ఎదారి బతుకులు పల్లెకతలు : ఎండపల్లి భారతి
వాస్తవికత,
కళాత్మకత, తాత్వికత, గాఢత, చలనశీలత వున్న
కథలివి.
మదనపల్లికి
కొద్ది దూరంలో వుండేఒక మాదిగ పల్లె
బిడ్డ. కేవం ఐదో తరగతి
వరకేచదివింది భారతి. కానీ జీవితాన్ని లోతుగా
చదివింది.అనుభవాన్ని సృజనాత్మకంగా వ్యక్తీకరించడానికి చదువేమీ అక్కర్లేదు. పెద్ద చదువు చదివిన
కథకులు చాలామంది రాయని, రాయలేని అద్భుతమైన కథలామె రాసింది. చిత్తూరు జిల్లా జీవభాష తొణికిసలాడుతూ వుంది ఆమె చేతిలో.
గొడ్డుతునకు, గంగవ్వ పోసే మజ్జిగ, పూపెట్టగుడ్లు,
ఒకటా రెండా ఎన్నో కథలు.
పూలపెట్ట కథచదివి కడుపారా నవ్వుకున్న. ముగింపు చదివికన్నీరు కార్చా. అలాగే, కోడలికి తిండి సరిగా పెట్టని
అత్త కథ చదివి కదిలిపోయా.
కథను చెప్పాలి. దృశ్యాన్ని వర్ణించి, సంభాషణు రాసి సినిమా స్క్రీన్ ప్లే నారేషన్ తపించే
కథలు రాసే వాళ్లు చాలా
మంది మనకున్నారు. ఉత్తమ కథ ప్రమాణాకుగానీ
ప్రమాణాకు విరుద్దంగా నవీన విధానంలో చేసే
విశ్లేషణకు గానీ నిలబడనివి చాలానే
వచ్చాయి. కానీ భారతి ఏ
విశేషణాలకు అందని నిఖార్సైన కథకురాలు.
వాస్తవికత, కళాత్మకత, తాత్వికత, గాఢత, చలనశీలత గుణాు
పుష్కలంగా వున్న కథలివి. ఈ
కథలు చదివి మీరే జడ్జిమెంట్
ఇవ్వండి.
- జిలుకర శ్రీనివాస్
ఫార్ములా
తెలియకుండానే క్లిష్టమైన లెక్కలన్నిట్నీ కరెక్టుగా ఆన్సర్ చేసినవాళ్ళను లోకం ఎంత అబ్బురంగా
చూపిస్తుందో భారతి రాసిన ఈ
కథను చదివినప్పుడు నాకు అలాగే అనిపించింది.
ఆమె ఒక్క అక్షరం కూడా
ప్రయత్నపూర్వకంగా రాయకపోయినా ఈ
రోజు సాహిత్యంలో చర్చకు వస్తున్న అన్ని విషయాలూ ఈ
కథల్లో కనిపిస్తాయి. వూరికే కనిపించడం కాదు; ఆమె
చూపు, భాషతో సహా అన్నీ
(కులం , వర్గం, జెండర్, లైంగికత అన్నీ) వంక పెట్టడానికి వీల్లేనంత
పకడ్బందీగా కథల్లోపలికి వచ్చి కూర్చుని ‘జీవితం
అంటే ఇదీ. ఇది మాత్రమే’
అని చెపుతున్నట్టుగా
ఉంటాయి. నాకు టోపీ లేదు
కాని
ఉంటే
తీసి భారతి కాళ్ళ ముందు
పెట్టేదాన్నే.
- వేమన
వసంతక్ష్మి
మూడుమాట్లు
ఈసడిరచుకోబడ్డ బతుకు
ఈ భూప్రెపంచకం మొత్తం మీద ఏ మూలకి
వెళ్ళినా ఆడోళ్ళు దిగనాసితనంలోకి తోసెయ్యబడ్డోళ్ళే. ఈ దేశపు ఆడోళ్ళు
మరి కాస్తి ఎక్కువే తొక్కబడ్డవోళ్ళు. ఇందులో మళ్ళీ మా
దళిత గూడే ఆడోళ్ళు బయట
సమాజంలో కులం పేరుతో, ఇంట్లో
మొగోళ్ళ చేతుల్లో ఆడిరగిలితనం పేరుతో, మిగతా కులాల ఆడోళ్ళ
మజ్జనేవో కులంతో పాటు బీదరికాన్ని బట్టీ
మొత్త్తం మూడు మాట్లు ఈసడిచ్చుకోబడతారు.
