నేను దేవదాసీని... నేను నాగరత్నమ్మను - స్పెషల్ స్టోరీ
1941... తిరువయ్యూరులో త్యాగరాజ ఆరాధనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఉదయాన్నే మొదలైన కచ్చేరీలు అర్థరాత్రి దాకా సాగేవి.
జనం కదిలేవాళ్లు కాదు.
ఐదు రోజుల ఉత్సవాల్లో వందమంది సంగీతకారులు పాటలు పాడాలి. నిష్ణాతులైన సంగీతకారులకు సైతం
ఒక్కొక్కరికీ అరగంటకు మించి పాడే అవకాశం లేదు.
అప్పుడొక లావుపాటి స్త్రీ ధన ధన చప్పుడు చేసుకుంటూ వేదిక ఎక్కింది. నల్లని శరీరం.. పెళపెళలాడే
పట్టుచీర .. ధగధగలాడే నగలు .. మైకు ముందు నిలబడి,
''నాన్ దేవర్ అడియాళ్ (నేను దేవదాసీని), నాన్ నాగరత్నమ్మాళ్'' అని దిక్కులు పిక్కటిల్లేలా
ఘీంకరించింది.
దిగ్గున మెరుపు మెరిసిన కొన్ని క్షణాల తర్వాత పిడుగు పడినట్లుగా చప్పట్లు మిన్ను ముట్టాయి.
ఆమె గొప్ప గాయని.
ఆమె గానం తిరువయ్యూరుకు కొత్త కాదు.
తమిళ, కన్నడ, తెలుగు ప్రాంతాలకూ ఆమె పాట పరిచితమే.
అయితే, ఆ క్షణం ఆ ఆఖరి దేవదాసి చేసిన యుద్ధనినాదం వెనుక ఉన్న వేదన, దు:ఖం , ఆగ్రహం,
అసహ్యం, ఛీత్కారం అక్కడున్న సంగీతప్రియుల్లో చాలామందికి అర్థం అయివుండకపోవచ్చు. ...
... ... ...
ఆదివారం ఆంధ్రజ్యోతి 20 మార్చి 2011 సంచికలో వెలువడిన
''బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర'' స్పెషల్ స్టోరీ
ఇక్కడ చదవండి.
రచయిత: ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు.
...
...
బెంగుళూరు నాగరత్నమ్మ గురించి ఆంధ్ర జ్యోతిలో ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు గారు రాసిన వ్యాసం పై శ్రీ వి.ఎ.కె. రంగారావు గారు అద్భుతంగా స్పందించారు. వారి స్పందనను మీ బ్లాగు వీక్షకుల దృష్టికి తెచ్చేందుకు (మీరు ఆ వ్యాసాన్ని మీ బ్లాగులో పెట్టారు కాబట్టి) ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఈ లేఖ ఆదివారం ఆంధ్రజ్యోతి 10 ఏప్రిల్ 2011 'ఇన్‌బాక్స్'లో ప్రచురించబడింది.
ReplyDelete...
బెంగుళూరు నాగరత్నమ్మ గురించి ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు రాసిన వ్యాసం చదివాక నాకెంతో ఆనందం కలిగిందో మాటల్లో చెప్పలేను.
వి. శ్రీరాం రాసిన పుస్తకంలోని విషయాలను వల్లించడం కాదు అరవయేళ్ల క్రితం ఆమె నెరిగిన వారితో మాట్లాడి ఆనాటి ఆమె వైభవం కళ్లకు కట్టించారు. దీనికి నేను రచయితకు, మీకు రుణగ్రస్థుడిని. దానికి కారణం నేను గర్భస్థ శిశువుగా వున్నప్పుడే ఆమె ఆశీస్సులుపొందిన వాడినవటం.
దీని గురించి శ్రీరాం పుస్తకంలో ఉంది.
వీరేశలింగం ముద్దుపళనినే కాదు బెంగుళూరు నాగరత్నమ్మను కూడా 'అది', 'ఇది' అని సంబోధించారు. అ లా సంబోధించడం సిగ్గు చేటు.
త్యాగరాజస్వామికి తగినట్లు సమాధిపై ఆలయం కట్టించింది. అక్కడి భూస్వాములు, ధనికులు, రాజకీయ నాయకులే నిర్మంచలేకపోయారు. కానీ ఒక సాని ఆలయం నిర్మిచడం విశేషం. అందుకు సంగీత కులార్లవమంతా కృతజ్ఞతా కెరటాలతో ఆమె పాదాల్ని కడగాలి.
- వి.ఎ.కె.రంగారావు, చెన్నై
"'అది', 'ఇది' అని సంబోధించారు. అ లా సంబోధించడం సిగ్గు చేటు." అంటూనే "కానీ ఒక సాని" అనటం ....
ReplyDelete