సన్నిహితుల జ్ఞాపకాలలో అంబేడ్కర్
ఈ పుస్తకం, పత్రికాశీర్షికలకూ, చారిత్రక ఘట్టాలకూ అతీతమైన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి సన్నిహిత స్వరూపాన్ని పాఠకుల ఎదట పెట్టడానికి చేసిన ప్రయత్నం. అంబేద్కర్ జీవితాన్ని వెలుగులతో నింపుతూ, ఆయన మరణంతోనే అంతరించిన కొన్ని యథార్థాలను పునర్దర్శించుకోవడం దీని లక్ష్యం – పుస్తకాల సేకరణలో, గ్రంథాలయ నిర్మాణంలో ఆయన తపన, పట్టుదల, చురుక్కుమనిపించే ఆయన హాస్యకుశలత, తొలిసారి ఆయన్ని దర్శించడంలో అభిమానులలో కలిగిన భావోద్వేగాలు, వేసవి తుఫాను బీభత్సం నుంచి ఇంట్లోకి అడుగుపెడుతూ ఆయన వయొలిన్ వాదనను విన్నప్పుడు కలిగిన గొప్ప అనుభూతి – వీటన్నిటినీ మీ ముందుకు తెస్తుంది ఈ పుస్తకం. ఇక్కడ మీకు ఆయన సహాయకులు, అభిమానులు, అనుచరుల మాటల్లో షేర్వాణీ, కుర్తాలు, లుంగీ, ధోవతులు, చివరకు ఎలాస్టిక్ చెడ్డీల పట్ల ఆయన మోహం గురించి తెలుస్తుంది. కుక్కల్ని ప్రేమించే అంబేద్కర్, ఫౌంటెన్ పెన్నులను సేకరించే అంబేద్కర్, గర్భనిరోధాన్ని, లైంగిక విద్యను సమర్థించిన అంబేద్కర్, మద్యపాన నిషేధాన్ని కోరిన అంబేద్కర్, మద్యాన్ని ముట్టని అంబేద్కర్, అపుడపుడూ వంట కూడా చేసిన అంబేద్కర్ ఇక్కడ మనకు దర్శనమిస్తారు.
ఈ సంకలనంలోని వేర్వేరు అంశాలన్నీ కలిపి చూసినపుడు ఆయన వ్యక్తిత్వంలోని భిన్న పార్శ్వాలు మనకు కనిపిస్తాయి. ఆయన జీవిత చరిత్రాన్వేషణలో మనకు ఎంతో సంతృప్తిని కలిగించే రచన ఇది.
ఈ సంకలనంలోని వేర్వేరు అంశాలన్నీ కలిపి చూసినపుడు ఆయన వ్యక్తిత్వంలోని భిన్న పార్శ్వాలు మనకు కనిపిస్తాయి. ఆయన జీవిత చరిత్రాన్వేషణలో మనకు ఎంతో సంతృప్తిని కలిగించే రచన ఇది.
సన్నిహితుల జ్ఞాపకాలలో అంబేడ్కర్
వ్యాసాల ఎంపిక, సంపాదకత్వం : సలీమ్ యూసఫ్‌జీ
ముందుమాట : ఊర్మిళా పవార్
ఉపోద్ఘాతం : బామా
ఫోటోల సేకరణ : విజయ్ సుర్వాడే
తెలుగు అనువాదం : సి. మృణాళిని
168 పేజీలు, వెల: రూ.200/-
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్ - 500006
ఫోన్: 040 23521849
Email ID :
hyderabadbooktrust@gmail.com
No comments:
Post a Comment