్రాభవం, ఆదరణ లభించటం అరుదనే చెప్పాలి.
దీనికింత వైభోగమెందుకు? ఏమిటి దీని ప్రత్యేకత?
::: ::: :::
విక్టర్ హ్యూగో (1802-85) సాటిలేని మేటి ఫ్రెంచి రచయిత. ఇతిహాసాల స్థాయిలో నవలలు రాసి విశ్వ సాహిత్యంలోనే వన్నెకెక్కాడు. అతని ''లే మిసరబ్ల'' (బీదలపాట్లు)కి సాటిరాగల నవలలు ఎన్నో వుండవు. విశ్వసాహిత్య పరిశీలకులు ఒకే గొంతుకతో ఒప్పుకునే మాట ఇది. ఆ మాటకొస్తే అటు విప్లవాలలోనూ, ఇటు సాహిత్యరంగంలోనూ కూడా ఫ్రాన్స్‌ది ఎప్పుడూ పైచేయి. అందుకే ఫ్రాన్స్‌ని ''విప్లవాల ఉయ్యాల'' అన్నారు. ఇంచు మించు అన్ని సాహిత్య సిద్ధాంతాలకి పుట్టినిల్లు ఫ్రాన్స్, మనందరం వీటిని మరీ మరీ మననం చేసుకోవాలి.
::: ::: :::
అనువాద కళలో సిద్ధహస్తులు సూరంపూడి సీతారాం తెలుగు పాఠకుల కోసం దాదాపు అరవై ఏళ్ల క్రితం (1954లో) చేసిన అనువాదం ఇది.
దీన్ని ఇప్పుడు పునర్ముద్రించి మీ ముందుంచుతున్నాం.
::: ::: :::
ఘంటారావం
రచన: విక్టర్ హ్యూగో
అనువాదం: సూరంపూడి సీతారాం
186 పేజీలు, వెల: రూ.100/-

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్ 500 067
ఫోన్ నెం. 040- 2352 1849
ఇ మెయిల్ ఐడి: hyderabadbooktrust@gmail.com
Saturday, June 4, 2011
అలెగ్జాండర్ ద్యుమా ప్రపంచ ప్రఖ్యాత నవల 'ది కౌంట్ ఆఫ్ మాంటి క్రిస్టో' తెలుగులో : ''అజేయుడు'' ... అనువాదం : సూరంపూడి సీతారాం ...
ప్రెంచి నవలా రచయిత, నాటకకర్త అయిన అలెగ్జాండర్ ద్యుమా రాసిన అద్భుత నవల - ద కౌంట్ ఆఫ్ మాంటి క్రిస్టో.
ఈ నవలలోని కథ చరిత్రతో, రాజకీయాలతో ముడివడింది.
ఇందులో చాలా సంఘటనలు వాస్తవ ఆధారితాలు.
సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం ... ఫ్రెంచి విప్లవం కారణంగా వచ్చిన మానవీయ విలువలు ఈ నవలలో స్పష్టంగా కనిపిస్తాయి.
స్వతహాగా ఈ విలువలపట్ల ఎంతో విశ్వాసం వున్న ద్యుమా ... ఈ నవలలో అంతర్లీనంగా అవి కన్పించేలా కథనాన్ని చక్కగా మలిచారు. అసూయాపరులైన స్నేహితుల కుట్రకు జైలుపాలైన వ్యక్తి విడుదల కాగానే మారుపేరుతో సొంత ఊరికి తిరిగి వచ్చి అమోఘమైన ప్రణాళికలతో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వారిపై పగ తీర్చుకుని జీవితంలో ''అజేయుడు'' గా నిలబడటం ఇందులోని మూల కథాంశం.
1844-46లో ఒక ఫ్రెంచి పత్రికలో సీరియల్‌గా వచ్చిన ఈ నవలకు అశేష ప్రజాదరణ లభించింది. సీరియల్ తరువాయి భాగం కోసం జనం పత్రికల దుకాణాల ముందు బారులు తీరేవారట. పుస్తకంగా వెలువడిన కొద్ది నెలల్లోనే పది భాషల్లోకి అనువాదమైంది. 1846లో వెలువడిన ఆంగ్ల ముద్రణ విశేష పాఠకాదరణ పొందింది. దాంతో అలెగ్జాండర్ ద్యుమా పేరు ప్రపంచమంతటా మార్మోగింది.
శతాబ్దాలు గడిచినా ... నేటికీ ఈ నవల పట్ల పాఠకుల ఆదరణ చెక్కు చెదరలేదు. సమాజంలో సంస్కృతుల మధ్య, విలువల మధ్య ఎంతో అంతరం వచ్చినా ఈ నవలని అప్పటి పాఠకులు ఎంతగా ఆస్వాదించారో, నేటి పాఠకులు కూడా అంతగా ఆస్వాదిస్తున్నారు. ఈ నవల ఆధారంగా ఐదు సినిమాలు వచ్చాయి. ఇక సంగీత, రేడియో రూపకాలకైతే లేక్కేలేదు.
అలెగ్జాండర్ ద్యుమా (1802-1870) ప్రపంచంలో అత్యధికంగా చదువబడుతున్న ఫ్రెంచి రచయిత. ఆయన అనేక నవలలు, నాటకాలు రాశారు. వాటిలో ద ''కౌంట్ ఆఫ్ మాంటి క్రిస్తో'', ''త్రీ మస్కిటీర్స్'' ఎంతో ప్రసిద్ధి పొందాయి.
సూరం పూడి సీతారాం 65 ఏళ్ల కిందట ఈ నవలను తెలుగులోకి అనువదించారు. ఆయన గతంలో చేసిన అనువాదాలను ...విక్టర్ హ్యూగో 'హంచ్‌బాక్ ఆఫ్ నొత్ర్‌దామ్' (ఘంటారావం), మహాశేతాదేవి 'హజార్ చౌరాశీర్ మా (ఒక తల్లి), 'దాయన్' (దయ్యాలున్నాయి జాగ్రత్త), 'శ్రీశ్రీ గణేశ్ మహిమ' (రాకాసి కోర) ... హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. ప్రపంచ సాహిత్యాన్ని, భారతీయ సాహిత్యాన్ని సహజ సుందర అనువాదాల రూపంలో తెలుగు పాఠకులకు చేరువ చేసిన ఘనత వారిది. ఆయన 1997లో మరణించారు.
అజేయుడు (నవల)
మూలం: ద కౌంట్ ఆఫ్ మాంటి క్రిస్టో
రచన: అలెగ్జాండర్ ద్యుమా
తెలుగు అనువాదం: సూరంపూడి సీతారాం
404 పేజీలు, వెల: రూ. 160 /-

Saturday, May 28, 2011
హృదయంతో చేసిన అనువాదం - చివరకు మిగిలింది? ('గాన్ విత్ ద విండ్') పుస్తక సమీక్ష - విజయకుమార్ (ఈ భూమి మాసపత్రిక)
కొన్ని కొన్ని కొందర్ని ఆకర్షిస్తాయి.
వాటికి ఎన్నో కారణాలు వుంటాయి.
ఎం.వి.రమణారెడ్డి గారిని మార్గరెట్ మిచ్చెల్ 'గాన్ విత్ ద విండ్' ఆకర్షించింది.
దానికి కారణాలు ఆయన చెప్పుకున్నారు.
ప్రపంచ ప్రసిద్ధ నవలను పరవశంగా అనువదించారు.
ఇది నవ్య వారపత్రికలో సీరియల్‌గా కూడా వచ్చింది.
ఇప్పుడు పుస్తకంగా మనముందు వుంది.
'ప్రతి అనువాదకుడు ఆ భాష కొక ప్రవక్తలాంటివాడు' అన్నాడు జర్మన్ మహాకవి గోథె.
రచనను, ఇతర భాషలోని రచనను ఆత్మీయంగా భావించినప్పుడే దాన్ని మాతృభాషలోకి తేవాలనిపిస్తుంది. మన ప్రాచీన మహాకవులందరూ అనువాదకులే.
