Tuesday, December 7, 2010

నేనెందుకు ప్రవక్తపై పుస్తకం రాశాను?

భిన్న మతాల చరిత్రలను లోతుగా అధ్యయనం చేసి వాటిని వర్తమానానికి  అన్వయించుకొని విశ్లేషించడం చాలా క్లిష్టమైన కళ. దీనిలో నిష్ణాతురాలు క్యారాన్ ఆం స్ట్రాంగ్. ఆమె రాసిన "హిస్టరీ ఆఫ్ గాడ్" పుస్తకం కొన్ని లక్షల కాపీలు అమ్ముడయింది. ౩౦ భాషల్లోకి అనువదించబడింది. ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం పై ఆసక్తి పెరుగుతున్న నేపధ్యం లో ఆం స్ట్రాంగ్ రాసిన మరో పుస్తకం - "ముహమ్మద్ - ఎ బయోగ్రఫీ ఆఫ్ ప్రాఫెట్" దీని అనువాదాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఇటీవల ప్రచురించింది. దానిలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలను మీకు అందిస్తున్నాం. - ఆంద్ర జ్యోతి.
(ఆంద్ర జ్యోతి 7-12-2010  సౌజన్యంతో )

Thursday, December 2, 2010

''గాన్‌ విత్‌ ద విండ్‌'' తెలుగులో ... 'చివరకు మిగిలింది?'.... అనువాదం: ఎం.వి.రమణారెడ్డి ...




ప్రపంచ వ్యాప్తంగా
రెండు కోట్ల కాపీలు అమ్ముడుబోయి
చరిత్ర సృష్టించిన నవల...


సినిమాగా విడుదలై పది అకేడమీ అవార్డులు
సొంతం చేసుకున్న నవల...


ప్రేమ, పెళ్లి, కుటుంబ జీవితాలతో పాటు
అమెరికాలో భూస్వామ్య విధానం జరిపిన
చిట్టచివరి పోరాటాన్ని
కళ్లకు కట్టినట్టు చూపించే నవల...


బైబిల్‌ తర్వాత అమ్మకాల్లో ప్రథమ స్థానం
పొందిన  నవల...

''గాన్‌ విత్‌ ద విండ్‌'' 

ఇప్పుడు తెలుగులో

''చివరకు మిగిలింది?''


మూలం: మార్గరెట్‌ మిచ్చెల్‌
అనువాదం,   ప్రచురణకర్త : ఎం.వి.రమణారెడ్డి

వెల: రూ.200/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500067
ఫోన్‌ నెం. 040 23521849

ఇ మెయిల్‌:   hyderabadbooktrust@gmail.com


.

Sunday, November 28, 2010

ఉత్కంఠ భరితం ''చంద్రగిరి శిఖరం'' - ఆంధ్రజ్యోతి


'వనవాసి', 'పథేర్‌ పాంచాలి'ల రచయిత బిభూతి భూషణ్‌ బందోఫాధ్యాయ రాసిన మరో పుస్తకమే ''చంద్రగిరి శిఖరం''.
సాహసాలు ఇష్టమున్నవాళ్లకు విధిగా నచ్చే పుస్తకం.
ఎక్కడ బెంగాల్‌! ఎక్కడ ఆఫ్రికా!
శంకర్‌ అనే కుర్రాడు చిన్న ఉద్యోగం కోసం అక్కడిదాకా వెళ్లి అడుగడుగునా ప్రమాద భరిత, సాహసోపేత జీవితం గడుపుతూ తనతో పాటు మననూ ఆ జీవితం లోకి లాక్కుని పోతాడు.
అందులో మనిషి కాలుమోపని కొండలు, అడవులు, ఎడారులు, మన మెన్నడూ కనీవినీ ఎరుగని జంతువులు, పక్షులు, కీటకాలు ఎన్నో
తారసిల్లుతాయి. 


వర్షాలు, వరదలు, తుఫానులే కాదు అగ్నిపర్వతం  పేలడం కూడా చూస్తాం. అక్కడ వీటన్నిటిమధ్యా ఒకరిద్దరు విదేశీ సీనియర్‌ సాహస
యాత్రికులతో కలిసి అమూల్యమైన వజ్రాల వేటలో మన శంకర్‌..

ఎటువంటి ప్రయాణం అది!
ఒళ్లు గగుర్పొడిచే సాహసయాత్ర.
వజ్రాలు దొరుకుతాయా లేదా అనే ఉత్కంఠ కంటే శంకర్‌ క్షేమంగా తిరిగొస్తాడా లేడా అనే ఉత్కంఠే ఎక్కువ కలుగుతుంది మనకి.
కానీ, శంకర్‌కి వజ్రాలకంటే, తన క్షేమం కంటే, ఆ అనుభవమే ముఖ్యం. అనుభవం కోసం ప్రాణాలు బలిపెట్టడానికి సిద్ధమైన వాణ్ణి పాఠకులు

అక్కున చేర్చుకోకుండా ఉండగలరా?
కాకపోతే పాఠకులకు ఎడతెగని సస్పెన్స్‌ కల్పించడం కోసం శంకర్‌ ప్రయాణాన్ని మరీ సుదీర్ఘం చేసినట్టనిపిస్తుంది.

కాత్యాయని గారి అనువాదం అచ్చ తెలుగులాగే వుంది.
అన్నిటికీ అన్ని తెలుగు పేర్లు వెతికి రాయగలిగారామె.

ఇంతకాలం ఈ పుస్తకం తెలుగులో ఎందుకు రాలేదా అని ఆశ్చర్యమేస్తుంది.


-ఆంధ్రజ్యోతి, ఆదివారం, 28-11-2010

చంద్రగిరి శిఖరం
-బిబూతి భూషణ్‌ బందోపాధ్యాయ
తెలుగు అనువాదం: కాత్యాయని
పేజీలు: 104, వెల: రూ.50/-


ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడి మల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌ నెం. 040 2352 1849

ఇ మెయిల్‌:   hyderabadbooktrust@gmail.com

Friday, November 26, 2010

ముస్లింలను అర్థం చేసుకోవడం, వారి మతాన్ని గౌరవించడం నేర్చుకుందాం!


ముహమ్మద్‌ ప్రవక్త జీవితం
- క్యారెన్‌ ఆంస్ట్రాంగ్‌
తెలుగు అనువాదం: పి. సత్యవతి

''ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న మతం ఇస్లాం. క్యారెన్‌ ఆంస్ట్రాంగ్‌ వ్రాసిన ముహమ్మద్‌ ప్రవక్త జీవిత చరిత్ర ఇస్లామ్‌ గురించీ, ఆ మతాన్ని గాఢంగా అనుసరించే ప్రజల గురించీ లోతుగానూ ఖచ్చితంగానూ అర్థం చేయిస్తుంది. ఇస్లామ్‌కు దగ్గర సంబంధం కల జూడాయిజం, క్రైస్తవంతో ఆ మతానికి కల పోలికల్ని కూడా అందిస్తుంది''
''భక్తితో కాక గౌరవంతో, పాండిత్య ప్రకర్షతో కాక వస్తు పరిజ్ఞానంతో వ్రాసిన ఈ పుస్తకం, అన్నిటికీ మించి, చదివించే శక్తి కలది''
-ఎకనమిస్ట్‌

''పాశ్చాత్య పఠితల్లో వుండే అపోహల్నీ, అపార్థాలనీ పోగొట్టడానికి సానుభూతితో మాత్రమే వ్రాసిన పుస్తకం కాదిది. ముస్లిములకు కొంత ముఖ్యమైన పుస్తకం కూడా.''
- ముస్లిమ్‌ న్యూస్‌
...

ముందుమాట నుంచి ...

సల్మాన్‌ రష్డీ రచించిన ''సెటానిక్‌ వర్సెస్‌'' వివాదం, రష్డీని హతమార్చాలంటూ అయాతుల్లా ఖొమైనీ 'ఫత్వా' జారీ సందర్భంగా నేను ఈ ముహమ్మద్‌ ప్రవక్త జీవిత చరిత్ర వ్రాశాను.

అంతకు ముందు ఎంతో ఉదారంగా, స్వతంత్రంగా ఆలోచించే వారుకూడా అప్పుడు ఇస్లాం మతం పట్ల కనబరచిన అహేతుకమైన ద్వేషం నన్ను చాలా కలవరపరిచింది. ... ప్రపంచ జనాభాలో దాదాపు అయిదు వంతులుగా వున్న ఒక మతం పట్ల మనం అస్పష్టమైన, అసత్యమైన అభిప్రాయాలను పెంచిపోషించ కూడదనిపించింది. ...

1990లో నేనీ పుస్తకం వ్రాస్తున్నప్పుడు ఒక ఇస్లామిక్‌ కాంగ్రెస్‌ సమావేశం జరగింది.  అందులో పాల్గొన్న 45 ముస్లిం రాజ్యాల తాలూకు 44 మంది ప్రతినిధులు ఖొమేనీ జారీ చేసిన ఫత్వాని నిర్ద్వంద్వంగా ఖండించారు. అది ఇస్లామ్‌ మత విరుద్ధమన్నారు.  అయినా బ్రిటన్‌లో  ఎవరూ కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ...

అయాతుల్లా ఖొమేనీతో విభేదించేవారూ, రష్డీన చంపాలనే కోరికలేని వారూ అయిన ముస్లిములు బ్రిటన్‌లో చాలామంది వున్నారు. అయితే సల్మాన్‌ రష్డీ తన నవలలో ముహమ్మద్‌ ప్రవక్తను దైవ దూషకునిగా చిత్రించడం వాళ్లందరినీ తీవ్రంగా కలవరపరిచింది.

