Tuesday, September 10, 2019

తథాగతుని అడుగుజాడలు


తథాగతుని అడుగుజాడలు
విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న ప్రాచీన బౌద్ధ క్షేత్రాలతో మొదలుపెట్టి, బుద్ధుని జీవితగాథనూ, అతడు బోధించిన ధర్మ సూత్రాలనూ, దేశవిదేశాలలో బౌద్ధ ధర్మం విస్తరించిన క్రమాన్నీ, ఆరామ జీవనాన్నీ ఈ రచన పేర్కొంటుంది. ముఖ్యంగా బుద్ధుని బోధనల ఆధునికతనూ, సమకాలీనతనూ ఈ పుస్తకం పాఠకుల ముందుంచుతుంది. ఈ పుస్తకం బౌద్ధ క్షేత్రాలలో కనిపించే అవశేషాలపట్ల కుతూహలం కలిగిన సందర్శకులనూ, బౌద్ధంపట్ల ఆసక్తి ఉన్న పాఠకులనూ, తమ స్థానిక చరిత్రను తెలుసుకొనగోరే  ఔత్సాహికులనూ దృష్టిలో ఉంచుకొని వ్రాసినది. ఎంతో చారిత్రక విశిష్టతను కలిగిన బౌద్ధ అవశేషాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను పాఠకుల దృష్టికి తెస్తుంది.
తథాగతుని అడుగుజాడలు
రచన: 
రాణీ శర్మ ఈమని
ఉణుదుర్తి సుధాకర్

196 పేజీలు, వెల: రూ.200/-
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com 

1 comment:

  1. ఇంత మంచి పుస్తకం ఎప్పుడొస్తుంది అని ఎదురుచూస్తున్నాను ...

    ముకుంద రామారావు

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