బెంగాలీ రచయిత బిభూతి భూషణ్ బందోపాధ్యాయ తన 'పథేర్ పాంచాలి' తర్వాత, రెండో భాగంగా 'అపరాజితో' రచించారు.
ఈ రెండు నవలలనూ కలిపి విఖ్యాత దర్శకుడు సత్యజిత్ రే మూడు చిత్రాలుగా రూపకల్పన చేశారు.
నవలలోని కథానాయకుడు అపూ కష్టాలూ కన్నీళ్లూ అధిగమిస్తూ ప్రశాంతంగా జీవించాలని తపిస్తాడు. వీలైనంతవరకూ ఇతరులకు
సాయపడాలన్నది అతని సంకల్పం. చిమ్మచీకట్లో చిరుపీదాన్ని వెతుక్కుంటూ ప్రస్థానం సాగిస్తాడు. పల్లెల నుంచి పట్నాలకు
వలసలు, ఛిద్రమవుతున్న గ్రామీణ వ్యవస్థ పెరిగిపోతున్న పేదరికం, తరిగిపోతున్న మానవ సంబంధాలను స్పశిస్తూ ప్రతి పాత్రనూ
హృద్యంగా మనముందుంచారు రచయిత.
బెంగాలీ సాహిత్యాన్ని అభిమానించే ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సిన నవల.
అపరాజితుడు
బెంగాలీ మూలం: బిభూతి భూషణ్ బందోపాధ్యాయ
అనువాదం: కాత్యాయని
పేజీలు: 197, వెల: రూ.100/-
ప్రతులకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్, ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్, గుడి మల్కాపూర్, హైదరాబాద్-500006
- కెవియల్లెన్
(ఈనాడు ఆదివారం 9-9-2012 సౌజన్యంతో)
No comments:
Post a Comment