Tuesday, April 15, 2014

గుజరాత్‌ 2002 జాతి హత్యాకాండ - Genocide: Gujarat 2002, Communalism Combat ...

''గుజరాత్‌ 2002 జాతి హత్యాకాండ''

''గుజరాత్‌ 2002 జాతి హత్యాకాండ'' (కమ్యూనలిజం కంబాట్‌) పుస్తకాన్ని దాదాపు 12 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ సంయుక్తంగా ప్రచురించాయి. మా పుస్తక ప్రచురణలో ఇదొక మైలురాయి వంటిది. ఒకటి కాదు అనేక విధాలుగా ఈ ప్రచురణ మాలో మార్పును తీసుకొచ్చింది. తెలుగు అనువాద సమయంలో గుజరాత్‌లో జరిగిన దారుణ మారణకాండ సంఘటనలు మా గుండెల్ని పిండివేశాయి. కౌసర్‌ బీ వంటి వారితోపాటు  మేమూ రోదించాము. సామాన్య హిందువులను - కొన్ని రాజకీయ దుష్టశక్తులు - అమాయక స్త్రీలపై  అత్యాచారాలు జరిపి హతమార్చే రాక్షసులనుగా మార్చాయి. వాళ్లు వృద్ధులూ, మహిళలతో సహా ముక్కు పచ్చలారని పసిపిల్లల్ని సైతం శూలాలతో, కత్తులతో పొడిచి చంపారు, సజీవ దహనం చేశారు. విచ్చలవిడిగా గృహదహనాలకు, ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు.

ఆ దారుణకాండ జరిగిన పుష్కరానికి ఇప్పుడు - 2014లో - ఈ సాధారణ ఎన్నికల సమయంలో - గుజరాత్‌ నమూనాను యావద్భారతదేశానికే ఆదర్శప్రాయమైనదిగా ఊదరగొడ్తుండం దిగ్భ్రాంతిని, ఆవేదనను ఆక్రోశాన్ని కలిగిస్తోంది.

ఈ నేపథ్యంలో ''గుజరాత్‌ 2002 జాతి హత్యాకాండ'' పుస్తకానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పుస్తకంతో పాటు
1) ''ఇస్లాంపై, ముస్లింలపై తరచూ జరిగే ప్రచారాలు అసలు నిజాలు'',
2) ''గుజరాత్‌ మారణకాండను ఎలా మరచిపోగలం''
అనే మరో రెండు చిన్న పుస్తకాలను పునర్ముద్రించాం. పాఠకులు వీటిని చదివి, చర్చించి విస్తృత స్థాయిలో ప్రజల ముందుకు  తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం.

భారతదేశంలో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమూ, చట్టబద్దపాలనా వుండాలనీ, మానవ విలువల్ని కాపాడుకోవాలనీ అనుకునే వ్యక్తులకీ సంస్థలకీ గుజరాత్‌ పెద్ద సవాలు విసిరింది. భారత రాజ్యాంగమ్మీద జరుగుతున్న ఈ ఫాసిస్టు దాడిని మనం ఎదుర్కోగలమా?
... ... ...

అహ్మదాబాద్‌ వెళ్తున్న సబర్మతీ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ లో ఒక బోగీపై గోధ్రా వద్ద దాడి చేసి తగులబెట్టడం, 12మంది పసిపిల్లలు, 26 మంది మహిళలతో సహా 58 మందిని సజీవ దహనం చేయడం క్షమించడానికి వీల్లేనంత రాక్షసత్వం. ఆ అమానుష అకృత్యానికి పాల్పడిన దుర్మార్గులని తక్షణమే విచారించి కఠినాతి కఠినంగా శిక్షించి తీరాల్సిందే.

కానీ ఆ నెపంతో-  ఆ దారుణంతో ఏమాత్రం సంబంధంలేని స్త్రీలపై  అత్యాచారాలు జరుపడం , పసిపిల్లలతో సహా అనేకమంది స్త్రీలనూ పురుషులనూ హతమార్చడం, విచ్చలవిడిగా విధ్వంసానికి పాల్పడడం అమానుషం. సభ్యసమాజం తలదించుకునేట్టు చేసిన ఉన్మాదం.
ఏమతం, ఏ ధర్మశాస్త్రం ఈ పైశాచికత్వాన్ని సమర్థిస్తుంది?
...  ...  ...

నాసిర్‌ ఖాన్‌ రహీంఖాన్‌ పఠాన్‌, ప్రిన్సిపాల్‌, సన్‌ఫ్లవర్‌ స్కూలు చెప్పిన సాక్ష్యం:

' నేను 9, 10 తరగతి విద్యార్థులకు ఇంగ్లీషు గణిత, బోధిస్తాను. మా స్కూల్లో హిందూ ముస్లిం విద్యార్థులు ఒకే బెంచీలో కూర్చుని చదువుకుంటారు. ఫిబ్రవరి 28న (2002) గుజరాత్‌ బంద్‌ ప్రకటించిన రోజు ఐదు పదివేలమందితో కూడిన చాలా పెద్ద గుంపు ఖాకీ రంగు నిక్కర్లు, కాషాయ రంగు బనియన్లు, తలకు నల్ల పట్టీలు కట్టుకుని వచ్చి దాడి జరిపారు. వాళ్ల దగ్గర శూలాలు, కత్తులు, యాసిడ్‌ బాంబులు, పెట్రోలు వున్నాయి. ... ... ...