'గాన్ విత్ ద విండ్' నవల గురించి చెబుతూ రమణారెడ్డి గారు 'అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్రలో సంభవించిన ఒకానొక మలుపు ఈ నవలకు నేపథ్యం... సామాజిక శక్తుల పోరాట క్రమంలో భూస్వామ్య వ్యవస్థకూ పెట్టుబడిదారీ వ్యవస్థకూ మధ్య జరిగిన ముఖాముఖి పోరాటాన్ని చిత్రించిన నవల ఇది. ఈ నవలలో ప్రధానపాత్ర 'స్కార్లెట్' అనే అమ్మాయిది. ఆమె పాత సమాజంలో ఇమడనూ లేదు. కొత్త సమాజాన్ని అందుకోనూ లేదు' అన్నారు. ఈ నవలను గతంలో సంక్షిప్తంగా పరిచయం చేసిన మాలతీ చందూర్ గారి పట్ల ఆయన కృతజ్ఞత ప్రకటించారు.
'గాన్ విత్ ద విండ్' నవల 1936లో అచ్చయింది.
1998 వరకు ప్రపంచ వ్యాప్తంగా రెండుకోట్ల కాపీలు అమ్ముడుపోయింది.
ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ బహుమతిని 1937లో అందుకుంది.
1939లో సినిమాగా వచ్చి 9 అకాడమీ అవార్డులు గెలుచుకుంది.
డిసెంబర్ 15, 1939న 'గాన్ విత్ ద విండ్' చిత్రం విడుదలయింది.
ఆ చిత్రం విడుదల రోజు జార్జియా రాష్ట్రంలో సెలవుదినంగా ప్రకటించారు.
అట్లాంటా నగరంలో మూడురోజులు ఉత్సవాలు జరపాల్సిందిగా నగర మేయర్ ఆజ్ఞలు జారీ చేశారు.
చలన చిత్ర చరిత్రలోనే అది అపూర్వ విషయం.
మార్గరెట్ మిచ్చెల్ నవల వెలుగు చూడడానికి పూర్వాపరాల్ని రమణారెడ్డిగారు ఆసక్తిగా వివరించారు. మార్గరెట్ మిచ్చెల్ 48వ ఏట కారు ఢీకొని స్పృహతప్పి ఆస్పత్రిలో చేరి ఐదురోజులుండి 1949 ఆగస్టు 16 న చనిపోయింది. ఈ నవల వచ్చి 70 సంవత్సరాలు గడచినా ఇప్పటి దాకా తెలుగులో రాలేదు. సంక్షిప్త కథా పరిచయాలు తప్ప సమగ్రంగా రాలేదని రమణారెడ్డి గారన్నారు. ఆ బృహత్తర బాధ్యతని స్వీకరించి ఈ నవలను ఆయన తెలుగు పాఠకుల ముందుంచారు.
బానిసత్వాన్ని రద్దు చేస్తూ లింకన్ చట్టం చేశాడు.
దాంతో అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి దక్షిణాది రాష్ట్రాలు విడిపోయాయి.
అంతర్యుద్ధం మొదలయింది.
జార్జియా రాష్ట్రంలో పుట్టి పెరిగిన స్కార్లెట్ ఓహరా జీవిత కథ ఈ నవల. ఆమె యాష్‌లీ అనే అతన్ని ప్రేమిస్తుంది. కానీ అతను మెలనీ అనే అమ్మాయిని పెళ్లిచేసుకుంటాడు. తన అందాన్ని లెక్కపెట్టని అతని పై ఆగ్రహంతో అతని తమ్ముడు చార్లెస్‌ను పెళ్లిచేసుకుంటుంది. అతను అంతర్యుద్దంలో చనిపోతాడు. కానీ ఆమె యాష్‌లీని మరచిపోదు. అంతర్యుద్ధంలో కాలిపోతున్న ఇళ్ల నించి స్కార్లెట్‌ను, ఆమె బంధువుల్ని బట్లర్ అనే అతను రక్షిస్తాడు. అతనంటే స్కార్లెట్‌కు ఇష్టముండదు. కానీ అతన్ని పెళ్లాడుతుంది. మనసులో యాష్‌లీ వుంటాడు. యాష్‌లీ భార్య చనిపోతుంది. స్కార్లెట్ మనసు తెలిసి బట్లర్ ఆమెను వదిలి వెళ్లిపోవాలనుకుంటాడు. ఈ మధ్యకాలంలో పిల్లలు కలగడం, పోవడం కూడా జరుగుతుంది. మధ్యలో అంతర్యుద్ధంలో అతలాకుతలమైన జీవితాలు ఎన్నెన్నో.
చివరిదాకా తన అహంకారాన్ని, అభిజాత్యాన్ని వదిలిపెట్టని స్కార్లెట్ తత్వం మనల్ని ఆకర్షిస్తుంది. చివరికి తన మనసులో వున్నది యాష్‌లీ కాదని, తన భర్త బట్లర్ అని తెలిసినా ఆ విషయం బాహాటంగా భర్తతో చెప్పదు. వ్యక్తులు కలుస్తూ, విడిపోతూ, అకర్షిస్తూ, సంక్షోభంలో సాగిపోతూ అడుగడుగునా మనకు ఉత్కంఠ కలిగిస్తారు.
యాష్‌లీ భార్య మిలెనీ మరణశయ్యపై వుంది. తన భర్తనీ, కొడుకునీ స్కార్లెట్‌కి ఒప్పగించి కళ్లు మూస్తుంది. అన్నాళ్లుగా తను ఆరాటపడిన వ్యక్తి తనకందినా తను ఎండమావులవెంట పరిగెత్తానని గుర్తిస్తుంది. తన మనసులో వున్నది తన భర్త బట్లరని తెలుసుకుంటుంది. బట్లరేమో ఆమెని వదిలి వెళ్లడానికి నిర్ణయించుకుంటాడు. తన అహంకారం వల్ల ఆమె భర్తని అభ్యర్థించదు. బట్లర్ లేని జీవితం అంధకారమనిపిస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచించే ఓపిక, ధైర్యం వుండవు. కానీ ఓటమిని ఒప్పుకొని భర్తని వేడుకోలేదు. తన అందంతో, ప్రేమతో అతన్ని లొంగ దీసుకోగల ననుకుంటూనే నిద్రపోతుంది.
నవలలో స్కార్లెట్, బట్లర్ పాత్రలు ప్రధానమయినవి. అందంలో, తెలివితేటల్లో, స్వార్థంలో ఒకరికొకరు తీసిపోరు. వాళ్లని యిష్టపడతాం, కోప్పడతాం, భూమిలో కలిసిపోతున్న భూస్వామ్య మనస్తత్వాలకు వాళ్లు ప్రతినిధులు. తన గొప్ప శిల్పంతో మార్గరెట్ మిచ్చెల్ మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేసి చదివిస్తుంది.
రమణారెడ్డిగారు ఈ నవలని రసవంతంగా అనువదించారు. ఉదాహరణకి చివర్లో స్కార్లెట్ భర్త బట్లర్ ఆమెని వదలివెళ్లాలనుకున్నప్పుడు ఆమెతో అన్న మాటలు చూడండి.
''మన పెళ్లినాటికే నువ్వు నన్ను ప్రేమించడం లేదని తెలుసు. నీ మనవులో నుండి యాష్‌లీ తొలగిపోలేదని తెలుసు. నేను ఎంత మూర్ఖుణ్ణంటే నువ్వు అతన్ని మరచిపోయేలా చేయగలననుకున్నాను. నువ్వు ఏది కోరినా కాదనకుండా సంతోషపెట్టాలనుకున్నాను. వివాహ బంధంతో రక్షణ కలిగించాలనుకున్నాను. నీ స్వేచ్ఛకు అడ్డు తగలకుండా గారాబంగా చూసుకోవాలనుకున్నాను. కష్టాల నుండి నీకు విముక్తి కలిగించాలనుకున్నాను... ఎందుకో తెలుసా? చీకూ చెంత లేకుండా నువ్వు చిన్నపిల్లలా సరదాగా ఆడుకోవాలని. నా దృష్టిలో నువ్వు యింకా చిన్నపిల్లవే. చిన్న పిల్లలు తప్ప నీ అంత మొండిగా తల బిరుసుగా మరొకరు ఉండలేరు.''
