Thursday, July 26, 2012

Book Launch of "Bhimayanam" at 3 PM on 29th July 2012 ...



LAMAKAAN

Invites you to the
Book launch of Bhimayanam

A Graphic Biography in Telugu of Dr. B. R. Ambedkar

at 3 - 5 PM on 29th July 2012.

(English edition will also be discussed and available)



 Bhimayana is a graphic biography of Dr B.R. Ambedkar told in the Pardhan Gond art style by Durgabai Vyam and Subash Vyam, with story by Srividya Natarajan and S. Anand. 

This art—deploying thick outlines enclosing dotted, shaded space—is particularly well-suited to describe pain and wide-eyed incomprehension in the face of wanton cruelty. 

Bhimayana tells the story of a man who did not have to go to South Africa to experience discrimination, a man who has been relegated to being the ‘architect of the constitution’ in history books. While narrating Ambedkar’s experiences of untouchability, Bhimayana is also a robust exposé of caste in contemporary India. It is published in eight languages so far.

Bhimayana has been hailed by CNN.com as one of the Top 5 political graphic books ever published.

The Program involves Children’s interpretation of the book and Interaction with the co-Author.

The event is Open to all. 

And Entry is Free.

Come one. Come All.

 Venue: 

Lamakaan, 
Lane next to C-Bay bldg, 
Opposite GVK Mall, 
Road no.1, 
Banjara Hills, 
Hyderabad - 33 

Ph:9642731329. 

Bus route no.:222, 222A

అపరాజితుడితో ఓ ఆలింగనం ...

జీవించడమన్నది ఒక కళ. 
జీవన వ్యాపారంలో విజయం సాధించాలంటే ఈ కళను ఎరిగి ఉండడం అత్యవసరం’...  
బిభూతిభూషణ్ బందోపాధ్యాయ నవల అపరాజితుడు’ (బెంగాలీ మూలంఅపరాజితోకు అనువాదం కాత్యాయని) చివరి పేజీలలో కనిపించే పంక్తులివి. 

పథేర్ పాంచాలికి కొనసాగింపుగా వచ్చిన ఈ నవల జీవితంలోని మార్మికత, వైవిధ్యాలను ఆవిష్కరిస్తుంది. 

పట్టాల మీద పరుగెత్తే రైలును చూడ్డానికి రెల్లు పొదల మధ్య, వెలుగునీడల నడుమ తన అక్క దుర్గతో కలిసి అపూ (అపూర్వారాయ్) పరుగులు తీసే సన్నివేశం పథేర్ పాంచాలినవలలో చదివినా గానీ, అదే నవలను సినిమాగా మలిచిన సత్యజిత్‌రే సినిమాలో చూసినా గానీ మరపునకు రాదు. అపూ బాల్యం, తరువాత అతడు ఎదుర్కొన్న వాస్తవిక అనుభవం అనే రెండు పట్టాల మీద అపూ జీవనయానం సాగిపోతుంది ఈ నవలలో.

చిన్నతనంలో అక్కనీ, నిరుద్యోగంతో పోరాడుతూ కలకత్తా పురవీధులను కొలుస్తున్నపుడు తల్లి సర్వజయనీ కోల్పోతాడు. తను ప్రేమించిన వారు, తనని ప్రాణంలో ప్రాణంగా ప్రేమించిన వారు ఎక్కువ మంది అపూ కళ్ల ముందే చనిపోతారు. కాజల్(కొడుకు)ను కని చనిపోయిన తన భార్య అపర్ణ కూడా అందులో ఒకరు. ఆమె ఎంత అనూహ్యంగా తన జీవితంలో అడుగు పెట్టిందో అంతే అనూహ్యంగా నిష్ర్కమిస్తుంది. మనం ఎక్కడ చదువుకున్నా, పొట్ట చేత పట్టుకు ని ఎక్కడికి వెళ్లినా చివరికి తల్లి లాంటి సొంత పల్లె పట్టుకు చేరుకుంటే కలిగే సాంత్వన ఎలా ఉంటుందో రచయిత మన అనుభవానికి తెస్తాడు. ఇలాంటి జీవన సత్యాలు ఎన్నో ఇందులో!

జీవించే కళకు మనిషి దూరం కావడం మొదలైన దశలో వచ్చిన నవల ఇది. ఆ కళ గురించి రచయిత పడ్డ ఆరాటం గొప్పది. ఎంత దారిద్య్రంలో ఉన్నా, ఆ కళను ఉపాసించడానికి మనిషి తన వంతు కర్తవ్యం నిర్వహించాలన్నదీ, అందుకు పోరాడాలన్నదీ రచయిత ఉద్దేశంలా కనిపిస్తుంది. అందుకు దారిద్య్రం అడ్డం కాకపోవచ్చు. ఇందుకు ఆయన చూపించిన మార్గం, బహుశా చరిత్రలో నిరూపితమైన మార్గం-పఠనం. 

ఇక్కడ జ్ఞాన సముపార్జనకు, ఎదుగుదలకు అడ్డంగా నిలిచిన పాత విలువలను నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టడం కూడా తప్పుకాదన్నది రచయిత ఉద్దేశం. అపూర్వారాయ్‌కి చిన్నతనం నుంచి పుస్తకాలతో ఒక అనుబంధం కల్పించారు రచయిత. 
రవీంద్రనాథ్ టాగూర్, విక్టర్ హ్యూగో వంటి రచయితల పేర్లు అతడికి చిన్నతనంలోనే తెలుసు. జీవితం అనుభవాలతో నిండుతున్న కొద్దీ అతనిలో పెరుగుతున్న భావుకత తెచ్చుకున్న పరిణామం, పరిపూర్ణమవుతున్న భావాలనూ, స్థిరచిత్తాన్నీ రచయిత ఈ పాత్రను తీర్చి దిద్దే క్రమంలో అద్దిన తీరు సంభ్రమం కలిగిస్తుంది. మొత్తంగా ఒక తృష్ణతో జీవించే లక్షణాన్ని ఈ పాత్రలో పొందుపరిచారు బందోపాధ్యాయ. అదే అతనిని అలుపెరుగని పాంథుడిగా మార్చి, ఎక్కడెక్కడికో తిప్పుతుంది. రచయితగానూ తీర్చిదిద్దుతుంది.

దాదాపు ఆరు దశాబ్దాల క్రితం రూపొందిన అపూ పాత్ర ద్వారా నగరాల కాలుష్యం పట్ల ఏహ్యభావాన్ని వ్యక్తీకరించడం అద్భుతమే. 

 పస్తులున్న రోజులు, అవమానాలు పడ్డ ఘడియల నుంచి తను బయటపడి జీవితాన్ని కొనసాగిం చడానికి కారణం తన పల్లె పసితనంలో నోట్లో చిలకరిం చిన అమృతబిందువులేఅని మనసారా భావిస్తాడు అపూ. ఆ వారసత్వం కొనసాగాలనుకుంటాడు. తన పల్లెలో కొడుకు కాజల్‌ను వదిలిపెట్టి అపూ ఫిజీలో ఉపా ధ్యాయ ఉద్యోగానికి వెళ్లడం అందుకే. 
అంటే ఈ నవలలో ఒక్కొక్కతరం గుండా ప్రవహిస్తూ వచ్చిన అజరామర మైన జీవన మార్మికతను రచయిత అక్షరబద్ధం చేశారు.