పశ్చిమ మేధావులు మాత్రం, ముస్లింలంతా రష్డీ రక్తం కళ్ల జూడాలనుకుంటున్నారని భావించారు. కొందరు బ్రిటన్‌ రచయితలు, మేధావులు తత్వవేత్తలు కూడా ఇస్లామ్‌ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. నిజం తెలుసుకోడానికి కూడా ఆసక్తి కనబరచలేదు. వారి దృష్టిలో ఇస్లాం సహనం లేని ఒక మూఢమతం. గౌరవించతగ్గ మతం కాదు. అంతేకాదు, రష్డీ ముహమ్మద్‌ని చిత్రించిన తీరుకు నొచ్చుకున్న ముస్లిముల సున్నితమైన మనోభావాలను వారు అసలు పట్టించుకోలేదు. అదంత ముఖ్యమైన విషయమే కాదనుకున్నారు.
. ...
2001 సెప్టెంబర్‌ 11 సంఘటన... ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని, పెంటగన్‌లో ఒక భాగాన్ని ముస్లిం ఉగ్రవాదులు ధ్వంసం చేసిన తీరు, దాదాపు 5000 వేల మంది మరణానికి కారణం కావడం పశ్చిమ దేశాలలో ముస్లిమ్‌ వ్యతిరేకతను తిరిగి రెచ్చగొట్టి, వారికి ఇస్లామ్‌ మతం పై వుండే ద్వేషాన్ని ద్విగుణీకృతం చేసింది.
...
ఇస్లాం హింసను సమర్థిస్తుందనే భావాలు ప్రచారంలో వున్నాయి. ఈ హింసాత్మక సంఘటన తరువాత జరిగిన అనేక చర్చల్లో, వాదవివాదాల్లో చాలామంది ఖురాన్‌లోని కొన్ని పరుషమైన వాక్యాలను ఉల్లేఖించడం ప్రారంభించారు. అటువంటి వాక్యాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తాయని వాదించారు. అయితే ఈ వాదన చేసేవారు క్రిస్టియన్‌, జ్యూయిష్‌ తదితర మత గ్రంధాల్లో కూడా అనేక హింసను ప్రోత్సహించే వాక్యాలు వున్నాయనే విషయాన్ని మరిచిపోతున్నారు.
...
పాశ్చాత్యుల్లో చాలామందికి ఇస్లాం మతం గురించి సంపూర్ణంగా తెలియదు. విచక్షణతో విశ్లేషించి ఉపయోగకరమైన చర్చ చెయ్యరు.
...
ఇరవై ఒకటో శతాబ్దంలోనైనా మనం మెరుగ్గా ఉండాలంటే
మనతో ఈ ధరిత్రిపై సహజీవనం చేస్తున్న ముస్లమ్‌లను అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి.
వారి మతాన్ని అభిమానించడం, గౌరవించడం నేర్చుకోవాలి. వారి అవసరాలను, వారి ఆరాటపోరాటాలను, వారి ఆశలను ఉద్దేశాలను గుర్తించాలి.
అందుకు ముహమ్మద్‌ ప్రవక్త జీవితాన్ని గురించిన ఖచ్చితమైన జ్ఞానం సంపాదించడం మొదటి మెట్టు.
ఈ సంక్లిష్ట సమయంలోని అజ్ఞాన తిమిరాన్ని ఆయన మేధో వికాస కాంతులు పారదోలగలవు.

...
పుస్తక రచయిత్రి గురించి:
క్యారెన్‌ ఆంస్ట్రాంగ్‌ 1944 నవంబర్‌ 14న బ్రిటన్‌లో జన్మించారు. 1962 నుంచి ఏడు సంవత్సరాలు హోలీ చైల్డ్‌ జీసస్‌ సొసైటీలో ఒక నన్‌గా వున్నారు. తరువాత సొసైటీ నుంచి తప్పుకొని టెన్నిసన్‌ మీద డీ.లిట్‌ చేస్తూ అస్వస్థత వల్ల అసంపూర్తిగా వదిలేశారు.
నన్‌గా తన అనుభావాలను, అవేదనలను వ్యక్తపరుస్తూ 1982లో వ్రాసిన ''థ్రూ ది నారో గేట్‌'' బహుళ  జనాదరణ పొందింది. అప్పుడే ఒక బ్రిటీష్‌ టెలివిజన్‌  ఛానెల్‌ ఆమెకు  సెయింట్‌ పాల్‌ మీద డాక్యుమెంటరీ తీసే అవకాశమిచ్చింది. ఆ పని మీద జెరూసలేంలో వుండడం కూడా ఆమెను ఎక్కువ ప్రభావితం చేసింది. 1993లో ఆమె వ్రాసిన ''హిస్టరీ ఆప్‌ గాడ్‌'' దాదాపు 30 భాషల్లోకి అనువాదమై ప్రపంచ ప్రజల మన్ననలందుకుంది.
అన్ని మతాల తులనాత్మక అధ్యయనం ఆమె అభిరుచి. ప్రపంచలోని అన్ని మత సంప్రదాయాల బాహ్య స్వరూపాలలో వైవిధ్యం వున్నా వాటి అంతస్సారం ఒకటేననీ మతాలన్నీ కూడా పరస్పర సానుభూతినీ సదవగాహననూ, సహనాన్నీ బోధించేవేననీ నమ్మకం కన్నా ఆచరణ ముఖ్యమనేది అమె తాత్విక దృక్పథం.

...
అనువాదకురాలి గురించి:
పి. సత్యవతి ప్రసిద్ధ స్త్రీవాద కథా రచయిత్రి. ''సత్యవతి కథలు'', ''ఇల్లలకగానే'', ''మంత్రనగరి'' కథా సంపుటాలు ప్రచురించారు. కొన్ని ఆంగ్ల కథలు తెలుగులోకి అనువదించారు. విజయవాడలో వుంటారు.

ఉదయకాంతి రేఖ
ముహమ్మద్‌ ప్రవక్త
రచన: క్యారెన్‌ ఆంస్ట్రాంగ్‌
తెలుగు: పి. సత్యవతి
ఆంగ్ల మూలం: Muhammad: A Biography of the Prophet, 1991, Harper Collins, U.K.


206 పేజీలు, వెల: రూ.80/-


ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడి మల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌ నెం. 040 2352 1849
ఇ మెయిల్‌:
hyderabadbooktrust@gmail.com

Wednesday, November 10, 2010

వర్గ నిర్మూలన ద్వారా కుల నిర్మూలన జరుగుతుందా? లేక కుల నిర్మూలన ద్వారా వర్గ నిర్మూలన జరుగుతుందా??



కులం - వర్గం

- బొజ్జా తారకం

...
కులం అనగానే కొంతమందికి డాక్టర్‌ అంబేడ్కర్‌ గుర్తుకు వస్తాడు.

వర్గం అనగానే కొంతమందికి కార్ల్‌
మార్క్స్ గుర్తుకు వస్తాడు.

భారతదేశంలోని ప్రధాన సమస్య కులం అని డాక్టర్‌ అంబేడ్కర్‌ చెబితే -
ప్రపంచంలోని ప్రధాన సమస్య వర్గం అని
మార్క్స్ చెప్పాడు.

కులం సమస్యను పరిష్కరిస్తే భారతదేశంలోని ప్రధానమైన సమస్య పరిష్కారం అవుతుందని డాక్టర్‌ అంబేడ్కర్‌ చెబితే -


వర్గ సమస్యను పరిష్కరిస్తే ప్రపంచంలోని ప్రధాన సమస్య పరిష్కారం అవుతుందని
మార్క్స్ చెప్పాడు.

కుల సమస్యను క్షుణ్ణంగా అంబేడ్కర్‌ పరిశీలిస్తే వర్గ సమస్యను విపులంగా
మార్క్స్ పరిశీలించాడు.

కులసమస్యతో పాటు వర్గ సమస్యను పరిశోధించటానికి అంబేడ్కర్‌కి అవకాశం లభించింది కానీ వర్గ సమస్యతో పాటు కుల సమస్యను అంత వివరంగా పరిశోధించటానికి
మార్క్స్ కు అవకాశం లేకపోయింది.

భారత దేశంలో కుల సమస్యా వున్నది, వర్గ సమస్యా వున్నది. 


కుల వైరుధ్యాలు వున్నాయి, వర్గ వైరుధ్యాలు వున్నాయి. 


కుల ద్వేషం వున్నది, వర్గ ద్వేషమూ వున్నది. 


కులాధిపత్యం వున్నది, వర్గాధిపత్యమూ వున్నది.


అందువల్ల అంబేడ్కర్‌కి ఈ రెండింటినీ పరిశోధించే అవకాశం దొరికింది. .....




కులం - వర్గం
రచన: బొజ్జా తారకం

 
ప్రథమ ముద్రణ: 1996
పునర్ముద్రణ: 2002, 2008 

 
87 పేజీలు, వెల: రూ.30/-

Tuesday, November 9, 2010

నెహ్రూ కంటె, నేతాజీ కంటె భీమ్‌రావు అంబేద్కర్‌ మహామహుడు - నార్ల వెంకటేశ్వరరావు ...


బాబా సాహెబ్‌ అంబేద్కర్‌
 
(జీవిత చరిత్ర)


రచన: బి.విజయభారతి



ఈ పుస్తకానికి 1982లో నార్ల వెంకటేశ్వరరావు రాసిన పీఠిక నుంచి ...

ఒక ప్రసంగంలో డాక్టర్‌ అంబేద్కర్‌ అన్నాడు - గాంధీ కంటె, జిన్నా కంటె మహదేవ గోవింద రెనడే అనేక విధాల మహామహుడని.
ఈ పీఠికలో నేనంటున్నాను - నెహ్రూ
కంటె, నేతాజీ కంటె భీమ్‌రావు అంబేద్కర్‌ మహామహుడని.

నెహూృ నేతాజీలవలె అంబేద్కర్‌ జన్మించింది అగ్రకులంలో కాదు, నిమ్నాతి నిమ్నమైన దానిలో. వారివలె ఆయన సంపన్న కుటుంబంలో పెరగలేదు. కటిక దారిద్య్రంలో పెరిగాడు. అడుగడుగునా అవమానాల మధ్య పెరిగాడు. ఒక గాంధీకి, ఒక సి.ఆర్‌.దాస్‌కు కూర్చినట్టు ఆయనకు రాజకీయంగా ప్రోత్సాహ ప్రోద్బలాలను కూర్చినవారు లేరు. సరిగదా, ఎందరెందరో ఆయనను అణగద్రొక్కడానికి ప్రయత్నించారు.

అయినా డాక్టర్‌ అంబేద్కర్‌  మహోన్నత స్థితికి రాగలగడం స్వయం కృషి వల్లనే, స్వీయ ప్రతిభ వల్లనే. విద్యా విజ్ఞానాలలో ఆయనకు సాటి రాగలవారు తక్కువ. ప్రజ్ఞా ప్రాభవాలలో ఆయనను మించగలవారు లేరనే చెప్పవచ్చు.
ధైర్య సాహసాలలో ఆయన స్థానం ప్రథమ శ్రేణిలో.  శీల సంపదకు ఆయన సరసన నిలవగలవారు ఈనాటి భారత వర్షంలో బహుశా ఒక్కరైనా లేరు.