రమణారెడ్డిగారి అనువాదంలో తెలుగు పలుకుబడివుంది.
అనువాదం సహజంగా, సరళంగా సాగింది.
తెలుగువాళ్లు హాయిగా చదువుకోవడానికి తగినట్టుగావుంది.
ఆ పేర్లని అనువదించడం అన్నది కుదరదు.
తక్కిన సంభాషణలు, సన్నివేషాలు, రాగద్వేషాలు అన్నీ మన ముందు అపూర్వంగా, ప్రతిభావంతంగా ఆవిష్కరించారు.
అనువాదం ఒక తపస్సు, ఒక తన్మయత్వం.
తన ఆనందాన్ని పంచుకోవాలని భావుకుడు అనుకుంటాడు.
రమణారెడ్డిగారు అనుకున్నారు.
తన మనసుగుండా సాగిన గాన్ విత్ ద విండ్ మన ముందు తియ్యని తెలుగై వెలుగుతోంది.
చదవండి.
- విజయ్‌కుమార్
ఈ భూమి, సామాజిక రాజకీయ మాసపత్రిక, మే 2011.
చివరకు మిగిలింది?
513 పేజీలు, వెల: రూ.200/-
ప్రతులకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్.

Friday, May 27, 2011
నిరంతర ఘర్షణ ప్రధాన ఇతివృత్తం - 'రాముడుండాడు రాజ్జిముండాది' పుస్తక సమీక్ష - ఎస్.రామకృష్ణ (పాలపిట్ట మాస పత్రిక)
డా. కేశవరెడ్డి అభిమానిగా ''రాముడుండాడు రాజ్జిముండాది'' నవల చదివాను. ఆయన మిగతా రచనల కంటే ఇది భిన్నంగా వుంది. ఇంత సరళంగా, సింగిల్ లేయర్‌లో మరే ఇతర నవల లేదనిపించింది. అయితే కథను దృశ్యమానం చేయడంలో డా. కేశవరెడ్డి ముద్ర ఇక్కడ కూడా కన్పిస్తుంది.
ఉదాహరణకు 11 వ భాగంలో ''అది పౌర్ణమి వెళ్లిన తరువాతి రాత్రి. సందె చీకటి దట్టంగా అ లముకుని వుంది. కూలిపోయిన కొలిమి దాపున ఉన్న సత్రం నక్షత్రాల కాంతిలో లీలగా కనిపిస్తున్నది. మందంగా వీస్తున్న గాలి పాటకు బూడిద తొలిగిపోవడంతో పొయ్యిలోని నిప్పు కణికలు నిగనిగలాడుతో కనిపించసాగాయి. కొలిమి వెనుకనున్న వెంపలి చెట్లలోను, జిల్లేడు చెట్లలోను అసంఖ్యాకములైన మిణుగురు పురుగులు అవిరామంగా ఎగురబోతున్నాయి.'' మొత్తం నవలకు ఈ వాక్యాలు బీజప్రాయాలు.
చితికిపోతున్న గ్రామీణ జీవితాలు, ఆదరణ కోల్పోతున్న కులవృత్తులు, ఆధునికత దెబ్బతో కుంగిపోయి ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ, ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్న వివిధ కులాలవారు, ఈ పరిస్థితి నుండి విముక్తి కోసం నిరంతరం సాగే పోరాటం ''రాముడుండాడు రాజ్జిముండాది'' ఇతి వృత్తం.
దీన్ని దృశ్యమానం చేయడానికి డా.కేశవరెడ్డి ఈ సన్నివేశం ఎంచుకున్నారు.
ఒక రైతు చేతిలో కూల్చివేయబడ్డ కంసాలి కొలిమి, అందులో ఇంకా ఆరని నిప్పు కణికలు, జరుగుతున్న దారుణాన్ని మౌనంగా తిలకిస్తున్న మిణుకు మిణుకుమనే నక్షత్రాలు, అవిరామంగా ఎగరాలని చూసే మిణుగురు పురుగులు. ఓ అద్భుత దృశ్యం.
పైకి కేవలం ఆర్థి సమస్యగానే కనబడే గ్రామీణ ఆర్థికవ్యవస్థ సంక్షోభానికి కేశవరెడ్డి మానవీయతను జోడించారు. కంసాలి కొలిమిలోని ఆరని నిప్పులు వృత్తిపనివారి తరగతి నైపుణ్యంగా మనం అర్థం చేసుకోవాలి. ఆకాశ,లోని నక్షత్రాలు కాస్పిక్ వాస్తవికతకు తార్కాణంగా, చెట్లలోని మిణుగురులు నిరంతర ఆశావాదులైన గ్రామీణులకు ప్రతీకలుగా తీసుకోవచ్చు.
ఆశ్చర్యకరంగా ఈ చాప్టర్‌లోనే బైరాగి పాత్ర ద్వారా డా. కేశవరెడ్డి ప్రస్తుత సమాజ సంక్షోభానికి కారణం వివరిస్తాడు. తంబూర మీటుతూ బైరాగి వీరబ్రహ్మంగారి తత్వాలు పాడుతున్నాడు. బ్రహ్మంగారు తన శిష్యుడు సిద్ధయ్యకు లోకం తీరు వివరిస్తున్నాడు. ''మానవ సంబంధాలలోని రాక్షసత్వాన్ని, సృష్టి యొక్క నిరర్థకతను'' అతను విపులీకరిస్తున్నాడు అంటూ, మళ్లీ నేపథ్య దృశ్యాన్ని వర్ణించిన కేశవరెడ్డి ఎట్లా ''గాలి వీచే కొద్ది పొయ్యిలోని బూడిద తొలిగిపోయి నిప్పులు బయటపడుతున్నాయో'', ఎట్లా కొమ్మలను అంటిపెట్టెకున్న మిణుగురు పురుగులు కదులుతున్నాయో చెబుతాడు. ఈ ప్రపంచంలో ప్రతీదీ కదులుతుంది. కాకపోతే వాటి వేగం, గమనం విషయంలో ఒక్కోరిది ఒక్కో అంచనా.
బైరాగి దగ్గరకు వచ్చిన యువకుడు ''లోకమంతా ఇట్టానేనే సామీ?'' అని అడుగుతాడు. బైరాగి దీర్ఘంగా నిట్టూర్చి ''లోకం అంతా ఇట్లనే'' అని సమాధానం ఇస్తాడు. అంతేకాదు, ''ఎవని లోకం వానిదిగా వుంది'' అని ముగిస్తాడు.
ఒక స్థాయిలో ''రాముడుండాడు రాజ్జిముండాది'' ను కేవలం గ్రామీణ వ్యవస్థ చితికిపోవడానికి ఆధునికత, సరళీకృత ఆర్థిక విధానాలే కారణమని చెప్పే నవలగానో, కేవలం పట్టణాలకు వలస పోవడమే కుల వివక్షకు పరిష్కారమని చెప్పే రచనగానో చూసేవారుండొచ్చు. కానీ ఫ్యూడల్ సమాజానికి, ఆధునిక పట్టణీకరణకు మధ్య జరిగే సంఘర్షణలో అణగారిన కులాల వారికి, కొన్ని నష్టాలూ, ఎక్కువ లాభాలూ జరిగాయని చెప్పడానికి కూడా ''రాముడుండాడు రాజ్జిముండాది'' తార్కాణంగా నిలుస్తుంది.
