చిరస్మరణీయుడు సి.కె. - వరవరరావు
Andhra Jyothy
September 14, 2013
మంచి
కమ్యూనిస్టు, ఆదర్శ
కమ్యూనిస్టు అనే మాటలు వాడితే మంచి వారు, ఆదర్శజీవి కాకుండా కమ్యూనిస్టు ఎట్లా అవుతాడు అని
అంటారు గానీ కమ్యూనిస్టుగా గుర్తింపు పొందిన వాళ్లంతా మంచివాళ్లు, ఆదర్శజీవులు అయి ఉంటే మన దేశంలో
విప్లవం ఇంత ఆలస్యమై ఉండేది కాదేమో.
పైగా
కమ్యూనిస్టు భావజాలంలో వ్యక్తి నిజాయితీ కన్నా సమష్టి కోసం చేసే వర్గ పోరాటం మీద కేంద్రీకరణ
ఎక్కువగా ఉంటుంది గనుక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో కూడా సుందరయ్య గారిని
ఆయన నిరాడంబరత్వానికి గాంధీతోనే పోల్చారు. సి.కె. నారాయణ రెడ్డి గారిని చిత్తూరు గాంధీ అన్నారు.
(చిత్తూరు కరంచంద్ అనలేదు!)
నక్సల్బరీ, శ్రీకాకుళ రైతాంగ పోరాటాలు ప్రారంభమయ్యాక తెలుగు నేల మీద ఏర్పడిన మార్క్సిస్టు లెనినిస్టు నిర్మాణాల్లో రాయలసీమ నుంచి నేను విన్న పేర్లలో తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, తర్వాత ప్రముఖంగా పేర్కొనవలసిన పేర్లు ముగ్గురివి. ఎస్.ఎ. రవూఫ్, మహదేవన్, సి.కె. నారాయణరెడ్డి.

వీరిలో మహదేవన్
నక్సల్బరీ విస్ఫోటనం నాటికి మద్రాసు సినీ రంగంలో ఉండి, విప్లవానికి దారి దొరికింది అన్నట్లుగా కొల్లిపర రామనరసింహరావు
వలెనే మద్రాసు వదిలి వచ్చి చారు మజుందార్ నాయకత్వాన్ని స్వీకరించిన పార్టీలో రాయలసీమలో పనిచేస్తూ
పార్వతీపురం కుట్రకేసులో అరెస్టయి 1972 నాటికే జైలు పాలయ్యాడు. బెయిల్ మీద విడుదలై అజ్ఞాత జీవితంలోకి
వచ్చిన కొద్ది కాలానికే 1976లో
ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యాడు. ఎస్.ఎ. రవూఫ్ బెంగళూరులో అంపశయ్యపై ఉన్నాడు.
మనుషుల్ని గుర్తుపట్టగల, గ్రహించగల
స్థితిలో కూడా లేడు. ఇంక మిగిలిన సి.కె. నిక్కచ్చి, ముక్కుసూటి మనిషిగా, నిజాయితీగా, కమ్యూనిస్టుగా సార్థక జీవితం గడిపి తన 88వ ఏట కన్నుమూసాడు.
కొల్లా వెంకయ్యగారు రైతాంగ కార్యకర్త పేరుతో రాసిన అమరవీరుల జీవిత చరిత్ర ప్రచురణ సందర్భంగా డెబ్బైల ఆరంభంలోనే ఆయనతో పాటు సి.కె.తో నాకు, చెరబండరాజుకు సాన్నిహిత్యం ఏర్పడింది. సి.కె. చెరబండరాజుకు ప్రాణమిత్రుడై ఆయన కవితా సంపుటాల ప్రచురణకు సహా యం చేశాడు.
శ్రీకాకుళ ఉద్యమ సెట్‌బ్యాక్ తర్వాత బహుశా సి.కె. పుస్తక ప్రచురణా రంగంలోకి వచ్చినట్లున్నాడు. అయితే 'ఇస్క్రా' పత్రిక ఆర్గనైజర్ పనిచేయాలని లెనిన్ ఆశించినట్లుగా సి.కె. ప్రచురించిన పుస్తకాలన్నీ, ముఖ్యంగా విప్లవోద్యమం సెట్‌బ్యాక్ కాలంలోనూ, పునర్నిర్మాణ కాల ంలోనూ ఒక తరాన్ని తమ జీవితాలను మలచుకునేలా చేసినవంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా విప్లవోద్యమం శ్రీకాకుళం సెట్‌బ్యాక్ నుంచి స్వీయ విమర్శ చేసుకుని ప్రజాపంథా చేపట్టాలని పునర్నిర్మాణానికి పూనుకున్న కాలంలో సి.కె. ప్రచురించిన పుస్తకాలు కరదీపికలుగా పనిచేసినవి.