అపరాజితుడు
బిభూతిభూషణ్ బందోపాధ్యాయ
హైదరాబాద్ బుక్ ట్రస్ట్  
పే.197, వెల రూ.100/-

సాక్షి దినపత్రిక (౨౩ ౭ ౨౦౧౨) సౌజన్యం తో ...

Friday, July 20, 2012

Book Review on Bhandaru Acchamamba Satcharitra in The Hindu ..


 Bhandaru Acchamamba Satcharitra

This is a brief biography of Bhandaru Acchamamba, perhaps the first story writer, and indeed the first women’s historian in Telugu. 

Within 8 chapters the author Kondaveeti Satyavati tries to given insight into the short (30 year long) life of a woman who not only wrote several stories and attempted a history of women across India, but was also a staunch supporter of the Swadeshi movement and was a an asocial worker. 

Her writings in Telugu are all the more remarkable as she lived in the State for a very short period of time and had managed to balance her personal domestic life with her strong feminist thinking.


For copies contact 
Hyderabad Book Trust, 
Flat no 85, Balajinagar, 
Gudimalkapur, Hyderabad 500006, 

Price: Rs. 50


Courtesy: The Hindu, 20 July 2012
 

ధిక్కార స్వరం ...!

ఇస్మత్ చుగ్తాయ్ కథల పై సాక్షి సమీక్ష ...తేది 16 7 2012




Thursday, July 19, 2012

గురజాడ కంటే ముందే తొలి తెలుగు కథ రాసిన భండారు అచ్చమాంబ సచ్చరితను తెలుసుకోవాలని ఉందా? పుస్తకం దొరకడం సమస్యగా ఉందా ? దిగులు పడకండి. బండారు అచ్చమాంబ సచ్చరిత ఈ బుక్ కూడా అప్పుడే వచ్చేసింది.!


తెలుగు సాహిత్యంలో చిరకాలంగా విమర్శకుల విస్మరణకు గురైన తొలి స్త్రీవాది భండారు అచ్చమాంబ.

తెలుగులో తొలి కథ రాసి, తొలిసారి స్త్రీల చరిత్రని స్త్రీవాద దృక్పథంతో దండ గుచ్చిన ఘనత కూడా అచ్చమాంబదే. స్త్రీల కోసం సంఘాలు నిర్మించడంలోనూ ఆమె ఆద్యురాలుగా నిలిచింది. వివిధ రంగాలలో ప్రసిద్ధులైన భారత స్త్రీల చరిత్రలను అనేక భాషల నుంచి సేకరించి, అవువదించి 1903లోనే అబలా సచ్చరిత్ర రత్మమాలను రాసింది. వైదిక పౌరాణిక, బౌద్ధ స్త్రీల చరిత్రలను గ్రంథస్తం చేయాలనే మెగా ప్రణాళికను సిద్ధం చేసుకున్న అచ్చమాంబను అది పూర్తికాకముందే మృత్యువు కబళించడం మహా విషాదం.
 
వందేళ్ళ క్రితమే స్త్రీల స్థితిగతుల గురించి ఎంతో అత్యాధునికంగా ఆలోచించి, స్త్రీల అభ్యున్నతి కోసం అహరహం కలవరించి, పలవరించిన అచ్చమాంబ ఆనాటి స్త్రీల పరిస్థితి పట్ల తన ఆవేదనను, అంతరంగ ఘోషను కథలుగా, వ్యాసలుగా, చరిత్రగా, ఉపన్యాసాలుగా మలుచుకున్న తీరు అమోఘం, ఆశ్చర్యకరం కూడా. దాన్ని సవివిరంగా చర్చించిందీ పుస్తకం.
 
కొండవీటి సత్యవతి, ఫెమినిస్ట్, జర్నలిస్ట్, రైటర్.

ముప్ఫై సంవత్సరాల స్త్రీల ఉద్యమంలో మమేకమయ్యారు. తెలుగులో వస్తున్న
ఏకైక స్త్రీవాద పత్రిక 'భూమిక' వ్యవస్థాపక సభ్యులే కాక ఇరవై సంవత్సరాలుగా సంపాదకురాలు. సమస్యల్లో ఉన్న స్త్రీల కోసం భూమిక హెల్ప్‌లైన్ నడపడంతో పాటు స్త్రీలకు సకల సహాయాలు అందించాల్సిన ప్రభుత్వ శాఖలు జండర్ స్పృహతో పనిచేసేలా కృషి చేస్తున్నారు.
 
ఇప్పటివరకూ ఆమె"కల", "మెలకువ సందర్భం" పేర్లతో రెందు కథా సంపుటాలు వెలువరించారు. అంకితం, భూమి హక్కులు, (ఆర్‌డిఐ) సంకలనాలు, గృహహింస చట్టం మీద సంక్షిప్త పుస్తకం, భూమిక సంపాదకీయాలు, ప్రయాణ అనుభవాలు మొదలైన పుస్తకాలు వెలువడ్డాయి.

భండారు అచ్చమాంబ సచ్చరిత "ఈ బుక్" కోసం ... కినిగే డాట్ కాం ... సందర్శించండి.

ఇది కాక మరెన్నో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పుస్తకాలు ఇప్పుడు కినిగే డాట్ కాం  వద్ద "ఈ బుక్స్ " రూపం లో లభిస్తున్నాయి.  




 

Saturday, July 14, 2012

అంబేడ్కర్‌ చేయిపట్టుకుని ప్రకృతి సహజమైన గోండుల చిత్రకళా ప్రపంచంలో విహరిద్దాం రండి !


భీమాయణం ఒక సాదా సీదా గ్రాఫిక్‌ పుస్తకం కాదు.
కంప్యూటర్‌ మాయాజాలంతోనో, మూసపోసినట్టుండే ఆధునిక చిత్రలేఖనంతోనో రూపొందించింది అసలే కాదు. 
ప్రతి పేజీ ఆదివాసీ గోండు 'డిగ్న'లతో,  ప్రకృతిని ప్రతీకాత్మకంగా ప్రతిబింబించే బొమ్మలతో అ లంకరించబడ్డ ఒక అపూర్వ కళాఖండం.
పర్యావరణంతో గాఢంగా పెనవేసుకుపోయిన గోండు చిత్రకళతో ఒక పుస్తకం వెలువడటం మన దేశంలో ఇదే ప్రథమం.
ఇందులోని చిత్రాలను వేసింది పార్థాన్‌ గోండు చిత్రకారులైన దుర్గాబాయ్‌ వ్యాం, సుభాష్‌ వ్యాం దంపతులు.
ప్రస్తుతం భోపాల్‌లో నివసిస్తున్న వీరికి కూడా ఇదే తొలి పూర్తి స్థాయి గ్రాఫిక్‌ పుస్తకం.