నిజానికి ఆర్థికాంశాలు ఎంతగా మనల్ని ఆలోచింపజేసినా, నవల చదువుతున్నంతసేపు కేశవరెడ్డి మార్కు కథనం మనల్ని డామినేట్ చేస్తుంది.
పెద్దనాయుడు (పెద్ద భూస్వామి), ముత్యాల నాయుడు (పెద్దనాయుడి పెద్ద పాలేరు), కోనిగాడు (పెద్దనాయుడి దగ్గర 30 ఏళ్లుగా జీతం చేసిన ముదుసలి మాల కులస్తుడు), పుల్లిగాడు (కోనిగాడి కొడుకు, మంచి జీవితం కోసం చెన్నై వలస వెళ్లిన యువకుడు), తిరిపాల నాయుడు (చితికపోయిన రైతు), గుడిపూజారి, చేతివృత్తినే నమ్ముకుని ఊరిమీద ప్రేమ చావని, శ్రమకు ప్రతిఫలం లేని కంసాలి, ''రాముడుండాడు రాజ్జిముండాది''లో ప్రధాన పాత్రలు.
ఇందులో క్లుప్తతకు కేశవరెడ్డి ఇచ్చిన ప్రాధాన్యత కొన్నిచోట్ల బాగుంది. నవలలో ప్రధాన విలన్ పెదనాయుడే అయినా, అతడు ఎక్కడా మనకు కనబడడు అతడి ప్రభావం ముత్యాల నాయుడి ద్వారా మనకు అర్థమవుతుంది.
వెట్టిచాకిరిని కొనసాగిస్తూనే పైకి దయామయుడిగా కన్పించడానికి పెదనాయుడి ప్రయత్నాలు ఆధునిక విలన్‌లకు దగ్గరగా ఉంటాయి. బహుశ ఎవరైనా ఈ నవలను సినిమాగా తీస్తే, చివరన కోనిగాడు తన బాండ్ పేపర్లను తెచ్చుకోవడానికి దొర ఇంటికి వెళ్లినప్పుడు పెదనాయుడిని, ఓ రంగుల కుర్తా వేసుకున్న ఆర్టిస్టుగా చూపిస్తే బాగుంటుంది. పైకి ఎంత తియ్యగా మాట్లాడినా, లాభనష్టాల విషయంలో అత్యంత కర్కశంగా వ్యవహరించే కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు ఇవాళ్టి ఫ్యూడల్స్‌కు ఆదర్శం.
అన్నిరకాల భ్రమలు దూరమైనా ఊరి మీద మమకారం చావకపోవడం మానవీయ లక్షణం. కన్నీళ్లతోనే ఉన్న ఊరిని వదిలి పట్నం బయల్దేరిన ఐదుగురు- కోనిగాడు, పుల్లిగాడు, కంసాలి, తిరిపాలనాయుడు, పూజారి- మన ఊళ్లలో కన్పించే వివిధ సామాజిక వర్గాలకు ప్రతినిధులు. అయితే వీళ్లు పట్నంలో మెరుగైన జీవితం గడుపుతారా? దశాబ్దాలపాటు ఉన్న ఊళ్లో అనుభవించిన కష్టాలు గట్టెక్కుతారా? ''రాముడుండాడు రాజ్జిముండాది'' అంటూ వలసపోయే చిత్తూరు ప్రాంత గ్రామీణుల ఆశావాదమే ఈ ప్రశ్నలకు జవాబు.
- ఎస్. రామకృష్ణ
(పాలపిట్ట మాస పత్రిక)
సమీక్షకుని సెల్ నెం. 924 636 4326
Friday, May 20, 2011
సిటీ బ్యూటిఫుల్ - డా.కేశవరెడ్డి ...
కాలేజీ చదువులయ్యాక కొన్ని నవలలు రాశాను.
అడపాదడపా పాఠకుల నుంచి ఉత్తరాలు వస్తుండేవి.
కొందరు పాఠకులు, ''మీరు డాక్టరై వుండీ ఎంతసేపూ పల్లెటూరి జీవితాలను గురించే రాస్తారెందుకు? నగర జీవితం గురించి ఒక నవల రాయండి'' అని రాసేవారు.
ఒకసారి శ్రీమధురాంతకం రాజారాం గారు కూడా, ''అవునబ్బా, నువు నాణెం రెండు వైపులా చూసినోడివి. సిటీలైఫ్ గురించి నువ్వు రాయాల'' అన్నారు. (ఇంతకీ నేను నాణెం రెండువైపులా చూసినోడినేనా?)
నాకు బాగా తెలిసన నగరం పాండిచ్చేరి నగరమే. ఆ నగరంలో ఎవర్ని గురించి రాయాలి? బాగా పరిచయమున్న విషయం గురించి మాత్రమే రాయాలన్న చాదస్తప్రాయమైన నియమం కలవాడిని. కనుక ఒక మెడికో అనుభవాలను ఆధారంగా చేసుకుని రాయాలనుకున్నాను. నా ఇతర నవలలలాగే సంఘటనలన్నీ స్వల్ప వ్యవధిలో - మూడు, నాలుగురోజులలో - జరిగిపోయేలా ప్లాటు వేసుకుని ఈ నవల రాశాను.
ఈ సమాజంలో ఏర్పరచుకున్న బూటకపు విలువలను, బోడి సంప్రదాయాలను ఆమోదించలేని ఒక ఉలిపికట్టె కథే ఇది.
- డా.కేశవరెడ్డి
(ముందుమాట 'లెస్ ఎలోన్ వెన్ ఎలోన్ లేక ఇక్కడా మనుషులేనా?' నుంచి)
......................................................................................
మన సమూహాల్లో ఒంటరితనాన్ని గుర్తు చేసే నవల యిది. ఈ సొసైటీలో మన 'బిలాంగింగ్‌నెస్' ని మనమే 'డిస్‌ఓన్' చేసుకునే ఓ ఆత్మిక సందర్భం ఈ 'సిటీ బ్యూటిఫుల్' అనే మంచి నవల.
ఓ గొప్ప రచయిత చేసిన అతి సాధారణ రచన అసాధారణంగా పాపులర్ అయిపోవచ్చు.
అదే రచయిత చేసిన ఓ అసాధారణ రచన, సామాజిక స్పృహ, నీతి సూత్రాలూ, సంఘ ప్రయోజనాల్లాంటి చాలా, చాలా 'గొప్ప' సాహితీ సూత్రాల వల్ల అతి మామూలు నవలగా, రచనగా మిగిలిపోవచ్చు. అదుగో అ లా మిగిలిపోయిన రచనే ఈ నవల అని నా ఉద్దేశం.
నిజానికి డా. కేశవరెడ్డి గారు తనమీద పడ్డ ఓ రకపు ముద్రకు తనే తనపైన అంగీకారాన్ని తెలియబరుస్తూ ఓ ఫ్రేమ్‌వర్క్‌లో రచన చేస్తూ వున్నారు...నిన్నటి ''మునెమ్మ'' దాకా.
ఆ ఫ్రేమ్‌వర్క్‌లో ఎక్కడా ఇమడని నవల ''సిటీ బ్యూటిఫుల్''. డాక్టర్‌గారి అసలు సిసలు రచనా బలాన్ని... ఆయన చదువరితనాన్ని, ఆయనలోని నిర్భీతినీ 'ట్రాన్స్‌పరెన్సీ' చూపే రచన సిటీ బ్యూటిఫుల్.
ఇందులో కథలేదు. (కథ లేకుండా నవలేమిటన్న సామాన్య అమాయక ప్రశ్నవేసే వాళ్లకది అసలు నవల కాదు).
ఇందులో అద్భుత కథనం వుంది.