ఇవి ముఖస్తుతులనడానికి, వీటిని విని నాకు ఏదో కట్టబెట్టడానికి అంబేద్కర్‌ సజీవుడైలేడు.  పోతే, ఇవి ఆత్యుక్తులనడానికి ఎవరైనా సాహసిస్తే వారికి భారత సాంఘిక చరిత్ర ఆణుమాత్రంగానైనా తెలియదనే చెప్పవలసి వుంటుంది.
... ... ... ... ... 

 
బానిసత్వం కంటె అతి నీచమైనది, నికృష్టమైనది, అత్యంత క్రూరమైనది, కఠోరమైనది, ఆద్యంతం అధమాధమమైనది, అమానుషమైనది - అస్పృశ్యత. 
ప్రపంచం మొత్తం మీదనే మరొక దేశంలో ఈ విధమైన రాక్షసత్వం కానరాదు.
.... ... ... ...
అస్పృశ్యతపై హిందూ దేశంలో తిరగబడిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్‌ అంబేద్కర్‌ కావడం ఏ దృష్టితో చూచినా ఒక గొప్ప విశేషం.
ఆయన గురించి చదివినకొద్దీ ఆయన పట్ల నాకున్న ప్రేమ గౌరవాలు పెరుగుతూ పోతున్నాయి.

అయితే ఆయన సాగించిన తిరుగుబాటు సాగవలసిన మేరకు సాగలేదు.
కొన్ని విషయాలలో సాగవలసిన మార్గాలలో సాగలేదు కూడా.
అందువల్లనే ఈనాడు దేశంలో ఏదో ఒకమూల అస్పృశ్యులపై ఏదో ఒక అత్యాచారం, ఏదో ఒక అమానుష చర్య జరిగినట్టు దినపత్రికలలో వార్తలు వస్తూనే వున్నాయి.
కాగా, పత్రికలకెక్కని ఘోరాలలెన్నో, క్రౌర్యాలెన్నో ఎవరు చెప్పగలరు?

ఈ దుర్భర పరిస్థితి తొలగాలంటే ఒక అంబేద్కర్‌ చాలడు.
ఆయన అంతస్తును అందుకొనలేకపోయినా, కనీసం ఆయన ప్రతిభలో, ఆయన స్వేచ్చా �ప్రవృత్తిలో, ఆయన నిష్కలంక శీలంలో శతాంశాన్ని చూపగలవారైనా కొన్ని వందలమంది ఆ సంఘం నుంచి పైకి రావాలి.
అందుకు కావలసిన ఉత్కంఠను, అందుకు కావలసిన ఉత్తేజాన్ని
డాక్టర్‌ బి.విజయభారతి రచించిన అంబేద్కర్‌ జీవిత చరిత్ర కలిగించగలదని ఆశిస్తున్నాను.

పెక్కు గ్రంథాలను పరిశోధించి సరళమైన శైలిలో, సమగ్రమైన రీతిలో ఈ రచనను చేసినందుకు ఆమెను నేను అభినందిస్తున్నాను.
ఆమె రచనలో ఆలోచనతోపాటు ఆవేదన వున్నది.
జీవంతో పాటు జవం వున్నది.
ఇది జీవిత చరిత్ర అయినా నవల వలె సాఫీగా నడుస్తున్నది.
కొన్ని కొన్ని ఘట్టాలలో నాటకం వలె ముఖ్య దృశ్యాలను కళ్లకు కట్టినట్టు చూపుతున్నది.
దీనిలో చెదురుగా కొన్ని లోపాలుంటే అవి పట్టించుకోదగినవి కావు.
ఇంతటితో సరిపుచ్చక అస్పృశ్య సంఘంలో నవచైతన్యానికి, విప్లవోత్సాహానికి దోహదం కూర్చగల మరి పెక్కు రచనలను డాక్టర్‌ విజయభారతి కొనసాగించాలని ఆశీర్వదిస్తున్నాను.

- నార్ల వెంకటేశ్వరరావు, జూన్‌, 1982, లుంబిని, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌, 500034

బాబా సాహెబ్‌ అంబేద్కర్‌

 
బి.విజయభారతి
మొదటి ముద్రణ: 1982
పునర్ముద్రణ: 1986, 1990, 1992, 1999, 2005, 2008, 2009

 
256 పేజీలు, వెల: రూ.70/-

Monday, November 8, 2010

ఆధునిక భారత చరిత్ర ...


ఆధునిక భారత చరిత్ర ...

గతంలో భారత దేశాన్ని ఆక్రమించిన విదేశీయులకూ, బ్రిటీష్‌ వారికీ మధ్య వున్న తేడా ఏమిటి?
భారతదేశం మీద బ్రిటన్‌ సాధించిన విజయం ప్రత్యేకత ఏమిటి?
భారత జాతీయోద్యమానికి 1857 తిరుగుబాటు ఏ రకమైన ఊపునిచ్చింది?
ఏఏ సామాజిక, మత సంస్కరణోద్యమాలు ఆవిర్భవించాయి?
అవి ఏ సుప్త చైతన్యాన్ని మేల్కొల్పాయి?
జాతీయోద్యమానికి ప్రజలు ఏవిధంగా స్పందించారు?
భారత జాతీయవాదంలోని పాయలేమిటి?
బ్రిటీష్‌ వలసవాద కుటిల రాజనీతి ఫలితంగా దేశానికి కలిగిన అరిష్టమేమిటి?

ఈ ప్రశ్నలకు సామాధానమే ఈ పుస్తకం.
ప్రజల ఆర్థిక, సామాజిక జీవిత విధానాల్లో వచ్చిన పరిణామాలకు చరిత్రను పునాదిగా గ్రహించిన కొద్దిమంది చరిత్రకారులలో ఈ గ్రంథ రచయిత బిపిన్‌ చంద్ర ఒకరు.

భారత సామాజిక జీవితంలోని వైరుధ్యాలనూ, సంక్లిష్టతనూ బిపిన్‌ చంద్ర అత్యంత ప్రతిభావంతంగా విశ్లేషించారు. నాయకుల మీద, మహా వ్యక్తుల మీద కాకుండా చరిత్రచోదక శక్తుల మీద, ఉద్యమాల మీద తమ దృష్టిని కేంద్రీకరించారు.
18వ శతాబ్దపు ఆర్థిక, సాంఘిక విషయాల చర్చ ఈ పుస్తకంలో విశేషంగా వుంది.
విదేశాల నుంచి వచ్చిన వర్తక సంస్థలు ఈ దేశాన్ని సునాయాసంగా ఆక్రమించుకోటానికి దారితీసిన పరిస్థితులను గ్రహించటానికి ఈ చర్చ ఎంతో ఉపయోగపడుతుంది.
బ్రిటీష్‌ సామ్రాజ్యవాదతత్వాన్ని, భారత ప్రజల జీవన విధానాలమీద దాని ప్రభావాన్ని విపులంగా వివరించారు.
దేశ ప్రజల్లో జాతీయతా భావావిర్భావం, విదేశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన దేశవ్యాపిత పోరాటం, రాజకీయ స్వాతంత్య్ర సముపార్జన తదితర అంశాలను ఇందులో సవివరంగా చిత్రించారు.

ఆధునిక భారత చరిత్ర
బిపిన్‌ చంద్ర
 

ఆంగ్ల మూలం: Modern India, Bipin Chandra
తెలుగు: సహవాసి
ప్రథమ ముద్రణ:1988
పునర్ముద్రణ: 1992, 1994, 1996, 1998, 2000, 2003, 2007
పేజీలు: 348 వెల: రూ.100/-

Sunday, November 7, 2010

నిలదీసే అక్షరాలు ....

నిలదీసే అక్షరాలు...

మార్క్సిస్టు అవగాహనతో తొలుత పౌర హక్కుల సంఘం కార్యకర్తగా, నేతగా ప్రత్యేకతను చూపిన డాక్టర్‌ కె. బాలగోపాల్‌ ఆ తర్వాత మానవ హక్కుల వేదిక ద్వారా తన కృషిని విస్తృత పరిచారు.
వివిధ రంగాల్లోని అనేక సమస్యలపై ఉద్యమించిన ఆయన, సమకాలీన సమాజంలోని వైరుధ్యాలను కూడా ప్రత్యేక రీతిలో విశ్లేషించారు.

బాలగోపాల్‌ మరణించి ఏడాదయిన సందర్భంగా పలు సంస్థలు ఆయన స్మృతిలో పుస్తకాలను ప్రచురించాయి. వివిధ సంధర్భాల్లో ఆయన చేసిన ప్రసంగాలను ''రాజ్యం - సంక్షేమం'' పేరిట 'పర్‌స్పెక్టివ్స్‌' పుస్తకంగా తీసుకొచ్చింది.

రాజ్యం ఆణచివేత స్వభావాన్ని నిలదీసిన బాలగోపాల్‌, సంక్షేమ బాధ్యత దానిపై ఉందని, అది ఉద్యమాల ఫలితమని స్పష్టం చేశారు.
మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో నక్సలైట్‌ ఉ్యమం తీరుతెన్నులు, ప్రభుత్వాల వైఖరులపై తనదైన అభిప్రాయాన్ని వెల్లడించారు. సెజ్‌లు, బహుళ జాతి సంస్థల విస్తరణను అడ్డుకునేందుకు ప్రజా ఉద్యమాలు మరింతగా అవసరమని నొక్కి చెప్పారు.

లోతయిన విశ్లేషణతో నిక్కచ్చిగా తన భావాలను వెల్లడించే బాలగోపాల్‌ మతం విషయంలో కూడా ఏమాత్రం తడబడకుండా దాని వికృతత్వాన్ని పలు సందర్భాల్లో ఎండగట్టారు. ఆ రచనలను హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ మతతత్వంపై బాలగోపాల్‌ పేరిట ప్రచురించింది.