దుర్గాబాయి వ్యాం ఆరేళ్ల వయసు నుంచే 'డిగ్న'లు వేస్తున్నారు.
పండగలప్పుడు, పెళ్ళిళ్లప్పుడు రకరకాల రంగురంగుల మట్టిని ఉపయోగించి ఆదివాసీలు తమ ఇంటి గోడలపై వేసుకునే బొమ్మలనూ, డిజైన్లనే 'డిగ్న'లు అంటారు.
దుర్గాబాయి చాలా పిల్లల పుస్తకాలకు ముఖచిత్రాలు వేశారు.
ది' నైట్‌ లైట్‌ ఆఫ్‌ ట్రీస్‌ ' అనే పుస్తకానికి 2008లో 'బలోజ్ఞ రాగిజ్ఞ ప్రైజ్‌' అందుకున్నారు.
గోండు దేవుళ్ల దగ్గర నుంచి భోపాల్‌ గ్యాస్‌ విపత్తు వరకూ రకరకాల ఇతివృత్తాల మీద బొమ్మలు వేశారు.
ఈ పుస్తకానికి పనిచేస్తున్నప్పుడు ఒకసారి ఆమె రచయిత ఆనంద్‌తో యదాలాపంగా 'ఇదేదో పెద్ద రామాయణంలా వుందే' అన్నారు.
ఆమె మాటలే ఈ పుస్తకానికి 'భీమయణం' అని పేరుపెట్టడానికి స్ఫూర్తినిచ్చాయి.


సుభాష్‌ వ్యాం కూడా పదేళ్ల వయసునుంచే మట్టి బొమ్మలు తయారుచేయడం మొదలుపెట్టారు.
చెక్కలతో శిల్పాలు చెక్కడంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించారు.
అయితే వాటిని కొనేవారు లేకపోవడంతో దానిని వదిలేసి
బట్టల మీదా కాగితాల మీదా బొమ్మలు వేయడం ప్రారంభించారు.
ఈ దంపతులిద్దరూ పెద్దగా చదువుకోకపోయినా తమ చిన్న ఇంట్లోనే
ఎంతో మంది గోండు చిత్రకారులను విజువల్‌ ఆర్టిస్టులుగా తీర్చిదిద్దుతూ ఆదివాసీ చిత్రకళకు తమవంతు సేవ చేస్తున్నారు.

పార్థాన్‌ గోండుల చిత్రకళ పర్యావరణంతో ఎంత గాఢంగా పెనవేసుకుందంటే ... పట్టణ జీవితం గురించిన సందర్భాల్లో కూడా సువిశాల దృశ్యాలూ, వాటిలో జంతువులూ, పక్షులూ, చెట్ల వంటివి ఎంతో సహజంగా వచ్చి చేరతాయి.
రైలు - పాము అవుతుంది...
దర్పం ఉట్టి పడే కోట - సింహం అవుతుంది...
దప్పిక గొన్న బాల అంబేడ్కర్‌ - చేపలా మారిపోతాడు...
సొంతగా నుయ్యి తవ్వుకుంటున్నందుకు ఓ దళితుడు హత్యకు గురైన సంఘటనను వివరించేటప్పుడు - మట్టి తవ్వే యంత్రమే కన్నీళ్లు రాలుస్తుంది...
బరోడాలో తలదాచుకునే చోటు దొరక్క కామతి పార్కులో కూర్చుని, తన దుస్థితి గురించి ఆలోచిస్తున్న అంబేడ్కర్‌ - ఏకంగా తనే పార్కుగా మారిపోతాడు....
అంబేడ్కర్‌ దేశదేశాలు తిరిగొచ్చినా చివరికి స్వదేశంలో ఎక్కడివాడక్కడే ఉన్నాడని చెప్పేందుకు ప్రతీకాత్మకంగా 'గానుగెద్దు' బొమ్మను వేశారు.

ఇలా చూసిన ప్రతిసారీ ఈ పుస్తకంలోని ప్రతి పేజీలోనూ మీకు కొత్త కొత్త అంశాలూ, కొత్త కొత్త అర్థాలూ, సరికొత్త ఆనందాలూ దొరుకుతుంటాయి;
అవి చూడటమెలగో కూడా నేర్పుతుంటాయి.
బొమ్మకూ బొమ్మకూ మధ్య వుండే ఖాళీని కూడా వీరు ఎంతో సృజనాత్మకంగా ఉపయోగించుకున్నారు.
ఆధునిక చిత్రకళలో మున్నెన్నడూ చూడని అద్భుత ప్రయోగమిది.


అగ్రవర్ణంలో పుట్టిన గాంధీకి దక్షిణాఫ్రికా వెళ్లాక గానీ 'జాతి వివక్ష' ఎలా వుంటుందో తెలిసిరాలేదు.
అంటరానికులంలో పుట్టిన అంబేడ్కర్‌కు విదేశాలకు వెళ్లాక గానీ 'సామాజిక సమానత్వం' ఎలా వుంటుందో అనుభవంలోకిరాలేదు.
జాతి వివక్షపై పోరాడి విజయం సాధించిన గాంధీకి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది.
విదేశాల నుంచి తిరిగి వచ్చాక అంబేడ్కర్‌కు అడుగడుగునా అంటరానితనం ఎప్పటిలాగే అడ్డంకులు సృష్టించింది.
అస్పృశ్యుడైనందువల్లనే అంబేడ్కర్‌ చరిత్ర తగిన స్థానం కల్పించలేదు.
ఆ లోపాన్ని పట్టి చూపేందుకు, అంబేడ్కర్‌ కథను సార్వజనీనం చేసి, ప్రపంచానికి తెలియజెప్పేందుకు చేసిన చిన్న ప్రయత్నమే ఈ 'భీమాయణం'.

ఇప్పటికే ఈ పుస్తకం ఇంగ్లీషు నుంచి హిందీ, మరాఠీ, తమిళం, మలయాళం, కన్నడ, ఫ్రెంచి, స్పానిష్‌, కొరియన్‌ భాషల్లోకి అనువాదమయింది. ఇంకా అనేక భాషల్లో అనువాదమవుతోంది.

ఈ పుస్తకంపై కొన్ని సమీక్షలు:

సంప్రదాయిక కళాకారుల కళామాధ్యమాన్ని ఎంత వినూత్నంగా మలుస్తారో, దానిని ఎలా పునరుత్తేజపరుస్తారో కళ్లకు కడుతుందీ భీమాయణం. న్యాయం కోసం అంబేడ్కర్‌ చేసిన అభ్యర్థనను మనోజ్ఞంగా, మనసుకు హత్తుకునే డాక్యుమెంటరీ లాగా మరోసారి ఇందులో ఆస్వాదించవచ్చు.
- పాల్‌ గ్రావెట్‌,
 టైమ్స్‌ లిటరరీ సప్లిమెంట్‌


భారతీయ సమాజంలో, హిందూ కుల వ్యవస్థలో వున్న ఏహ్యమైన, అత్యంత కిరాతకమైన లక్షణాలను భీమాయణం అద్భుతంగా, సులభశైలిలో, అక్కడక్కడా వినోదాన్ని మేళవించి చిత్రించింది. సాధారణమైన బొమ్మలు, సూటిగా వుండే సందేవాలు అసంకల్పితంగానే మీ చేత కంటతడి పెట్టిస్తాయి. మీకు కోపం తెప్పిస్తాయి. సంతోషపరుస్తాయి. ఆహ్లాదం కలిగిస్తాయి.. ఇందులోని పేజీలన్నీ పక్షులూ, జంతువులూ, పాములూ, చేపలతో నిండి వున్నాయి. కచ్చితంగా చెప్పాలంటే కథ ఒక పేజీ నుంచి మరో పేజీకి ఒక నీటి ప్రవాహంలా సాగిపోతుంది.
-క్రేర్‌ డోయెల్‌,
సోషలిస్ట్‌ వరల్డ్‌
(కమిటీ ఫర్‌ వర్కర్స్‌ ఇంటర్నేషనల్‌ మంత్లీ)


