మార్పు జెండా
అమెరికాలో బానిస విధానం రద్దయింది. బానిసల మీదే ఆధారపడ్డ భూస్వాములు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అంతర్యూద్ధం మొదలైంది. "గాన్ విత్ ది విండ్" నవల నేపధ్యం ఇది. పాత పధ్ధతుల్ని వదులుకోలేకా కొత్త మార్పులు మింగుడు పడకా అప్పటి ప్రజలు పడ్డ సంఘర్షణ నవలలో దర్శనమిస్తుంది. ఆ పరిణామ క్రమంలో అంతర్మధనానికి గురయ్యే ప్రధాన పాత్ర స్కార్లెట్. మిగతా పాత్రలూ సన్నివేశాలూ కూడా మారుతున్న సామాజిక పరిస్థితులకు అద్దంపడతాయి. మార్గరెట్ మిచ్చెల్ రాసిన ఈ నవల అప్పట్లో ఓ సంచలనం. దానికి తెలుగు అనువాదమే "చివరకు మిగిలింది?" అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన పుస్తకాన్ని తెలుగు పాఠకులకు అందించాలన్న ప్రయత్నం ప్రశంసనీయం,.
- విరాట్
ఈనాదు ఆదివారం, 27-3-2011 సౌజన్యంతొ
No comments:
Post a Comment