Friday, June 13, 2014

అంబేద్కర్ స్మారకోపన్యాసాలు, వేగుచుక్కలు పుస్తకాలపై : సాక్షి దినపత్రిక సమీక్షలు

 
( సాక్షి దినపత్రిక 08-06-2014 ఆదివారం ఫన్ డే సౌజన్యం తో )   

 అద్వితీయుడు అంబేద్కర్‌ స్మారకోపన్యాసాలు

డా.బి.ర్‌ అంబేద్కర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ 1986 నుంచి 2013 వరకు ప్రతి ఎటా నిర్వహించిన అంబేద్కర్‌ స్మారకోపన్యాసాల సంకలనం ఇది జస్టిస్‌ చిన్నపరెడ్డి, ప్రొ. డి. నరసింహారెడ్డి, ప్రొ. జయశంకర్‌, ప్రొ. జి. హరగోపాల్‌, ప్రొ. గోపాలగురు, ప్రొ. వకుళాభరణం రామకృష్ణ వంటి పెద్దలందరూ అంబేద్కర్‌ను వివిధ మార్గాల్లో దర్శించడం ఈ సంకలనంలో కనిపిస్తుంది. అంబేద్కర్‌ సామాజికత తత్వం, దళిత విమోచన దృక్పథం, బౌద్ధమతం, స్త్రీవాదం వంటి అనేక విషయాల మీద సమగ్రమైన లోతైన అవగాహన కల్పించే విలువైన ఉపన్యాసాలివి.

వెల రూ 150 ప్రచురణ హెచ్‌బిటి పోన్‌ 040 23521849


వేగు చుక్కలు
అన్నమయ్య వేమన వీరబ్రహ్మంల సామాజిక దృక్పథం

కాలంలో అంతరం ఉన్నా ఒకే ప్రాంతానికి చెందిన వైతాళికులు అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మం, ముగ్గురు జనం కోసం నిలబడినవారే. జనానికి చెరుపు చేసే అధిపత్య భావజాలాన్ని భాషనీ వర్ణ పెత్తనాన్ని వ్యతిరేకించినవారే. కనుకనే వారు వేగుచుక్కలయ్యారు అని తన అధ్యయనంతో నిరూపిస్తున్నారు వినోదిని. ఎక్కువ కులజుడైన హీన కులజుడైన నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు అన్నాడు అన్నమయ్య, 'పిండములు చేసి పితరులు తలపోసి' అని నిరసించాడు వేమన, 'మతము కల్పితమ్ము మార్గమొక్కటే గదా' అన్నాడు వీరబ్రహ్మం, మహనీయులు మానవ సమాజాన్ని సంస్కరించడానికే చూస్తారు అని నిరూపించే పుస్తకం ఇది.

వెల: రూ 80

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