చారుమజుందార్ పంథాలోనే ప్రారంభమై శ్రీకాకుళ ఉద్యమాన్ని ఉజ్వలమైన త్యాగాల చరిత్రగా ప్రేమించిన కొల్లా వెంకయ్య, సి.కె.లు 1972 నాటికే చారుమజుందార్ రాజకీయాలతో విభేదించారు. బహుశా అందుకే చైనా విప్లవ అనుభవాలను ప్రచారం చేసే పుస్తక ప్రచురణకు పూనుకున్నారు సి.కె.
1974 నాటికే ఆయన హైదరాబాదులోని ఖైరతాబాదు నుంచి జనతా ప్రచురణలు ప్రారంభించారు. 1974 సృజన సంచికలో 'జనతా ప్రచురణలు' ప్రచురించిన 'చైనాపై అరుణతార' ఎడ్గార్ స్నో అనువాద గ్రంథం ప్రకటన వెలువడింది. అదే సంచికలో 'రక్తాశ్రువులు' (స్కాల్పెల్ అండ్ స్వోర్డ్ పేరుతో డాక్టర్ నార్మన్ బెతూన్ జీవితం, కృషిపై వచ్చిన ఇంగ్లీష్ పుస్తకం అనువాదం) పుస్తక పరిచయాన్ని అప్పటికింకా కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిగా ఉన్న రావి భుజంగరావు చేసాడు. మామూలుగా కాదు, డాక్టర్ నార్మన్ బెతూన్ స్ఫూర్తితో 'వైద్యులారా రోగుల దగ్గరికి మీరే వెళ్లండి' అనే పిలుపుతో.
నాకిప్పటికీ
జ్ఞాపకం, ఆ పుస్తకం ఇంకా
ప్రింటింగ్ ప్రెస్ తడి ఆరక ముందే ఆసాంతం చదివి ఒక సాయంత్రం వచ్చి ఆ పుస్తకం
ఎంత గొప్ప స్ఫూర్తియో, ఉత్తేజమో
నాకు వివరించి, ఆ రాత్రే నన్ను చదివేలా
చేసి మర్నాడు తన పరిచయం రాసి తెచ్చిచ్చాడు భుజంగరావు. కాకతీయ వైద్య కళాశాల
విప్లవ విద్యార్థులు ఎం.జి.ఎం. గోడల మీద 'వైద్యులారా రోగుల దగ్గరికి మీరే వెళ్లండి' అని నినాదాలు రాశారు. ఎదురుగా ఇస్లామియా
జూనియర్ కాలేజీ గోడల మీద రాశారు. నాకు తెలిసి 1974 నుంచి 1985 వరకు కాకతీయ వైద్య కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు ఆ స్ఫూర్తితో, ఆదర్శంతో పనిచేసారు. వాళ్లలో అమరులు
డాక్టర్ రామనాథం, డాక్టర్
ఆమడ నారాయణ, డాక్టర్ ఎ.
రామయ్యలను మనం ఎప్పుడూ మరచిపోలేం కదా. డా. కోట్నీస్ ముఖచిత్రంతో వెలువడిన సృజనలో ఈ పరిచయం, పుస్తకంలోంచి కొన్ని పేజీలు, డాక్టర్ చాగంటి భాస్కరరావు, డాక్టర్ నార్మన్ బెతూన్ ఫోటోలు అందులో ఉన్నాయి.
ఇంక రాష్ట్రవ్యాప్తంగా 'రక్తాశ్రువులు' పుస్తకం ద్వారా ముఖ్యంగా వైద్య విద్యార్థులకు
నార్మన్ బెతూన్ ఆ రోజుల్లో ఒక రోల్ మోడల్ అయ్యాడు. తమ పాఠ్య గ్రంథాలతో పాటు
'రక్తాశ్రువులు' ఒక పాఠ్య గ్రంథమైంది.
ఇంక 'విముక్తి' గురించి నా స్వీయానుభవం చెప్పాలి.
