Tuesday, February 11, 2020

అనువాదాలు మరో సమాజాన్ని, సంస్కృతిని మన కళ్ళ ముందు ఉంచుతాయి


అనువాదాలు మరో సమాజాన్ని, సంస్కృతిని మన కళ్ళ ముందు ఉంచుతాయి

హైదరాబాద్ బుక్ ట్రస్ట్  ప్రారంభించి నాలుగు దశాబ్దాలు పూర్తి ఛేసుకున్న సందర్భంగా వరంగల్ కాకతీయ విశ్వవిధ్యాలయం, జాఫర్ నిజాం హాల్ లో ఫిబ్రవరి 9, 2020 తేదిన "సమాజం- అనువాద సాహిత్యం" అనే అంశంపై సెమినార్ ను హెచ్.బి.టి. సంస్థ నిర్వహించింది. ఈ అంశంపై రచయిత్రి,  అనువాదకురాలు చూపు కాత్యాయని, ప్రచురణ రంగంలో 40 సంవత్సరాల  హెచ్.బి.టి. ప్రయాణం, అనుభవాలపై  ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యురాలు గీతా రామస్వామి ఉపన్యసించారు. 

 ఈ సదస్సులో అనేక మంది విధ్యాధికులు,  సాహిత్యాభిలాషులు, పౌరహక్కుల ప్రతినిధులు పాల్గొని తమ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలను అందించి  సదస్సును ఆసక్తికరంగా మార్చారు.  ముందుగా గీతా రామస్వామి మాట్లాడుతూ  ఇప్పటివరకూ హెచ్.బి.టి. 400 వరకూ పుస్తకాలను ప్రచురించిందని, ప్రపంచ వ్యాప్తంగా వచ్హిన మంచి సాహిత్యాన్ని తెలుగు పాటకులకు అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ సంస్థ, 250కి పైగా అనువాదాలను ప్రచురించిందని అన్నారు.  అయితే నానాటికీ పుస్తక పఠనం తగ్గుతుండడం, తెలుగు భాష పట్ల పెరుగుతున్న నిరాధరణ తెలుగు భాష క్రమంగా అంతరించిపోతుందేమోననే ఆందోళనను కలిగిస్తున్నాయని, అన్నారు. తెలుగు ఫాంట్ కి సంబంధించి యూనిఫాం కోడ్ ఉండాలని, ఆంగ్ల భాషను ప్రోత్సహించినా, తెలుగు భాషను విధిగా నేర్చుకోవలసిన భాషగా చేయడానికి ప్రభుత్వం పూనుకోవాలని అన్నారు.

కాత్యాయని మాట్లాడుతూ  సమాజంలోని ఆర్ధిక రాజకీయ సాంఘిక వాతావరణమే సాహిత్య మానసికతను సృష్టిస్తుందని, సమాజానికీ సాహిత్యానికి పరస్పర సంబంధం ఉంటుందని, అనువాదాలు మరో సమాజాన్ని సంస్కృతిని మన కళ్ళ ముందు ఉంచుతాయని అన్నారు. 

కె.యు.సి. రిజిస్ట్రార్ పురుషోత్తం ప్రసంగిస్తూ విశ్వవిధ్యాలయాలలో 90 శాతంగా వున్న బడుగు బలహీన వర్గాల విధ్యార్ధుల ఉపాధి బద్రతకు తెలుగు కాక ఆంగ్ల భాష కావడంతో విధ్యార్దులు అటువైపే మొగ్గు చూపుతున్నారని ఈ స్థితిలో మార్పు రావాలని అన్నారు. 

పౌరహక్కుల నాయకులు హరికృష్ణ, రచయిత మెట్టు రవీందర్, అనేక మంది ఇతర సభ్యులు కూడా తమ అభిప్రాయాలను వెలిబుచ్హారు.  సదస్సును హెచ్.బి.టి.బాధ్యురాలు సంధ్య నిర్వహించారు.

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