మానవ హక్కుల వేదిక ప్రచురించిన ''హక్కుల ఉద్యమం- తాత్విక దృక్పథం'',  ''మా బాలగోపాల్‌'' కూడా ఆ హక్కుల యోధుడి జీవితానికీ, ఆలోచనలకూ అద్దం పట్టేవే.



రాజ్యం - సంక్షేమం
కె.బాలగోపాల్‌ ఉపన్యాసాలు
పేజీలు: 164, వెల: రూ.100/-

మతతత్వంపై బాలగోపాల్‌
పేజీలు 336, వెల: రూ.150/-

హక్కుల ఉద్యమం-తాత్విక దృక్పథం
పేజీలు: 248, వెల: రూ.100/-

మా బాలగోపాల్‌
పేజీలు: 248, వెల: రూ.100/-


ఈనాడు ఆదివారం 07 నవంబర్‌ 2010

Sunday, October 31, 2010

మనసున్న మహా గాయని

మనసున్న మహా గాయని

బెంగుళూరు నాగరత్నమ్మ ఓ శతాబ్దం క్రితమే, పురుషాధిక్య సమాజాన్ని ఎదిరించి నిలిచారు.
సంగీత ప్రతిభతో మహామహుల ఆదరం పొందారు.
ఆస్తులు సంపాదించారు.
తంజావూరు పాలకుల ఆస్థాన కవయిత్రి ముద్దుపళని రాసిన రాధికా సాంత్వనము అనే శృంగార కావ్యాన్ని ధైర్యంగా ముద్రించారు.

తిరువయ్యారులో త్యాగరాజు సమాధి శిధిలావస్థలో వుందని తెలిసి ఆ”మె మనసు ద్రవించింది.
వెంటనే బయల్దేరి వెళ్లారు.
ఇక తిరువయ్యారే ఆమె ప్రపంచమైపోయింది.
త్యాగయ్య సమాధే ఆమెకు సర్వస్వమైపోయింది.
తనకున్న ఆస్తులన్నీ కరిగించి ఆలయాన్ని కట్టాంచారు.
త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో మహిళలకు ప్రవేశం కల్పించిన ఘనత కూడా నాగరత్నమ్మదే.
కావేరీ తీరంలోని ఆమె సమాధి సంగీతాభిమానుల పుణ్యక్షేత్రం.
 
ఆ సంగీత సామ్రాజ్ఞి జీవితాన్నీ, వ్యక్తిత్వాన్నీ ఈ పుస్తకంలో కళ్లకు కట్టారు వి.శ్రీరాం.
సంగీత ప్రపంచానికి కూడా పెద్దగా తెలియని ఆమె జీవిత విశేషాల్ని సేకరించడానికి రచయిత చాలా కష్టపడ్డారని అడుగడుగునా కనిపించే రెఫరెన్సులు చూస్తేనే అర్థమైపోతుంది.
అనువాదం సరళంగా వుంది.

- వాణి.
ఈనాడు ఆదివారం 31-10-2010




















బెంగుళూరు
నాగరత్నమ్మ 
జీవిత చరిత్ర
శ్రీ రాం.వి
అనువాదం: టి. పద్మిని
ముఖచిత్రం: బత్తుల
పేజీలు 143
వెల: రూ.60/-

ప్రతులకు, వివరాలకు
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067
ఫోన్‌: 040 2352 1849 

Friday, October 22, 2010

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వద్ద లభించే ఇతర సంస్థలు ప్రచురించిన కే బాలగోపాల్ పుస్తకాలు


1. మా బాల గోపాల్
మానవ హక్కుల వేదిక ప్రచురణ
165 పేజీలు  వెల: రూ. 100 /- 

]


2. హక్కుల ఉద్యమం - తాత్విక దృక్పధం
మానవ హక్కుల వేదిక ప్రచురణ
248 పేజీలు  వెల: రూ. 100 /-


 


3.రాజ్యం - సంక్షేమం
కే బాలగోపాల్ ఉపన్యాసాలు
పర్స్పెక్టివ్ ప్రచురణ 
170 పేజీలు  వెల : రూ. 100 /-  


4. వీటితోపాటు మనవ హక్కుల వేదిక వారి బాలగోపాల్ ఉపన్యాసాల డీవీడీ (తెలుగు) కూడా వుంది. వెల రూ. 50 /- 

కావలసిన వారు
సంప్రదించ వలసిన చిరునామా :

హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్, గుడి మల్కాపూర్,
హైదరాబాద్ - 500 067
ఫోన్ నెం. 040 2352 1849
ఇ మెయిల్ :
   hyderabadbooktrust@gmail.com

Friday, October 15, 2010

చంద్రగిరి శిఖరం (చందేర్‌ పహార్‌) - బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ - తెలుగు అనువాదం: కాత్యాయని-


చంద్రగిరి శిఖరం 
- బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ -

బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ పేరు వినగానే తెలుగు పాఠకులకు రెండు అపురూపమైన నవలలు గుర్తొస్తాయి.
ఒకటి: పథేర్‌ పాంచాలి.
రెండు: వనవాసి - 

వాటితో పోల్చినప్పుడు ఈ చంద్రగిరి శిఖరం (చందేర్‌ పహార్‌) కాస్త భిన్నమైనదిగా తోచవచ్చు. (ఇది పూర్తిస్థాయి సాహసగాథ కావటం వల్ల అలాఅనిపిస్తుంది) కానీ, కొంచెం లోతుగా పరిశీలించి చూస్తే బిభూతి భూషణుడి జీవన తాత్వికతా, ప్రకృతితో ఆయనకున్న ప్రగాఢమైన అనుబంధమూఈ మూడు నవలల్లోనూ సమానంగానే ప్రతిఫలించాయని అర్థమవుతుంది.

ప్రకృతి సౌందర్యాన్ని దర్శించటంలో ఈ రచయిత దొక విలక్షణమైన దృష్టి.  ప్రకృతిలోని అన్ని పార్శ్వాల్లోనూ, అన్ని శక్తుల్లోనూ వ్యక్తమయ్యే సౌందర్యాన్ని ఆస్వాదించి పాఠకుల అనుభూతికి అందించగలడాయన.

పూల వనాలూ, కీకారణ్యాలూ, వెన్నెల రాత్రులూ, కార్చిచ్చు జ్వాలలూ, జలపాతాలూ, అగ్నిపర్వతాలూ... ప్రకృతిలోని ప్రతి అంశాన్నీ మానవజీవితంలోని వెలుగునీడలంత సహజంగా స్వీకరించి, ప్రేమించగలడాయన. ఈ తాత్వికతే ఆయన రచనలకు గొప్ప గాఢతనూ, సౌందర్యాన్నీచేకూర్చింది.

'పథేర్‌ పాంచాలి' నవలలో బెంగాల్‌ పల్లెసీమల ప్రకృతి దృశ్యాలనూ, 'వనవాసి' నవలలో లవటులియా, మౌహన్‌పురా ప్రాంతాల అరణ్య శోభనూ వర్ణించిన బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ ఈ చందేర్‌ పహార్‌ (చంద్ర గిరి శిఖరం)లో ఆఫ్రికన్‌ అడవుల భయద సౌందర్యాన్ని దృశ్యమానం చేశాడు. 

శంకర్‌ అన్న బెంగాలీ యువకుడు ఆఫ్రికన్‌ అరణ్యాల్లోని చందేర్‌ పహార్‌ అనే పర్వతాన్ని అధిరోహించాలన్న ఆశతో సాగించిన సాహస యాత్రను
ఉత్కంఠ భరితంగా చిత్రించాడు.

అయితే ఇది కేవలం కాలక్షేపాన్ని అందించే సాహస గాథ వంటిది కాదు. ప్రకృతితో గాఢమైన అనుంబంధం ద్వారా మానవ స్వభావానికి చేకూరే సౌకుమార్యాన్నీ, స్వార్థ రాహిత్యాన్నీ, తాత్విక దృష్టినీ గురించి ఎంతో సున్నితంగా చెప్తుందీ నవల. బిభూతి భూషణుడి రచనలతో తెలుగు పాఠకుల అనుబంధాన్ని ఇది మరింత గాఢం చేస్తుంది.

చంద్రగిరి శిఖరం
బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ
బెంగాలీ మూలం : చందేర్‌ పహార్‌
తెలుగు అనువాదం: కాత్యాయని
104 పేజీలు
వెల: రూ.50/-

Thursday, October 14, 2010

బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర -


బెంగుళూరు నాగరత్నమ్మ ఒక దేవదాసి.
ఓ అసాధారణ స్త్రీమూర్తి.
ఇది ఆమె జీవిత చరిత్ర.

సంగీత సాహిత్య సామాజిక రంగాలలో ఆమె చూపిన ప్రతిభ, తెగువ విలక్షణమైనవి.
ఆమె సంగీత పండితుల నుంచి కూడా గౌరవాన్ని పొందిన విద్వాంసురాలు.
తన జీవితాన్ని త్యాగరాజ సంప్రదాయానికి అంకితం చేసిన విదుషీమణి.

ముద్దుపళని ''రాధికా సాంత్వనము''ను ప్రచురించి వీరేశలింగం పంతులువంటి ఉద్దండులను ఎదుర్కొంది.
ముళ్ల తుప్పల మధ్య అనాదరంగా పడివున్న త్యాగరాజ సమాధిని చూసి చలించిపోయి తిరువయ్యూరుకు కొత్త శోభను తీసుకొచ్చింది.
దేవదాసీ హక్కుల కోసం ధైర్యంగా పోరాడింది.

దేవదాసీగా పుట్టిన నాగరత్నమ్మ (1878-1952) చిన్నతనంలోనే సంగీత సాహిత్య నృత్య కళల్లో ఎంతో నైపుణ్యం సాధించింది.

వాగ్గేయ కారుడు త్యాగరాజు సమాధి చుట్టూ మండపం కట్టించడంలో ఆమె పాత్ర చిరకాలం నిలిచిపోతుంది.
రెండు వేరువేరు వర్గాల వారు త్యాగరాజ ఆరాధనోత్సవాలను నిర్వహించడమే గానీ మండపం గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.
అప్పుడు నాగరత్నమ్మ జోక్యం చేసుకుని, మండపం కోసం తన ఆస్తినంతా ధారపోసింది.
ఆమె కృషి వల్లనే త్యాగరాజు సమాధి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
దాని బాగోగులు చూసేందుకు తన జీవిత చరమాంకంలో తిరువయ్యూరులోనే వుండిపోయింది.
అయినా ఆమె త్యాగరాజ ఆలయంలో దాసిగానే మిగిలిపోయింది.
త్యాగరాజు సమాధికి ఎదురుగా చేతులు జోడించి కూర్చున్న భంగిమలో ఆమె విగ్రహం వుంది.
ఇంతకంటే ఆమె కూడా ఏమీ కోరుకుని వుండదు....