దేవీదాస్ అనబడే ఓ యువ మెడికో అంతస్సంఘర్షణను అక్షరబద్ధం చేయడం చూస్తామిందులో. ప్రాంతాల వారీగా ... మతాల వారీగా ... కులా వారీగా ... జెండర్ వారీగా సాహిత్యాన్ని చింపి చూసే, చూపే సాహితీ 'దొడ్డు' వారికి డా.కేశవరెడ్డి ఓ ప్రాంతానికి చెందిన రచయిత.
కేశవరెడ్డి గారి రచనల్లో స్థలాలూ, భాషా నేపథ్యం ఓ ప్రాంతానికి చెందినవైనా ... ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేసిన డా.కేశవరెడ్డి గారి ప్రాత్రల మూలాలు మాత్రం విశ్వమానవీయతలో వుంటాయి.
...
జాతి, మత, కుల, ప్రాంతాలకు అతీతంగా నిజ జీవితాన్ని సాగిస్తూన్న డా.కేశవరెడ్డిగార్ని ఓ చట్రంలో బిగించేసి చూస్తున్నవారికి, సాధారణ పాఠకులక్కూడా ఓ విభిన్నమైన నవల ఈ ''సిటీ బ్యూటిఫుల్''.
నా వరకూ నాకు ఇది ఆయన నంబర్ వన్.
- కాశీభట్ల వేణుగోపాల్
(పరిచయం 'మంత్ర నగరి' నుంచి)
..........................................
సిటీ బ్యూటిఫుల్
రచన: డా.కేశవరెడ్డి
122 పేజీలు
వెల: రూ.80/-
ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్ - 500 067
ఫోన్ నెం. 040 2352 1849
ఇ మెయిల్: hyderabadbooktrust@gmail.com
Thursday, May 19, 2011
ఇన్‌క్రెడిబుల్ గాడెస్ (క్షుద్ర దేవత) - డా. కేశవరెడ్డి ...
ఇన్‌క్రెడిబుల్ గాడెస్ అన్నదే ఈ నవల పేరు!
ఈ ఇంగ్లీషు పేరుకు ఒక తెలుగు అర్థం ... క్షుద్రదేవత.
కొంతకాలం క్రితం ఒకరోజు మా ఆసుపత్రిలో పేషెంట్లను చూస్తున్నాను. ఒక రోగి 'కన్సల్టేషన్ రూమ్' లోకి వచ్చాడు. రోగిని పరీక్షించేముందు అతని పేరు, కులం, ఊరు, వయసు వగైరా వివరాలను 'స్టాటిస్టికల్ పర్పస'్ కోసం నమోదు చేయాలి.
అవన్నీ అయ్యాక ''ఏం చేస్తుంటావు?'' అని అడిగాను.
అతడు ''అడుక్కు తింటుంటా'' అన్నాడు.
''అది సరే నీ కుల వృత్తి ఏమిటి?'' అనడిగాను.
అతడు, ''అడుక్కు తింటాం'' అన్నాడు.
''చూడు బాబూ. నేను రాసుకోవాలి. నీ కులవృత్తి ఏమిటో చెప్పు'' అన్నాను.
అతడు ''మా కులపోళ్లంతా చేసేది అదే. అందరం అడుక్కుతింటాం'' అన్నాడు.
తర్వాత తెలిసిందేమిటంటే అడుక్క తినడమే కులవృత్తిగా గల కులాలు ఈ దేశంలో డజనుకుపైగా వున్నాయట.
ఈ దేశంలో వ్యవస్థీకృతమై వున్న ఈ భ్రష్టకారి కుల వ్యవస్థ మీద పోరాటం దాదాపు రెండువేల సంవత్సరాల నుంచి సాగుతున్నది.
ఇన్ని వేల యేండ్లుగా ఏ కులమైతే తనను అవమానాలకు, అమానవీయతకు, హైన్యతకు గురిచేస్తూ వచ్చిందో ఆ కులనామాన్ని తన పేరు చివరన నేడు దళితుడు రాసుకుంటున్నాడు.
అ లా రాసుకోవడం ద్వారా తన ఆత్మగౌరవాన్ని, తద్వారా తన సాంఘిక సమానత్వాన్ని నిర్ద్వంద్వంగా, బాహాటంగా ప్రకటించుకున్నాడు.
ఈ శతాబ్దంలో సగర్వంగా చెప్పుకోదగిన సాంఘిక చైతన్యంగా దీనిని భావించడానికి ఏమాత్రం తటపటాయించనవసరంలేదు.
ఐతే ఈ సాంఘిక చైతన్యం బాహ్యశక్తులతో పోరాడి సంపాదించింది కాదు.
వేలయేండ్లుగా తనను అంటిపెట్టుకుని వుండిన ఆత్మన్యూనతతో పోరాడి, దానిని ఛేదించి తన జీవితాన్ని మెరుగుపరచుకునే క్రమంలో నేడు దళితుడు ఒకానొక కీలకమైన మజిలీని చేరుకున్నాడు.
ఇలా సాధించుకున్న 'సాంఘిక' సమానత్వం దానికదే అతని జీవితాన్ని గుణాత్మకంగా మార్చడానికి నిర్వహించగల పాత్ర ఎంత?
ఈ ప్రశ్నకు సమాధానం ''సున్న'' అని చెప్పాల్సి వుంటుంది.
కానీ 'సున్న' కు విలువ లేదని ఏ గణిత శాస్త్రజ్ఞుడైనా అనగలడా?
అనలేడు.
సున్నాకు ముందు 'అంకె' చేరితే దానికి ఎనలేని విలువ సమకూరుతుంది. ఆ అంకె పేరే ఆర్థిక సమానత్వం.
-డా.కేశవరెడ్డి
('దళితుడి పయనం' ముందుమాట నుంచి)
....................................................
మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన కేశవరెడ్డి తన చుట్టూరా వున్న సమాజంలోని నిమ్నోన్నతాల్ని, హింసా సన్నివేశాల్ని, అంతులేని యాతనతో నిండిని దీనజనుల దుఃఖ జీవితాల్నీ బాగా కళ్లు తెరచుకుని చూచిన మానవుడు.
చిన్న వయసులోనే ఒక పెద్ద ఆశయం కోసం కలం పట్టిన రచయిత.
ఏరు దాటి తెప్ప తగలేసేవాడు కాడు.
తిరుపతిలో వున్నా, పాండిచ్చేరిలో వున్నా, నిజామాబాదులో వున్నా తమ పల్లెను గురించి, అక్కడి బక్క రైతుల యొక్క బీద కూలీల స్థితిగతులను గురించి ఆలోచించే నిజాయితీపరుడు.
ఈ నవలలో రచయిత దాపరికం లేకుండా, మొగమాటానికి పోకుండా హరిజనుల జీవన సమస్యకంతా కీలకప్రాయమైన, మూలకారణమైన లోపం ఎక్కడుందో చెప్పేశాడు.
మనిషికి యితరులవల్ల జరిగే అపకారం కన్నా, తనవల్ల తనకే జరిగే అపకారం ఆత్మహత్యా సదృశమైనదని నిరూపించాడు.
గుండెల్ని పిండిచేసే సానుభూతిలో నుంచీ వెలువడిన ఒక కరుణామయమైన ఆక్రందన యీ నవల.
- మధురాంతకం రాజారాం
(పరిచయం నుంచి)
................................
ఇన్‌క్రెడిబుల్ గాడెస్ (క్షుద్రదేవత)
రచన: డా.కేశవరెడ్డి
155 పేజీలు
వెల: రూ.80/-
ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్ - 500 067
ఫోన్ నెం. 040 2352 1849
ఇ మెయిల్: hyderabadbooktrust@gmail.com
Sunday, April 10, 2011
ప్రాంతీయత సార్వజనీనతల సమ్మేళనం ''బషీర్ కథలు'' - 2, డా. కిన్నెర శ్రీదేవి ( 'మిసిమి' మాసపత్రిక ) ...
