మానసిక అనారోగ్యం గురించి చర్చించడానికి చాలామంది నేటికీ సిగ్గు, భయం చేత దాన్ని అవమానకరమైందిగా భావిస్తారు. ఇటువంటి వాతావరణంలో ఈ పుస్తకం మనకు అరుదైన, అర్ధవంతమైన వాస్తవాన్ని గ్రహించే జ్ఞానాన్ని అందిస్తుంది. ప్రజలకు మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కలిగించి, వారికి సహాయపడటానికి రచయిత తన సమయాన్ని ఇందు కోసం వినియోగించాడని నా నమ్మకం. మానసిక వ్యాధిగ్రస్తుని ఆలోచన దృక్పథం నుంచి చూస్తే ఈ పుస్తకం వెలకట్టలేనిది.ఎందుకంటే, ఇందులో స్కిజోఫ్రీనియా లాటి మానసిక జబ్బు ఎంతటి వేదనకు గురిచేస్తుందో మనకు కొత్తగా తెలుస్తుంది. భారతదేశంలోని మానసిక ఆరోగ్యం పరిరక్షణాలోని నాణ్యత, సంఘంలో ఈ వ్యాధి వలన ఉత్పన్నమయ్యే సిగ్గు , భయం, అవమానాలను ఈ వ్యాధిగ్రస్తుడు స్వయంగా తన అనుభవాలతో ఈ పుస్తకంలోని గొప్పతనం.
ఇందులో, భారతదేశంలో మనకు లభించే మానసిక ఆరోగ్యానికి సంబంధించిన వైద్య సౌకర్యాల ప్రశ్న సందర్భోచితంగా వుంది. నిజమే, మనం ఈ వ్యాధిగ్రస్తులను ఆశ్రమాలలో వుంచడమో లేక ఒంటరిగా నిర్భమధించడమో చేసే రోజుల నుండి చాలా దూరమే వచ్చాం. సంఘంలో ఇముడ్చుకోడానికి మెల్లగా అంగీకరిస్తున్నాం. ఇపుడు మెరుగైన వైద్యం అందుబాటులో వుంది .మానసిక వేదనకు గురైన సామాన్యులందరికీ చేరాలంటే మనమింకా చాలా దూరం ప్రయాణించవలసి ఉంది. మూఖ్య0గా గ్రామ ప్రాంతాలలో ఈ వ్యాధి గురించిన అవగాహన కలిగించడం అత్యంత ఆవశ్యకం. ఇది ఒక జాతీయ కార్యక్రమంగా దేశమంతటా చేపట్టవలిసి వుంది .
ఈ పుస్తకం మానసిక ఆరోగ్యం రూపకర్తలు, వైద్యులు, మానసిక అనారోగ్యంతో బాధపడే వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు మరియు సాధారణ ప్రజలుకు , చాలా ఉపయోగపడుతుంది.

ప్రతులకు, వివరాలకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ,
ప్లాట్ నెం.85. బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్- 500006
ఫొన్ నెం:23521849
ధర :120/- పేజీలు, 148
No comments:
Post a Comment