స్త్రీవాదిగా నాగరత్నమ్మ జీవితం దేవదాసీల పట్ల మనకుండే అపోహలను పటాపంచలు చేస్తుంది.
వారిని లైంగిక జీవులుగా, అనైతిక ప్రాణులుగా హీనంగా చూసే మన సమాజ ధోరణి ఎండగడుతూ... వారిని కూడా మనలో ఒకరిగా చూసే కొత్త చూపును మన కందిస్తుంది.

ఈ మహత్తర జీవిత చరిత్రకు అంతటి ప్రాశస్త్యం వుంది.


బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర
ఆంగ్లమూలం:The Devadasi and the Saint : The Life and Times of Bangalore Nagarathnamma. East West Books (Madras) Pvt. Ltd., Chennai 2009
By Shriram.V.
అనువాదం: టి. పద్మిని
ముఖచిత్రం: బత్తుల
పేజీలు 143
వెల: రూ.60/-

Tuesday, October 12, 2010

మతతత్వంపై బాలగోపాల్‌



మతతత్వంపై బాలగోపాల్‌  

''హైందవం గర్వంగా ప్రకటించుకునే విప్లవ సంప్రదాయమేమీ లేదు. అందువల్ల ''హిదూత్వం' పరమత ద్వేషం మీద మాత్రమే మనగలదు'' - బాలగోపాల్‌

    భారత దేశంలో మతతత్వం అనే అంశంపై ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల వేదిక నాయకుడు, రచయిత కె. బాలగోపాల్‌ (1952-2009) వివిధ సందర్భాలలో రాసిన 31 వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం.

    మతతత్వంపై, ప్రత్యేకించి హిందూత్వపై డా.కె.బాలగోపాల్‌ రాసిన 31 వ్యాసాల సంకలనమిది. మన జీవితాలపై హిందూత్వ ప్రభావం తాలూకు విభిన్న అంశాలను తడిమే ఈ వ్యాసాలు మూడు భాగాలలో పొందుపరచబడ్డాయి.  

    మొదటి భాగం 'హిందూ ధర్మ ప్రజాస్వామ్యం'లో దేశభక్తి, హిందూమతం, దాని వర్ణవ్యవస్థ, అదేవిధంగా ప్రజాస్వామ్యం నుంచి మతాన్ని (వర్ణ వ్యవస్థను) వేరు చేయాల్సిన అవసరం వంటి అంశాలపై రాసిన వ్యాసాలున్నాయి. 

    రెండో భాగం ''హిందూత్వ విద్య''లో డా.బాలగోపాల్‌ విద్యారంగ కాషాయీకరణ గురించి చర్చించారు.  వీటిలో  భారతదేశానికీ, దాని విజేతలకూ సంబంధించిన చారిత్రక వాస్తవాలు ఏమాత్రం వక్రీకరించకుండా విద్యార్థులకు ''లౌకికతత్వం'' విలువను బోధించాల్సిన ఆవశ్యకతను విశ్లేషించారు.

    మూడో విభాగం ''మైనారిటీలు-సంఘ్‌పరివార్‌''లో  ముస్లింలూ, క్రైస్తవులూ తదితర అ ల్పసంఖ్యాకులపై జరిగే దాడులకూ, అణచివేతకూ హిందూత్వ ఎలా దోహదం చేస్తోందో వివరించారు. బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్‌ మారణకాండ, క్రైస్తవులపై పెరుగుతున్న దాడుల గురించి ఈ భాగంలో చర్చించారు.

    దేశంలో చోటు చేసుకున్న ఆయా చారిత్రక సంఘటనలను ఒక క్రమపద్ధతిలో అర్థం చేసుకునేందుకు వీలుగా ఈ మూడు భాగాలలోని వ్యాసాలన్నీ తేదీల వరుసక్రమంలో పొందుపరచబడ్డాయి.

    ఈ పుస్తకానికి బిజు మాథ్యూ ముందుమాట రాశారు.

ఇందులోని వ్యాసాల వివరాలు:
హిందూ ధర్మ ప్రజాస్వామ్యం:
1. దేశభక్తి
2. శ్రామికుడిని శ్రమ దోపిడీకి లోనయ్యేలా చూడటం 'మతం' కర్తవ్యం.
3. హిందూ మత రాజ్యం
4. బ్రాహ్మణ ధర్మంలో ప్రజాస్వామ్యం
5. పర్సనల్‌ చట్టాలు: ఏకీకరణ కాదు, ప్రజాస్వామీకరణ జరగాలి.
6. ప్రాచీన భారత రాజకీయార్థిక నిర్మాణాలను ప్రతిబింమించే రచనలు-మహిళల జీవితం.

హిందూత్వ విద్య:
7. చదువును గురించి మాట్లాడటమూ కుట్ర అవుతుందా?
8. చరిత్ర పాఠాలపై కాషాయం నీడ
9. విద్య-భావజాలం
10. లౌకిక ప్రజాస్వామిక విలువలు
11. పాఠాంశాలలో హిందూత్వవాదుల జోక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
12. విద్య, విజ్ఞానం: హిందూత్వవాదుల దాడిని ఎదుర్కోవడానికి మనం సిద్ధమేనా?

మైనారిటీలు-సంఘ్‌ పరివార్‌:
13. నిరాధారమైన రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంపై జరుగుతున్న మత ఘర్షణలను ఆపండి! దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక విలువలను కాపాడండి
14. హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం
15. సంఘ్‌ పరివార్‌పై అవగాహన లోపం ఎవరికీ లేదు
16. 'కమల' వికాసంలో ఎవరి చేయి ఎంత?
17. క్రైస్తవం పైన దాడులను వ్యతిరేకిద్దాం
18. జాతి ఆకాంక్ష కాదు మానవతకు అవమానం
19. అయోధ్యలో ఏ కరసేవా జరగనక్కరలేదు..జరగనివ్వొద్దు
20. సంఘ్‌ పరివార్‌ను గట్టిగా ఎదుర్కోవడం అవసరం
21. హిందూత్వవాదుల ద్వేషం ఎవరి మీద?
22. ఇంకెక్కడా మరొక గుజరాత్‌ కాకుండా చూడటం ప్రజాతంత్ర ఉద్యమాల కర్తవ్యం
23. గుజరాత్‌లో అన్ని కేసులూ బెస్ట్‌ బేకరీ కేసులే కాబోతాయా?
24. దేశాన్ని 'వెలిగించ'డానికి తగలబెట్టడమూ ఒక మార్గమే
25. భాజపా 'విజన్‌' - మతోన్మాద ఫాసిజానికి ముసుగు
26. ఎవరికి సంకేతాలు పంపడానికి అఫ్జల్‌ను ఉరితీయాలి?
27. సంఘ్‌ పరివార్‌ హింసాకాండను వ్యతిరేకిద్దాం రండి
28. ఆదివాసీ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలను తిరస్కరిద్దాం.
ఇంగ్లీషు నుంచి అనువాదం:
29. మీరట్‌ 1987 రాజ్య ప్రేరేపిత ఉగ్రవాదంగా మారిన మతకల్లోలం
30. డిసెంబర్‌ 6, 1992 ఎందుకు జరిగింది?
31. గుజరాత్‌ ప్రదేశ్‌: హిందూ రాష్ట్ర ప్రతిరూపం

తొలి ముద్రణ: అక్టోబర్‌ 2010
పేజీలు: 317
ధర: రూ.150/-


ప్రతులకు, వివరాలకు
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067
ఫోన్‌: 040 2352 1849

Friday, October 1, 2010

బాలగోపాల్ సంస్మరణ సభ, ఆరు పుస్తకాల ఆవిష్కరణ - అక్టోబర్ 8 న, హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో


బాలగోపాల్ సంస్మరణ సభ
అక్టోబర్ 8 న, హైదరాబాద్  సుందరయ్య విజ్ఞాన  కేంద్రంలో
సమయం: సా: 5.00 నుంది 9.00 వరకు


విద్వంసకర ఆభివృద్ధి నమూనా- మానవ హక్కులుఅనే అంశం మీద
 శ్రీ ఈఏఏస్ శర్మ,మాజీ ఇందన శాఖ కార్యదర్శి, GOI 
 స్మారకోపన్యాసం చెస్తారు.
                               
 మానవ హక్కుల ఉద్యమం - బాలగోపాల్ కృషి అనే అంశం మీద
 బుర్రా రాములు, మానవహక్కుల వేదికప్రసంగిస్తారు. 
                      
సభను ఎస్ జీవన్ కుమార్ నిర్వహిస్తారు. 

వివిధ సంస్థలు ప్రచురించిన బాలగోపాల్ రచనలు, ఆయన సామాజిక జీవితం మీద వచ్చిన రచనలు ఆవిష్కరించబడతాయి.
అవి
 
1. హక్కుల ఉధ్యమం తాత్విక ధృక్పదం - బాలగోపాల్ రచన
2.
మా బాలగోపాల్ - మానవ హక్కుల వేదిక ప్రచురణ
3.
రాజ్యం- సంక్షేమం - బాలగోపాల్ ప్రసంగాలు-పెర్స్పెక్టివ్
4.
మతతత్వం పై బాలగోపాల్ - హైదరబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ
5.
సాహిత్యం పై బాలగోపాల్ - హైదరబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ       
6.
నిగాహ్ - ప్రజాతంత్ర లో ప్రచురిచితమయిన బాలగోపాల్ వ్యాసాల సంకలనం. 