స్వాతంత్య్రం తర్వాత భారతీయ సమాజంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మార్పులన్నిటినీ సానుకూలంగా చూసే అవకాశం లేదు. వీటిలో కొన్ని సమాజ పురోగమనానికి కాకుండా తిరోగమనం వైపుకి నడిపించేవి కూడా వున్నాయి. ఉదాహరణకు వ్యక్తులకు నైతిక మద్దతు, ప్రోత్సాహం ఇచ్చిన సంస్కరణోద్యమం- స్వాతంత్య్రోద్యమం తర్వాత తిరోగమనం వైపు కదిలింది. సాంస్కృతిక రంగంలో వస్తున్న మార్పులు కూడా ప్రగతికాముకంగా లేవు. స్వాతంత్య్రానికి ముందే అమలులో వున్న ఫ్యూడల్ సామాజిక వ్యవస్థ స్వతంత్రం వచ్చిన తరువాత కూడా కొనసాగింది. స్వాతంత్య్రం తర్వాత రూపుదిద్దుకున్న సామాజిక వ్యవస్థ మరింత అమానవీయంగా మిగిలింది. ఆర్థికరంగంలో వచ్చిన తీవ్రమైన మార్పులు వ్యక్తుల జీవితాలలోకి అనేక సమస్యలనూ సంక్లిష్టతలనూ తీసుకువచ్చాయి. ధనిక వర్గాల జీవిత ప్రమాణాలలో మార్పులు వచ్చాయి. సామాన్యుల జీవితాలలో మాత్రం ఈ మార్పులు ఉపద్రవంగా పరిణమించాయి. గ్రామీణ పేదలు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవటానికి తీవ్ర సంఘర్షణకు లోనవ్వాల్సి వచ్చింది. వాళ్లు తమ జీవితాలలో అంతులేని పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతిమంగా, మనుషుల మధ్య వున్న సామాజిక సంబంధాలు, వ్యాపార సంబంధాలుగా మారిపోయాయి. ఈ దారుణమైన సంబంధాలన్నింటినీ బషీర్ కథలు హృదయాన్ని ద్రవింపజేసే స్థాయిలో చాలా విశ్లేషణాత్కంగా ప్రతిబింబించారు. మనుషుల మధ్య సంబంధాలు కేవలం ఆర్థిక సంబంధాలుగా మారిపోయిన వైనాన్ని, అందులో వున్న దారుణాన్ని ''పాత్తుమ్మా మేక'' బహిర్గతం చేసింది. అందులో తల్లీ కొడుకుల మధ్య జరిగే సంభాషణ ఎప్పుడూ డబ్బు చుట్టూనే తిరుగుతుంటుంది. తన దగ్గరికి ఎప్పుడు వెళ్లినా డబ్బు అడగడానికే వెళుతుంది. తల్లీ కొడుకుల సబంబంధాలలో కూడా డబ్బు కీలకమైన పాత్ర పోషించడంలోని అమానుషాన్ని ఈ రచన ప్రతిబింబిస్తుంది. ''నీ జేబులో ఒక్క రూపాయుంటే ఇవ్వు, అయితే ఎవ్వరితోనూ ఈ విషయం చెప్పకు'' అంటుంది.
''నిన్నే కదా ఇచ్చింది.'' అంటాడు కొడుకు.
ఇలా నిరంతరం తల్లి డబ్బు కోసం మాత్రమే రావటం కొడుకులో అసహనానికి కారణమవుతుంది. ఒక ఉద్రేక పూరితమైన సందర్భంలో తల్లితో ఇలా అంటాడు:
''ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపో లేకపోతే నేనే ఇల్లు వదిలి పోతా''. కుటుంబంలో అందరికీ అతని డబ్బు కావాలి. కొంత మంది అతని డబ్బుకు తామే వారసులని భావిస్తుంటారు. కుటుంబాలలోని వ్యక్తుల మధ్య డబ్బు నిర్వహిస్తున్న, నిర్వహించబోతున్న దారుణమైన పాత్రను చాలా ముందుగానే పసిగట్టి దాన్ని కాల్పనిక సాహిత్యంలో విశ్లేషించగలిగాడు బషీర్.
బషీర్ కథల్లో దారిద్య్రం దాని ఫలితంగా జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలు, ఆ వైఫల్యాలకుండే పర్యవసానాలు ప్రధాన వస్తువులు. ఒక ప్రత్యేకమైన హాస్యం దాన్ని వెంటాడివుండే వ్యంగ్యం బషీర్ రచనా శైలితో విడదీయరాని అంశాలు. నిజానికి బషీర్ హాస్యం వెనుక అంతులేని విషాదం వుంది. బషీర్ చాలా సందర్భాలలో హాస్యాన్ని తగినంతగా వాడుకోలేకపోయానని వాపోయిన సన్నివేశాలు కూడా వున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా వలస పాలన అమలులో వున్న కాలంలో తను స్వేచ్ఛాపూరితంగా రచన చేయలేకపోయాననీ, అసలు తనకలాంటి అనుకూలమైన వాతావరణం లేదని ఒక ఇంటర్వ్యూలో బషీర్ అభిప్రాయపడినాడు. (ఇండియన్ లిటరేచర్, సాహిత్య అకాడమీ జర్నల్ మే-జూన్2008). అదే ఇంటర్వ్యూలో తాను కోపంతో రగిలిపోతూ వుండటం వలన ''పాత్తుమ్మా మేక'' అనే హాస్యస్ఫోరక రచన చేశానని చెప్పారు. ఆ రచన ఉత్తమ పురుషలో నడుస్తుంది. అందుకే ఆయన చిత్రించిన జీవితం ఆద్యంతం ఆర్థిక సంక్షోభాన్ని గురించే అయినప్పటికీ అందులో ఎక్కడా కూడా ఆర్థిక అంశాల ప్రస్తావన లేనే లేదు. అ లాగే యుద్ధాల ప్రసక్తిగానీ, వాటి ప్రభావాల గురించిన చర్చగానీ, అంతెందుకు అసలు స్వతంత్ర ఉద్యమాన్ని గురించిన ప్రసక్తిగానీ కనపడదు. అయితే ఈ అంశాలను పాత్రల అంతఃచేతనను వర్ణించే క్రమంలో చిత్రించటం జరిగింది. దాదాపు అన్ని పాత్రల పై ప్రభావాల భారాన్ని మోస్తూ, వాటి గురించి మాట్లాడవలసి వచ్చిన సందర్భాలలో ఎటువంటి సంకోచం లేకుండా విశదపరచడం కనిపిస్తుంది.
