Thursday, October 9, 2014

'సంగీతం రీతులు-లోతులు' ...కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ ...


'సంగీతం రీతులు-లోతులు' ...కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ ...



సంగీతం సముద్రం వంటిది. దాని వైశాల్యం ఒక్కసారిగా అందదు. ఎన్నెన్నో రకాల సంగీతాలున్నాయి. పాటలున్నాయి. ప్రతి పాట వెనుకా గొప్ప లోతులున్నాయి. పాట వినేవారికి ఆ లోతులు తెలియక పోవచ్చు. తెలిస్తే మాత్రం, పాటలోని రుచి, దాని మీద గౌరవం మరింత పెరుగుతాయి. ...

సంగీతం గానీ, సాహిత్యం గానీ మరేదయినా గానీ పరిచయం పెరిగినకొద్దీ బాగా అర్థమవుతుంది. ... రోహిణీ ప్రసాద్‌ లాంటి వారు ప్రక్కన నిలబడి 'ఇదిగో, ఈ వివరం చూడు' అని చెప్పారనుకోండి. రుచి మరింత సులభంగా తెలుస్తుంది.

శాస్త్రీయ సంగీతం గురించి, సులభ పద్ధతిలో చెప్పేవారు లేకనే, అది చిటారుకొమ్మన మిఠాయి పొట్లంలా మిగిలింది. రోహిణీ ప్రసాద్‌ రాసిన ఈ వ్యాసాలు మిఠాయిని కిందకు దించి అందరికీ పంచుతాయి.

రోహిణీ ప్రసాద్‌ శాస్త్రజ్ఞుడు, సాంకేతిక నిపుణుడు. ఇక సంగీత సాహిత్యాలతో లోతయిన అనుభవం గల మనిషి, ఆయన స్వయంగా సితార్‌ విధ్వాంసుడు, రచయిత కూడానూ. శాస్త్రీయ దృక్పథంతో సంగీత విషయాలను విశ్లేషించి, సులభమయిన మాటల్లో చెప్పడం ఆయనకు బాగా కుదిరింది. తండ్రిగారు కుటుంబరావు గారి కారణంగా, స్వంత ఆసక్తి వలననూ మొదటి నుంచి, సంగీతంతో, విధ్వాంసులతో గడుపుతూ, వారి మాటలు వింటూ, చర్చల్లో పాల్గొంటూ గడిపే అవకాశం ప్రసాద్‌కు అందింది. అది ఆయన అవగాహనను పెంచింది. స్వతహాగా శాస్త్రీయ దృక్పథం ఉండటంతో తన స్వంత విశ్లేషణ తోడయింది. సంగీతకారులకు, పాడడం, వాయించడం తెలిసినంత సంగీతం గురించి చెప్పడం చేతకాదు. రచయిత గనక రోహిణీ ప్రసాద్‌ వివరణలు సులభంగా సాగాయి. అందరికీ అర్థమయ్యే రీతిలో నడిచి, ఆహా అనిపింపజేశాయి.

సినిమా పాటల గురించి రోహిణీ ప్రసాద్‌ అందించిన విశ్లేషణలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. సాహిత్యం స్వరాలు, లయ మొదలిన వాటి వివరాలు, వాటి మధ్యనుండే సంబంధాలు మనల్ని పాటలకు కొత్త అర్థాలు వెదుక్కునే వరకు లాగుతాయి. సినిమా పాటంటే     ముందిలే అనుకున్న వారికి, పాటలోని కనబడని లోతులను చూసేందుకు చక్కని మార్గం చూపించారు రచయిత.

- కె.బి.గోపాలం ముందుమాట 'రోహిణీ ప్రసాదం' నుంచి.

ఈ పుస్తకంలో విశ్లేషించిన కొన్ని అంశాల:
... సంగీతరస పానశాల ఘంటసాల
... పుష్పవిలాపం - రాగాలతో సల్లాపం
... అసామాన్య సంగీత దర్శకుడు సి.ఆర్‌.సుబ్బరామన్‌
... మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి
... బాలమురళీకృష్ణ సంగీతం
... అత్యుత్తమ హిందూస్థానీ గాయకుడు బడే గులాం అలీఖాన్‌
... నౌషాద్‌
... ఓ.పీ.నయ్యర్‌
... పాటల్లో లయ విన్యాసాలు
... జుగల్‌ బందీ కచేరీలు
... సినిమా పాటల్లో తాళం నడకలు, విరుపులు
...  కీబోర్డ్‌ మీద రాగాలు

ఇంకా మరెన్నో



సంగీతం రీతులు-లోతులు

- కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

212 పేజీలు, ధర: రూ.150/-




పతులకు, వివరాలకు:
 హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
        ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
        గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006
        ఫోన్‌ : 040 23521849 
Email ID: hyderabadbooktrust@gmail.com

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