1973 అక్టోబర్‌లో మొదటిసారి నేను మీసా కింద అరెస్టయినపుడు డాక్టర్ రామనాథం గారు విలియం హింటన్ రాసిన 'ఫ్యాన్‌షెన్' పుస్తకం కొని పంపారు. 'శత్రువు రక్తంలో చేతులు ముంచిన వాడే కమ్యూనిస్టు' అని, వర్గశత్రు నిర్మూలన యుద్ధమే విప్లవమని అప్పటిదాకా తీవ్రంగా ఉన్న నా భావాలను ఆ పుస్తకం కుదిపేసింది. 1974లో మళ్లీ మేం జైలుకు వెళ్లే నాటికి కె.ఎస్. రాసిన 'ఆత్మవిమర్శ' పుస్తకం ఇంగ్లీషు అనువాదం కోసం కెవిఆర్‌కు వస్తే మేమంతా ఆ పుస్తక పఠనంలో నిమగ్నమయ్యాం. 1974 అక్టోబర్‌లో ఆర్ఎస్‌యు ఏర్పడి, 1975 ఫిబ్రవరిలో మహాసభలు జరుపుకుని ప్రజాపంథా చేపట్టే మార్గాన్ని ప్రచారం చేసే సాహిత్య అవసరాన్ని వెతుక్కుంటున్న రోజుల్లో జూన్ 1975లో జనతా ప్రచురణలు ఫ్యాన్‌షెన్ సంక్షిప్త రూపం 'విముక్తి'ని ప్రచురించింది. కొద్ది రోజుల్లోనే ఎమర్జెన్సీ వచ్చింది. బయటేమో నాకు తెలియదు గానీ ఎమర్జెన్సీలో నేను వరంగల్, సికిందరాబాదు, హైదరాబాదు మూడు జైళ్లలో ఎక్కువ కాలమే ఉన్నాను. మూడు జైళ్లలోనూ విప్లవ రాజకీయ ఖైదీలు వందల సంఖ్యలో ఉన్నారు. అందరికీ ఎమర్జెన్సీ కాలమంతా 'విముక్తి' ఒక టానిక్. మూడు జైళ్ళలోను ముప్పై మందికి పైగా విరసం సభ్యులం ఉండేవాళ్లం. రాడికల్ విద్యార్థులూ ఉండేవాళ్లు. మేమంతా బోల్షివిక్ పార్టీ చరిత్రతో పాటు, 'విముక్తి' సమష్టిగా చదువుకుని చర్చించుకునే వాళ్లం.
ఆఖరుసారిగా ఆయనను జార్జ్‌రెడ్డి నలభైవ వర్ధంతి సభలో 2012 ఏప్రిల్ 14న సుందరయ్య విజ్ఞాన భవన్‌లో చూశాను. ముందు వరుసలో కూర్చున్న ఆయన దగ్గరికి వెళ్లి పలకరించి వచ్చాను. కొల్లా వెంకయ్య గారితో 'అమరవీరుల జీవిత చరిత్రలు' ప్రచురణ సందర్భం తర్వాత మళ్లా సికిందరాబాద్ జైల్లో కలిసుండే అవకాశం వచ్చింది. కానీ సి.కె.తో ఉన్న అనుబంధమంతా ఆయన ప్రచురించిన పుస్తకాలతోనే. వాటి ప్రభావంతోనే. బహుశా 'సహవాసి'ని మూల రచయిత అని పాఠకులు భ్రమించేంత సుప్రసిద్ధ అనువాదకునిగా తీర్చిదిద్దిన కృషిలో కూడా సి.కె. నిర్వహించిన భూమిక ఉండే ఉంటుంది.

పత్రికలు, పుస్తకాలు ఏం చేయగలవో, ఎలక్ట్రానిక్ మీడియా ఇరవై నాలుగు గంటల రొదలో, ఆర్భాటంలో అర్థం చేయించడం కష్టం కావచ్చు, కానీ ఇప్పటికీ అజ్ఞాత జీవితంలోనూ, జైళ్ళలోనూ ఉన్న వాళ్ల పుస్తకాలం దాహం చూస్తే సి.కె. విప్లవోద్యమానికి చేసిన సేవ ఎంత చిరస్మరణీయమైందో అవగతమవుతుంది.
- వరవరరావు
(ఆంధ్ర జ్యోతి 14 సెప్టెంబర్ 2013 సౌజన్యంతో)
(సి.కె. నారాయణ రెడ్డి సంస్మరణ సభ - సెప్టెంబర్ 14 శనివారం సా.6 గంటలకు
బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో)
బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో)
.
No comments:
Post a Comment