అంధరికి  ఆహ్వానం

Sunday, September 12, 2010

విస్మృత విముక్తి దాత: సావిత్రిబాయి ఫూలే జీవితం - పోరాటం -శిశిర

విస్మృత విముక్తి దాత: సావిత్రిబాయి ఫూలే జీవితం - పోరాటం

''ది ఫర్‌గాటన్‌ లిబరేటర్‌ : ది లైఫ్‌ అండ్‌ స్ట్రగుల్‌ ఆఫ్‌ సావిత్రిబాయి ఫూలే'' అనే ఇంగ్లీషు పుస్తకంను (మౌంటెన్‌ పీక్‌ పబ్లికేషన్‌) భారతదేశంలో కుల వివక్ష తదితర సామాజిక రుగ్మతలపై పోరాడిన ఒక మహోన్నత స్త్రీ గురించి రాసిన పుస్తకంగా పరిగణించవచ్చు. ఈ పుస్తకాన్ని ''సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి ... సావిత్రిబాయి ఫూలే జీవితం - ఉద్యమం'' పేరుతో 'చూపు' కాత్యాయని తెలుగులోకి అనువాదం చేస్తే, హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారు ప్రచురించారు.

చరిత్రకారులు వాస్తవాన్ని వెలుగులోకి తేవడానికి ఎంతో ధైర్యం నిజాయితీ, చిత్తశుద్ధి కలిగి వుండాలి. దురదృష్ట వశాత్తూ చాలామంది చరిత్రకారులు వాస్తవాలను వక్రీకరించే ధోరణులకు పాల్పడి, నిజాలను ప్రజలకు చేరవేయటంలో విఫల మవుతుంటారు. చరిత్రను కల్పనలతో జోడించి గందరగోళం సృష్టించి ప్రజలను అహేతుకంగా తయారు చేయటంలో ఇటువంటి వారి పాత్ర చాలా ఎక్కువ.

ఈ పుస్తకానికి బ్రజ్‌ రంజన్‌ మణి రాసిన ముందుమాటలో బ్రాహ్మణుల చేతుల్లో దళితులు, ఆదివాసీలు, సిక్కులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర వెనకబడిన తరగతుల వారు ఏవిధంగా అణచివేతకు గురైందీ వివరంగా రాశారు.

ఈ పుస్తకం చదివిన తరువాత సహేతుకంగా ఆలోచించగలిగిన ప్రతి ఒక్కరూ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, గాంధీ, నెహూృ కుటుంబాల పేర్లు చరిత్రలో చోటు చేసుకుని సావిత్రిబాయి ఫూలే వంటి ఒక గొప్ప వ్యక్తిని
ఎట్లా విస్మరించగలిగాయా అని ప్రశ్నించక మానరు.

ముందు మాట గురించి నాలుగు వాక్యాలు:
''ఈ భూమ్మీద భారతదేశమే ఒక అసమ సమాజంగా వుంది. ఎన్ని మార్పులు చోటు చేసుకున్నప్పటికీ వారి పరిస్థితి యధాతధంగానే వుంది. ఆరోగ్యం సంపద, విద్య అనేవి పెరుగుతున్నప్పటికీ వాటి పంపిణీలోని తేడాలవల్ల రెండు దేశాల సిద్ధాంతం ప్రచారంలోకి వచ్చింది. అవి - ఒకటి : వెలిగిపోతున్న దేశమైతే, రెండోది: బాధాతప్త దేశం.

జనాభాలో కేవలం 10 శాతంగా వున్న పెత్తందారీ కులాలు అధికారాన్ని తమ చేతుల్లో పెట్టుకుని తక్కిన 90 శాతం ప్రజలను నిరంతరం అణచివేయబడి మానసికంగా క్రుంగిపోయి జాతికి చౌకగా శ్రమను అందించే సమూహంగా తయారు చేయడంలో విజయం సాధించారు.

పేదలను అభివృద్దిచేయటం, జాతి నిర్మాణం పేరిట అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నప్పటికీ పదలు మాత్రం మరింత పేదలుగా మిగిలిపోయారు. వారు ఇప్పటికీ తిండి, నీరు, విద్య వంటి కనీస అవసరాల కోసం పోరాడుతూనే వున్నారు. వీరంతా ఎవరు? 90శాతంగా వున్న ఆదివాసీలు, దళితులు, ఓబీసీలు అంటే ఇతర వెనుకబడిన తరగతులవారు, ముస్లింలు. పెరుగుతున్న మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక వ్యాపార రంగాల్లో, సమాచార
సాంకేతిక రంగాలలో, వినోద పరిశ్రమల్లో వీరి ప్రాతినిధ్యం శూన్యం.''

ఈ దేశంలోని కుల వ్యవస్థకు బ్రాహ్మణీయ కుల సంస్కృతికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించిన వారిలో తొలి వ్యక్తులు జ్యోతిబా ఫూలే, ఆయన భార్య సావిత్రిబాయి ఫూలే. మహారాష్ట్రకు చెందిన ఈ జంట బ్రాహ్మ'ణీయ విలువలకు వ్యతిరేకంగా అణగారిన కులాలను ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించింది. పేదలనూ,  అణచివేతకు గురైన వారినీ ఉద్ధరించే ఉద్యమంలో సావిత్రిబాయి ఫూలే సమాన భాగస్వామ్యాన్ని నిర్వహించారు.

ఆమె నిరక్షరాస్యురాలు అయినప్పటికీ మహాత్మా ఫూలే ఆమెను చదువుకోమని ప్రోత్సహించాడు. తర్వాత కాలంలో భర్త ప్రారంభించిన పాఠశాలలో మొదటి మహిళా ఉపాధ్యాయిని అయింది. వారు అట్టడుగువర్గాల వారికి, సామాజిక, సాంస్కృతిక విలువల పునరుద్ధరణకు అవసరమైన విద్యను అందించడానికి చొరవ చేశారు. 1852లో సావిత్రిబాయి ఫూలే మహిళా సేవా మండల్‌ ను స్థాపించారు. ఆ సంస్థ మహిళలకు తమ హక్కులు, ఆత్మ గౌరవం తదితర సామాజిక అంశాల ఎడల చైతన్యం కలిగించడానికి కృషి చేసింది. ఆమె వ్యకితగత ప్రమాదాలను కూడా లెక్కచేయకుండా విధవలకు గుండ్లు చేసే దురాచారానికి నిరసనగా బొంబాయి, పూణే నగరాలలో క్షురకుల సమ్మెను విజయవంతంగా నిర్వహించింది.

స్త్రీ విద్య ఒక నేరంగా పరిగణించబడే కాలంలో సావిత్రిబాయి ఫూలే, ఆమెకు మద్దతుగా నిల్చిన మరికొందరు    ఎదుర్కొన్న కడగండ్లను వివరించారు. మరొక రచయిత్రి గెయిల్‌ ఆంవెట్‌ ఒక పాఠశాల ఉపాధ్యాయినిగా ఛాందసవర్గాల వ్యతిరేకతల మధ్య నిరంతరం పేడ, రాళ్ల దెబ్బలను ఎదుర్కొంటూ సావిత్రిబాయి చేసిన జీవిత పోరాటాన్ని హృద్యంగా చిత్రీకరించారు. సావిత్రిబాయి ఫూలే అటువంటి వాటన్నిటినీ ప్రశాంతచిత్తంతో,
సాహసంతో ఎదుర్కొంది.

అస్పృశ్యుల నీడను అపవిత్రంగా భావిస్తూ దప్పికగొన్న వారికి మంచినీళ్లను కూడా ఇవ్వని రోజుల్లో సావిత్రిబాయి, జ్యోతిరావు ఫూలేలు తమ ఇంట్లో చోటు ఇచ్చారు. ఈ చర్య బ్రాహ్మణులను తమ మనోధర్మాన్ని మార్చుకోమంటూ విసిరిన ఒక సవాల్‌. అయితే 200 ఏళ్ల తరువాత ఇవాళ్టికి కూడా దేశంలో దళితులు నీటి హక్కుల కోసం పోరాడవలసి రావడం దారుణం.

ఫూలే దంపతులు ఆనాటి సమాజంలోని అన్ని వర్గాల వ్యతిరేకతను ఎదుర్కొన్న వైనాన్ని సావిత్రిబాయి ఫూలే పాఠశాలకు వెళ్తూ రాళ్లు, పేడ దెబ్బలను ఎదుర్కోవడం తన దైనందిన జీవితంలో భాగంగా భావించడాన్ని సింధియా స్టీఫెన్‌ వర్ణించారు.

ఈ పుస్తకంలో సావిత్రిబాయి ఫూలే తన భర్తకు రాసిన మూడు ఉత్తరాలను కూడా చేర్చారు. వాటి ద్వారా సావిత్రిబాయి ఫూలేకు తన భర్త పట్ల గల గౌరవం వివిధరంగాల్లో ఆమెకు గల పరిజ్ఞానం, విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న వైనం మనకు అర్థం అవుతాయి.

సునీల్‌ సర్దార్‌ మరియు విక్టర్‌ పాల్‌ లు సావిత్రిబాయి రాసిన ఐదు గీతాలను అనువదించారు. భారత దేశంలోని ఒక మహిళ, అందులోనూ అణగారిన వర్గాల మహిళ రాసిన గీతాలను ఇంగ్లీషువారు ఆదరించడమనేది ఈమెతోనే ప్రారంభమయింది. ఇంగ్లీషు ప్రాధాన్యతను, విద్య ప్రాధాన్యతను తన గీతాల ద్వారా వివరించిన సావిత్రిబాయి ఫూలే ఆధునిక గీత సాహిత్యానికి తల్లివంటిది. 

ఈ పుస్తకంలోని మరొక విశేషం ఫూలేలు ప్రారంభించిన పాఠశాలలో చదువుకున్న ఒక బాలిక రాసిన ఉత్తరం. అందులో మంగ్‌, మహర్ల కడగండ్లపై ఆమె రాసిన విషయాలు చాలా లోతైన అవగాహనతో వున్నాయి. ఫూలేల పాఠశాలలోని విద్యా ప్రమాణాలకు ఇదొక మచ్చుతునక.

1876-1898ల మధ్య కరువుకాలంలో సావిత్రిబాయి ఫూలే తన భర్తతో కలిసి ఎంతో సాహసంగా కరువు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉచితంగా ఆహారాన్ని దుస్తులను పంచి పెట్టారు. ఒక ప్లేగు వ్యాధి పీడితుడైన బిడ్డకు సేవచేస్తూ ఆ వ్యాధి సోకి సావిత్రిబాయి మరణించింది.