కుల వివక్షపై వచ్చిన అద్భుత సచిత్ర పుస్తకం. ఇందులోని బొమ్మలూ, పేజీల లేఅవుట్లూ విస్మయానికి గురిచేస్తాయి. పరిపూర్ణంగా అర్థం చేసుకునేందుకు... చూసిన చిత్రాన్నే మళ్లీ మళ్లీ చూసేలా చేస్తాయి.
- జై అర్జున్‌ సింగ్‌,
సండే గార్డియన్‌


అప్పుడే అందిన కవర్‌లోంచి భీమాయణం పుస్తకాన్ని బయటకు తీయగానే దాని రూపం నన్ను మంత్రముగ్ధుణ్ని చేసింది. మూడేళ్లయినా నిండని మా పాపను కూడా ఈ పుస్తకం ఎంతగానో ఆకర్షించింది. స్వతంత్ర భారతదేశపు అత్యంత విషాదకరమైన అంశం గురించి పిల్లల్నీ ఆలోచింపజేయడంలో, ప్రశ్నించేలా, ప్రతిస్పందించేలా చేయడంలో భీమాయణం విజయవంతమయిందంటే అందుకు కారణం అంబేడ్కర్‌ కథతోపాటు అంతే ప్రాధాన్యతతో చరిత్ర అట్టడుగు పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చిత్రించడమే. మనసును పట్టి కుదిపే ఒక అసాధారణమైన నాయకుడి ఈ ఆత్మకథను మన దేశంలోని పిల్లలూ పెద్దలూ ప్రతి ఒక్కరూ చదవాలి. దీనిని మన పాఠశాలల్లో తప్పనిసరిగా పాఠ్యాంశంగా చేర్చాలి.
- సౌమ్య శివకుమార్‌,
ది హిందూ


చిత్రకారులు దుర్గాబాయి వ్యాం, సుభాష్‌ వ్యాం పాశ్చాత్య  శైలినీ, జపాన్‌ తరహా 'మాంగా' కామిక్‌ పుస్తకాల సూత్రాలనన్నింటినీ ధైర్యంగా ధిక్కరించి తమదైన పార్థాన్‌ గోండ్‌ వారసత్వ సంప్రదాయ శైలిని అద్భుతంగా చిత్రించారు.
ఓ 'అస్పృశ్యుడు' గాంధీని సైద్ధాంతికంగా, సమర్థంగా ఎదుర్కొన్నవాడు, భారతదేశపు అతిగొప్ప, ధీరోదాత్తమైన నేతల్లో ఒకరైన అంబేడ్కర్‌ జీవిత చరిత్రను గ్రాఫిక్‌ శైలిలో పూర్తి విభిన్నంగా తీర్చిదిద్దేందుకు వ్యాంల గోండు కళ చక్కగా అక్కరకొచ్చింది. అడుగడుగునా ప్రతీకలు, కళా విన్యాసాలతో 'భీమాయణం' సంప్రదాయ శైలీ నియమాలన్నింటినీ సవాల్‌ చేస్తూ అసలు అంబేడ్కర్‌ ఎవరో, కుల వ్యవస్థ గురించి ఆయన వ్యక్తం చేసిన విప్లవాత్మక భావాలకు నేటికీ ఎందుకంత ప్రాధాన్యం ఉందో బలంగా తెలియజెపుతోంది.
- జో శాక్కో
('పాలస్తీనా' పుస్తక రచయిత)

భారతదేశపు అతి ముఖ్య మేధావుల్లో ఒకరైన అంబేడ్కర్‌ జీవిత కథ... దశాబ్దాలుగా పనిగట్టుకునే మరుగుపరచబడుతోంది.
దాన్నిప్పుడీ  'భీమాయణం' ఎంతో అసాధారణమైన అందంతో మన ముందుకు తెస్తోంది. దీన్ని మరచిపోవడం అసాధ్యం.
అరుంధతీ రాయ్‌
(గాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ థింగ్స్‌' రచయిత్రి)


భీమాయణం
అంటరానితనం అనుభవాలు
భీమ్‌రావ్‌ రామ్‌జీ అంబేడ్కర్‌ నిజ జీవిత సంఘటనలు

కథనం: శ్రీవిద్య నటరాజన్‌, ఎస్‌. ఆనంద్‌
చిత్రలేఖనం: దుర్గాబాయి వ్యాం, సుభాష్‌ వ్యాం

ఆంగ్ల మూలం: Bhimayana: Experiences of Untouchablity by Navayana Publishing in 2011.
తెలుగు అనువాదం: డి. వసంత


1/4 డెమీ సైజులో పంచవన్నెల చిత్రాలతో 107 పేజీలు, వెల: కేవలం రూ.200/- మాత్రమే.

ప్రచురణకర్తలు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
నవయాన్‌








Wednesday, July 11, 2012

రామాయణం కాదు .. సరికొత్త... సచిత్ర ... ''భీమాయణం'' ...'అంటరానితనం అనుభవాలు' ... భీమ్‌రావ్‌ రామ్‌జీ అంబేడ్కర్‌ నిజ జీవిత సంఘటనలు ... చిత్రకళ: దుర్గాబాయి వ్యాం, సుభాష్‌ వ్యాం... కథనం: శ్రీ విద్య నటరాజన్‌, ఎస్‌. ఆనంద్‌ ... తెలుగు అనువాదం : డి. వసంత ...

భీమాయణం

ఇదో అద్భుత పుస్తకం... బాధలు, సహానుభూతులు నిండిన తరతరాల ఆర్ద్రమైన దైహిక అనుభవాల సమాహారం.
- జాన్‌ బెర్జర్‌ ('పాలస్తీనా' పుస్తక రచయిత)

భారతదేశపు అతి ముఖ్య మేధావుల్లో ఒకరైన అంబేడ్కర్‌ జీవిత కథ... దశాబ్దాలుగా పనిగట్టుకునే మరుగుపరచబడుతోంది. దాన్నిప్పుడు ఈ ''భీమాయణం'' ఎంతో అసాధారణమైన అందంతో మన ముందుకు తెస్తోంది. దీన్ని మరచిపోవటం అసాధ్యం.
- అరుంధతీ రాయ్‌ (బుకర్‌ ప్రైజ్‌ విజేత 'గాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ థింగ్స్‌' రచయిత్రి)