ఉదాహరణకి ఇదే కథలో కథకుడి సోదరుడు అబ్దుల్ ఖాదర్ కూడా ఇతన్ని డబ్బులు అడుగుతాడు. అయితే అతను విభిన్నమైన కారణాలు చూపిస్తాడు. అతని చెల్లెలు కూడా అతన్నించి డబ్బే ఆశిస్తుంది. వాళ్లందరి దృష్టిలో అతడు డబ్బులిచ్చే ఒక యంత్రం లేక సాధనం. అతన్ని వాళ్ళెప్పుడూ కూడా తన రక్త సంబంధీకుడుగా చూడరు. వాళ్లతనితో జరిపే సంభాషణలన్నీ ఏదోరకంగా డబ్బు చుట్టూనే తిరుగుతుంటాయి. మనుషుల మధ్య సంబంధాలను డబ్బులు నిర్దేశించటమనేది ఇవ్వాళ ఉన్నంత దారుణంగా బషీర్ కాలంలో ఉండి ఉండే ఆస్కారం లేదు. బషీర్ కథలు చదువుతుంటే, అతడు తన కాలాన్ని దాటి ఎంత లోతుగా భవిష్యత్తును పరిశీలించగలిగాడో తెలుస్తుంది. అసలు బషీర్ కథలన్నీ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలలో డబ్బుపట్ల వుండే ఆకాంక్షను బహిర్గతం చేస్తాయి. చాలా లోతుగా ఎటువంటి సంకోచాలు లేకుండా మానవ కార్యకలాపాలను డబ్బు నిర్వహించే పాత్రను బషీర్ విశ్లేషించి ముఖ్యంగా నిర్దిష్ట సందర్భాలను సృష్టించడం ద్వారా విమర్శకు గురిచేస్తాడు. ఎటువంటి రచయితైనా భవిష్యత్తును స్పష్టంగా చూడగలిగేందుకు అవసరమైన విశ్లేషణా పరికరాలను ఇవ్వగలిగారు. బషీర్‌లో అటువంటి శక్తి గణనీయంగా వుంది. అందువలననే తానున్న సమాజం తీసుకోబోతున్న మార్పులను, ఎదుర్కోబోతున్న పర్యవసానాలను ముందుగానే పసిగట్టి, వాటిని కాల్పనిక సాహిత్య రూపంలో వ్యక్తం చేశాడు. తద్వారా తానున్న సమాజాన్ని చైతన్యవంతం చేసే కృషికి పూనుకున్నాడు. ఏ రచయితైనా కేవలం సామాజిక వాస్తవికతను ప్రతిబింబించడం ద్వారా గొప్ప రచయిత కాలేడు. అంతకంటే ముఖ్యంగా ఆ రచయిత తానున్న సమాజం ఎదుర్కోబోతున్న ప్రమాదాలను పసిగట్టి విశ్లేషించగలిగినప్పుడే ఆ రచయిత శక్తి సామర్థ్యాలు అవగతమవుతాయి. ఈవిధంగా చూసినప్పుడు బషీర్ తన కాలం కంటే చాలా ముందున్నాడన్న విషయం స్పష్టమవుతుంది. బషీర్ పై పనిని అత్యంత కళాత్మకంగా చేయగలిగాడు. తాను ప్రదర్శించగలిగిన వస్తురూప సమతౌల్యత వల్లే గొప్ప రచయితగా కీర్తించబడుతున్నాడు.
''పాత్తుమ్మా మేక'' గురించి మాట్లాడుతూ బషీర్ అందులోని కథ మూఢనమ్మకాలలో జీవిస్తూ వున్న ముస్లిం కుటుంబాలకు సంబంధించిందని అన్నాడు. సమాజంలో కొనసాగుతూ వున్న జాతి, మత, జెండర్ సంబంధిత వ్యత్యాసాలను, తరతరాలుగా అవి కొనసాగుతున్న తీరును ప్రశ్నించే పనికి పూనుకున్నాడు. బషీర్ ఎక్కుపెట్టిన ఈ విమర్శ ఒక నిర్దిష్ట మతంపైనేనని, ఆ మతాన్ని విమర్శించేందుకు ఆ కాలంలో ఎవరూ సాహసించలేని సందర్భంలో బషీర్ రచన చేశాడని తెలిసినప్పుడు బషీర్ ప్రతిభ తెలుస్తుంది. ''పాత్తుమ్మా మేక''తో పాటు మిగతా కథల్లోని ఏ పాత్ర కూడా పాఠకుల తిరస్కరణకు గురికాదు. పాత్తుమ్మాలోని నిరాశా నిస్పృహలకు ఆమె తండ్రి ఎంతగా కారణమో పాఠకులకు స్పష్టంగానే అవగతమతుంది. అయితే, ఆ పాత్ర పట్ల పాఠకులు ఎటువంటి ద్వేషాన్ని పెంచుకోరు. ఎందుకంటే, ఆ తండ్రి పాత్ర ప్రవర్తనకు కారణం అతడున్న స్థితి. అ లాంటి స్థితిలో ఎవరూ కూడా అ లాకాక మరో రకంగా ప్రవర్తించలేరనే విషయాన్ని పాఠకులు అంగీకరించేట్లుగా బషీర్ చిత్రిస్తాడు.
''పాత్తుమ్మా మేక'' ప్రారంభంలోనే కథకుడు తాను ప్రపంచమంతా తిరిగి విసిగి పోయిగాని ఇక ఇంటి దగ్గిరే వుండి ప్రశాంత జీవితాన్ని గడపాలనుకుంటాడు. తన ఇంటి చుట్టూ ఆవరించివున్న చెట్లు, పూలతోటల మధ్య తన బంధువులతోనూ, తన ఆత్మీయులతోనూ గడపాలనుకుంటాడు. అయితే తానుండాలనుకున్న ఇల్లు అద్దెకిచ్చేశారని తెలుసుకొని తాను వంచింపబడినాడని తెలుసుకొని బాధపడతాడు. తన స్వప్నం మొత్తం ధ్వంసం అయిందని చింతిస్తాడు. ఈ కథలో బషీర్ తన కాలపు వైయక్తిక, సామాజిక అచేతనాన్ని అద్భుతంగా ఆవిష్కరించగలిగాడు.
ఉత్తమ పురుషులో సాగే కథను ఎక్కువ సందర్భాలలో రచయిత యొక్క ప్రాపంచిక దృక్పథాన్ని వ్యక్తం చేస్తాయి. చాలా కథలను బషీర్ ఉత్తమ పురుషులోనే రాశాడు. కొన్ని కథలలో తానే కథకుడుగా వుంటాడు. అందువలన తన ప్రాపంచిక దృక్పథాన్ని గురించి పాఠకులకు నిర్దిష్టమైన అవగాహన కలుగుతుంది. ''పాత్తుమ్మా మేక''లో కూడా రచయితను కథకుణ్ణి వేరుచేయటం సాధ్యం కాదు. బషీర్ తన కథలలో పాత్రలన్నింటిని రోజువారీ జీవితం నుంచి గ్రహించాడు. అంత మాత్రం చేత అవి మూసలు కావు. తన పాత్రలను రక్తమాంసాలతో సజీవ వ్యక్తులలాగా మలిచాడు. ఆ పాత్రలన్నీ మనుషులకు వుండే అన్ని అనుభూతుల సమాహారంగా కనిపిస్తాయి. సాహిత్యం వాస్తవికతను ప్రవచించినప్పటికీ అది అర్థంలో ప్రతిబింబంలాగా వుండదు. సాహిత్య ప్రతిఫలనంలో కళ ఒక కొత్తరూపాన్ని పొందుతుంది. ఇది సాధారణ వాస్తవికత నుంచి భిన్నంగా వుంటుంది. దీనిపట్ల బషీర్‌కు పూర్తి స్థాయి అవగాహన వుంది. అందువలననే అతని కథలు చాలా సాదాసీదా అంశాలుగా అసాధారణాంశాలుగా కనిపిస్తాయి. ఈ అసాధారణ అంశం బషీర్ కథలను పాఠకులకు దగ్గర చేస్తుంది.
పరిచిత ప్రాంతాలను వాటి భౌగోళిక స్వరూపాలను బషీర్ తన కథలలో నిరంతరం ప్రస్తావిస్తుంటారు. అందువలననే ఎర్నాకులం, ఎడపాల్ రైల్వేస్టేషన్, కాలికట్ సబ్ జైల్, వైకం, తలయార పెరంబో లాంటి ప్రాంతాలు బషీర్ కథల్లో పునర్నింపబడుతూ వుంటాయి. సాహిత్యం ఎంత విశ్వజనీన మైనప్పటికీ సారాంశంలో అది అత్యంత ప్రాంతీయంగా వుంటుంది. అ లా వున్నప్పుడు మాత్రమే అది పాఠకుల్ని కదిలించగలుగుతుంది. ప్రపంచంలో గొప్ప సాహిత్యం అనదగిన దాన్ని దేనిని పరిశీలించినా ఈ విషయమే స్పష్టమవుతుంది. బషీర్ కూడా తన కథల్లో ఈ ప్రాంతీయతను విశ్వజనీనతతో మేళవించి చిత్రించాడు. ఉదాహరణకు తన చాలా కథలలో 'లైకమ్' అనే ప్రాంతాన్ని తిరిగి సృష్టించాడు. ఆ ప్రాంతంలోని సాధారణ ప్రజలు, వారి దారిద్య్రం, వాళ్ల ఆత్మిక సంక్షోభాలన్నీ కూడా ఆయన కథలలో ప్రతిఫలించాయి. ఆర్థిక సమస్యల వలన చెదిరిపోయిన మనసుల జీవితాల చిత్రీకరణ ఆయన కథలలో అడుగడుగునా కనిపిస్తుంది. తాను చిత్రించిన జీవితంలో వ్యక్తిగతంగా, ప్రత్యక్షంగా తాను అనుభవించిందే కావటం వలన ఆ చిత్రీకరణ అందరికీ ఆమోదకరంగానూ, అంగీకారయోగ్యంగానూ కనిపిస్తుంది.
