'మా నాయన బాలయ్య'
- వై.బి.సత్యనారాయణ
అ లెక్స్ హేలీ 'ఏడుతరాలు' రాసి ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపాడు. ఆ పుస్తకం నల్లవాళ్ల బైబిల్‌గా ప్రసిద్ధికెక్కింది. ఇప్పుడు వై.బి.సత్యనారాయణ మూడు తరాల ఆత్మకథ రచించి చరిత్ర సృష్టించాడు. సాహిత్యంలో మరాఠీ ఆత్మకథ విజయకేతనం ఎగురవేస్తే ఇప్పుడు తెలుగులో తొలిజెండా ఎగురవేసిన ఈ పుస్తకం సాహిత్య చరిత్రలో ఓ మైలురాయి. మాదిగల చరిత్రను అక్షరీకరిస్తే అది రామాయణ, మహాభారతాలను మించిపోతుంది. ఇది ఒక బాలయ్య ఆత్మకథ మాత్రమే కాదు, లక్షలాది బాలయ్యల భార చరిత. రచయిత తన అపూర్వ మేధతో, పరిశీలనతో, రచనా శిల్పంతో ఈ పుస్తకాన్ని అమూల్యం చేశాడు. ఈ పుస్తకం చిదివితే మాట తప్పని మానధనులైన మాదిగల మహోన్నత మనస్తత్వం, స్వేచ్ఛ, వారి అమాయకత్వం పరోపకారప్రియత్వం, బహుభాషా పరిజ్ఞానం, సౌందర్యాత్మక దృష్టి మరియు చెప్పుల నిర్మాణంలో గొప్ప కళాసృష్టి పాఠకుల దృష్టిని ప్రగాఢంగా ఆకర్షిస్తాయి.
.................................................................................................................. - ఎండ్లూరి సుధాకర్
తెలంగాణా గ్రామీణ జీవితాల్లో పొరలు పొరలుగా ఎదురయ్యే పేదరికం, సామాజిక వెలి, అంటరానితనం, శ్రమ దోపిడీ, కష్టాల కడగండ్ల వంటి వాటన్నింటిపై ఓ దళిత కుటుంబం సాగించన యుద్ధాన్ని కళ్లకు కట్టే రచన ఇది. వాళ్లీ క్రమంలో చేసిన ప్రయత్నాలనూ, అనుభవించిన వేదననూ నిజాయితీగా ఆవిష్కరిస్తుందిది. విద్యకోసం, ఆత్మగౌరవం కోసం, స్వేచ్ఛకోసం జరిపే పోరాటంలో విజయం ఎంత ప్రధానమో బలంగా నొక్కి చెప్పే ఈ రచన - మనల్ని కల్లోల పరుస్తుంది. అదే సమయంలో ఎంతో స్ఫూర్తినీ రగిలిస్తుంది.
............................................................................................................................. - శాంతా సిన్హా
'... తన కొడుకుని గ్రామంలో వెట్టిచాకిరి నుంచి రక్షించాలనుకున్నాడు నర్సయ్య. అగ్రకులస్థుల నిరంతర వేధింపులు భరించలేక అతను తన పూర్వీకుల గ్రామాన్ని వదిలిరావడం- నర్సయ్యనే కాక తరువాతి తరాలను కూడా బంధవిముక్తుల్ని చేసింది. ఆత్మగౌరవమూ, కృషీ మనుషులకు శక్తినీ ఆత్మవిశ్వాసాన్నీ గుర్తింపునీ ఇస్తాయనేది బాలయ్య నమ్మకం. ఆ నమ్మకమే తన బిడ్డలను విద్యావంతులను చేయాలనే జీవిత ధ్యేయాన్ని కలుగచేసింది. నగరానికి వలసరావడం రైల్వేలో నౌకరీ సంపాదించడం భూస్వామల ఆగడాలకు దూరంగా, కొంత అజ్ఞాతంగా వుండడానికి కూడా దోహదం చేసింది. అయితే కుల వ్యవస్థా, దానితో వచ్చిన అవమానమూ దళితులను అన్నిచోట్లా వెంటాడుతూనే వుంటాయని ఈ జీవితకథ చెబుతుంది. విద్యాలయాల్లోనూ, ఇళ్లు అద్దెకు తీసుకునేటప్పుడూ ఒక్కొక్కసారి కులం దాచిపెట్టుకునే అవసరాన్ని కూడా పరిస్థితులు కల్పిస్తాయి. సమాజంలో మార్పుకు విద్య కీలకమైన పాత్ర పోషిస్తుందనీ, అది ఒక ఆయుధంవలె పనిచేస్తుందనీ ఈ పుస్తకం నొక్కి చెబుతుంది. ''
..................................................................................................- ఎస్.ఆర్. శంకరన్ (మార్చి 2010)
'మై ఫాదర్ బాలయ్య' పేరుతో ఆంగ్లంలో వెలువడిన రచనకు తెలుగు అనువాదం ఈ పుస్తకం. తెలంగాణా ప్రాంతానికి చెందిన ఓ మాదిగ రచయిత రాసిన మొట్టమొదటి ఆత్మకథాత్మక జీవిత చరిత్ర ఇది. ఒక రకంగా ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఇంగ్లీషులో వచ్చిన పూర్తిస్థాయి దళిత ఆత్మకథగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. రచయిత దీన్ని తన మాతృ భాష అయిన తెలుగులో కాకుండా ఇంగ్లీషులో ఎందుకు రాశారన్నది ఆసక్తికర అంశం. పుస్తకం చదువుతుంటే బాలయ్య, ఆయన కుటుంబం విద్యకు ఎంతటి ప్రాధాన్యం ఇచ్చారో మనకు అవగతమవుతుంది. అంటరానితనాన్ని, దాని మూలంగా నిత్య జీవితంలో అనుభవంలోకి వచ్చే తీవ్ర వివక్షలను అధిగమించడానికి విద్యను ఓ అత్యవసర సాధనంగా, మార్గంగా గుర్తించిన కుటుంబం వారిది. ఈ క్రమంలో రచయిత వై.బి.సత్యనారాయణ ఇంగ్లీషును మార్పునకు, ప్రభావశీలతకు కీలక సంకేతంగా కూడా గుర్తిస్తారు.
ప్రధానంగా రండు లక్ష్యాలను ఆశించి మేమీ తెలుగు అనువాదాన్ని మీ ముందుకు తెస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంగ్లీషులో వచ్చిన తొలి దళిత ఆత్మకథాత్మక జీవిత చరిత్రగా తెలుగునాట దీనికి సముచిత స్థానాన్ని కల్పించటం మొదటి ఉద్దేశం. రెండోది - తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన మాదిగ, దళిత అనుభవాలు, కులానికి సంబంధించి ఎన్నో అంశాలను 'డాక్యుమెంట్' చేసిన ఈ రచనను తెలుగు పాఠకులకు అందుబాటులో ఉంచటం అవసరం అని మేం భావాస్తున్నాం.
............................................................................................................ - హైదరాబాద్ బుక్ ట్రస్ట్
మా నాయన బాలయ్య
- వై.బి.సత్యనారాయణ
ఆంగ్లమూలం : My Father Balaiah, Harper Collins, New Delhi, 2011
తెలుగు అనువాదం: పి.సత్యవతి
184 పేజీలు, వెల: రూ. 100/-
ప్రతులకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్ 500006
ఫోన్ నెం. 040 2352 1849
.

No comments:
Post a Comment