భారతదేశంలో అంటరానివారిగా జీవించటమంటే ఏమిటి?
భారతీయుల్లో కొందరు తమ సాటివారిని ఎందుకు ముట్టుకోరు?
భారతదేశపు విప్లవాత్మక సంస్కర్తల్లో అగ్రగణ్యులైన భీమ్‌రావ్‌ రామ్‌జీ అంబేడ్కర్‌ (1891-1956) ఒక అస్పృశ్యుడిగా తాను ఎదుగుతున్నక్రమంలో ఎదుర్కొన్న అనుభవాలను అక్షరబద్ధం చేశారు.
పదేళ్ల వయసులో స్కూల్‌లో,
కొలంబియా యూనివర్సిటీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత బరోడాలో,
ప్రయాణాల్లో...
ఇలా ఎన్నోచోట్ల చాలా 'సర్వసాధారణంగా' తాను వివక్షను ఎదుర్కొన్న తీరును వివరించారు అంబేడ్కర్‌.
ప్రతికూలతలకు ఎదురొడ్డి అంబేడ్కర్‌ భారత రాజ్యాంగ ముసాయిదా రాశారు.
తర్వాత బౌద్ధమతాన్ని స్వీకరించారు.
నాడు అంబేడ్కర్‌కు ఎదురైన అనుభవాల్లాంటివే
నేడు భారతదేశంలోని 17 కోట్ల మంది దళితులనూ వెన్నాడుతూనే వున్నాయి.
ఇప్పటికీ వారికి ప్రాథమిక అవసరాలైన నీరు, నీడ వంటివి తిరస్కరింపబడుతూనే వున్నాయి.

ఈ వినూత్న ప్రయత్నంలో పార్థాన్‌ గోండు చిత్రకారులైన దుర్గాబాయి వ్యాం, సుభాష్‌ వ్యాంలు మహద్‌ సత్యాగ్రహం వంటి చారిత్రక ఘట్టాలను నేటి సమకాలీన భారత సమాజంలోని ఘటనలతో కలగలిపి కథ అ ల్లటం విశేషం.

సంప్రదాయ బొమ్మల, గ్రాఫిక్‌ పుస్తకాల వ్యాకరణాన్ని ధిక్కరిస్తూ, తమదైన మాంత్రిక కళను ఇతిహాస స్థాయిలో రూపుకట్టిస్తూ గ్రాఫిక్‌ కళా రంగానికే ఒక కొత్త నుడికారాన్నీ, సరికొత్త జవజీవాలనూ అందించారు.

భీమాయణం ...
- 'జీవితంలో తప్పనిసరిగా చదవాల్సిన 1001 కామిక్స్‌'
పుస్తకాల్లో
స్థానం సంపాదించుకుంది.
- సిఎన్‌ఎన్‌ ప్రకటించిన 'ఐదు అత్యుత్తమ రాజకీయ కామిక్స్‌ పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది.
- 2011 సంవత్సరానికి గాను 'ఫ్రీడమ్‌ టు క్రియేట్‌' అవార్డుకు సిఫారసు చేయబడింది.
- 2012 'ద వైట్‌ రావెన్స్‌' అవార్డు పరిశీలనకు ఎంపికైంది.

ఇంగ్లీషులో విశేష ఆదరణ పొందిన ఈ పుస్తకం
కన్నడ, హిందీ, మరాఠీ, తమిళం, మలయాళం, స్పానిష్‌ , ఫ్రెంచ్‌, కొరియన్‌ భాషల్లోకి
కూడా అనువాదమయింది.

తప్పక చదవండి:

భీమాయణం

భీమ్‌రావ్‌ రామ్‌జీ అంబేడ్కర్‌ నిజ జీవిత సంఘటనలు, అనుభవాలు

చిత్రకళ: దుర్గాబాయి వ్యాం, సుభాష్‌ వ్యాం
కథనం: శ్రీ విద్య నటరాజన్‌, ఎస్‌. ఆనంద్‌
ఆంగ్లమూలం: Bhimayana: Experiences of Untouchability by Navayana Publishing, 2011.

తెలుగు అనువాదం : డి. వసంత
1/4 demy 107 పేజీలు, వెల : రూ. 200/-

ప్రచురణ కర్తలు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ &
నవయాన

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849
E Mail: hyderabadbooktrust@gmail.com


హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పుస్తకాలను ఇప్పుడు మీరు " ఫ్లిప్ కార్ట్ " ద్వారా ఆర్డర్ చేసి నేరుగా ఇంటికే తెప్పించుకోవచ్చు. ఎలాంటి అదనపు రవాణా చార్జీలు లేకుండా!

వివరాలకు ...ఇక్కడ ... క్లిక్ చేయండి !

Tuesday, July 10, 2012

ప్రాచీన భారతదేశ చరిత్ర - డి. డి. కోశాంబి పరిచయం - కె. బాలగోపాల్‌ ...

శాస్త్రీయ దృక్పథంతో భారత చరిత్రకు జీవం పోసిన విఖ్యాత చరిత్రకారుడు డి. డి. కోశాంబి ని తెలుగు పాఠకులకు పరిచయం చేస్తూ ఆలోచనాపరుడు, ప్రగతిశీల మేధావి కె. బాలగోపాల్‌ రాసిన విలువైన పుస్తకమిది.

ఆదిమ కాలం నుంచి భూస్వామ్య దశ వరకు ప్రాచీన భారత చరిత్ర గురించి కోశాంబి చూపించిన చిత్రాన్ని వివరించే ప్రయత్నం చేస్తుంది. శాస్త్రీయంగా భారత దేశ ప్రాచీన చరిత్రను అధ్యయనం చేయదలచుకున్న వారు ఎవరైనా కోశాంబి ప్రతిపాదించిన భౌతిక చోదక క్రమాన్ని ప్రాతిపదికగా తీసుకోక తప్పదు.

కోశాంబి భగవద్గీత మీద రాసిన వ్యాసాన్ని చదివే తను మార్క్సిస్టునయ్యాననీ; ఆ రుణాన్ని ఈ పుస్తకం రూపంలో తీర్చుకున్నాననీ చెప్పారు బాలగోపాల్‌.

వలసతత్వం, శృతిమించిన 'దేశభక్తి', సంప్రదాయకత, అగ్రవర్ణ ఆధిక్యత, విశృంఖలమైన ఊహాతత్పరత మొదలైన అవలక్షణాల నుంచి మన దేశ చరిత్రను కోశాంబి రక్షించాడు అంటారాయన. కొడవటిగంటి కుటుంబరావు అన్నట్టు చరిత్ర గురించి శాస్త్రీయంగా ఆలోచించడం నేర్చుకుంటే అన్ని విషయాల గురించి శాస్త్రీయంగా ఆలోచించగలుగుతాం.

ఈ పుస్తకం తొలి ముద్రణ 1986లో వెలువడింది. ఆతరువాత 1992, 1995, 2000, 2009, 2012ల్లో పునర్ముద్రణ పొంది అశేష పాఠకులకు ఆకట్టుకుంది. ఇంకా ఆకట్టుకుంటూనే వుంది.
తప్పక చదవండి.

ప్రాచీన భారతదేశ చరిత్ర డి. డి. కోశాంబి పరిచయం
- కె. బాలగోపాల్‌
పేజీలు 196, వెల : రూ. 80/-


కినిగే డాట్ కాం లోఇప్పుడు ఈ పుస్తకం " E BOOK"  రూపం లో లభిస్తోంది:
ఇక్కడ క్లిక్ చేయండి:
ప్రాచీన భారత దేశ చరిత్ర " ఈ బుక్ "


.

