Monday, November 12, 2012

నిబద్ధ మహిళ జీవిత దర్పణం - తెలకపల్లి రవి - ప్రజాశక్తి ...



విప్లవోత్తేజాన్ని, విషాద గాంభీర్యాన్ని తనలో నిబిడీకృతం చేసుకున్న ఒక మాతృమూర్తి ఆర్ద్రగాధ ఇది.
నిబద్ధతకు మారుపేరుగా నిర్దయాత్మక జీవితానుభవాలను భరించిన నిండుకుండ నిజ జీవిత గాధ ఇది.

నిర్జన వారధి పేరిట వెలువడిన కొండపల్లి కోటేశ్వరమ్మ జ్ఞాపకాలు కళ్లను చెమరింపచేస్తాయి.
అదే సమయంలో పిడికిళ్లు బిగిసేలా చేస్తాయి.
ఆలోచించగలిగిన వారిలో అనేక ప్రశ్నలనూ రగిలిస్తాయి.
మిగిలిస్తాయి.
అందుకే ఇదొక అరుదైన ఆత్మకథ.
అంతు తెలియని వ్యథ.
ఆడవాళ్ల రొద.

కోటేశ్వరమ్మ బాల వితంతువుననే సంగతి తెలియకుండానే పెరిగారు.
తనకు తెలిసిన తర్వాత దీర్ఘంగా విచారించే అవసరం లేకుండా కమ్యూనిస్టు నేతల చొరవతో నాటి కృష్ణా జిల్లా పార్టీ కార్యదర్శి కొండపల్లి సీతారామయ్యను పెళ్లి చేసుకున్నారు.
కుటుంబాల పరమైన ప్రతికూలతలను అధిగమించి ఆశయబద్ధమైన అన్యోన్య జీవితంలో బాబు, పాపలను కన్నారు. ఆయన బలవంతంపైనే ప్రజా కళాకారిణిగా మారారు.
అదే సమయంలో అగ్ని పరీక్షల వంటి నిషేధాలు, నిర్బంధాలను చూశారు.
అతి దుర్భరమైన అజ్ఞాతంలో అష్టకష్టాలు పడుతూ అమ్మలా, అక్కలా అనేకమందిని ఆదుకున్నారు.
ఆడవాళ్లకన్నా మిన్నగా అజ్ఞాతంలో తనకు అనుపమ సేవలు చేసిన అన్నదమ్ములవంటి సహచరుల ఆత్మీయత చవిచూశారు.
అనుకోని రీతిలో సీతారామయ్య ఉద్యమానికే చెందిన మరో మహిళకు దగ్గరై తనకు దూరమవుతుంటే
భరించారు. ఈ క్రమంలో ..............................

మిగతా సమీక్ష .. ఇక్కడ ..చదవండి.

http://www.prajasakti.com/soundofsilence/article-401519

ప్రజాశక్తి దినపత్రిక 4 నవంబర్ 2012కి కృతజ్ఞలతో



.

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