మూడున్నర దశాబ్దాలుగా తెలుగు పాఠకులకు మంచి పుస్తకాలు అందిస్తున్న సంస్థ: చిరునామా: Hyderabad Book Trust, Plot No. 85, Balaji Nagar, Gudi Malkapur, Hyderabad-500 006. Ph.No. 040-23521849 ..... Mail: hyderabadbooktrust@gmail.com
Monday, February 13, 2012
వేదాల్లో ఏమున్నది?
వేదాల్లో ఏమున్నది?
''దాచిపెట్టిన జ్ఞానం నిరుపయోగం కావటమే గాక ప్రజలను పీడించటానికి సాధనమవుతుంది'' అని తెలిసిన వాళ్లు చెబుతారు.
వేదాల విషయంలో ఇదే జరిగినట్లు కనబడుతుంది.
వేదాలను బ్రాహ్మలు గుత్తకు తీసుకొని,
వేదాధ్యయనానికి నిషేధాజ్ఞలు కల్పించి,
అందులో ఏమున్నదీ ఎవరికీ తెలియకుండా చేశారు.
ఈ పరిస్థితిని ఆధారం చేసుకొని కొందరు ముందుకు పోవటమంటే
భయమూ, అసహ్యమూ గల వాళ్లు,
వేదాల్లో లేనిది లేదని ప్రజలను నమ్మించ జూశారు.
...
వేదాల్లో ఏమున్నది అన్న విషయం గురించి
మనకు తెలియజెప్పిన వాళ్లు చాలా వరకు పాశ్చాత్యులు.
వాళ్లు సంస్కృతం చదువుకొని,
వేదాలు పఠించి,
అందులో ఏమున్నదీ మనకు తెలియబరచవలసిన దుస్థితి కలిగింది.
...
ఋగ్వేద రచన క్రీస్తు పూర్వం 1500-1400 ప్రాంతంలో
జరిగిందన్న అంచనాను పురాతత్వ శాస్త్రం బలపరుస్తున్నది.
ఋగ్వేదంలో 10,500 పైచిలుకు ఋక్కులున్నాయి.
కొన్ని ఋక్కులను కలిపి ఒక సూక్తం అన్నారు.
శౌనకుడు ఋగ్వేదాన్ని 10 మండలాలుగా విభజించాడు.
ఋక్కులలో (సూక్తాలలో) కొన్ని స్తోత్రాలు,
కొన్ని ప్రార్థనలు, కొన్ని మంత్రాలు, కొన్ని ఉత్తపాటలు:
'ఒకప్పుడు వాస్తవమూ, విశ్వసనీయమూ, అద్భుతమూ అయినవి,
కానీ తరచూ చపలంగానూ, పామరంగానూ, దురవగాహంగానూ కూడా వుంటాయి''
అన్నాడు మాక్స్ ముల్లర్.
...
ఋగ్వేదంలోని భాష ఆడంబరంగానూ, పాండిత్య ప్రకర్షతో కూడినదిగానూ ఉండి, తరచుగా చాలా క్లిష్టంగా కూడా ఉంటుంది.
ఋగ్వేద ఋషులు సుమారు 2000 మంది ఉండేవారట.
వారు ఎంతో శ్రద్ధగా ఋగ్వేద రచన చేశారు.
వారు తాము ఆర్యులమని, కొత్త ప్రదేశాలను జయించామనీ చెప్పుకున్నారు.
...
వేదాలు నాలుగంటారు గానీ కొందరు మూడు వేదాలనే గుర్తిస్తారు.
నన్నయ భట్టు భారతం ప్రారంభిస్తూ ''వేదత్రయ మూర్తయః త్రిపురుషాః'' అన్నాడు.
ఋగ్వేదం పోతే మిగిలిన వేదాలు సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం.
కానీ వీటికి కూడా మూలం ఋగ్వేదంలాగనే కనిపిస్తుంది.
...
వేదాల గురించీ, ఆకాలపు మనుషులను గురించీ, తెలుసుకోవడం మనకీనాడు ఎంతైనా అవసరం. ఎందుకంటే అప్పటికీ ఇప్పటికీ జీవితంలోనూ, సమాజ స్వరూపంలోనూ ఊహించరాని మార్పులెన్నో వచ్చినా, మన సంస్కృతి అంతా ఆ వేదాల మీదనే ఆధారపడి పెరిగింది.