Friday, July 6, 2012

అణువుల శక్తి - కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ ...


ప్రస్తుత కాలంలో అణుశక్తిని గురించి మనసు ఆలోచింపజేసే విషయాలు విద్యుదుత్పాదనా, అణుయుద్ధాలూ, తీవ్రవాదుల వల్ల అణుపదార్థాల ప్రమాదాలూ వగైరాలే. అటువంటి ఆసక్తితో ఈ పుస్తకం చదవగోరే వారికి కొంత ప్రాథమిక పరిజ్ఞానం అవసరమవుతుంది. అందువల్ల ఇందులో అణుసిద్ధాంతం మూలాల దగ్గర్నుంచీ బృహదణువులూ, రియాక్టర్ల విశేషాలదాకా క్లుప్తంగా, తేలిక భాషలో వివరించడానికి ప్రయత్నించాను.
- కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

పదార్థాలన్నీ అణువులమయమే అనడానికి ఆధారాలేమిటి?
అణుసిద్దాంతం ఎప్పుడు మొదలై, ఏయే రూపాలు సంతరించుకుంది?
నానో టెక్నాలజీ అంటే ఏమిటి?
అణుశక్తి ఎలా విడుదల అవుతుంది? దానికి ఎన్ని రూపాలున్నాయి?
అణువుల అస్థిరత రేడియో ధార్మికతకు ఎలా దారితీస్తుంది? అందులోని ప్రమాదాలేమిటి?
అణ్వస్త్రాలు ఎలా పనిచేస్తాయి? వాటిని ఎలా నిర్మిస్తారు?
చెర్నోబిల్‌, ఫుకుషిమా వంటి అణు రియాక్టర్లలో ప్రమాదాలు ఎందుకు ఎలా తలెత్తాయి?
అణువిద్యుత్తు గురించిన భయాందోళనలు సమంజసమైనవేనా?
వంటి అనేక ప్రశ్నలకు ఈ పుస్తకం సమాధానాలిస్తుంది.

అణువుల శక్తి
- కొడవటిగంటి రోహిణీప్రసాద్‌
పేజీలు : 192, వెల : రూ. 100/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849

అపరాజితుడు ... రచన: బిభూతిభూషణ్‌ బందోపాధ్యాయ ... తెలుగు అనువాదం: కాత్యాయని ...

బిభూతిభూషణ్‌ బందోపాధ్యాయ ప్రసిద్ధ నవల ''పథేర్‌ పాంచాలి'' రెండో భాగమే ఈ 'అపరాజితో' (అపరాజితుడు). ఈ రెండు నవలలనూ కలపి 'పథేర్‌ పాంచాలి', 'అపూర్‌ సంసార్‌', 'అపరాజితో' అనే మూడు కళాఖండాలుగా మలిచాడు సత్యజిత్‌ రే.

ప్రపంచంపై ముసురుకుంటున్న యుద్ధ మేఘాలు, బెంగాల్‌ కరువు, ఛిన్నాభిన్నమవుతున్న గ్రామీణ వ్యవస్థ, బీటలు వారుతున్న భూస్వామ్య సమాజం, పర్యావరణ విధ్వంసం, పల్లెల నుండి పట్నాలకు వలసలు, తెగిపోతున్న మానవ సంబంధాలు - ఈ నేపథ్యంలో బతుకు పోరాటం సాగిస్తూ జీవన మార్మికతనూ, తాత్వికతనూ శోధించే వ్యక్తుల జీవిత చిత్రణ ఈ నవల.

బిభూతిభూషణుడి జీవన దృక్పథానికి అచ్చమైన ప్రతిబింబమే - అపూ. కష్టాలూ కన్నీళ్లూ ముసురుకుంటున్న చీకట్ల నడుమ నుండి ఒక చిరు దీపాన్ని చేతబట్టుకుని జీవిత సాఫల్యానికై నిరంతరాన్వేషణ సాగించడమే బిభూతి భూషణుడి తాత్వికత. అతడి రచనలన్నిటికీ అంతిమ సారాంశం ఇదే.

తాను కోల్పోయిన జీవితానందాన్ని కేవలం జ్ఞాపకాల వడపోతలకు కుదించకుండా కలకత్తా నగర కాలుష్యం నుండి నిశ్చిందిపురానికి, ఇచ్ఛామతీ నదీ తీరానికి తన కొడుకు కాజల్‌తో కలిసి పయనమవుతాడు అపూ. ప్రకృతిలోని నిరంతరత్వాన్నీ, జీవన కాంక్షనూ మానవ జీవితంలోనికి అనువదించుకునే అద్భుతమైన కళను కొత్తతరానికి అందించే ప్రక్రియను అపూ ఇలా ప్రారంభించాడు. అక్కడితో నవల పూర్తవుతుంది...
పాఠకుల ఆలోచనల వికాసం ప్రారంభమవుతుంది!

అన్ని మానవీయ విలువలనూ చిదిమివేసే కటిక పేదరికంలో, నిరాశలో సైతం అపూ తాను నిటారుగా నిలబడుతూ తన సాన్నిహిత్యంలోకి వచ్చిన వ్యక్తులకు భౌతికంగానో, ఆత్మికంగానో ఆసరాగా నిలిచేందుకు తపిస్తాడు. కాస్తంత వెసులుబాటు దొరికితే అడవితోనూ, ఆకాశంతోనూ మౌనంగా, ధ్యానంగా సంభాషిస్తాడు. దాదాపు ఎనభయ్యేళ్ల కిందటే ... పర్యావరణ విధ్వంసాన్ని చూసి బిభూతిభూషణుడు పడిన ఆందోళననూ, విడిపోతున్న మానవ హృదయాలను కలపటానికి ఆయన పడిన తపననూ ఈ రచన అపురూపంగా నమోదు చేసింది.

అన్ని మానవీయ స్పందనలూ ఎండిపోతున్న ఈవేళ ఈ అపరాజితుడితో సంభాషించడం ఒక అద్భుతమైన అవకాశం.
ఈ పుస్తకాన్ని సరళమైన తెలుగులోకి అనువదించిన కాత్యాయని తెలుగు పాఠకులకు సుపరిచితురాలు. పలు నవలలు, సాహిత్య పుస్తకాలు తెలుగులోకి అనువదించారు. ''చూపు'' పత్రికను నిర్వహించారు.

అపరాజితుడు
రచన: బిభూతిభూషణ్‌ బందోపాధ్యాయ
తెలుగు అనువాదం: కాత్యాయని
పేజీలు : 197, వెల : రూ. 100/-


ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849


హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పుస్తకాలను ఇప్పుడు మీరు " ఫ్లిప్ కార్ట్ " ద్వారా ఆర్డర్ చేసి నేరుగా ఇంటికే తెప్పించుకోవచ్చు. ఎలాంటి అదనపు రవాణా చార్జీలు లేకుండా!
వివరాలకు ... ఇక్కడ ... క్లిక్ చేయండి !

 


ప్రఖ్యాత ఉర్దూ రచయిత్రి ఇస్మత్‌ చుగ్తాయ్‌ కథలు... తెలుగు అనువాదం: పి. సత్యవతి ...


