Thursday, September 19, 2019

ఇది రిజర్వేషన్ల దేశం

ఇది రిజర్వేషన్ల  దేశం 
రిజర్వేషన్ల గురించి భారతదేశంలో ఎప్పుడూ ఏదో ఒక మూల వివాదం నడుస్తూనే ఉంటుంది. రిజర్వేషన్ల అవసరాన్నీ లక్ష్యాన్నీ అర్థం చేసుకున్న మేధావులే తరచుగా ఆ వివాదాలను లేవదీసి సామాన్య ప్రజలను రెచ్చగొడుతూ ఉండటం పరిపాటి అయింది.
ప్రాచీన హిందూదేశంలో రిజర్వేషన్లు పొందిన వర్గాల సంగతి సరే. ఆధునిక భారతదేశంలో రిజర్వేషన్లు పొందుతున్నవారూ రిజర్వేషన్ల అమలు గురించి అసంతృప్తితోనే ఉన్నారు. రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాలంటున్నారు.
రాజ్యాంగ నిర్మాతల అసలు లక్ష్యాలను వెనక్కు నెట్టివేసి రిజర్వేషన్లను రాజకీయ అంశంగా మాత్రమే చూస్తున్న కొందరు చేస్తున్న వాదనలు విస్మయజనకంగా ఉన్నాయి.
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా దేశ జనాభాలో 13 శాతం కూడా లేని అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవలే భారత పార్లమెంటు చేసిన రాజ్యాంగ సవరణ పాలకవర్గాల ప్రయోజనాలకు అనువుగా రూపొందిందన్న విమర్శ వినవస్తున్నది. దేశ ప్రయోజనాలకు అవసరమైన ఎన్నెన్నో అంశాలు సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉండగా అగ్రవర్ణాల లోని పేదలకు రిజర్వేషన్ కల్పించే బిల్లు అత్యవసరంగా అతి తక్కువ వ్యవధిలో చట్టంగా తెచ్చారు. కేంద్ర మంత్రిమండలి 8-1-2019న బిల్లును ఆమోదించింది. మర్నాడే లోక్సభలో ప్రవేశపెట్టారు. మూడు నాలుగు గంటల చర్చతోనే ఆమోదించారు. మర్నాడు రాజ్యసభ దీనిని ఆమోదించింది. 103వ రాజ్యాంగ సవరణ అనంతరం ఈ బిల్లు 12-1-2019న ఆమోదం పొంది 14-1-2019 నుండి అమలులోకి వచ్చింది.
ఇది రిజర్వేషన్ల  దేశం 
బొజ్జా తారకం
208 పేజీలు, వెల: రూ.150/-
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ , బొజ్జా తారకం ట్రస్ట్
 ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
 ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com  

3 comments:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