ఈ 20 (21)వ శతాబ్దంలో ఈ సంస్కృతిలో మౌలికమైన మార్పులు రాకపోతే మనం ప్రపంచ సంస్కృతికి వెనుకబడి ఉండటం తప్పని సరి అవుతుంది.
అందుచేత తెలిసిన వాళ్లు వేదాలను గురించి వేదకాలపు జీవితం గురించి సాధ్యమైనన్ని వాస్తవ విషయాలు ప్రజలకు తెలియజెప్పాలి.
ఈ సందర్భంలో తప్పుడు భావాలు ప్రచారంలో వుండటం అంత మంచిది కాదు.
...
వేదాల్లో ఏమున్నది ?
- కొడవటిగంటి కుటుంబరావు
పునర్ముద్రణ
పేజీలు 24, వెల: రూ.10
(అవును పది రూపాయలే)
Subscribe to:
Post Comments (Atom)
వేదాల్లో యేముందో తెలిసికొనటం మంచి ఉద్దేశమే. కాని వేదాలు వాటి మీది శ్రధ్ధతో పుష్కరాలపాటు అభ్యసించవలసిన విషయం. గబగబా వాచ్యార్దాలను చదివేసుకుంటూ పోవటం, మనకు మమకారమున్న దృక్పధానికి అనుకూలమైన ముక్కలు వెదికి పట్టుకుని వక్రభాష్యాలు చెప్పటం వల్ల ఉపకారం కన్నా అపకారమే యెక్కువ జరుగుతుంది. నా ఉద్దేశం కమ్మూనిష్టు అవగాహలతో వేదాలు అర్థంచేసుకోవటానికి ప్రయత్నించటం ఘోరమైన ప్రమాదాలకు దారితీస్తుంది. అంత కంటే ఓ నమస్కారం పెట్టి ఊరుకోవటం వాటికీ సమాజానికి మంచిది.
ReplyDeleteఅసలు వేదాన్ని ఎవరూ రచించలేదు .అది అపొరుషేయము .కాబట్టి వేదానికి కాల నిర్ణయము చేయడము కుదరదు .ఇక్కడే వేదాన్ని అధ్యయనము చేసి అర్ధము చేసుకొన్నాము అది ఇదే అనే పాశ్చాచ్యుల కుయుక్తి తేలుస్తొంది .ఇక్కడ ఒక్క ప్రశ్న అస్సలు భారత దేశము లొ పుట్టిన ఇతర వర్ణ ముల వారికే వేదాధ్యయన అధికారము లేనప్పుడు ఎక్కడనుందొ వచ్చిన పాశ్చాచ్యులు ఎలా దాన్ని అధ్యనము చేశారు ..?దాని యందు గల మంతార్ధము ఇదే అని ఎలా చేప్పగలరు ...?ఈ మాత్రము వివేచన లేని వారు మేధావులా...?దేశాన్ని అన్నివిధాలా నాశనము చేసి తమ అధికారాన్ని నిలబేట్టు కొనేందుకు మేకాలే వంటి వారు చేసిన ఒక ప్రయత్నము ఇది ..ఈ విషయాన్ని మేకాలే తన భార్య కు పంపిన కేబుల్ సందేశములొ పొందు పరిచాడు ......
ReplyDelete2013 Calender by L Ls Siddhanthy
ReplyDeletehttp://lsiddhanthy.blogspot.in/search/label/2013%20Calender
"మితృలందరికీ 2013 శుభాకాంక్షలు"
పై లింక్ క్లిక్ చేసి నాచే గణించబడిన 2013 క్యాలెండర్ డౌన్ లోడ్ చేసుకోగలరు
Vedaallo emundo thelusukovadam ippudantha avarama?
ReplyDeletePaina annattu vatikoka namaskaram petti voorukovadam chaala manchidi.
Inkaa ee science yugam lo veeti avasaram vunda?
Oka vela Vedalu avasaram ani anipisthe inni rojulugaa vaatini (Daachi) kaapaaduthu vasthunna vaallake avasaram. Daachi pettina Jnanam obsolate avuthundi annadi sthyam.
Sir,book yela order chesukovali???
ReplyDelete