Thursday, September 19, 2019

టిపు సుల్తాన్

టిపు సుల్తాన్
మరణించిన 220 సంవత్సరా తర్వాత కూడా ఇప్పటికీ  తాజాగా వార్తల్లో ఉంటున్న వ్యక్తి టిపు సుల్తాన్‌. టిపు చరిత్ర 18వ శతాబ్దం ఉత్తరార్థపు భారతదేశ చరిత్ర. 1750లో జన్మించిన టిపు మే 4, 1799, అంటే 18వ శతాబ్దం ఇంకా ఎనిమిది నెల్లో ముగుస్తుందనగా మరణించాడు. టిపు మరణంతో 19వ శతాబ్దం మొదటి దశకంలో భారత దేశంలో ‘బ్రిటిష్‌ రాజ్‌’ నిరాఘాటంగా స్థాపించబడిరది. 1799లో టిపు మరణంతో  మైసూర్‌ రాజ్యం తన స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయి బ్రిటిష్‌ సామంత రాజ్యం అయ్యింది. తర్వాత, ఒకే ఒక  స్వతంత్ర రాజ్యంగా మిగిలిన మరాఠా రాజ్యం కూడా 1803లో అంటే టిపు మరణించిన నాలుగు సంవత్సలరాకు తన స్వాతంత్య్రాన్ని కోల్పోయి బ్రిటిష్‌ సామంత రాజ్యం అయ్యింది. 1818లో మరాఠాలు తమ స్వాతంత్రాన్ని తిరిగి పొందే ప్రయత్నం చేశారు. కానీ ఆ సంవత్సరం బ్రిటిష్‌ వారితో జరిగిన కోరేగావ్‌ యుద్ధంలో ఘోర పరాజయం పాలై తమ అస్తిత్వాన్నే కోల్పోయారు. మరాఠా రాజ్యం బ్రిటిష్‌ తూర్పు ఇండియా కంపెనీ సామ్రాజ్యంలో భాగమయ్యింది. పేష్వా బ్రిటిష్‌ వారి పింఛనుదారుడయ్యాడు.
  టిపు మరణవార్త తెలుసుకొని టిపుకు వ్యతిరేకంగా తరచూ ఆంగ్లేయుతో  సహకరించిన, అప్పుడు మరాఠా రాజ్యాన్ని నడిపిస్తున్న మరాఠా రాజకీయ దురంధరుడు నానా ఫడ్నవీస్‌ చెప్పిన భవిష్య వాణిని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ‘‘టిపు మరణించాడు. ఆంగ్లేయు బలం పెరుగుతుంది.ఇప్పటికే తూర్పు భారతమంతా వారి ఆధీనంలో ఉంది. తర్వాత పూనాయే వారి గురి. ముందు ముందు చెడ్డ రోజు రాబోతున్నాయి. తరాతను ఎవరూ తప్పించలేరు’’
టిపు సుల్తాన్
ఆంగ్లేయులకు తలవంచని వీరుడు
యర్లగడ్డ  నిర్మల 
160 పేజీలు, వెల: రూ.150/-
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ , బొజ్జా తారకం ట్రస్ట్
 ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
 ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com 

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