ఈ వ్యాసాలతో పాటు ఆమె జీవితంలోని ప్రముఖ ఘట్టాలకు సంబంధించిన చిత్రాలు కూడా ఎంతో అర్థవంతంగా వున్నాయి. ఒక అంధకార యుగంలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టే సాహసం చేసిన ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం గల సావిత్రిబాయి ఫూలే గురించి భారత మహిళలకు అవగాహన లేదు. భారత సమాజం మహిళలపై విధించిన ఆంక్షలకు నిరసనగా గళం ఎత్తిన సాహసి ఆమె. అందుకు గాను నేటి మహిళ ఆమెకు కృతజ్ఞులై వుండాలి.

మానవ హక్కువలలో విశ్వాసం కలిగిన వారు, మహిళా సాధికారత గురించీ స్త్రీవాదం గురించీ ఎక్కువగా మాట్లాడే మహిళా సంఘాలవారు ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి.

-శిశిర
సమాంతర మాసపత్రిక (ఆగస్ట్‌ 2010) సౌజన్యంతో

EMAIL :  samaantaravoice@gmail.com

సామాజిక విప్లవకారిణి సావిత్రీబాయి
- సావిత్రీబాయి ఫూలే జీవితం-ఉద్యమం
సంకలనం: బ్రజ్‌ రంజన్‌ మణి, ప్యామెల సర్దార్‌



మూలం: A Forgotten Liberator : The Life and Struggle of Savitribai Phule, Mountain Peak, Delhi 2008.

తెలుగు అనువాదం: కాత్యాయని

72 పేజీలు , వెల: రూ. 40


ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ 500 067
ఫోన్‌: 040 2352 1849
ఇ మెయిల్‌: hyderabadbooktrust@gmail.com



.

Friday, September 3, 2010

కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక అవార్డుల ప్రదానం

కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక అవార్డుల ప్రదానం

2009 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక అవార్డుల ప్రదానోత్సవం 20 ఆగస్ట్‌ 2010న పనాజీ (గోవా) లోని దీనానాథ్‌ మంగేష్కర్‌ కళా మందిర్‌ గోవా కళా అకాడమీలో జరిగింది. మొత్తం 23 భాషలకు చెందిన 23 మంది అనువాదకులకు కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు శ్రీ సునీల్‌ గంగోపాధ్యాయ ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఉపాధ్యక్షులు శ్రీ సుతీందర్‌ సింగ్‌ నూర్‌ అవార్డు గ్రహీతలను సత్కరించారు. సభకు అకాడమీ కార్యదర్శి శ్రీ అగ్రహార కృష్ణమూర్తి అధ్యక్షత వహించగా ప్రముఖ మళయాలీ రచయిత శ్రీ ఎం.టి. వాసుదేవన్‌ నాయర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

తెలుగు భాషకు సంబంధించి ఈ అవార్డు శ్రీ ప్రభాకర్‌ మందారకు లభించింది. ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహృ యునివర్సిటీ ప్రొఫెసర్‌ డా. యాగాటి చిన్నారావు సిద్ధాంత గ్రంథం ''దళిత్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఐడెంటిటీ'' ని ''ఆంధ్ర ప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర'' పేరిట చేసిన తెలుగు అనువాదానికి గాను ఈ పురస్కారం లభించింది. ఈ పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించింది.
అవార్డు కింద ఒక్కొక్క విజేతకు రూ.50 వేల చెక్కును, తామ్ర పత్రాన్ని అందజేశారు.

అవార్డు గ్రహీతల వివరాలు ఇలా వున్నాయి:

1. శ్రీ జతీంద్ర కుమార్‌ బర్గోహాయ్‌ (అస్సామీ)
2. శ్రీ ఉజ్జల్‌ సింఘ (బెంగాలీ)
3. శ్రీ గోబింద నర్జరీ (బోడో)
4. శ్రీ ఓం గోస్వామి (డోగ్రీ)
5. శ్రీ త్రిదీప్‌ సుహృద్‌ (ఇంగ్లీష్‌)
6. శ్రీ రమణీక్‌ సోమేశ్వర్‌ (గుజరాతీ) (డాక్టర్ ఎన్‌. గోపీ ''జలగీతం'' తెలుగు కవితా సంపుటిని గుజరాతీ భాషలోకి చేసిన తర్జుమాకు )
7. శ్రీ బాలచంద్ర జయశెట్టి (హిందీ)
8. శ్రీ డి.ఎన్‌. శ్రీనాథ్‌ (కనడ)
9. శ్రీ షాద్‌ రంజాన్‌ (కశ్మీరీ)
10. శ్రీమతి కస్తూరి ఎన్‌. దేశాయ్‌ (కొంకణి)
11. శ్రీ బాలచంద్ర ఎస్‌ ఝా (మైథిలీ)
12. శ్రీ కె. రాధాకృష్ణ వారియర్‌ (మళయాలం)
13. శ్రీ ఎస్‌. బ్రజేశ్వర్‌ శర్మ (మణిపురీ)
14. శ్రీ జయప్రకాశ్‌ సావంత్‌ (మరాఠీ)
15. శ్రీ ఓం నారాయ్‌ గుప్తా (నేపాలీ)
16. శ్రీ ధరణీధర్‌ పాణిగ్రాహి (ఒరియా)
17. శ్రీ షా చమన్‌ (పంజాబీ)
18. శ్రీ అర్జున్‌ సింగ్‌ షెకావత్‌ (రాజస్థానీ)
19. శ్రీ ప్రేమ్‌ నారాయణ్‌ ద్వివేది (సంస్కృతం) (ఇటీవలే వీరు స్వర్గస్థులయ్యారు)
20. శ్రీ ఝాము చుగానీ (సింధీ)
21. శ్రీమతి భువనా నటరాజన్‌ (తమిళ్‌)
22. శ్రీ ప్రభాకర్‌ మందార (తెలుగు)
23. శ్రీమతి ఆస్మా సలీమ్‌ (ఉర్దూ)

ఈ సందర్భంగా తీసిన కొన్ని ఛాయా చిత్రాలను ఇక్కడ పొందు పరుస్తున్నాము









Wednesday, August 18, 2010

Barefoot - Naren’s last testament… Harsh Mander



Barefoot - Naren’s last testament…
Harsh Mander

Naren’s book is an insider's plea to save farming from the many ills that afflict it today, mainly as a result of the industrial-chemical agricultural practices…
A little over a year ago, we lost one of the finest men I have known. As his wife Uma aptly noted, ‘Naren passed away peacefully after (not) fighting brain cancer on July 5, 2009'. I wrote then in these columns about the many ways in which my friend Naren had taught me many lessons about life and goodness. I continue to learn from him.
Naren left behind an almost completed manuscript, “Dilemmas in Agriculture: A Personal Story”. We persuaded Uma to update the volume, and add a few personal notes. The little book is ready and published by Vasudheva Kutumbukum ( kutumbukum@gmail.com). It is rich with wisdom and gentle insights about the predicaments of rural life in India today, but what makes it significant is that it is based on their own journey. The narrative begins in 1987, when Naren decided to leave his well-paid job in a Bank to return to his ancestral village Venkatramapuram in Chittoor, Andhra Pradesh, for a ‘life of organic farming and social work'. With heavy hearts, they sent their older daughter Samyuktha to a school, Kalakshetra in Chennai, whereas the younger Lakshmi was raised for many years in a village school. Looking back, Uma writes: ‘I have no doubt that villages are the best places for children to grow up'.
Firsthand experience
In their new life in the village, Naren and Uma learnt about the plight of farmers in the most authentic way possible: by becoming farmers themselves. The questions for which they sought answers were: why are farmers continuing to commit suicide, even while our country is poised to record growth of nearly 10 per cent annually? And is it a historical inevitability that as we ‘ develop', our farming population will have to be reduced from 60 per cent to 15 to 2 per cent, as it has happened in ‘developed' countries? If so, where will they go, what will they do? What is the future of 600 million people engaged in farming?
Collected experience
This slim volume is a log-book of what they discovered through their own toil and investments over 20-odd years as farmers. Naren describes with self-deprecating irony their ‘battle with crops': always half-failed attempts at farming mango, paddy, sugarcane, groundnut, coconut and vegetables, deploying organic technologies and ethical payment to farm workers. With elaborate calculations, he establishes that it is impossible to break even in farming today. Prices are unstable and unpredictable, and credit, inputs and electricity prohibitively expensive. ‘Indian farmers looking at the skies for rains are not just images in photographs and films; they indeed are a ground reality, a fact of life. Timely, adequate and regular rains at different stages of growth and fruition of the crops make all the difference … between prosperity and desperation. The dry-land farmer knows this better and more bitterly than anybody else'.
When they took control of their 32-acre farm, Naren had a bank account of Rs. 10 lakhs. But in 1997, Chittoor fell into a drought which lasted seven years! By 2000, their bank balance had vanished, and they were in debt for Rs. two lakhs. He asks: ‘If the plight of a farmer like me, owning 32 acres was like this, how about farmers having two to five acres? From 1993 to 2005, 2,50,000 farmers have committed suicide; that is 20,000 per year! Share of agriculture in the country's GDP has come down from 50 per cent during the 1960s to 17 per cent now. That is, 60 per cent of our population has only 17 per cent of the nation's wealth. Migration from the rural areas has been on such a massive scale that villages are getting emptied out. People are literally fleeing from agriculture and rural areas'.
If there is good price for a farmer's crop, Naren found, the yield is poor. If the yield is good, the price is low. ‘To add to their woes, under the LPG (liberalisation-privatisation-globalisation) regime, there is pressure to withdraw even the meagre subsidies and concessions, and uncontrolled exports and imports' result in highly volatile prices. Farmers repeatedly demand, often through violent protests, to come to their rescue when prices fall below the minimum support price declared by the government. ‘But government becomes deaf and dumb at such times, leaving the farmers to their own devices. How are farmers to survive when they find whatever the crops they grow, they are in loss and debts?'
Uma endorses that ‘In Chittoor district farmers are a weary, tired lot today. Whatever they may do they seem to be in losses. The feeling of frustration and resignation is pervasive; the sense of inferiority is profound. Farmers introduce themselves apologetically, much like the women who introduce themselves as “just housewives”.' Farmers are unable to find brides for their farming sons. A marriage broker said that a father rejected a prospective bridegroom who owned 20 acres of mango gardens, and pleaded: ‘please look for some teacher or an attendant or clerk.'
Changing priorities
They observe that our tradition recognised food to be the basis of life and society. But today farmers are encouraged to grow ‘cash crops', as if they can eat cash! ‘If a society is to progress in peace and prosperity, its people should have access to adequate food under any and all circumstances. Our culture and society supported public feeding through temples and endowments on a very large scale. But all this has changed. Modern farming puts earning money as the primary objective of farming, as opposed to growing adequate food first for the farmer's family and then for the society'. The neglect of dry-land cultivation, and a Public Distribution System centred on rice and wheat, has led to sharp declines in production of nutritious millets, pulses and oilseeds.
Naren's book is accordingly a passionate — even desperate — plea to save the Indian farmer from hunger, pauperisation and despair. At least some answers for policy-makers are not so hard to find. Dr. M.S. Swaminathan headed a National Farmers Commission which submitted its recommendations in 2006. Above all, it recommended that governments must ensure minimum support price for all crops; it deemed a fair remunerative price to be 50 per cent more than the cost of production, so that the farmer has a small profit left after meeting the cost of production. The Commission called for land reforms, cheap credit for farmers including consumption credit, social security for farmers, crop insurance, safeguarding traditional seeds, strengthening dry-land agriculture, small irrigation projects, and small farmer cooperatives.
For an evergreen revolution
Naren endorses all of these, and adds, ‘True we need a second green revolution, an evergreen revolution, but that … has to come from improved organic farming, afforestation, watershed development, water-bodies restoration, pastures development, and so on.' The solution in the long run is ‘to get off the train of industrial-chemical agriculture. We will have nothing to lose except the desolation of a poverty-debt-ridden-polluted planet!' He believes that if the small farmers have to stand on their own feet, they must grow enough food to feed themselves, and have some cash for other expenses. ‘By eco-friendly farming, we can feed the nation good nutritious non-poisonous food, we can stem groundwater as well as power crisis because good organic farming practices retain moisture in the soils far better than chemical farming, we can improve soil fertility, we can contain water and air pollution, and we can reduce fossil fuel energy use to a great extent'.
My gentle friend left the world dreaming of a new caring India, which would restore the dignity, hope and morale of the Indian farmer. Swaminathan's report and Naren's last testament shows us many pathways. But even as farmers across India continue to kill themselves in an unending epidemic of despair, is anyone listening?

