ఆత్మాభిమానం కోటేశ్వరమ్మ గారి ఇంటి పేరు!
మార్చి 2013
నా భాధతోనే కాదు – ఈ లోకంలోని భాధ అంతటితోనూ,
చీకటి అంతటితోనూ నా నిరంతర పోరాటం.
అందుకే ఈ చరిత్ర బాధార్ణవం -ఒక శోకార్ణవం
-చలం‘నిర్జన వారధి ‘ రచయిత్రి కొండపల్లి కోటేశ్వరమ్మగారి బాధ కూడ పూర్తిగా వ్యక్తిగతం కాదు, సామాజికమైనది, రాజకీయమైనది కూడ. అందుకే ఆమె బాధ ప్రతి పాఠకుని హృదయాన్ని పిండి వేస్తుంది. ఈ పుస్తకం కోటేశ్వరమ్మగారి అంతర్వాహిని గా సాగినా, ఆమె శైలి, కధనంలోని భిన్నత్వం మనల్ని పుస్తకం పూర్తి అయ్యిన దాకా వదలనివ్వదు.
తన తొంభై రెండు ఏళ్ళ వయస్సులో ఇంచుమించు ఎనిమిది దశాబ్ధాలు ప్రజాజీవితంలో గడిపిన ఆమె జీవితం కచ్చితంగా ఇతర స్రీల జీవితాల కంటే వైవిధ్యమైనది, విశిష్టమైనది. ఆమె జీవితం ఉద్యమం, సాహిత్యం, సంగీతం, నాటకంతో పెనవేసుకొని ఆమెను ఒక విభిన్న వ్యక్తిగా నిలబెట్టాయి. ఉద్యోగాన్ని కూడా తన మనసుకు నచ్చిన విధంగా మలచుకొని తన సర్వ జీవచైతన్య శక్తులు చివరివరకు సజీవంగా ఉంచగలిగారు. అందుకే తొంభై ఏళ్ళ వయసులో కూడా తేటినీలాపురం పక్షులని చూసి పరవశించగలిగారు.
.......
కొండపల్లి కోటేశ్వరమ్మ '' నిర్జన వారధి '' పుస్తకం పై రమా సుందరి గారి సమీక్ష
"వాకిలి ఇ సాహిత్య మాసపత్రిక " లో చదవండి
http://vaakili.com/patrika/?p=1412
No comments:
Post a Comment