ఇస్మత్‌ చుగ్తాయ్‌ కథలు 

ఆధునిక ఉర్దూ సాహిత్యంలో అగ్రస్థానంలో నిలిచే విలక్షణ రచయిత్రి ఇస్మత్‌ చుగ్తాయ్‌. స్వతంత్ర ఆలోచనా ధోరణితో ఛాందసాన్ని దునుమాడుతూ, సాహసం, ధిక్కారం అనే రెండు అస్త్రాలతో సాహిత్యంలోనూ, సమాజంలోనూ కూడా విప్లవాలు తెచ్చిన శక్తి, అభివ్యక్తి ఆమెది.

1915లో జన్మించిన ఇస్మత్‌ చుగ్తాయ్‌ అలీగఢ్‌ విశ్వవిద్యాలయంలో చదువుకొని, ప్రేమ్‌చంద్‌ ప్రారంభించిన అభ్యుదయ రచయితల సంఘంలో కొంతకాలం పనిచేసింది. స్త్రీల గొంతులు ఇంకా పెగిలిరాని కాలంలో, ఒక కవితో, కథో రాయాలన్న ప్రయత్నాన్ని సైతం 'తిరుగుబోతుతనం'గా పరిగణిస్తున్న రోజుల్లో ఇస్మత్‌ చుగ్తాయ్‌ సంప్రదాయాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగరేసి నిర్భీతిగా నిలబడింది. స్త్రీల జీవితాల్లోని విషాదాన్ని చురుక్కుమనిపించేలా పాఠకుల ముందుంచే అసాధారణ ప్రజ్ఞ ఇస్మత్‌ సొంతం.

1944లో 'లిహాఫ్‌' అనే కథమీద వచ్చిన అశ్లీల ఆరోపణలను ఆమె జయప్రదంగా ఎదుర్కొంది. శక్తిమంతమైన, బహుముఖమైన ఇస్మత్‌ రచనలు భారత, పాకిస్థాన్లలో అశేషమైన ఆదరణ పొందాయి.
...

...''స్త్రీల జీవితాలలో వివాహ వ్యవస్థా, సంప్రదాయాలూ, పిత్రుస్వామ్యమూ కలిసికట్టుగా సృష్టించిన విధ్వంసం ఈ కథలనిండా పరుచుకుని వుంది. అంతా చదివేసి పుస్తకం పక్కన పెట్టేసి, హాయిగా వుండడం  కుదరదు. బేగమ్‌ జాన్‌, కుబ్రాతల్లి, కుబ్రా, ఆమె చెల్లీ, రుక్సానా, హలీమా, గోరీబీ, సరలాబెన్‌ బిచ్చూ అత్తయ్య, వదినె, షబ్నమ్‌ ఇల్లూడ్చే ముసలమ్మ, ఫర్హత్‌ అంతా చాలాకాలం మన చుట్టూ తిరుగుతూనే వుంటారు. రచయిత్రినీ, రచననూ చాలా ఇష్టపడి చేసిన అనువాదం కనుక చాలా సంతోషాన్నిచ్చింది నాకు.''
- పి. సత్యవతి
...

ఇస్మత్‌ చుగ్తాయ్‌ కథలు
ఆంగ్లమూలం: The Quilt & Other Stories translated from Urdu by Tahira Naquvi and Syed S. Hamed


తెలుగు అనువాదం: పి. సత్యవతి

ముఖ చిత్రం : శంకర్ 
పేజీలు : 184, వెల : రూ.100/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849



హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పుస్తకాలను ఇప్పుడు మీరు " ఫ్లిప్ కార్ట్ " ద్వారా ఆర్డర్ చేసి నేరుగా ఇంటికే తెప్పించుకోవచ్చు. ఎలాంటి అదనపు రవాణా చార్జీలు లేకుండా!
వివరాలకు ... ఇక్కడ ... క్లిక్ చేయండి !




ఇస్మత్ చుగ్తాయ్ కథల "ఇ బుక్ " కోసం
ఇక్కడ క్లిక్ చేయండి:


.

Thursday, July 5, 2012

జీవశాస్త్రవిజ్ఞానం సమాజం - కొడవటిగంటి రోహిణీ ప్రసాద్‌ ...


''ధైర్యవంతుడివా, మూఢాచారాలను వదిలించుకొని స్వేచ్ఛా జీవివి కా... సన్యాసులు భౌతిక శాస్త్రంలో అజ్ఞానులు. దీనికి కారణం వారు సరైన గ్రంథపఠనం చేయకపోవడమే. హేతువాదం మానవ జీవన విధానమైనట్లయితే మానవజాతి సమస్యలెన్నో అంతరించివుండేవి.''
- స్వామి వివేకానంద

...
సైన్సు తనకు తెలియని విషయాలను తెలియనివిగానే పరిగణిస్తుంది. తెలిసిన వాటికి సైద్ధాంతిక వివరణలను ఇస్తుంది. పాతసిద్ధాంతాలను సవాలుచేసే కొత్త సాక్ష్యాలు లభించినప్పుడల్లా వాటిని సవరించుకుంటుంది. ఇందులో భేషజాలకూ, పిడివాదాలకూ చోటుండదు. ప్రతిరోజూ కొత్త విషయాలు కొల్లలుగా బైటపడుతున్న ఈ కాలంలో వాటిని స్థూలంగానైనా సామాన్య పాఠకులకు వివరించడం సైన్సు రచయితల బాధ్యత...
...
''...అరచేతిలో సైన్స్‌ ... మన పాఠ్య పుస్తకాలు ఇలా వుంటే ఎంత బావుండేదనిపిస్తుంది... విషయం ఏదైనా చందమామ కథలంత సాఫీగా సాగిపోతుంది.''
- ఈనాడు
...
''ఈ పుస్తకం తెలుగు రచనల పరిధిని పెంచడానికి కాక విద్యార్థులు వీటిని చదివి సైన్స్‌ పట్ల ఇష్టాన్ని పెంచుకుని శాస్త్రవేత్తలుగా ఎదగడానికి తోడ్పడుతుంది. మరీ ముఖ్యంగా ప్రజలలో మూఢనమ్మకాల్ని తొలగించే హేతువాదాలకు, ప్రగతివాదాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది... సైన్స్‌లో లోతైన పరిజ్ఞానం లేనివారికి సైతం అరటిపండు ఒలిచిన చందంగా అవగాహన చేయించడం రచయిత రచనా కౌశలానికి నిదర్శనం.''
- స్వేచ్ఛాలోచన మాసపత్రిక
...
భౌతికవాదులూ, హేతువాదులూ అందరూ చదవదగ్గ విలువైన పుస్తకం. విద్యార్థులకూ, యువతీ యువకులకూ బహుమతిగా ఇవ్వదగ్గ సరళ రచన.
...
రచయిత కొడవటిగంటి రోహిణీ ప్రసాద్‌ అణుభౌతిక శాస్త్రంలో పిహెచ్‌డి చేశారు. బాబా అణుకేంద్రంలోనూ, ఇసీఐఎల్‌లోనూ పనిచేశారు. వీరు రచించిన మనుషులు చేసిన దేవుళ్లు, అణువుల శక్తి పుస్తకాలను హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ఇటీవలే ప్రచురించింది.

