''ధైర్యవంతుడివా, మూఢాచారాలను వదిలించుకొని స్వేచ్ఛా జీవివి కా... సన్యాసులు భౌతిక శాస్త్రంలో అజ్ఞానులు. దీనికి కారణం వారు సరైన గ్రంథపఠనం చేయకపోవడమే. హేతువాదం మానవ జీవన విధానమైనట్లయితే మానవజాతి సమస్యలెన్నో అంతరించివుండేవి.''
- స్వామి వివేకానంద
...
సైన్సు తనకు తెలియని విషయాలను తెలియనివిగానే పరిగణిస్తుంది. తెలిసిన వాటికి సైద్ధాంతిక వివరణలను ఇస్తుంది. పాతసిద్ధాంతాలను సవాలుచేసే కొత్త సాక్ష్యాలు లభించినప్పుడల్లా వాటిని సవరించుకుంటుంది. ఇందులో భేషజాలకూ, పిడివాదాలకూ చోటుండదు. ప్రతిరోజూ కొత్త విషయాలు కొల్లలుగా బైటపడుతున్న ఈ కాలంలో వాటిని స్థూలంగానైనా సామాన్య పాఠకులకు వివరించడం సైన్సు రచయితల బాధ్యత...
...
''...అరచేతిలో సైన్స్ ... మన పాఠ్య పుస్తకాలు ఇలా వుంటే ఎంత బావుండేదనిపిస్తుంది... విషయం ఏదైనా చందమామ కథలంత సాఫీగా సాగిపోతుంది.''
- ఈనాడు
...
''ఈ పుస్తకం తెలుగు రచనల పరిధిని పెంచడానికి కాక విద్యార్థులు వీటిని చదివి సైన్స్ పట్ల ఇష్టాన్ని పెంచుకుని శాస్త్రవేత్తలుగా ఎదగడానికి తోడ్పడుతుంది. మరీ ముఖ్యంగా ప్రజలలో మూఢనమ్మకాల్ని తొలగించే హేతువాదాలకు, ప్రగతివాదాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది... సైన్స్‌లో లోతైన పరిజ్ఞానం లేనివారికి సైతం అరటిపండు ఒలిచిన చందంగా అవగాహన చేయించడం రచయిత రచనా కౌశలానికి నిదర్శనం.''
- స్వేచ్ఛాలోచన మాసపత్రిక
...
భౌతికవాదులూ, హేతువాదులూ అందరూ చదవదగ్గ విలువైన పుస్తకం. విద్యార్థులకూ, యువతీ యువకులకూ బహుమతిగా ఇవ్వదగ్గ సరళ రచన.
...
రచయిత కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ అణుభౌతిక శాస్త్రంలో పిహెచ్‌డి చేశారు. బాబా అణుకేంద్రంలోనూ, ఇసీఐఎల్‌లోనూ పనిచేశారు. వీరు రచించిన మనుషులు చేసిన దేవుళ్లు, అణువుల శక్తి పుస్తకాలను హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఇటీవలే ప్రచురించింది.
జీవశాస్త్రవిజ్ఞానం సమాజం
- కొడవటిగంటి రోహిణీ ప్రసాద్
పేజీలు : 175, వెల : రూ.100/-
తొలి ముద్రణ: జనసాహితి, 2008
పునర్ముద్రణ (హెచ్‌బిటి): జూన్ 2012
ప్రతులకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్ - 500006
ఫోన్: 040 23521849
EMail : hyderabadbooktrust@gmail.com

No comments:
Post a Comment