Tuesday, September 27, 2016

చరిత్ర మార్చిన మనిషి : బొజ్జ అప్పలస్వామి , బొజ్జ తారకం

శతాబ్దాలుగా వెట్టి చాకిరితోనూ  పాలేరుతనాలతోనూ దీనంగా దుర్భరంగా నిస్సహాయంగా జీవితాలు గడుపుతూ ఆత్మగౌరవం అనే మాటకు ఆమడ దూరం పెట్టబడిన వర్గాలను గురించీ -ఆ వర్గాలను పురోగమన మార్గంలో ప్రధాన స్రవంతి దిశగా నడిపించిన ఉద్యమ శక్తుల గురించీ - ఎంత చెప్పుకున్న అది ఎప్పటికీ అంతులేని కథనమే అవుతుంది . హిందూ సమాజపు సామాజిక నిర్మితి పైన ,మతమౌఢ్యపు దౌర్భల్యాలపైనా సమరం సాగించిన ఉద్యమ శక్తుల సమాహారం అది  రుదాంద్ర మహోద్యమం . ఆ మహోద్యమంలో ఎన్నో వెలుగు రవ్వలు. ఈ చరిత్రను  ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ స్ఫూర్తి  పొందుతూ ముందుకు సాగవలసి వుంది.
ఆ సంఘర్షణాత్మ వికాస క్రమంలో బొజ్జ అప్పలస్వామి గారు , డా . అంబేడ్కర్ బాటలో పయనించారు. అంబేడ్కర్ స్థాపించిన ఆలిండియా షెడ్యూలు క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీలో క్రియాశీల సభ్యలు. ఆయన వ్యవహాశైలి,ఆలోచన రీతి, సాహాసము , నిర్భీతి ఆయనను ఉత్తమ ప్రజా నాయకునిగా నిలిపాయి. ఒక జాతికి మార్గదర్శకునిగా ఒక ఉద్యమకారునిగా ఆయన రాజకీయ సామాజిక గమనాన్ని వివరిస్తూ ... ఆ ఆశయాలతో ఉద్యమిస్తున్న యువతరానికి జవసత్యాలను అందించే ప్రయత్నమే ఈ పుస్తకం.


No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