ఇట్టా లింగ, వర్గ, కుల
వివక్షల అట్టడుగు పీడితురాలుగా బతుకుతూనే తన దైన్యపు స్థితి
అంతటి నుండీ కుటంబానికి సేవలూ,
సౌఖ్యాలూ అందించాల్సిన పరిస్థితుల్లో దక్షిణ
జంబూదేశాన మంగంలో మిరగబాయిలా మలమలా ఏగుతున్న రాయసీమ
నే మీద మా ఆడోళ్ళ
కడగండ్లు వుంకో అడుగు ఎనక్కి
వేసి ఈ ప్రపంచపు అత్యంత
పీడిత జీవిగా ఆమెను పరిచయం చేస్తాయి.
ఎదారి బతుకు నిండా ఈ
వాస్తవం మట్టి సట్టికి అడుగున
కరుగు కొవ్వుకు మల్లే పేరుకుని అగపడతది.
పీడకు బతుకుల్ని అనుకరిచ్చటమే నాగరికత, అభివృద్ధి అని నేర్పిన ఈ
సమాజంలో పీడక ఆసాము భాష,
దాష్టీకం, క్రమశిక్షణ పేరుతో చేసే శారీరక హింస
లాంటి ఎన్నో అవక్షణాను అరువు
తెచ్చుకున్న మా గూడెపు మొగోడు
తనతో పాటు సమానంగా బువ్వ
సంపాదిచ్చే, తనకన్నా ఎక్కువగానే గుడిసెను భద్రం చేసుకునే దళిత
స్త్రీ పట్ల చూపిచ్చే ‘మగతనం’
భారతి కథల్లో మిగతా స్త్రీవాద సాహిత్యంలోని
నిందా దృక్పథంతో కాకుండా ఎద ఆరిన నిస్సహాయతతో
పంచలో కూకుని గుడిసె గురిచ్చి దిగాలు పడతన్న మా జేజి మొకంలోని
మడత ఇవరంలా కనబడిద్ది. ఏ పండక్కో ఇంటికెల్లినప్పుడు
నా మంచం పక్కనే కూకుని
తలకాయలోని చెమట చీంపొక్కుల్ని గ్లితా
మా చెల్లెలు చెప్పే తన సంసారపు కతలా
వుంటది.
- ఇండస్
మార్టిన్
భారతికథలు
అభివృద్ధి చెందుతున్న
భారతదేశపు క్రీనీదలను చూపించిన కాగడాలు. నగర మధ్యతరగతి భద్రజీవుల కథలు కావివి. కులం రీత్యా వర్గం రీత్యా
సమాజపు అంచులలోనుంచీ ఇంకా నడిమధ్యకు రావడానికి పెనుగులాడుతున్న జనం వెతలు. తన అమ్మనుడిలోనే
చెప్పకున్న ఈ కథలను, భారతి వర్ణించి వర్ణించి మాజిక్కులు చేసి ఏమీ చెప్పదు. నెత్తిమీద
మొట్టీ చెప్పదు. ఉపన్యాసాలూ ఇవ్వదు. కబుర్లు చెప్పినట్టు చెప్పి ఉలిక్కిపడెలా చెస్తుంది.
చివర్లో కొన్ని జీవితసత్యాలను అలవోకగా మన మీదకి విసురుతుంది చాలా ఒడుపుగా. ఇవి ఒక్క
దిగవబురుజు కతలే కాపు. భారతదేశపు కథలు, భారతి చెప్పిన వెతలు. తెలుగు కథావనంలోకి పచ్చపచ్చగా
నడిచి వచ్చింది ఈ కథాభారతి. స్వాగతం పలుకుదాం.
- పి.సత్యవతి
ఎదారి బతుకులు పల్లెకతలు : ఎండపల్లి భారతి
రచన : ఎండపల్లి భారతి
120 పేజీలు, వెల: రూ.100/-
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్ - 500006
ఫోన్: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com