ఇంట్లో ప్రేమ్‌చంద్
అన్ని మానవ సంబధాల్లోకి అతి సన్నిహితమైనదీ, ఎక్కువ కాలం కొనసాగేదీ భార్యాభర్తల అనుబంధం.
భర్త చనిపోయాక భార్య ఆయనతో తను పంచుకున్న జీవితం గురించి నిజాయితీగా రాయటమనేది భారతీయ సాహిత్యంలో చాలా అరుదుగా కనిపించే అంశం.
ఈ పుస్తకంలో శివరాణీదేవి ఆ పని చేసి చూపారు.
సంభాషణల ద్వారానూ, అక్కడక్కడా స్వగతంలాగానూ ఆమె రాసిన విషయాలవల్ల ప్రేమ్‌చంద్ తాలూకు గొప్పదనమే కాక, ఆమె గొప్పదనమూ, ప్రేమ్‌చంద్‌ని ఒక్కోసారి ముందుండి నడిపించిన ఆవిడ తెలివితేటలూ, ధైర్యమూ అనుకోకుండానే ఈ పుస్తక,లో మనకి కనిపిస్తాయి.
ప్రేమ్‌చంద్ గురించి తెలియని తెలుగు పాఠకులు అరుదు.
ఆయన వ్యక్తిగా ఎటువంటివారో తెలుసుకునేందుకు,
ఇంకా ముఖ్యంగా ఆయన భార్య శివరాణీదేవిలో ఎంత ప్రతిభ ఉందో తెలుసుకునేందుకు అందరూ ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి.
..................
పాఠకుల ముందు ఈ పుస్తకాన్ని ఉంచటం వల్ల నాకు నా కర్తవ్యాన్ని నెరవేర్చానన్న తృప్తి కలుగుతోంది. ఈ పుస్తకం రాయటం వెనక ఆ మహా రచయిత కీర్తిని అందరికీ తెలియజేయాలన్నది నా ఉద్దేశం కాదు. చాలా మటుకు జీవిత చరిత్రల్లో జరిగేది అదే. ఈ పుస్తకంలో మీకు మా ఇంట్లో జరిగిన సంఘటనల జ్ఞాపకాలు కనిపిస్తాయి, వాటిలో ఆ మహా రచయిత వ్యక్తితం కనిపిస్తుంది. మానవత్వం దృష్ట్యా కూడా ఆయన ఎంత గొప్పవాడో, ఎంత విశాల హృదయుడో చెప్పేందుకే ఈ పుస్తకం రాశాను. ఇది చెప్పేందుకు నా కన్నా ఎక్కువ హక్కు మరెవరికీ లేదన్నది నా నమ్మకం.
........................................................... - శివరాణీదేవి ప్రేమ్‌చంద్
...........................
''ముసలి ఆవుని ముస్లింలు బలి ఇచ్చినప్పుడు రెండు పక్షాలవాళ్లూ కొట్టుకు చస్తారు. కానీ అదే ఇంగ్లీషువాళ్లు వందలకొద్దీ ఆవులనీ, దూడలనీ చంపినప్పుడు హిందువుల రక్తం కోపంతో మరిగిపోదేం? నువ్వే చెప్పు, మేకలని బలివ్వని దేవత గుడి ఉందా మన దేశంలో?
ఏ మతమూ పూర్తిగా మంచిదీ కాదు, చెడ్డదీ కాదు. ఆవుకోసం ప్రాణాలు ఇవ్వటానికి వెనకాడని ఆ హిందువులే తల్లిదండ్రులకి ఒక ముద్ద అన్నం పెట్టలేరు...''
........................................................ - ప్రేమ్‌చంద్
.........................................................................................................................
ఈ పుస్తకాన్ని అనువదించిన ఆర్. శాంతసుందరి విఖ్యాత రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమార్తె. 1947 ఏప్రిల్‌లో మద్రాసులో పుట్టారు. గత మూడు దశాబ్దాలుగా అనువాద రంగంలో కృషిచేస్తున్నారు. వీరివి ఇంతవరకూ హిందీ, తెలుగుభాషల్లో దాదాపు యాభై పుస్తకాలు ప్రచురణ పొందాయి. కవితలూ, కథలూ, నవలలూ, నాటికలే కాక వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు కూడా అనువదించారు.
అనువాదాలకు గాను, భారతీయ భాషా పరిషద్ (న్యూఢిల్లీ), జాతీయ మానవహక్కుల సంస్థ (న్యూఢిల్లీ), పి.ఎస్. తెలుగు విశ్వవిద్యాలయం (హైదరాబాద్)ల నుంచి పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వుంటున్నారు.
ఇంట్లో ప్రేమ్‌చంద్
- శివరాణీదేవి ప్రేమ్‌చంద్
హిందీమూలం : ప్రేమ్‌చంద్ ఘర్‌మే, రోశనాయి ప్రకాశన్
తెలుగు అనువాదం: ఆర్. శాంతసుందరి
తొలి ముద్రణ : భూమిక మాస పత్రికలో జనవరి 2009 నుంచి జులై 2012 వరకు సీరియల్ గా.
పుస్తకం గా ప్రధమ ముద్రణ : సెప్టెంబర్ 2012
పేజీలు: 274, వెల: రూ.120/-
ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్ బుక్‌ట్రస్ట్,
ప్లాట్‌నెం. 85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్ - 500006
ఫోన్ నెం. 04-23521849
ఇమెయిల్ ఐడి: hyderabadbooktrust@gmail.com
.
No comments:
Post a Comment