జీవశాస్త్రవిజ్ఞానం సమాజం
- కొడవటిగంటి రోహిణీ ప్రసాద్‌
పేజీలు : 175, వెల : రూ.100/-

తొలి ముద్రణ: జనసాహితి, 2008
పునర్ముద్రణ (హెచ్‌బిటి): జూన్‌ 2012

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849
EMail : hyderabadbooktrust@gmail.com

Wednesday, July 4, 2012

తొలి తెలుగు కథా రచయిత్రి ''భండారు అచ్చమాంబ సచ్చరిత'' - కొండవీటి సత్యవతి


1910లో గురజాడ రాసిన ''దిద్దుబాటు'' కథే తెలుగులో తొలి కథగా ఇంతవరకూ ప్రచారంలో వుంది. కానీ నిజానికి శ్రీమతి భండారు అచ్చమాంబ  1902లో రాసిన ''ధన త్రయోదశి'' కథ తొలి  తెలుగు కథ. ఇది 'హిందూ సుందరి' పత్రికలో ప్రచురించబడింది.

భండారు అచ్చమాంబ అతి చిన్న వయసులోనే కథా రచన మొదలు పెట్టినట్టు, ఇంగ్లీషు నుంచి తెలుగులోకి అనేక రచనలను అనువదించినట్టు 'తెలుగు జనానా' పత్రికను నిర్వహించిన రాయసం వెంకటశివుడు వెల్లడించారు. అయితే 1898లో ప్రచురించబడ్డ ఆమె రెండు కథలు ఇప్పుడు లభించడం లేదు. అందువల్ల 1902 నాటి ధనత్రయోదశి కథే తొలి తెలుగు కథగా చెప్పుకోవాలి.

ధనత్రయోదశి కథలోని ఇత్రివృత్తం, గురజాడ 'దిద్దుబాటు' కథలోని ఇతివృత్తం దాదాపు ఒక్కటే కావడం ఒక విచిత్రం.... రెండు కథల్లో వున్న థీమ్‌ తెలివైన భార్య తన భర్తను సంస్కరించుకోవడం!

1874లో కృష్ణా జిల్లా నందిగామలో జన్మించిన అచ్చమాంబ బాల్యం నల్గొండ జిల్లా దేవరకొండలో గడిచింది. పదేళ్లు కూడా నిండని వయసులో ఆమె వివాహం దేవరకొండలోనే భార్య చనిపోయి ఒక బిడ్డ కూడా వున్న మేనమామ భండారు మాధవరావుతో జరిగింది. ఆమెను కొందరు తెలంగాణా  రచయిత్రిగా మరికొందరు ఆంధ్ర రచయిత్రిగా పేర్కొంటున్నారు.

ఏది ఏమైనా వందేళ్ల క్రితమే స్త్రీల స్థితిగతుల గురించి ఎంతో అత్యాధునికంగా ఆలోచించి, స్త్రీల అభ్యున్నతి కోసం అహరహం కలవరించి, పలవరించిన అచ్చమాంబ ఆనాటి స్త్రీల పరిస్థితిపట్ల తన ఆవేదనను, అంతరంగ ఘోషను కథలుగా, వ్యాసాలుగా, చరిత్రగా ఉపన్యాసాలుగా మలుచుకున్న తీరు ఆమోఘం, ఆశ్చర్యకరం కూడా. ఆ విషయాలనన్నింటినీ సవిరంగా చర్చించిన పుస్తకమిది.

ఈ పరిశోధనాత్మక రచనను అందించిన శ్రీమతి కొండవీటి సత్యవతి ఫెమినిస్ట్‌గా, భూమిక సంపాదకురాలిగా, రచయిత్రిగా తెలుగు పాఠకులకు సుపరిచితమే.

భండారు అచ్చమాంబ సచ్చరిత్ర
-కొండవీటి సత్యవతి

పేజీలు : 92, వెల : రూ.50/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500067
ఫోన్‌ నెం. 040 23521849
ఇ మెయిల్‌:  hyderabadbooktrust@gmail.com

పుస్తకం డాట్ నెట్ లో " నేనేబలాన్ని -టి ఎన్ సదాలక్ష్మి బతుకు కథ " పుస్తకం పై జంపాల చౌదరి గారి సమీక్ష


నేనే బలాన్ని – టి.ఎన్. సదాలక్ష్మి వ్యక్తిత్వచిత్రణ

కొన్నాళ్ళ క్రితం ముదిగంటి సుజాతారెడ్డిగారి ఆత్మకథ ముసురును ఇక్కడ పరిచయం చేస్తూ, తెలుగులో మహిళల ఆత్మకథలు తక్కువగా ఉన్నాయని వ్రాశాను. ఆ వెంటనే దొరికిన కొన్ని ఆత్మకథలను (పొణకా కనకమ్మ, ఏడిదము సత్యవతి) ఇక్కడ పరిచయం చేస్తూ నేనే బలాన్ని పుస్తకం గురించి కూడా ప్రస్తావించాను. ఐతే, ఈ పుస్తకం టి.ఎన్. సదాలక్ష్మిగారి ఆత్మకథ కాదు. గోగు శ్యామలగారు వ్రాసిన జీవితకథ. కాని, చాలా చోట్ల ఈ కథ టి.ఎన్.సదాలక్ష్మిగారి సొంత గొంతుకలోనే వినిపిస్తుంది.

అన్వేషి సంస్థ ‘రాష్ట్ర రాజకీయాలలో, ఉద్యమాలలో దళిత స్త్రీల పాత్ర ‘ ప్రాజెక్టులో భాగంగా టి.ఎన్.సదాలక్ష్మి జీవితంపై పరిశోధన జరిగి ఈ పుస్తకం వెలువడింది. గోగు శ్యామలగారు సదాలక్ష్మిగారిని ఇంటర్వ్యూ చేసి ఆమె జీవితకథని వ్రాద్దామని చాలాకాలం నుంచి ప్రయత్నించినా, ముందు సదాలక్ష్మిగారు సహకరించలేదట. ఆవిడకు నమ్మకం దొరికి తన అనుభవాల గురించి శ్యామలగారికి చెప్పటం మొదలుబెట్టిన కొన్నిరోజుల్లోనే సదాలక్ష్మిగారు మరణించారట. సదాలక్ష్మిగారి సన్నిహితుల, సహచరుల సహకారంతో ఈ పుస్తకాన్ని పూర్తిచేశానని శ్యామలగారు వ్రాశారు.

టి.ఎన్. సదాలక్ష్మిగారు 1928 డిశెంబరు 25న బొలారం ప్రాంతంలో “అట్టడుగు కులాలన్నింటిలోకీ అడుగు కులంగా కొనసాగుతున్న మెహతర్ కులంలో” జన్మించారు. తండ్రి కంటోన్మెంట్ ప్రాంతంలో సఫాయి పని చేసేవాడు. కానీ ఇంటి దగ్గర వైద్యం చేసేవాడు. తల్లి వడ్డీ వ్యాపారం చేసేది. ...............................

పూర్తీ సమీక్ష " పుస్తకం డాట్ నెట్ " లో చదవండి. 
http://pustakam.net/?p=11830

(పుస్తకం డాట్ నెట్ వారికి కృతజ్ఞతలతో...)


హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