Thursday, November 12, 2020

శాంతసుందరికి జోహార్లు

 శాంతసుందరికి జోహార్లు 



గత కొంత కాలంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న శాంతసుందరి గారు 11 నవంబర్ 2020 రాత్రి చనిపోయారు. వారు అనేక పుస్తకాలను ఇంగ్లీష్, హిందీ భాషలనుంచి తెలుగు లోకి, తెలుగు నుంచి హిందీ లోకీ అనువదించారు. 

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన "ఇంట్లో ప్రేమ చంద్" పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం అందుకున్నారు. ఇది తొలుత 'భూమిక' మాస పత్రికలో సీరియల్ గా వెలువడింది. వీరు అనువదించిన మరో పుస్తకం "కలల రైలు" (కాల్సన్ వైట్ హెడ్ రచన)ను కూడా హెచ్ బి టి ప్రచురించింది.

వరూధిని-కొడవటిగంటి కుటుంబరావు గార్ల కుమార్తె అయిన శాంతసుందరి 1947 లో మద్రాస్ లో జన్మించారు.వారి కుటుంబ సభ్యులకు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తోంది. 





హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