పి సత్యవతి గారికి "ఒక హిజ్ర ఆత్మకథ" అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం
హైదరాబాదు బుక్ ట్రస్ట్ ప్రచురించిన ఒక హిజ్రా ఆత్మకధ పుస్తకానికి అనువాద విభాగంలో 2019 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన రచయిత్రి పి.సత్యవతి గారికి అభినందనలు. ఈ పుస్తకం చదివితే హిజ్రాల పట్ల అంత వరకూ మనం ఏర్పరచుకున్న దురభిప్రాయాలు, ఏహ్యత, చిన్నచూపు అన్నీ పటాపంచలయ్యి వారి పరిస్థితి పట్ల సానుభూతి, దుఖం కలుగుతాయి. వారిని ఇంటా బయటా అడుగడుగునా అవమానిస్తూ చీదరించుకున్నందుకు మన పట్ల మనకు అపరాధ భావం కలుగుతుంది. కొత్త కోణంలోనుంచి వారిని కూడా మనుషులుగా చూస్తూ వారి సమస్యలను అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తాం. శారీరకంగా తాము ఎదుర్కొనే సమస్యలు తమలో కలిగే భావాల గురించి ఎవరికీ చెప్పుకోలేక, హిజ్రా అని తెలిసిన తర్వాత కుటుంబాల, సమాజ వెలివేతకు గురై ఎవరి ఆదరణకూ నోచుకోక, ఎటువంటి ఆసరా లేక జీవించడానికి హిజ్రాలు ఎంచుకున్న మార్గాలు అనుభవిస్తున్న అతి దారుణమైన పరిస్థితులూ మన హృదయాన్ని మెలిబెడతాయి. వారి పరిస్థితిని ఆసరా చేసుకుని వారిపై దౌర్జన్యాలు చేస్తున్న వారిపట్ల ఆగ్రహం కలుగుతుంది. హిజ్రాలు అనుభవిస్తున్న దుఖం ఏమిటో, వాళ్ల అంతరంగం ఎంత కల్లోలభరితంగా ఉంటుందో, వాళ్ళ పట్ల ఈ సమాజం, ప్రభుత్వాలు ఎంత నిర్ధయగా ఉన్నాయో పి. సత్యవతి గారు అత్యద్భుతంగా అనువదించి మన కళ్ల ముందుంచారు. రేవతి కధ కల్పించిన ప్రేరణ అవగాహనతో ఎంతో మంది స్త్రీ వాదులు, హిజ్రాలు తమ సమస్యలపై జరుపుతున్న పోరాటాలకు ఈనాడు అండగా నిలబడుతున్నారు.
- హైదరాబాద్ బుక్ ట్రస్ట్
,,,,,,,,,,,,,,,,,,,,,,
పి.సత్యవతికి కేంద్ర సాహిత్య పురస్కారం
న్యూఢిల్లీ, విజయవాడ/కల్చరల్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ కథా రచయిత్రి పి.సత్యవతిని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. ఆమె అనువదించిన ‘ఓ హిజ్రా ఆత్మకథ’ రచనకు ఈ పురస్కారం లభించినట్టు అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు తెలిపారు. 23 భాషల్లో అనువాద పురస్కారాలను సోమవారం ప్రముఖ కన్నడకవి చంద్రశేఖర కంబార నేతృత్వంలోని కార్యవర్గ సమితి ఆమోదించింది.
ఈ పురస్కారం క్రింద సత్యవతికి రూ.50వేలు నగదు, ప్రశంసాపత్రం అందజేస్తారు. ఎ.రేవతి తమిళంలో రాసిన ఆత్మకథ ‘ద ట్రూత్ ఎబౌట్ మీ: ఏ హిజ్రా స్టోరీ’ పేరిట ఆంగ్లంలోకి అనువాదం అయింది. ఈ రచనను హైదరాబాద్ బుక్ ట్రస్ట్ కోసం సత్యవతి ‘ఓ హిజ్రా ఆత్మకథ’’ పేరుతో తెలుగులోకి తెచ్చారు.
ఆంధ్ర జ్యోతి 26-2-2020