Courtesy : The Hindu 14 August 2010


Published by
Vasudhaiva Kutumbkam Publication (P) Ltd,
XC - 7, Saha Vikas Apts,
Plot no 68, IP Extension,
Patparganj, Delhi- 110 092,

Price: Rs. 120


Copies are available at Hyderabad Book Trust also.

It is the English version of ITLU OKA RAITU (Telugu) published by Hyderabad Book Trust in the year 2008.
 

Saturday, August 14, 2010

కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక బహుమతుల ప్రదానోత్సవం ఆగస్టు 20న గోవాలో!

కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక బహుమతుల ప్రదానోత్సవం ఆగస్టు 20న గోవాలో!

2009 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ముందు అనుకున్నట్టు కొత్త ఢిల్లీలో కాకుండా గోవాలో ఈ నెల 20న (శుక్రవారం సా.5.30కి) నిర్వహిస్తున్నారు.

దీనానాథ్‌ మంగేష్కర్‌ కళా మందిర్‌, కాంపాల్‌, పానాజీలో - సాహిత్య అకాడమీ చైర్మన్‌ సునీల్‌ గంగోపాధ్యాయ అధ్యక్షతన జరిగే ఈ సభకు - ప్రఖ్యాత మళయాళీ రచయిత ఎం.టి.వాసుదేవన్‌ నాయర్‌ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. సాహిత్య అకాడమీ కార్యదర్శి అగ్రహార కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు సుతీందర్‌ సింగ్‌ నూర్‌ ప్రభృతులు సభలో పాల్గొంటున్నారు.

మొత్తం 24 భాషల్లో ఒక్కో భాషనుంచి ఎంపిక చేసిన ఒక్కొకరికి చొప్పున ఇరవైనలుగురు అనువాదకులకు బహుమతులు అందిస్తారు.
ఆ భాషలు: అస్సామీస్‌, బెంగాలీ, బోడో, డోగ్రీ, ఇంగ్లీష్‌, గుజరాతీ, హిందీ, కనడ, కశ్మీరీ, కొంకణి, మైథిలీ, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, రాజస్థానీ, సంస్కృతం, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ.

తెలుగు నుంచి ఈ అవార్డుకు ప్రభాకర్‌ మందార ఎంపికైన విషయం విదితమే.
డా.యాగాటి చిన్నారావు సిద్ధాంత గ్రంథం ''దళిత్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఐడెంటిటీ'' ని ''ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర''పేరిట చేసిన అనువాదానికి గాను ఈ అవార్డు దక్కింది.

ఈ పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించింది.

Tuesday, July 27, 2010

సావిత్రీబాయి ఫూలే జీవితం - ఉద్యమం - కె.పి.అశోక్‌ కుమార్‌


సావిత్రీబాయి ఫూలే జీవితం - ఉద్యమం

ఆధునిక భారతదేశంలో మొట్టమొదటగా బ్రాహ్మణీయ కులతత్వ సంస్కృతి, మత వ్యవస్థలపై యుద్ధం ప్రకటించిన వ్యక్తులు జ్యోతిరావు ఫూలే, ఆయన భార్య సావిత్రీబాయి. మహారాష్ట్రీయులైన ఈ దంపతులు మొదటిసారిగా సమగ్రమైన కుల వ్యతిరేక సిద్ధాంతానికి రూపకల్పన చేసి, ఆధిపత్య విలువలకు వ్యతిరేకంగా గొప్ప ప్రజా ఉద్యమాలను నిర్మించారు. వారి సామాజిక సాంస్కృతిక దృక్పథంలోని మౌలికాంశం పీడితులందరినీ ఐక్యం చేయడమే.

స్త్రీలు-శూద్రులు-అతిశూద్రులందరినీ ఒక తాటిమీదికి తీసుకురావడమే ఈ ఉద్యమ లక్ష్యం. విప్లవకారుడైన తన భర్తతో కలిసి సావిత్రీబాయి ఫూలే (1831-97) చేసిన పోరాటాలూ, ఎదుర్కొన్న సమస్యలూ తగిన గుర్తింపు పొందకపోవడానికి కారణం సమాజంలోని కులతత్వ, పురుషాహంకార ధోరణులే. పండిత వర్గాల్లోని చాలామందికి కూడా ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసు. ఆధునిక భారతదేశంలో మొట్టబదటి ఉపాధ్యాయురాలిగా, పేద ప్రజల ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికై కృషి చేసిన ఉద్యమకారిణిగా, స్త్రీ విముక్తి పోరాట నాయకురాలిగా కవియిత్రిగా, కులమూ - పితృస్వామ్యమూ అనే శక్తులపై యుద్ధానికి పూనుకున్న సాహసిగా సావిత్రీబాయి ఒక  స్వతంత్ర
వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్న ఆదర్శ మహిళ. పందొమ్మిదవ శతాబ్దంలో జరిగిన సామాజికోద్యమాలన్నిటిలోనూ నాయకత్వస్థానంలో కనబడే మహిళ ఆమె ఒక్కతే.

భారతదేశంలో మొట్టమొదటి మహిళా పాఠశాలను స్థాపించిన సావిత్రీబాయి 1852లో ''మహిళా సేవా మండల్‌'' అనే మహిళా సంఘాన్ని కూడామానవ హక్కుల గురించి, ఇతర సామాజిక సమస్యల గురించి, స్త్రీలను చైతన్యపరచడానికి ఈ సంస్థ ఎంతగానో కృషి చేసింది. స్త్రీలకు జెండర్‌ పరనంగా ఎదురయ్సేమస్యలకు తోడుగా కుల, పితృస్వామ్య
వ్యవస్థల అణిచివేత కూడా సాగుతున్నదన్న వాస్తవాన్ని ఒక మహిళగా ఆమె పూర్తిగా అర్థం చేసుకోగలిగింది. స్త్రీల ప్రత్యేక సమస్యపై జరిగిన ఎన్నో ఉద్యమాల్లో ఆమె పాలు పంచుకుంది. వితంతువులపై వివక్షకూ, అక్రమ సంతానమైన శిశువుల హత్యలకు వ్యతిరేకంగా ప్రచారాన్ని చేపట్టింది.

వితంతు పునర్వివాహాల అవసరాన్ని గురించి చాటిచెప్పడమే గాక, ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది.
అనాథలుగా మారుతున్న శిశువుల కోసం శరణాలయాన్ని స్థాపించింది. దిక్కులేని స్త్రీలకూ, పిల్లలకూ సావిత్రీబాయి ఇల్లే ఒక పునరావాస కేంద్రంగా మారింది. వితంతువులకు శరోముండనం చేసే ఆచారానికి సహకరించబోమంటూ క్షురకులు తిరుగుబాటు చేసేట్టుగా ప్రోత్సహించింది.

ఈ పనులన్నిటకీ ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టి నిర్వహించింది. సత్యశోధక్‌ సమాజాన్ని నిర్వహించిన ముఖ్య నాయకుల్లో సావిత్రీబాయి ఫూలే కూడా వున్నారు. సంస్థ మహిళా వొరీభాగానికి ఆమె నాయకురాలు. సత్య శోధక్‌ సమాజ కార్యకర్తలను ఎన్నో సామాజికోద్యమాల్లోకి నడపటంలో ఆమె శ్రద్ధ వహించింది. 1896-97 కాలంలో కరువు, ప్లేగు వ్యాధి వ్యాపించిన సందర్బాలలో సావిత్రీబాయి నాయకత్వంలో సత్య శోధక్‌ సమాజం చేసిన సేవ ఎంతో గొప్పది. సావిత్రీబాయి జీవితం ఉద్యమం గురించి విశ్లేషిస్తూ ప్రముఖులు రాసిన ఈ వ్యాసాల సంకలనాన్ని కాత్యాయిని తెలుగులోకి అనువదించారు.

- కె.పి.అశోక్‌ కుమార్‌
(వార్త దిన పత్రిక, జూలై 18, 2010 సౌజన్యంతో)

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