మన పిల్లలకు శ్రమ గౌరవ (డిగ్నిటీ ఆఫ్ లేబర్)
పాఠాలు నేర్పిద్దాం
మన సమాజంలో శ్రమకు గౌరవం లేకపోవడానికి ప్రధాన కారణం కులవ్యవస్థే.
ఈ కుల వ్యవస్థ చట్రంలో ... ఒళ్లు వంచి శ్రమ చేసే ఏదైనా అమర్యాదగా, అగౌరవంగా చూపించబడ్డాయి.
శ్రమ చెయ్యటం హీనం! శ్రమ చెయ్యకుండా తినడం హుందా!!
మన విద్యా వ్యవస్థల్లో కూడా ఇదే ధోరణి ప్రతిఫలిస్తోంది.
డా.బి.ఆర్.అంబేడ్కర్ చెప్పినట్టుగా ఈ కుల వ్యవస్థ అన్నది కేవలం 'శ్రమ విభజన' కాదు.. ఇది 'శ్రామికుల విభజన'.
మన దేశంలో ఈ నిచ్చెనమెట్ల కులవ్యవస్థ శారీరక శ్రమకూ, మానసిక శ్రమకూ మధ్య స్పష్టమైన విభజన రేఖ గీచింది. దురదృష్టవశాత్తూ ఇదే ఆలోచనాధోరణి నేటి మన స్కూలు విద్యా వాధానాలను నడిపిస్తోంది. పాఠ్యప్రణాళికల్లోనూ ఇదే ధోరణి నిండి వుంది.
మన భారతీయ పిల్లలు ఉన్నత చదువులకు ఎదిగిన కొద్దీ ఫ్రాథమికమైన ఉత్పాదక శ్రమ పట్ల విముఖత పెంచుకుంటున్నారు. చదువుల్లో ఎంత ఎదిగితే వీటి పట్ల చికాకు, చిన్నచూపు అంత పెరుగుతున్నాయి. స్కూలుకు వెళ్లే ప్రతి పిల్లా, ప్రతి పిల్లవాడూ కూడా రోజువారీ పనులైన ఇల్లు ఊడ్వడం, నేల తుడవడం, గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం, చెత్తాచెదారం ఎత్తటం వంటి ఇంటి పనుల పట్ల ఏహ్యాన్నీ, అసహ్యాన్నే ప్రదర్శిస్తున్నారు. పైగా ఈ పనులన్నీ చాలా వరకూ 'అమ్మ చెయ్యాల్సిన' పనులుగా భావిస్తున్నారు. లేదూ కాస్త కలిగిన కుటుంబానికి చెందిన వాళ్లయితే ఇవన్నీ 'పని మనిషి' చూసుకోవాల్సిన చెత్తపనులని భావిస్తున్నారు.
చిత్రమేమిటంటే, ఆ 'పనిమనిషి' కూడా చాలాచోట్ల 'కింది కులాలకు' చెరదిన మహిళే అయ్యుంటుంది. మొత్తానికి ఇంటి పని చేసే ఏ మహిళకైనా కూడా ... కుమ్మరి, మంగలి, చాకలి వంటి కింది కులాల స్థాయినే ఇస్తున్నారు.
ఇటువంటి పనులకు సరైన గౌసవమే కాదు, గౌరవప్రదమైన వేతనం కూడా ఉండదు. కాబట్టి శ్రమ గౌరవం లేకపోవటం, శ్రమను చులకనగా చూడటమన్నది కులం, జెండర్‌లు రెంటితోనూ ముడిపడి వుందని గుర్తించాలి.
శ్రమను నీచంగా చూసే ఈ ఆలోచనలన్నీ కూడా పిల్లలకు ఇళ్లలోనూ, స్కూళ్లలోనూ, శతాబ్దాలుగా పరంపరగా వస్తున్న సాంస్కృతిక, సామాజిక విలువల వ్యవస్థల ద్వారానూ చాలా తేలికగా ఒంటబడుతున్నాయి.
ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే... శ్రమను గౌరవించటమన్నది మన పిల్లలకు స్కూలులో బోధనాంశాల్లో భాగంగానూ, ఇంట్లోనూ నేర్పించాల్సిన అవసరం వుంది. ...
రేపటి పౌరులకు శ్రమ గౌరవాన్ని నేర్పించటానికీ, హేతుబద్ధమైన, శాస్త్రీయమైన, ప్రజాస్వామికమైన భారతదేశాన్ని నిర్మిచటానికీ ఈ పుస్తకం ఎంతో దోహదపడుతుందని ఆశిస్తున్నాను. (రచయిత ముందుమాట నుంచి)
సారె తిప్పు-సాలు దున్ను ...
మన కాలపు శ్రమగౌరవ పాఠాలు
- కంచె ఐలయ్య
బొమ్మలు : దుర్గాబాయ్ వ్యామ్
తెలుగు : 'చంద్రిక'
108 పేజీలు, వెల రూ. 140/-
ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్, గుడిమల్కాపూర్,
హైదరాబాద్ - 500006
ఫోన్ : 040 2352 1849
ఇమెయిల్ : hyderabadbooktrust@gmail.com
No comments:
Post a Comment