మహ్రుక్‌ బానో కూతురు ఖైరున్నీసా పై జరిగిన అత్యాచారానికి ప్రత్యక్ష సాక్షిని నేను. పశువుల గుంపు 11 మంది ఆమెపై అత్యాచారం చేశారు.... .. తరువాత ఆ మూక, ఆ కుటుంబం మొత్తాన్ని ఒకరి తరువాత ఒకర్ని సజీవంగా దహనం చేశారు. ఇంటి యజమానురాలు ఖైరున్నీసా తల్లిని ముక్కలు ముక్కలుగా నరికారు  ...

గంగోత్రి, గోపి పార్క్‌ దగ్గర ఎస్‌టి వర్క్‌షాప్‌ వెనుక ఉన్న తిస్రా కుఆన్‌లో సుమారు 80 మందిని సజీవంగా దహనం చేసి బావిలోకి విసిరేశారు. తర్కాష్‌ బీబీ అబ్దుల్‌ ఘనీ అనే 70 ఏళ్ల ముసలామెను కూడా వాళ్లు సజీవ దహనం చేశారు. '' ముసల్మానోంకో జిందా జలాదో'' అన్నది వాళ్ల సందేశం. ...

గుండెల్ని పిండివేసే  ఇలాంటి అనేక దారుణాలను కమ్యూనిజం కంబాట్‌ పత్రిక సంపాదకులు తీస్తా సెతల్వాద్‌, జావెద్‌ ఆనంద్‌లు ఈ ప్రత్యేక సంచిక ద్వారా వెలుగులోకి తెచ్చారు.



గుజరాత్‌ 2002, జాతి హత్యాకాండ

ఆంగ్ల మూలం: Genocide: Gujarat 2002, Communalism Combat, Post BNox No. 28253,
Juhu Post Office, juhu, Mumbai- 400049


144 పేజీలు, ధర్‌ : రూ.50/-

ప్రచురణ కర్తలు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ & ప్రజాశక్తి బుక్‌ హౌస్‌

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ఫ్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌
హైదరాబాద్‌- 500020 ఫోన్‌ నెం. 040 23521849

ప్రజాశక్తి బుక్‌ హౌస్‌,
1-1-187/1/2, వివేక్‌ నగర్‌, చిక్కడపల్లి
హైదరాబాద్‌-500020, ఫోన్‌ నెం. 040 27660013

ఇస్లాంపై, ముస్లింలపై తరచూ జరిగే ప్రచారాలు
అసలు నిజాలు

బుక్‌లెట్‌ ధర: రూ.1/-

గుజరాత్‌ మారణకాండను ఎలా మరచిపోగలం ?
బుక్‌లెట్‌ ధర: రూ.3/-







4 comments:

  1. బుక్‌లెట్‌ ధర: రూ.1/- , ila oka roopayi dhara pette kante miru online lo free ga ivvachu kada , appudu adi chala mandiki cherutundi. free ga ani enduku cheptunnanu ante one ruppe pay cheyyali ante online lo konchem kastam.

    ReplyDelete
  2. "బుక్‌లెట్‌ ధర: రూ.1/- ," : ఒక రూపాయి ధరపెట్టే కంటే ఆన్-లైన్ లో ఫ్రీగా ఇవ్వచ్చు కదా. అప్పుడు అది చాల మందికి చేరే అవకాశం ఉంటుంది.

    ReplyDelete
  3. నాగశ్రీనివాస గారు
    మీ సూచనకు ధన్యవాదాలు
    మా వద్ద ఈ పుస్తకాల ఫిల్మ్ లే తప్ప డీ టీ పీ ఫైల్లు అందుబాటులో లేవు.
    రీ కంపోస్ చెసి బ్లాగులో పొందుపరిచేందుకు ప్రయత్నిస్తాము.
    ఇలాంటి మరికొన్ని పుస్తకాలను కూడా నెట్ ద్వార పాఠకులకు అందుబాటులో ఉంచాలన్న ఆలోచన వుంది.
    అయితే , ఎవరైనా స్వచ్చందంగా తప్పులు లేకుండా డీ టీ పీ చేసి ఇవ్వగలవారు
    హెచ్ బీ టీ కి సహకరించేందుకు ముందుకు వస్తే ఆర్ధికంగా కొంత సౌలభ్యంగా వుంటుంది.
    అలంటివారు ఈ కింది చిరునామాను సంప్రదిస్తే మేము వారికి డీ టీ ఫీ కొరకు వెంటనె
    ఎంపిక చేసిన పుస్తకాలను పోస్ట్ ద్వారా పం పిస్తాము.

    Gita Ramaswamy
    Hyderabad Book Trust
    Plot No. 85, Balaji Nagar, Gudimalkapur, Hyderabad 500006
    Phone No. 040 23521849
    E Mail : hyderabadbooktrust@gmail.com

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