బషీర్ కథలలో సార్వత్రిక అంశాలతో పాటు యదార్థ అంశాలు కలిసి వుండటం వలన అవి మిగతా భాషలలోకి అనువదింపబడినప్పుడు కూడా ఆయా భాషలలోని పాఠకుల అభిమానాన్ని చూరగొంటాయి. జీవితాన్ని దాని యదార్థ స్థితిలో పరిశీలించి, సృజనాత్మకంగా విశ్లేషించి చిత్రించటం వలననే వాటిని అనువాదాలలో ఎటువంటి అపసవ్యత లేకుండా తీసుకురావడానటికి వీలు కలిగింది. ఎటువంటి భావోద్వేగాలకు లోనుగాకుండా జీవితాన్ని దాని మొరటు రూపంలో పరిశీలించి ఆ తర్వాత చిత్రీకరణకు పూనుకోవటం వలన ఆ కథలపై ఆయన స్వతంత్ర ముద్రతో పాటు విశిష్టమైన విశ్లేషణకూడా కనిపిస్తుంది. ఆయన తన కథలలో జీవితాన్ని కొంత సానపట్టి చిత్రించినప్పటికీ అందులో ఎటువంటి కృత్రిమత్వం కనిపించకపోవటం గమనార్హం.
ఏ రచయితకయినా తాను చిత్రిస్తున్న జీవితం పట్ల గౌరవం నమ్మకం కూడా వుండాలి. ఆ జీవితాన్ని జీవిస్తున్న పాత్రల పట్ల గౌరవం కూడా వుండాలి. ఈ లక్షణాలన్నీ బషీర్‌లో పుష్కలంగా వుండటం వలన ఆయన ఆధునిక భారత చరిత్రలో ఒక ప్రముఖుడిగా నిలబడగలిగాడు.
బషీర్‌కు తాను చిత్రించిన స్త్రీ పాత్రల పట్ల అచంచలమైన గౌరవం వుంది. (లవ్ లెటర్) ''ప్రేమలేఖ'', ''బంగారు ఉంగరం'' లాంటి కథలను చూసినా ఈ విషయం అర్థమవుతుంది. ''ప్రేమలేఖ'' కథలో చాలా సందర్భాలలో బషీర్ స్త్రీలను ''ఖాళీ బుర్రలు'' అని హేళనగా ప్రస్తావిస్తుంటాడు. అయితే ఈ ప్రస్తావనలన్నీ సారమ్మ పాత్ర సృష్టిలో ఆయన చూపించిన నైపుణ్యం ఆ పాత్రకిచ్చిన వ్యక్తిత్వం మేధస్సు తార్కి జ్ఞానం, ప్రేమ లాంటి అంశాలు పరిగణనలోకి తీసుకున్నప్పుడు బషీర్‌కు స్త్రీలపట్ల వున్న గౌరవం స్పష్టమవుతుంది. ''బంగారు ఉంగరం'' కథలో కూడా భర్త తన భార్యను పనికిమాలినదని, తెలివి తక్కువదని అంటూ వుంటాడు. అయితే కథలో చాలా సందర్భాలలో ఆమె మేధస్సు ముందు భర్త ఓడిపోతూ వుంటాడు. నిజానికి బషీర్ స్త్రీ పాత్రల రూపకల్పనలో వాటికి నిర్థిష్టమైన వ్యక్తిత్వాన్ని ఇవ్వటంలో తన కాలం కంటే ముందే వున్నాడు. స్త్రీ పురుష సంబంధాల గురించి ముఖ్యంగా భార్యాభర్తల సంబంధం గురించి లోతైన అవగాహన వుంది. అతని పాత్రలన్నీ సంప్రదాయ ముస్లిం కుటుంబాలనుంచి వచ్చినటువంటివి. ఇవి అప్పుడప్పుడు 'బాలెన్స్' కోల్పోతుంటాయి. అయితే, కుటుంబ సంబంధాలను నిలుపుకొనేందుకు , అవి తమను తాము సరిదిద్దు కుంటుంటాయి. బషీర్ రాసిన 'అమ్మ' లాంటి కథలో కూడా ఈ విషయాలను గమనించవచ్చు. ఈ కథ స్వతంత్య్రోద్యమంలో పాల్గొనటానికి వెళ్లిన తన కొడుకు పట్ల తల్లికున్న ప్రేమను వ్యక్తం చేయటమేకాక ఆ కొడుకు కోసం ఆమె ఎదురు చూపుల్ని చిత్రించే క్రమంలో కథకుడు చాలా ఉచ్ఛస్థితికెళ్లి చిత్రించటం కనిపిస్తుంది. ''గోడలు'' అనే కథ బషీర్ రాసిన ఉత్తమ కథలలో ఒకటి. ప్రేమ అనే భావనను బషీర్ ఈ కథలో చాలా విస్తృతమైన అర్థంలో చూపిస్తాడు. నిజానికి ఎప్పుడూ కలవని ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడ్డ ప్రేమను చిత్రించిన కథ అదే కావచ్చు. ఈ ప్రేమికులు కలువకుండానే విడిపోయిన తర్వాత కూడా ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమను కాపాడుకోవడం అనేది గమనించదగిన అంశం. ఈ ప్రేమికులిద్దరు ఒక పెద్ద గోడ చేత విడదీయబడ్డ ఇద్దరు ఖైదీలని తెలిసినప్పుడు, ఈ కవి పట్ల పాఠకులలో ఆసక్తి మరింతగా పెరుగుతుంది. తాము ప్రేమలో వున్నామన్న భావాన్ని కాపాడుకోడానికి తాము జైలు నుంచి బయటకు వెళ్లి స్వేచ్ఛగా వుండే అవకాశాన్ని కోల్పోవటానికి సిద్ధమవుతారు. ప్రేమలేని స్థితిలో స్వేచ్ఛ వారికి అవసరంగా అనిపించదు. కథకుడు ఈ కథలో గోడను ఒక రూపకంగా చూపించారు. ప్రతి రూపకానికి బహుళార్థాలుంటాయి. అ లాగే ఈ కథకు కూడా.
ఈ లక్షణాల వల్లనే బషీర్ కథలలో, ఈ కతకి విశేషమైన పేరు వచ్చింది. పై పరిశీలన తర్వాత కథ వస్తు రూపాలలో, పాత్ర చిత్రీకరణలో ప్రాంతీయతను ప్రతిబింబించడంలో వ్యక్తుల జీవితాలను నడిపిస్తున్న ఆర్థిక అంశాల విశ్లేషణలో వ్యక్తిలోని ఔన్నత్యాన్ని పెంచటంలో ప్రేమకున్న ప్రాధాన్యతను ప్రతిబింబించడంలో బషీర్ చూపించిన ప్రతిభ అతన్ని ప్రపంచ కథా సాహిత్యంలో ఏ కథా రచయితకు తీసిపోని స్థాయిలో నిలబెట్టగలిగింది.
- డాక్టర్ కిన్నెర శ్రీదేవి,
( 'మిసిమి' మాస పత్రిక, ఏప్రిల్ 2011 సౌజన్యంతో )
బషీర్ కథలు
290 పేజీలు, వెల: రూ.100

Subscribe to:
Posts (Atom)