Add caption |
- కాళీపట్నం రామారావు
అనుకోని పరిస్థితుల్లో బీహారులో జైలు జీవితం గడిపిన బ్రిటీషు పౌరురాలు మేరీ టైలర్ అనుభవాలకు అక్షరరూపమే ఈ పుస్తకం. ఐదేళ్లపాటు హజారీబాగ్ జైలులో ఆమె ఎంతోమంది ఖైదీలతో కలిసిమెలసి ఉన్నారు. ఈ సమయంలో సునిశితమైన పరిశీలనా దృష్టితో, సాటి మనుషుల పట్ల అవ్యాజమైన ప్రేమాసక్తులతో వారినుంచి తెలుసుకొన్న విభ్రాంతికర వాస్తవాలెన్నో ఈ పుస్తకంలో ఆమె మన కళ్ల ముందుంచారు. విస్తృతంగా పరుచుకున్న దారిద్య్రం, నిరంకుశంగా సాగిపోతున్న రాజకీయ దమనకాండల మధ్య నలిగిపోతున్న జనజీవితాల గురించీ, న్యాయ-జైళ్ల వ్యవస్థల్లో పాతుకుపోయిన అమానుష ధోరణుల గురించీ ఆమె ఆర్తితో రాసిన అనుభవాలు మనల్ని తట్టి లేపుతాయ.
భారతదేశంలో నాజైలు జీవితం
రచన : మేరీ టైలర్
తెలుగు అనువాదం: సహవాసి
248 పేజీలు వెల: 200/-
ప్రతులకు:హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్ - 500006
ఫోన్: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com