" ఊరు వాడ బతుకు " ఆంగ్లానువాదం " Life in Anantaaram " ఉచిత పీడీఎఫ్
దేవులపల్లి కృష్ణమూర్తి ఆత్మకథాత్మక నవల "ఊరు వాడ బతుకు" తెలుగు పాఠకుల విశేషాదరణను పొందింది. పోలీసు యాక్షన్ పేరిట ఆనాటి హైదరాబాద్ రాజ్యంలో జరిగిన సైనిక చర్య ముందరి తన బాల్య జీవితం, అనంతారం, సూర్యాపేటల్లో కొనసాగిన తన చదువు, ఆనాటి గ్రామీణ జీవితం, కమ్యూనిస్టు ఉద్యమం , రజాకార్ల ఆగడాల నేపధ్యంతో సరళమైన తెలంగాణా భాషలో ఒక అద్భుతమైన డాక్యుమెంటరీలా సాగుతుందీ రచన. తెలంగాణా ప్రజా జీవనం లో అంతర్భాగమైన పాటలు, సామెతలు, జాతీయాలు పుస్తకం నిండా పరచుకుని ఆనాటి తెలంగాణా బతుకులోని విలక్షనతను, ఔన్నత్యాన్ని చాటి చెబుతాయి. ఏలె లక్ష్మణ్ చిత్రాలు ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ.
తెలంగాణా సామాన్య జన జీవితాన్ని అసామాన్యంగా ఆవిష్కరించిన ఈ పుస్తకాన్ని ప్రపంచ పాఠకుల దృష్టికి తీసుకెళ్లాలన్న ఆకాంక్షతో కొన్నాళ్ళ క్రితం గీతా రామస్వామి ఇంగ్లిష్ లోకి అనువదించారు. కానీ పుస్తక రూపంలో తీసుకు రావడానికి వీలుపడక " మిషన్ తెలంగాణా " వారి ద్వారా పీడీఎఫ్ రూపం లో పాఠకులకు అందుబాటులో వుంచారు. కింది లింక్ ద్వారా ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎడిటింగ్ ఇంకా పూర్తి కాలేదు కనుక పాఠకులు తమ దృష్టికి వచ్చిన లోపాలు, సూచనలు ఈ కింది మెయిల్ ఐడీకి తెలియజేయగలరు.
http://missiontelangana.com/life-in-anantharam/
Mail ID: gita.ramaswamy@gmail.com
No comments:
Post a Comment